ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్

digit car insurance
usp icon

6000+ Cashless

Network Garages

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

బయ్ /రెన్యూ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఆన్లైన్లో ఇన్ ఇండియా అప్ తో 75% ఆఫ్

digit-play video

ডিজিট কার ইনস্যুরেন্সের মাধ্যমে, আপনি লেস ড্রাইভ করলে, আপনি লেস পেমেন্ট করতে পারেন!

digit-play video

కార్ ఇన్సూరెన్స్: తక్షణమే ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు/ రెన్యువల్ చేయండి

డిజిట్ కార్ ఇన్సూరెన్స్లో ఏమేం కవర్ అవుతాయి.

Hatchback Damaged Driving

ప్రమాదాలు

ప్రమాదాల వలన కలిగే డ్యామేజీలు కవర్ అవుతాయి

Getaway Car

దొంగతనాలు

మీ కారు అనుకోని పరిస్థితుల్లో దొంగతనానికి గురయితే ఈ యాడ్-ఆన్ మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది.

Car Got Fire

అగ్నిప్రమాదాలు

ప్రమాదవశాత్తు జరిగే అగ్ని ప్రమాదాల వలన మీ కారుకు అయ్యే డ్యామేజీలు, నష్టాల నుంచి కవర్ చేస్తుంది.

Natural Disaster

ప్రకృతి విపత్తులు

వరదలు, తుఫానుల వంటి ప్రకృతి విపత్తుల వలన మీ కారుకు డ్యామేజీలు జరిగినపుడు కవర్ చేస్తుంది.

Personal Accident

వ్యక్తిగత ప్రమాదం

కారు ప్రమాదం జరిగినపుడు అనుకోకుండా యజమానికి గాయాలు/ మరణం సంభవించినపుడు.

Third Party Losses

థర్డ్ పార్టీ నష్టాలు

ప్రమాదంలో లేదా వేరే సమయంలో మీ కారు వలన వేరే వ్యక్తుల వాహనానికి కానీ, ఆస్తికి కానీ డ్యామేజీ జరిగినప్పుడు

డిజిట్ కార్ ఇన్సూరెన్స్తో యాడ్ ఆన్స్

మీరు మీ కార్ ఇన్సూరెన్స్​తో పాటు కొనుగోలు చేయగలిగే కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్లు Car insurance add-ons 

జీరో డెప్రిసియేషన్ కవర్

5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న కార్లకు జీరో డెప్రిసియేషన్ కవర్ అనువైనది. మీ కారు మరియు దాని భాగాలపై విధించే తరుగుదలను జీరో డెప్రిసియేషన్ కవర్ zero depreciation cover తగ్గిస్తుంది. మరమ్మతులు, ఖర్చులు, రీప్లేస్​మెంట్ల యొక్క పూర్తి విలువను క్లెయిమ్ సమయంలో మీకు అందిస్తుంది. 

రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్

ఒకవేళ మీ కారు దొంగతనం జరిగినా లేదా రిపేర్ చేయలేని విధంగా పాడైపోతే అప్పుడు మీకు రిటర్న్ టూ ఇన్​వాయిస్ యాడ్ ఆన్ return to invoice add-on కనుక మీకు ఉన్నట్లయితే అది మీకు మీ వాహనం ఇన్​వాయిస్​ విలువ యొక్క మొత్తాన్ని అందిస్తుంది. అంతే కాకుండా మీ వాహన రిజిస్ట్రేషన్​కు అయ్యే ఖర్చు మరియు రోడ్​ ట్యాక్స్​ కూడా కవర్ అవుతాయి. 

టైర్ ప్రొటెక్ట్ కవర్

ప్రమాద సమయంలో నష్టం జరిగితే తప్ప సాధారణ సమయాల్లో టైర్​కు జరిగే నష్టాలు స్టాండర్డ్ ఇన్సూరెన్స్​లో కవర్ కావు. అందుకోసమే ఈ టైర్ ప్రొటెక్ట్ యాడ్ ఆన్ tyre protect add-on మీకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. టైర్ పేలడం, ఉబ్బడం లేదా టైర్ కట్స్ వంటి అన్ని సమస్యలకు ఈ యాడ్ ఆన్ మీకు పరిష్కారం చూపెడుతుంది. దీని ద్వారా మీ టైర్లు రక్షించబడతాయి. 

