కార్ ఇన్సూరెన్స్‌లో ఎన్​సీబీ (NCB)

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

కార్ ఇన్సూరెన్స్‌లో ఎన్​సీబీ అంటే ఏమిటి?

భారతదేశంలో, ఫోర్-వీలర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే మీరు ఇక్కడ కారును కొనుగోలు చేసేముందు, మోటార్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​ అనేది భారతదేశంలో తప్పనిసరి అని మీరు తెలుసుకోవాలి. అలాగే మీరు కారు కొనుగోలు చేసేటప్పుడే ఈ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలా వరకు ఇన్సూరెన్స్​ ప్రొవైడర్లు తమ పాలసీదారులకు ఎన్​సీబీ ప్రయోజనాలను అందిస్తున్నాయి.

ఈరోజుల్లో భారతదేశంలోని చాలామంది ప్రజలకు ఎన్​సీబీ అంటే అర్ధం ఏమిటో కూడా తెలియదు! అందుకనే, మీరు సాధారణంగా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మేము మీ ముందుకు వచ్చాం,

ఇన్సూరెన్స్‌లో ఎన్​సీబీ ఫుల్​ ఫామ్

ఎన్​సీబీ అంటే ‘నో క్లెయిమ్ బోనస్’ అని అర్ధం. పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌ను ఫైల్ చేయనప్పుడు వారి కస్టమర్‌లకు కార్​ ఇన్సూరెన్స్​ ప్రొవైడర్లు అందించే ఒక రకమైన రివార్డ్ ఇది. ఈ రివార్డ్‌ ద్వారా, ఇన్సూరెన్స్​ చేయించుకున్న వ్యక్తి తదుపరి పాలసీ సంవత్సరంలో తన ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసే సమయంలో ప్రీమియంపై కొంత తగ్గింపును పొందుతారు.

కార్ ఇన్సూరెన్స్‌లో ఎన్​సీబీ - ఇది ఎలా పని చేస్తుంది?

మీ చుట్టూ ఉన్న ప్రతివాటి ధరలు పెరుగుతుంటే, మీ కార్ ఇన్సూరెన్స్ మాత్రం కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను తగ్గించుకునే ఛాయిస్‌ను అందించడం ద్వారా మీకో ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది ఎలా పని చేస్తుంది అని మీరు అడగవచ్చు?

చెప్పాలంటే, ఇది దాదాపు రివార్డ్ సిస్టమ్​లాగా పనిచేస్తుంది. మీరు మీ పాలసీ మొదటి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకుంటే 20% ఎన్​సీబీ డిస్కౌంట్ పొందుతారు. ఈ విధంగా, మీ నుంచి ఎటువంటి క్లెయిమ్‌లు జరగకపోతే, వరుసగా రెండవ సంవత్సరం నుంచి అదనంగా 5% పొందుతారు. ఇలా మీరు వరుసగా ఆరవ సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు 50% వరకు తగ్గింపును పొందుతారు.  ఒక చిన్న కథగా చెప్పాలంటే, మీరు ఎంత బాగా డ్రైవ్ చేయగలిగితే, అంత బాగా మీ కారును మెయింటేన్​ చేయగలరు - దీర్ఘకాలంలో ఇది మీకు అంత బాగా పని చేస్తుంది.

చిన్న క్లెయిమ్‌లు చేసి నో క్లెయిమ్ బోనస్‌ను కోల్పోవడం మంచి ఆలోచనేనా?

కానే కాదు! మీరు ఒక చిన్న ప్రమాదంలో చిక్కుకున్నట్లయితే లేదా చిన్న టైర్ పేలినందుకు మీ కారు ఇన్సూరెన్స్​ను ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు క్లెయిమ్‌కు వెళ్లకుండా దానికి బదులుగా, మరమ్మతుల కోసం మీరే చెల్లించవచ్చు (మీకు సాధ్యమవుతుందని అనుకుంటేనే!). మీరు ఎటువంటి క్లెయిమ్‌లు లేకుండా ఒక సంవత్సరం పాటు గడపవచ్చు. మీ కార్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్​ సమయంలో నో క్లెయిమ్‌ బోనస్‌ను పొందవచ్చు.

నో క్లెయిమ్ బోనస్ క్యాలుక్యులేటర్

ఇన్సూరెన్స్ టర్మ్‌లలో ఎన్​సీబీ పాలసీ అంటే ఏమిటో అర్థం చేసుకున్న తర్వాత, తదుపరి అసలైన ప్రశ్న ఏమిటంటే - కారు ఇన్సూరెన్స్ కోసం నో క్లెయిమ్ బోనస్ ఎంత అని?

