కార్ ఇన్సూరెన్స్‌లో ఎన్సీబీ (NCB)
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
భారతదేశంలో, ఫోర్-వీలర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే మీరు ఇక్కడ కారును కొనుగోలు చేసేముందు, మోటార్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలో తప్పనిసరి అని మీరు తెలుసుకోవాలి. అలాగే మీరు కారు కొనుగోలు చేసేటప్పుడే ఈ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలా వరకు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు తమ పాలసీదారులకు ఎన్సీబీ ప్రయోజనాలను అందిస్తున్నాయి.
ఈరోజుల్లో భారతదేశంలోని చాలామంది ప్రజలకు ఎన్సీబీ అంటే అర్ధం ఏమిటో కూడా తెలియదు! అందుకనే, మీరు సాధారణంగా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మేము మీ ముందుకు వచ్చాం,
ఎన్సీబీ అంటే ‘నో క్లెయిమ్ బోనస్’ అని అర్ధం. పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌ను ఫైల్ చేయనప్పుడు వారి కస్టమర్లకు కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు అందించే ఒక రకమైన రివార్డ్ ఇది. ఈ రివార్డ్ ద్వారా, ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి తదుపరి పాలసీ సంవత్సరంలో తన ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసే సమయంలో ప్రీమియంపై కొంత తగ్గింపును పొందుతారు.
మీ చుట్టూ ఉన్న ప్రతివాటి ధరలు పెరుగుతుంటే, మీ కార్ ఇన్సూరెన్స్ మాత్రం కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకునే ఛాయిస్‌ను అందించడం ద్వారా మీకో ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది ఎలా పని చేస్తుంది అని మీరు అడగవచ్చు?
చెప్పాలంటే, ఇది దాదాపు రివార్డ్ సిస్టమ్‌లాగా పనిచేస్తుంది. మీరు మీ పాలసీ మొదటి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకుంటే 20% ఎన్సీబీ డిస్కౌంట్ పొందుతారు. ఈ విధంగా, మీ నుంచి ఎటువంటి క్లెయిమ్‌లు జరగకపోతే, వరుసగా రెండవ సంవత్సరం నుంచి అదనంగా 5% పొందుతారు. ఇలా మీరు వరుసగా ఆరవ సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు 50% వరకు తగ్గింపును పొందుతారు. ఒక చిన్న కథగా చెప్పాలంటే, మీరు ఎంత బాగా డ్రైవ్ చేయగలిగితే, అంత బాగా మీ కారును మెయింటేన్ చేయగలరు - దీర్ఘకాలంలో ఇది మీకు అంత బాగా పని చేస్తుంది.
కానే కాదు! మీరు ఒక చిన్న ప్రమాదంలో చిక్కుకున్నట్లయితే లేదా చిన్న టైర్ పేలినందుకు మీ కారు ఇన్సూరెన్స్‌ను ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు క్లెయిమ్‌కు వెళ్లకుండా దానికి బదులుగా, మరమ్మతుల కోసం మీరే చెల్లించవచ్చు (మీకు సాధ్యమవుతుందని అనుకుంటేనే!). మీరు ఎటువంటి క్లెయిమ్‌లు లేకుండా ఒక సంవత్సరం పాటు గడపవచ్చు. మీ కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ సమయంలో నో క్లెయిమ్ బోనస్‌ను పొందవచ్చు.
ఇన్సూరెన్స్ టర్మ్‌లలో ఎన్సీబీ పాలసీ అంటే ఏమిటో అర్థం చేసుకున్న తర్వాత, తదుపరి అసలైన ప్రశ్న ఏమిటంటే - కారు ఇన్సూరెన్స్ కోసం నో క్లెయిమ్ బోనస్ ఎంత అని?