బ్రేక్ డౌన్ అసిస్టెన్స్

మనకు కార్​ గురించి ఎంత తెలిసినా కానీ కొన్ని, కొన్ని సార్లు సహాయం అవసరం పడుతుంది. డిజిట్ అందిస్తున్న బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ Breakdown Assistance Add-On మీకు అవసరమైన సమయంలో సహాయాన్ని అందిస్తుంది. ఉదాహరణకు ఎటువంటి సమయంలోనైనా మీ కార్ బ్రేక్ డౌన్ అయినపుడు.. మీకు నచ్చిన విధంగా సహాయం అందిస్తుంది. ఇందులో మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఇది క్లెయిమ్​గా కూడా పరిగణించబడదు. 

కన్స్యూమబుల్ కవర్

కన్స్యూమబుల్ కవర్ consumable cover మీ కారుకు అదనపు రక్షణ కవచాన్ని అందిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినపుడు కారు యొక్క ఇంజిన్ ఆయిల్స, స్క్రూలు, నట్స్ మరియు బోల్ట్స్, గ్రీస్ మొదలయిన మీ కారు అన్ని వస్తువులకు అయ్యే ఖర్చును ఇది కవర్ చేస్తుంది. 

ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్

మీ ఇంజిన్​ను మార్చేందుకు అయ్యే ఖర్చు కారుకు అయ్యే ఖర్చులో దాదాపు 40 శాతం అని మీకు తెలుసా? స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కేవలం ప్రమాద సమయంలో సంభవించే నష్టాలకు మాత్రమే పరిహారం లభిస్తుంది. కానీ ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్​తో engine and gear-box protection cover ప్రమాదం తర్వాత మీ కారుకు సంభవించే (ఇంజిన్ మరియు గేర్​బాక్స్​) పర్యవసాన నష్టాల నుంచి మీ వాహనాన్ని రక్షించుకోవచ్చు. 

రోజూవారీ రవాణా ప్రయోజనం

ఒక వేళ మీ కారు చెడిపోయి గ్యారేజ్​లో ఉంటే.. డైలీ కన్వేయన్స్ బెనిఫిట్ Daily Conveyance Benefit యాడ్ ఆన్​ కనుక మీకు ఉంటే… కారు గ్యారేజ్​లో ఉన్న సమయంలో మీ రోజూ వారి ప్రయాణం కోసం అయ్యే ఖర్చును ఇది అందిస్తుంది. లేదా మీకు మరో వాహనాన్ని కానీ ఏర్పాటు చేస్తుంది. 

కీ మరియు లాక్ ప్రొటెక్ట్

దొంగతనం లేదా డ్యామేజ్ లేదా నష్టం జరిగినపుడు అందులోని లాక్​సెట్ రిపేర్​కు అయ్యే ఖర్చును కీ మరియు లాక్​ ప్రొటెక్ట్ Key and Lock Protect యాడ్ ఆన్​ కవర్ ఉంటే బీమాదారు మీకు చెల్లిస్తారు. 

వ్యక్తిగత వస్తువులకు నష్టం

బీమా చేయబడిన వాహనంలో పాలసీదారుని లేదా అతని కుటుంబసభ్యులకు చెందిన ఏవైనా వ్యక్తిగత వస్తువులు పోతే loss of personal belongings వాటికి ఇన్సరెన్స్ కంపెనీ నష్టపరిహారం అందజేస్తుంది. 

పే ఆస్ యూ డ్రైవ్ కవర్

Pay as you drive పే ఆస్ యూ డ్రైవర్ కవర్ వలన ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా బేస్ పాలసీ యొక్క ఓన్ డ్యామేజ్ కవర్  ప్రీమియం మీద డిస్కౌంట్ పొందేందుకు పాలసీదారుడు అర్హత పొందుతాడు. అదనపు ప్రీమియాన్ని చెల్లించడం ద్వారా బేస్​ పాలసీ కింద కిలోమీటర్లను టాప్ అప్(రీచార్జ్) చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. 