మీ కారుకు నో క్లెయిమ్ బోనస్‌ని లెక్కించడం అంత కష్టమేమీ కాదు. వాస్తవానికి, అనేక ఇన్సూరెన్స్​ కంపెనీలు తమ వెబ్‌సైట్‌లలో నో క్లెయిమ్ బోనస్ క్యాలిక్యులేటర్‌ను అందిస్తాయి. అది మీ పాలసీకి అనుగుణంగా నో క్లెయిమ్ బోనస్ అమౌంట్‌ని లెక్కించడంలో మీకు సహాయపడుతుంది. ఇది సాధారణంగా మీ సంబంధిత పాలసీ యొక్క రెండో సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది.

ప్రస్తుత ప్రమాణాల ప్రకారం, భారతదేశంలో ఎన్​సీబీ 20 శాతంతో మొదలై ఆరో సంవత్సరంలో 50 శాతానికి చేరుకుంటుంది. ఏదైనా ఫోర్-వీలర్ కోసం నో క్లెయిమ్ బోనస్ పర్సెంటేజ్ సాధారణంగా కింది విధంగా లెక్కించబడుతుంది.

కార్ ఇన్సూరెన్స్ కోసం ఎన్​సీబీ క్యాలుక్యులేటర్

క్లెయిమ్ చేయని సంవత్సరాలు నో క్లెయిమ్ బోనస్
మొదటి సంవత్సరం తరువాత 20%
2 సంవత్సరాల తరువాత 25%
3 సంవత్సరాల తరువాత 35%
4 సంవత్సరాల తరువాత 45%
5 సంవత్సరాల తరువాత 50%

కార్ ఇన్సూరెన్స్‌లో ఎన్​సీబీ యొక్క ప్రయోజనాలు

1. మీకు పాజిటివ్ రివార్డులను అందిస్తుంది: ఎన్​సీబీ అంటే మంచి, బాధ్యతాయుతమైన డ్రైవర్, కారు యజమానిగా ఉన్నందుకు మీకు అందించే ఒక రివార్డ్.

2. మీకు కనెక్ట్ చేయబడుతుంది, మీ కారుకు కాదు: ఎన్​సీబీ మీకు వ్యక్తిగతంగా కనెక్ట్ చేయబడుతుంది. మీ కారుకు కాదు. దీని అర్థం, మీ వద్ద ఏ కారు ఉన్నా- మీరు మీ కారు పాలసీలను గడువు తేదీకి ముందే రెన్యూ చేస్తున్నంత వరకు, మీరు మీ కారు ఇన్సూరెన్స్ కోసం నో క్లెయిమ్ బోనస్ నుంచి ప్రయోజనం పొందుతూనే ఉండవచ్చు.

3. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఆదా చేసుకోండి: అందరూ ఇష్టపడే ప్రయోజనమేంటో తెలుసా? డిస్కౌంట్స్! ఒక్క నో క్లెయిమ్ బోనస్ మీ వార్షిక కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో కనీసం 20% ఆదా చేస్తుంది.

4. సులభంగా ట్రాన్స్​ఫర్ చేయవచ్చు: మీరు మీ ఇన్సూరర్​ను లేదా కారును మార్చుతున్నప్పుడు, మీ ఎన్​సీబీని ట్రాన్స్​ఫర్ చేసే ప్రక్రియ చాలా సులభం, దానిలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు నిర్ధారించుకోవాల్సిన ఏకైక విషయం ఏమిటంటే, మీ ప్రస్తుత పాలసీ గడువు ముగిసేలోపు మీ పాలసీని మార్చాలి.

ఇన్సూరెన్స్‌లో ఎన్​సీబీ గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు

ఎన్​సీబీ ఎప్పుడు రద్దు అవుతుంది?