మీ కారుకు నో క్లెయిమ్ బోనస్‌ని లెక్కించడం అంత కష్టమేమీ కాదు. వాస్తవానికి, అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వెబ్సైట్లలో నో క్లెయిమ్ బోనస్ క్యాలిక్యులేటర్‌ను అందిస్తాయి. అది మీ పాలసీకి అనుగుణంగా నో క్లెయిమ్ బోనస్ అమౌంట్‌ని లెక్కించడంలో మీకు సహాయపడుతుంది. ఇది సాధారణంగా మీ సంబంధిత పాలసీ యొక్క రెండో సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది.
ప్రస్తుత ప్రమాణాల ప్రకారం, భారతదేశంలో ఎన్సీబీ 20 శాతంతో మొదలై ఆరో సంవత్సరంలో 50 శాతానికి చేరుకుంటుంది. ఏదైనా ఫోర్-వీలర్ కోసం నో క్లెయిమ్ బోనస్ పర్సెంటేజ్ సాధారణంగా కింది విధంగా లెక్కించబడుతుంది.
క్లెయిమ్ చేయని సంవత్సరాలు |
నో క్లెయిమ్ బోనస్ |
మొదటి సంవత్సరం తరువాత |
20% |
2 సంవత్సరాల తరువాత |
25% |
3 సంవత్సరాల తరువాత |
35% |
4 సంవత్సరాల తరువాత |
45% |
5 సంవత్సరాల తరువాత |
50% |
1. మీకు పాజిటివ్ రివార్డులను అందిస్తుంది: ఎన్సీబీ అంటే మంచి, బాధ్యతాయుతమైన డ్రైవర్, కారు యజమానిగా ఉన్నందుకు మీకు అందించే ఒక రివార్డ్.
2. మీకు కనెక్ట్ చేయబడుతుంది, మీ కారుకు కాదు: ఎన్సీబీ మీకు వ్యక్తిగతంగా కనెక్ట్ చేయబడుతుంది. మీ కారుకు కాదు. దీని అర్థం, మీ వద్ద ఏ కారు ఉన్నా- మీరు మీ కారు పాలసీలను గడువు తేదీకి ముందే రెన్యూ చేస్తున్నంత వరకు, మీరు మీ కారు ఇన్సూరెన్స్ కోసం నో క్లెయిమ్ బోనస్ నుంచి ప్రయోజనం పొందుతూనే ఉండవచ్చు.
3. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఆదా చేసుకోండి: అందరూ ఇష్టపడే ప్రయోజనమేంటో తెలుసా? డిస్కౌంట్స్! ఒక్క నో క్లెయిమ్ బోనస్ మీ వార్షిక కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో కనీసం 20% ఆదా చేస్తుంది.
4. సులభంగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు: మీరు మీ ఇన్సూరర్‌ను లేదా కారును మార్చుతున్నప్పుడు, మీ ఎన్సీబీని ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియ చాలా సులభం, దానిలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు నిర్ధారించుకోవాల్సిన ఏకైక విషయం ఏమిటంటే, మీ ప్రస్తుత పాలసీ గడువు ముగిసేలోపు మీ పాలసీని మార్చాలి.
ఎన్సీబీ చాలా ప్రయోజనకరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మీరు క్లెయిమ్ చేయనంత కాలం, మీరు ఎన్సీబీ రక్షణ యొక్క ప్రయోజనాన్ని పొందుతూనే ఉంటారు. కానీ, మీరు పాలసీ సంవత్సరంలో ఏదైనా కారణం చేత క్లెయిమ్ చేయవలసి వస్తే, తదుపరి పాలసీ సంవత్సరంలో మీరు ఎన్సీబీ ప్రయోజనం పొందలేరు. మీరు మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీని గడువు ముగిసే తేదీ నుంచి 90 రోజులలోపు రెన్యువల్ చేయకపోతే, మీ ఎన్సీబీ రద్దు చేయబడుతుంది. ఆ తర్వాత మీరు నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాన్ని పొందలేరు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ మీ పాలసీని సకాలంలో పునరుద్ధరించుకోవాలి.