ఏమేం కవర్ కావంటే

మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీలో ఏమేం కవర్​ కావనే విషయం గురించి కూడా మీరు తెలుసుకోవడం చాలా అవసరం. కవర్​ కాని విషయాలను మీరు ముందుగా తెలుసుకుంటేనే క్లెయిమ్​ చేసే విషయంలో ఆశ్చర్యానికి గురి కాకుండా ఉంటారు. కవర్​ కాని విషయాల గురించి ఇక్కడ పేర్కొన్నాం.

థర్డ్ పార్టీ పాలసీ దారుడి సొంత వాహనానికి అయిన డ్యామేజీలు

మీరు థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకున్నపుడు సొంత వాహనానికి అయిన డ్యామేజీలు​ ఇందులో కవర్​ కావు.

మద్యం సేవించి వాహనం నడిపినా లేదా లైసెన్స్ లేకుండా నడిపినా..

ప్రమాదం జరిగినపుడు మీరు మద్యం సేవించి ఉన్నా లేదా సరైన డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా వాహనం నడిపినపుడు పాలసీ కవర్​ కాదు.

సరైన లైసెన్స్ ఉన్న వ్యక్తి పక్కన లేకుండా వాహనం నడిపితే

ఒకవేళ మీకు లెర్నర్స్ లైసెన్స్​ ఉంటే, సరైన లైసెన్స్​ ఉన్న వ్యక్తి మీ పక్కన ఉండాలి. అలా లేకుండా మీరు వాహనం నడిపితే ఇన్సూరెన్స్​ వర్తించదు.

పర్యావసాన నష్టాలు

ప్రమాదానికి సంబంధించినవి కాకుండా మిగతా డ్యామేజీలు​ అయినపుడు కవర్​ కాదు. (ఉదా.. ఒక ప్రమాదం తర్వాత మీ కారును ఎవరైనా సరే సరిగ్గా నడపకుండా దాని ఇంజన్​ డ్యామేజ్​ అయితే అది కవర్​ కాదు)

కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్

ఏదైనా కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ (ఉదా., తయారీదారు డ్రైవింగ్ మాన్యువల్ ప్రకారం సిఫార్సు చేయని వరదలో కారును నడపడం వల్ల జరిగిన డ్యామేజ్, కవర్ చేయబడదు)

అవసరమైన యాడ్ ఆన్స్ కొనుగోలు చేయనపుడు

కొన్ని డ్యామేజీలు​ యాడ్–ఆన్స్​లో మాత్రమే కవర్​ అవుతాయి. మీరు అలాంటి యాడ్​–ఆన్స్​ కొనుగోలు చేయకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో కవర్​ అయ్యే విషయాలు కవర్​ కావు.

మీరు డిజిట్ కార్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?

ఈ సారికి డిజిట్​లో మీ కార్​ ఇన్సూరెన్స్​ను తీసుకునేందుకు ప్రయత్నించండి. డిజిట్​ వలన ఎటువంటి మార్పులు ఉంటాయంటే..

క్యాష్‌లెస్​ రిపేర్లు

భారతదేశ వ్యాప్తంగా మాకు 6000+ క్యాష్​లెస్​ (నగదు రహిత) నెట్‌వర్క్​ గ్యారేజీలు ఉన్నాయి. వాటిల్లో నుంచి ఏదైనా సరే మీరు ఎంచుకోవచ్చు

Customize your Vehicle IDV

మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్​ చేసుకోండి

మా దగ్గర మీరు పాలసీ తీసుకునేటప్పుడు మీ వాహనం ఐడీవీ (IDV)ని మీకు నచ్చిన తీరుగా కస్టమైజ్​ చేసుకునే అవకాశం ఉంటుంది.