ఎన్​సీబీ చాలా ప్రయోజనకరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మీరు క్లెయిమ్ చేయనంత కాలం, మీరు ఎన్​సీబీ రక్షణ యొక్క ప్రయోజనాన్ని పొందుతూనే ఉంటారు. కానీ, మీరు పాలసీ సంవత్సరంలో ఏదైనా కారణం చేత క్లెయిమ్ చేయవలసి వస్తే, తదుపరి పాలసీ సంవత్సరంలో మీరు ఎన్​సీబీ ప్రయోజనం పొందలేరు. మీరు మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీని గడువు ముగిసే తేదీ నుంచి 90 రోజులలోపు రెన్యువల్ చేయకపోతే, మీ ఎన్​సీబీ రద్దు చేయబడుతుంది. ఆ తర్వాత మీరు నో క్లెయిమ్‌ బోనస్ ప్రయోజనాన్ని పొందలేరు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ మీ పాలసీని సకాలంలో పునరుద్ధరించుకోవాలి.

ఎన్​సీబీ సర్టిఫికెట్ ఎలా పొందాలి?

ఎన్​సీబీ గురించి తలెత్తే తదుపరి ప్రశ్న ఏంటంటే.. ఎన్​సీబీ సర్టిఫికెట్ ఎలా పొందాలని? ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో, పాలసీదారుడికి ఎన్​సీబీ సర్టిఫికెట్ అందించబడుతుంది. తర్వాత పాలసీదారుడు పాలసీ సంవత్సరంలో ఏవైనా క్లెయిమ్‌లు చేస్తున్నాడా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అతను క్లెయిమ్ చేసినట్లయితే, తరువాతి సంవత్సరంలో ఎన్​సీబీ ప్రయోజనం పొందడానికి అర్హుడు కాదు. అయితే, అతను మొత్తం సంవత్సరానికి క్లెయిమ్ చేయని పక్షంలో, అతను ఎన్​సీబీ ప్రయోజనానికి అర్హత పొందుతాడు.

ఇన్సూరెన్స్‌లో మునుపటి ఎన్​సీబీ అంటే ఏమిటి?

మీరు ఇంకా ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే, సంవత్సరం మధ్యలో మీ కారును విక్రయించాలని లేదా మరొక కారును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే ఏం జరుగుతుందని ఆశ్చర్యపోతున్నారా?

మీరు డీలర్ లేదా ఏదైనా థర్డ్-పార్టీ నుంచి పాత కారును కొనుగోలు చేసినట్లయితే, ఆ కారు ఎన్​సీబీకి అర్హత కలిగి ఉంటే, మీరు నో క్లెయిమ్ బోనస్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంలో, మీరు చేయాల్సిందల్లా, మీ పాత కారు విక్రయం గురించి మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు సమాచారమిచ్చి, మీ ఎన్​సీబీని కొత్త కారుకు బదిలీ చేయమని అభ్యర్థించడమే.

మీరు ఇప్పుడు డిజిట్​తో కొత్త కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తున్నట్లయితే, మీరు చేయాల్సిందల్లా మీ ప్రస్తుత ఎన్​సీబీని, మీ మునుపటి ఇన్సూరర్ పేరు, పాలసీ నంబర్‌ను పేర్కొనండి. (మీరు మాతో మొదటిసారిగా కొత్త కార్ పాలసీని కొనుగోలు చేస్తుంటే) ఇక మిగతాదంతా మేము చూసుకుంటాము.

కొత్త కార్ ఇన్సూరెన్స్‌కు ఎన్​సీబీని ఎలా ట్రాన్స్​ఫర్​ చేయాలి?

ఇది మీరు మీ కొత్త కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారా లేదా ఏజెంట్ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ కొత్త కారు ఇన్సూరెన్స్ పాలసీని ఆఫ్‌లైన్‌లో లేదా ఏజెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లయితే, మీరు మీ బయ్యర్-సెల్లర్ అగ్గ్రిమెంట్ ఫారమ్‌లు 29, 30తో పాటు సమర్పించడం ద్వారా మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీకి మీ ఎన్​సీబీ ని బదిలీ చేయమని అభ్యర్థించవచ్చు.

అప్పుడు సంబంధిత ఇన్సూరర్ ఎన్​సీబీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. దానిని మీరు మీ కొత్త కారు ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, మీరు మీ కొత్త కారు ఇన్సూరెన్స్​ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయబోతున్నట్లయితే, మీరు ఇందులో ఏదీ చేయవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా సరైన ఎన్​సీబీ, పాత పాలసీ నంబర్, ఇన్సూరర్ పేరును పేర్కొనడమే. మిగిలిన ప్రక్రియను మీ కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది.