ఎన్సీబీ గురించి తలెత్తే తదుపరి ప్రశ్న ఏంటంటే.. ఎన్సీబీ సర్టిఫికెట్ ఎలా పొందాలని? ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో, పాలసీదారుడికి ఎన్సీబీ సర్టిఫికెట్ అందించబడుతుంది. తర్వాత పాలసీదారుడు పాలసీ సంవత్సరంలో ఏవైనా క్లెయిమ్‌లు చేస్తున్నాడా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అతను క్లెయిమ్ చేసినట్లయితే, తరువాతి సంవత్సరంలో ఎన్సీబీ ప్రయోజనం పొందడానికి అర్హుడు కాదు. అయితే, అతను మొత్తం సంవత్సరానికి క్లెయిమ్ చేయని పక్షంలో, అతను ఎన్సీబీ ప్రయోజనానికి అర్హత పొందుతాడు.
మీరు ఇంకా ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే, సంవత్సరం మధ్యలో మీ కారును విక్రయించాలని లేదా మరొక కారును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే ఏం జరుగుతుందని ఆశ్చర్యపోతున్నారా?
మీరు డీలర్ లేదా ఏదైనా థర్డ్-పార్టీ నుంచి పాత కారును కొనుగోలు చేసినట్లయితే, ఆ కారు ఎన్సీబీకి అర్హత కలిగి ఉంటే, మీరు నో క్లెయిమ్ బోనస్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంలో, మీరు చేయాల్సిందల్లా, మీ పాత కారు విక్రయం గురించి మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు సమాచారమిచ్చి, మీ ఎన్సీబీని కొత్త కారుకు బదిలీ చేయమని అభ్యర్థించడమే.
మీరు ఇప్పుడు డిజిట్‌తో కొత్త కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తున్నట్లయితే, మీరు చేయాల్సిందల్లా మీ ప్రస్తుత ఎన్సీబీని, మీ మునుపటి ఇన్సూరర్ పేరు, పాలసీ నంబర్‌ను పేర్కొనండి. (మీరు మాతో మొదటిసారిగా కొత్త కార్ పాలసీని కొనుగోలు చేస్తుంటే) ఇక మిగతాదంతా మేము చూసుకుంటాము.
ఇది మీరు మీ కొత్త కారు ఇన్సూరెన్స్ ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారా లేదా ఏజెంట్ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ కొత్త కారు ఇన్సూరెన్స్ పాలసీని ఆఫ్‌లైన్‌లో లేదా ఏజెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లయితే, మీరు మీ బయ్యర్-సెల్లర్ అగ్గ్రిమెంట్ ఫారమ్‌లు 29, 30తో పాటు సమర్పించడం ద్వారా మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీకి మీ ఎన్సీబీ ని బదిలీ చేయమని అభ్యర్థించవచ్చు.
అప్పుడు సంబంధిత ఇన్సూరర్ ఎన్సీబీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. దానిని మీరు మీ కొత్త కారు ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, మీరు మీ కొత్త కారు ఇన్సూరెన్స్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేయబోతున్నట్లయితే, మీరు ఇందులో ఏదీ చేయవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా సరైన ఎన్సీబీ, పాత పాలసీ నంబర్, ఇన్సూరర్ పేరును పేర్కొనడమే. మిగిలిన ప్రక్రియను మీ కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది.
డాక్యుమెంట్లకు సంబంధించినంత వరకు మీరు అప్లికేషన్‌తో పాటు కింది డాక్యుమెంట్లను ఇవ్వాలి:
పై డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, కొత్త కారుకు నో క్లెయిమ్ బోనస్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇప్పటికే ఉన్న ఎన్సీబీ సర్టిఫికెట్ ఆధారంగా కస్టమర్ కొత్త కారు కోసం ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్ ప్రయోజనాన్ని పొందవచ్చు.