స్మార్ట్​ ఫోన్​ ఆధారిత సెల్ఫ్​ తనిఖీ

మీ కారు​కు జరిగిన డ్యామేజీలను కేవలం స్మార్ట్​ ఫోన్​లో ఒక ఫొటో తీసి మాకు పంపిస్తే సరిపోతుంది.

సూపర్​ ఫాస్ట్​ క్లెయిమ్స్

మేము ఇప్పటి వరకు 96 శాతం ప్రైవేటు కార్​ ఇన్సూరెన్స్​ల​ క్లెయిమ్స్​ను​ సెటిల్​ చేశాం.

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్​ సపోర్ట్​​ సౌలభ్యం ఉంటుంది.

డిజిట్ అందించే కార్ ఇన్సూరెన్స్ యొక్క కీ ఫీచర్స్ (ముఖ్య లక్షణాలు)

కీ ఫీచర్స్

డిజిట్ ద్వారా ప్రయోజనం

ప్రీమియం

రూ. 2094 నుంచి ప్రారంభం

నో క్లెయిమ్ బోనస్(NCB)

50శాతం వరకు డిస్కౌంట్

మీకు నచ్చిన యాడ్ ఆన్స్

10 రకాల యాడ్ ఆన్స్ అందుబాటులో ఉన్నాయి.

క్యాష్లెస్ రిపేర్లు

డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ సేవలు 6000+ కంటే ఎక్కువ గ్యారేజీల్లో అందుబాటులో ఉన్నాయి.

క్లెయిమ్ ప్రాసెస్

స్మార్ట్ ఫోన్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. 7 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఆన్లైన్లో పూర్తవుతుంది.

ఓన్ డ్యామేజ్ కవర్

లభిస్తుంది.

థర్డ్ పార్టీ డ్యామేజెస్

పర్సనల్ డ్యామేజెస్ కొరకు అపరిమిత బాధ్యత మరియు ఆస్తులు లేదా వాహనాలకు డ్యామేజ్ జరిగితే 7.5 లక్షల వరకు నష్టపరిహారం

మీ అవసరాలకు సరిపోయే కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

car-quarter-circle-chart

థర్డ్ పార్టీ

థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ అనేది ఒక సాధారణ రకమైన కార్​ ఇన్సూరెన్స్​; ఈ పాలసీలో కేవలం థర్డ్​ పార్టీ వ్యక్తులకు లేదా ఆస్తుల​కు జరిగిన డ్యామేజీలు​ మాత్రమే కవర్​ అవుతాయి.

car-full-circle-chart

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ అనేది ఎంతో విలువైన కార్​ ఇన్సూరెన్స్​. ఇది థర్డ్​ పార్టీ లయబిలిటీల​ను కవర్​ చేయడంతో పాటు సొంత వాహనానికి జరిగిన డ్యామేజీల​ను కూడా కవర్​ చేస్తుంది.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

ఫోర్-వీలర్స్ కు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ధరలు

థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ మీ కారు ఇంజన్ సిసిపై ఆధారపడి ఉంటుంది మరియు సంబంధిత ప్రీమియం రేట్ లు కూడా ఐఆర్‌డిఎఐ (IRDAI) చే ముందుగా నిర్ణయించబడతాయి, ఇవి క్రింది విధంగా ఉన్నాయి:

ఇంజిన్ సామర్థ్యంతో ప్రైవేట్ కార్లు

2019-20 ప్రీమియం INRలో

ప్రీమియం రేట్ (జూన్ 1, 2022 నుండి అమలులోకి వస్తుంది)

1000cc మించకూడదు

₹2072

₹2094

1000cc దాటినా 1500ccకి మించకూడదు

₹3221

₹3416

1500cc మించిపోయింది

₹7890

₹7897

భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ మార్కెట్ పరిమాణం, ప్రాంతాల వారీగా, 2015 నుండి 2025 వరకు విలువ ప్రకారం

కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ను ఎలా ఫైల్ చేయాలి?

మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ను కొనుగోలు/ రెన్యువల్ చేసిన తర్వాత చాలా నిశ్చింతగా ఉండండి. మీరు క్లెయిమ్ చేసేందుకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా 3 స్టెప్పుల క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. పైగా, ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ.