ఎన్​సీబీ ట్రాన్స్​ఫర్​కు అవసరమైన డాక్యుమెంట్లు

డాక్యుమెంట్లకు సంబంధించినంత వరకు మీరు అప్లికేషన్‌తో పాటు కింది డాక్యుమెంట్లను ఇవ్వాలి:

పై డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, కొత్త కారుకు నో క్లెయిమ్ బోనస్ ట్రాన్స్​ఫర్ చేయబడుతుంది. ఇప్పటికే ఉన్న ఎన్​సీబీ సర్టిఫికెట్ ఆధారంగా కస్టమర్ కొత్త కారు కోసం ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఇన్సూరెన్స్‌లో నో క్లెయిమ్ బోనస్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

నేను ఒకటికంటే ఎక్కువ కార్లకు నో క్లెయిమ్ బోనస్ పొందవచ్చా?

మీ నో క్లెయిమ్ బోనస్ ఒక కారుకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి, మీరు మీ పుట్టినరోజున ఒక సరికొత్త కారు ను కొనుగోలు చేస్తే, మీరు దానిని విడిగా ఇన్సూర్ చేయవలసి ఉంటుంది - అలాగే, దాని కోసం క్లెయిమ్ చేయకుండా దానికంటూ సొంత ఎన్​సీబీ ని ఏర్పాటు చేసుకోండి.

నేను నో క్లెయిమ్ బోనస్‌ను ఒక ఇన్సూరర్ నుంచి మరొకరికి ట్రాన్స్​ఫర్ చేయవచ్చా?

మీరు ఇన్సూరెన్స్ కంపెనీలను మార్చాలనుకుంటే , మీరు మీ నో క్లెయిమ్ బోనస్‌ను ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి మరొకరికి ట్రాన్స్​ఫర్ చేయవచ్చు. మీరు మీ పాలసీ రెన్యువల్ సమయంలో కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్​ఫర్ చేయాలనుకుంటే, మీరు చూపాల్సిందల్లా మీ గత సంవత్సరం పాలసీ డాక్యుమెంట్ లేదా మీ ఎన్​సీబీని పేర్కొనే రెన్యూవల్ నోటీసు మాత్రమే. మీరు సమయం వృథా అవకూడదనుకుంటే ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయవచ్చు, ఇక్కడ మీ ఎన్​సీబీ మీ డిక్లరేషన్ ఆధారంగా ట్రాన్స్​ఫర్ చేయబడుతుంది - అలాగే, మీరు దీర్ఘకాలం పాటు కొనసాగే నో క్లెయిమ్ బోనస్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం కూడా ఉండదు.

థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌కు నో క్లెయిమ్ బోనస్ వర్తిస్తుందా?

ఎన్​సీబీ మీ ప్రీమియంలోని దాదాపు 15-20% వరకు ఉండే  థర్డ్-పార్టీ లయబిలిటీలకు సంబంధించిన భాగాన్ని కవర్ చేయదు. అంటే మీకు థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ మాత్రమే ఉంటే మీరు ఎన్​సీబీని పొందలేరు - ఎన్​సీబీకి అర్హత పొందాలంటే మీరు కాంప్రహెన్సివ్​ లేదా ఓన్ డ్యామేజ్ కార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. అయితే, థర్డ్ పార్టీ క్లెయిమ్ మీ ఎన్​సీబీని ప్రభావితం చేయదు, ఇది భరోసానిస్తుంది. తెలివిగా క్లెయిమ్‌లు చేయడం ద్వారా మీ నో క్లెయిమ్ బోనస్‌ను కొనసాగించండి. గడిచిపోయే ప్రతీ సంవత్సరం మీ ప్రీమియం తగ్గుతున్నందున మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే, ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన ఏకైక విషయం ఏమిటంటే సురక్షితంగా డ్రైవ్ చేయడం. ప్రమాదాలు అనేవి ఎప్పటికి ఉహించలేనివని మనందరికీ తెలుసు కదా.

నో క్లెయిమ్ బోనస్ అనేది యాడ్–ఆన్ ఆ?

లేదు, నో క్లెయిమ్ బోనస్ యాడ్​–ఆన్​ కాదు. మీరు ఓన్​ డ్యామేజ్​ లేదా కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ  ని కొనుగోలు చేసినట్లయితే, మీరు నో క్లెయిమ్ బోనస్‌కు అర్హులు. అవును, మీరు ఎటువంటి క్లెయిమ్ చేయకుండా సంవత్సరాలుగా సంపాదించిన నో క్లెయిమ్ బోనస్‌ను రక్షించాలనుకుంటే, మీరు నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ యొక్క యాడ్ఆన్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు

కార్ ఇన్సూరెన్స్‌పై గరిష్టంగా వర్తించే నో క్లెయిమ్ బోనస్ ఎంత?