స్టెప్1

1800-258-5956 అనే నంబర్పై కాల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫారాలు కూడా నింపాల్సిన అవసరం ఉండదు.

స్టెప్2

అప్పడు మేము మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక స్వీయ తనిఖీ లింక్ను పంపిస్తాం. అప్పడు మీరు మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను ఫొటో తీసి మాకు పంపిస్తే సరిపోతుంది. ఎలా పంపాలి అనేది మేము దశలవారీగా వివరిస్తాం.

స్టెప్ 3

రీయింబర్స్మెంట్ క్లెయిమ్ కానీ, క్యాష్లెస్ క్లెయిమ్ కానీ ఎంచుకుంటే సరిపోతుంది. క్యాష్లెస్ క్లెయిమ్ అనేది కేవలం మా నెట్వర్క్ గ్యారేజీల్లోనే లభిస్తుంది.

డిజిట్ కార్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిములు చేయడం మరింత సులభం

Cashless Garages by Digit

డిజిట్ యొక్క క్యాష్లెస్ గ్యారేజీలు

మాకు భారతదేశ వ్యాప్తంగా 6000+ కంటే ఎక్కువ క్యాష్​లెస్​ గ్యారేజీలు ఉన్నాయి.

Report Card

డిజిట్ క్లెయిమ్స్ ఎంత త్వరగా సెటిల్ అవుతాయి?

ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు వారి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇది.

డిజిట్ యొక్క క్లెయిముల రిపోర్టు కార్డును చదవండి

మా గురించి మా కస్టమర్లు ఏమని అనుకుంటున్నారంటే..

విశాల్ మోడీ

డిజిట్​లో క్లెయిమ్​ ప్రక్రియ చాలా సింపుల్​గా ఉంటుంది. ఇందులో ఉన్న కస్టమర్​ టీమ్​ కూడా చాలా సాయం చేస్తూ ఉంటుంది. సర్వేయర్లు కూడా చాలా నిబద్ధతతో ఉంటారు. (నా విషయంలో మిస్టర్​ సతీష్​ కుమార్​). నేను కేవలం ఫొటోలను అప్​లోడ్​ చేయగానే క్లెయిమ్​ ప్రాసెస్​ అయింది. రీయింబర్స్​మెంట్​ కూడా చాలా త్వర​గా వచ్చింది. గో డిజిట్​ చాలా గ్రేట్​.

సులభ్ సిన్హా

నా అనుభవాలను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. డిజిట్​లో నాకు ఎదురైన విషయాలను నేను మీకు చెబుతాను. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్సూరెన్స్​ కంపెనీల్లో డిజిట్​ ఉత్తమ ఇన్సూరెన్స్​ కంపెనీ అని నేను చెబుతాను. క్లెయిమ్​ సెటిల్​మెంట్​ విషయంలోనైనా, లేదా కస్టమర్​ సపోర్ట్​ విషయంలోనైనా డిజిట్​ ఉత్తమం. నేను మిస్టర్​ రత్న (సర్వేయర్​) కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అతడే నా క్లెయిమ్​కు సంబంధించిన కేసును పరిష్కరించాడు. అతడు సరైన సమయంలో నాకు ఇచ్చిన సలహా ఇచ్చాడు. ఎవరైనా సరే ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశిస్తారు. డిజిట్​ కంపెనీ తన సర్వీసును ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నాను.

సిద్ధాంత్ గాంధీ

డిజిట్​ ఇన్సూరెన్స్​లో పాలసీ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మొత్తం ప్రాసెస్​ డిజిటల్​గా, కస్టమర్​ ఫ్రెండ్లీగా ఉంటుంది. వర్క్​షాప్​లో నా కారు రిపేర్​ చేయించినపుడు నేను ఎటువంటి కంగారుకు గురికాలేదు. మీ కారుకు ఏదైనా ప్రమాదం అయిందని మీరు చెబితే వారు మీ ఫోన్​ నంబర్​కు ఒక లింక్​ పంపిస్తారు. ఆ లింక్​ ద్వారా మీ డ్యామేజ్​ అయిన కారు ఫొటోలను పంపిస్తే సరిపోతుంది. తర్వాత మీ క్లెయిమ్​కు సంబంధించిన పూర్తి విషయాన్ని సర్వేయర్​ చూసుకుంటాడు. నా విషయంలో మిస్టర్​ మాత్రే చాలా సహాయం చేశారు. అన్ని విషయాలకు అతడు స్పందించిన తీరు అద్భుతం. నా ముందటి ఇన్సూరెన్స్​ కంపెనీ కంటే డిజిట్​ ఖచ్చితంగా మెరుగ్గా ఉంది.

Show more

కార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాలు

మిమ్మల్ని ఆర్థిక నష్టాల నుంచి కవర్ చేస్తుంది

మీరు థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ ఎంచుకున్నా లేదా కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ ఎంచుకున్నా ప్రమాదాల వలన కలిగే నష్టాల నుంచి ఆర్థికంగా కాపాడబడతారు. కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​లో ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వంటి అనుకోని సందర్భాల్లో ఎదురయ్యే నష్టాలు కూడా కవర్​ చేయబడతాయి. అంతే కాకుండా మీరు ట్రాఫిక్​ జరిమానాల నుంచి కూడా కాపాడబడతారు.

థర్డ్ పార్టీ డ్యామేజీల వలన ఏర్పడే సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది

ప్రమాదాలు సర్వసాధారణం. ఏదైనా సందర్భంలో మీ వాహనానికి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం వలన థర్డ్​ పార్టీ వ్యక్తులు, ప్రాపర్టీలకు జరిగే డ్యామేజ్ నుంచి మిమ్మల్ని సంరక్షిస్తుంది. గంటల తరబడి మీరు పోరాడాల్సిన అవసరం ఉండదు.

యాడ్ ఆన్స్ వలన మంచి కవరేజ్ మరియు బెనిఫిట్లు అందుతాయి...

మీరు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను కనుక ఎన్నుకుంటే మీకారుకు మరింత సంరక్షణ అందించే యాడ్​–ఆన్స్​ను ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. జీరో డిప్రిషియేషన్ కవర్​, రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్, బ్రేక్​ డౌన్​  అసిస్టెన్స్​ వంటి యాడ్​–ఆన్లతో మీరు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు.

చట్టం దృష్టిలో మంచి వ్యక్తులుగా ఉండండి

మోటార్​ వాహన చట్టం ప్రకారం భారతదేశంలో కార్ల​కు కనీసం థర్డ్​  పార్టీ ఇన్సూరెన్స్​ అయినా సరే తప్పకుండా ఉండాలి. ఎటువంటి ఇన్సూరెన్స్​ లేకుండా మీరు బయట తిరిగితే మీకు భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ లేకుండా మొదటి సారి దొరికినపుడు రూ. 2,000, రెండో సారి దొరికినపుడు రూ. 4,000 వరకు ఫైన్ పడుతుంది.

డోర్ స్టెప్ పికప్, డ్రాప్

మీరు డిజిట్​ అందించే కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ ను తీసుకుంటే మీకు మరో ప్రయోజనం కూడా లభిస్తుంది. అదే డోర్​ స్టెప్​ పికప్, డ్రాప్​. మీ కారు ఎప్పుడైనా రిపేర్ చేయాల్సిన అవసరం వస్తే ఇది ఉపయోగపడుతుంది.

సమయాన్ని ఆదా చేసుకోండి!

ప్రస్తుతం టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. మీ కార్​ ఇన్సూరెన్స్​ కు సంబంధించిన అన్ని విషయాలు ఆన్​లైన్​లో చిటికెలో పూర్తవుతాయి. దీని వలన మీ డబ్బుతో పాటు విలువైన సమయం కూడా ఆదా​ అవుతుంది.

ఏ కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఉత్తమమైనది?

సరైన కార్ ఇన్సూరెన్స్ను ఎలా ఎంచుకోవాలి.