కార్ ఇన్సూరెన్స్‌పై వర్తించే గరిష్ట ఎన్​సీబీ 50% వరకు ఉంటుంది. క్లెయిమ్‌లు లేని మొదటి రెండు సంవత్సరాల్లో, మీ ఎన్​సీబీ 20% నుంచి ప్రారంభమవుతుంది. మీరు వరుసగా ఐదు సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్‌లను కలిగి ఉండకపోతే చివరికి 50% వరకు పెరుగుతుంది.

ఇన్సూరెన్స్​ కంపెనీలు నో క్లెయిమ్ బోనస్‌ని తనిఖీ చేసి, క్లెయిమ్ హిస్టరీని వెరిఫై చేస్తున్నాయా?

అవును, మీ కారు ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేసేటప్పుడు ప్రకటించిన నో క్లెయిమ్ బోనస్, ఇతర వివరాలు సరైనవో కాదో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు తనిఖీ చేస్తాయి. ఏదైనా తప్పుగా పేర్కొన్నట్లయితే, మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ కారు ఇన్సూరెన్స్ పాలసీని (ఇప్పటికే జారీ చేసినట్లయితే) జారీ చేయకపోవచ్చు లేదా రద్దు చేయకపోవచ్చు.

మీరు డ్రైవింగ్ చేయడం మానేస్తే మీరు నో క్లెయిమ్ బోనస్‌ను కోల్పోతారా?

లేదు, మీరు డ్రైవింగ్ చేయడం మానేసినప్పటికీ, మీ నో క్లెయిమ్ బోనస్‌ను కోల్పోరు. మీరు పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేస్తే లేదా మీ కారు ఇన్సూరెన్స్ పాలసీని గడువు తేదీకి ముందు రెన్యూ చేయనప్పుడు మాత్రమే మీరు మీ ఎన్​సీబీని కోల్పోతారు.

ఎన్​సీబీ మొత్తం కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఎలా ప్రభావం చూపుతుంది?

మీరు మీ మొదటి పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకుంటే, మీరు మీ కారు ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసేటప్పుడు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై 20% డిస్కౌంట్​ ఇవ్వబడుతుంది. మీ పాలసీ గడువు ముగిసేలోపు మీరు రెన్యూ చేసేలా చూసుకోండి! ఇలా చేయడం వల్ల, ఎటువంటి క్లెయిమ్‌లు లేకుండా సంవత్సరాలు గడిచేకొద్దీ, మీరు పొందే డిస్కౌంట్ 20% నుంచి 50% వరకు పెరుగుతూనే ఉంటుంది!

ఎన్​సీబీ ఎంత కాలం చెల్లుబాటు అవుతుంది?

మీరు మీ తదుపరి క్లెయిమ్ చేసే వరకు మీ ఎన్​సీబీ చెల్లుతుంది.

మీరు మీ ఇన్సూరెన్స్‌ను రద్దు చేసుకుంటే ఎన్​సీబీని కోల్పోతారా?

అవును, మీరు మీ ఇన్సూరెన్స్ గడువు ముగిసేలోపు పూర్తిగా రద్దు చేస్తే, మీ ఎన్​సీబీని కోల్పోతారు. అయితే, మీరు మీ ఇన్సూరర్‌ను మాత్రమే మార్చాలనుకుంటే, మీ ఎన్​సీబీని డిక్లేర్ చేయడం లేదా మీ ప్రస్తుత ఇన్సూరర్‌ నుంచి మీ కొత్త ఇన్సూరర్‌కు మీ ఎన్​సీబీ సర్టిఫికెట్‌ను అందజేయడం ఉత్తమం. ఇలా చేయడం వలన మీ ప్రస్తుత ఎన్​సీబీ నుంచి పూర్తిగా రద్దు చేయడానికి బదులుగా మీ బెనిఫిట్స్ కొనసాగుతాయి. ముందు చెప్పినట్లుగా, మీ ఎన్​సీబీ మీకు వ్యక్తిగతంగా కనెక్ట్ చేయబడి ఉంటుంది, అంతే కానీ మీ కారు లేదా మీ ఇన్సూరర్‌తో కాదు.