మీ కారు కోసం సరైన ఇన్సూరెన్స్​ను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ ఉంది.

కొనుగోలు ప్రక్రియ..

ప్రతి ఒక్కరూ సమయం కోసమే చూస్తారు. ఎల్లప్పుడూ గజిబిజిగా లేని కార్​ ఇన్సూరెన్స్​ కోసం ప్రయత్నించండి. తొందరగా పూర్తయ్యే దాని కోసం చూడండి. డిజిట్​ అందించే కార్​ ఇన్సూరెన్స్​ నిమిషాల్లో పూర్తవుతుంది. దీని మొత్తం ప్రక్రియ ఆన్​లైన్​లోనే ఉంటుంది.

సరైన ఐడీవీ

మీ ఐడీవీ (మీ వాహన ప్రస్తుత మార్కెట్​ విలువ) అనేది చాలా ముఖ్యం. కార్​ ఇన్సూరెన్స్​లో ఇది ప్రధానమైన విషయం. ఈ విలువ మీ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను నేరుగా ప్రభావితం చేస్తుంది. క్లెయిమ్​ సెటిల్​మెంట్​ సమయంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. డిజిట్​లో మీ ఐడీవీని మీరు ఇష్టం వచ్చిన విధంగా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది.

సర్వీస్ ప్రయోజనాలు

అదనపు ప్రయోజనాలను మనమందరం ఇష్టపడతాం. మీ కార్​ ఇన్సూరెన్స్​ను తీసుకునే సమయంలో ఇది కూడా చాలా ముఖ్యం. కావున ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకునేటపుడు కంపెనీ ఎటువంటి సర్వీసులను అందిస్తుందనేది ఓ సారి చూసుకోవాలి. ఉదా. డిజిట్​లో డోర్​ స్టెప్​ పికప్, డ్రాప్​ సౌలభ్యం ఉంది.

క్లెయిమ్ ప్రక్రియ

కార్​ ఇన్సూరెన్స్​లో క్లెయిములకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీరు ఎంచుకునే కార్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ ప్రాసెస్​ చాలా ఈజీగా ఉండేలా చూసుకోండి. అది ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా జాగ్రత్త పడండి. మీరు ఇబ్బందుల్లో ఉన్నపుడు మీ క్లెయిమ్​ తొందరగా రావాలని కోరుకుంటారు కదా.. ఎంతో కష్టపడి క్లెయిమ్​ ఫైల్​ చేసిన తర్వాత అది రిజెక్ట్​ అయితే చాలా సమయం వృథా అవుతుంది.

క్లెయిమ్ సెటిల్మెంట్లు

క్లెయిమ్​ సెటిల్​మెంట్లు అనేవి చాలా ముఖ్యం. మీరు ఒక క్లెయిమ్​ చేసినపుడు అది ఆమోదించబడుతుందా లేదా రిజెక్ట్​ అవుతుందా అనేది క్లెయిమ్​ సెటిల్​మెంట్​ నిష్పత్తిలోనే తెలుస్తుంది. అందుకోసమే మనం పాలసీ తీసుకునే ముందు తప్పనిసరిగా క్లెయిమ్​ సెటిల్​మెంట్​ నిష్పత్తిని సరిగ్గా చూసుకోవాలి.

కస్టమర్ సపోర్ట్

కార్​ ఇన్సూరెన్స్​లో కస్టమర్​ సపోర్ట్​ అనేది చాలా విలువైనది. కాబట్టే 24x7 కస్టమర్​ సపోర్ట్​ అందించే కార్​ ఇన్సూరెన్స్​ కంపెనీనే ఎంచుకోండి.

మీరు తెలుసుకోవాల్సిన కార్ ఇన్సూరెన్స్ పదజాలం

సరైన కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా ఎంచుకోవాలి?

కార్ ఇన్సూరెన్స్ పాలసీని డిజిట్తో ఎందుకు రెన్యువల్ చేసుకోవాలి?

కార్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు

ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు

ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ను కొనుగోలు/ రెన్యువల్ చేయడం గురించి మీకు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటి జవాబుల కోసం కింద చూడండి.