Third-party premium has changed from 1st June. Renew now
కమర్షియల్ వెహికల్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
కమర్షియల్ వెహికిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించే ట్రక్కులు, స్కూల్ బస్సులు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు తదితర కమర్షియల్ వాహనాలకు అవసరమయ్యే ప్రత్యేకంగా రూపొందించబడిన పాలసీ. ఇది థర్డ్ పార్టీ వాహనం, ఆస్తి, లేదా వ్యక్తికి సంభవించే డ్యామేజీల వల్ల మీకు కలిగే నష్టాల నుంచి సంరక్షిస్తుంది.
భారతదేశంలో, మోటార్ వాహనాల చట్టం ప్రకారం, కనీసం థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ అయినా కలిగి ఉండటం తప్పనిసరి. ఉదాహరణకు, వాహనం నడుపుతున్నప్పుడు, మీ ట్రక్కు రోడ్డుపై వెళుతున్న మరో వాహనాన్ని ఢీకొట్టి డ్యామేజీ కలిగించిందనుకోండి, ఈ సందర్భంలో డ్యామేజీ అయిన వాహనం వలన మీకు కలిగే నష్టాలను కవర్ చేస్తుంది.
కమర్షియల్ వాహనాలకు డిజిట్ అందించే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఏమేం కవర్ అవుతాయి?
ఏమి కవర్ కావు?
మేము పారదర్శకతను నమ్ముతాం. అందుకే ఏమేం కవర్ చేయబడుతుందో మీకు తెలిసినప్పుడు, మీ థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్లో ఏది కవర్ చేయబడదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీరు క్లెయిమ్ చేసినప్పుడు ఎలాంటి షాక్‌లకు గురికారు. అటువంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
కమర్షియల్ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ దురదృష్టవశాత్తు మీ సొంత వాహనానికి అయ్యే ఎలాంటి డ్యామేజీలను కూడా కవర్ చేయదు, ఎందుకంటే ఇది థర్డ్ పార్టీలకు సంబంధించిన నిర్దిష్ట పాలసీ.
క్లెయిమ్ సమయంలో, డ్రైవర్-ఓనర్ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మద్యం ప్రభావంతో బీమా చేయబడ్డ వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నట్లుగా తేలితే, అప్పుడు క్లెయిమ్ ఆమోదించబడదు.
ఒకవేళ మీరు లెర్నర్ లైసెన్స్‌ను కలిగి ఉండి, ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో సరైన డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లయితే- అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మీ క్లెయిమ్ కవర్ చేయబడదు.
డిజిట్ అందించే కమర్షియల్ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కీలక ఫీచర్లు
కీలక ఫీచర్లు | డిజిట్ ప్రయోజనం |
---|---|
థర్డ్ పార్టీకి కలిగే పర్సనల్ డ్యామేజీలు | అపరిమిత లయబిలిటి |
థర్డ్ పార్టీకి కలిగే ప్రాపర్టీ డ్యామేజీలు | 7.5 లక్షల వరకు |
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ | ₹330 |
ఫైర్ కవర్ | ఎండార్స్మెంట్లాగా థర్డ్ పార్టీ పాలసీతో లభ్యం అవుతుంది (20 టన్నుల కంటే |
అదనపు కవరేజ్ | PA కవర్స్, లీగల్ లయబిలిటి కవర్, స్పెషల్ ఎక్స్క్లూజన్స్ మొదలైనవి |
గూడ్స్ క్యారీయింగ్ వాహనాల యొక్క ప్రీమియం- ప్రైవేట్ క్యారియర్లు (3 వీలర్లు కాకుండా)
ఇంజిన్ సామర్థ్యం | ప్రీమియం రేట్ ( జూన్ 1, 2022 నుండి అమల్లోకి) |
---|---|
7500 కేజీల కన్నా మించనివి | ₹16,049 |
7500 కేజీలకు మించినవి కానీ 12,000 కేజీలకు మించనివి | ₹27,186 |
12,000 కేజీల కన్నా మించినవి మరియు 20,000 కేజీల కన్నా మించనివి | ₹35,313 |
20,000 కేజీల కన్నా మించినవి మరియు 40,000 కేజీల కన్నా మించనివి | ₹43,950 |
40,000 కేజీల కన్నా మించినవి | ₹44,242 |
వ్యవసాయ ట్రాక్లర్లకు థర్డ్ పార్టీ ప్రీమియం
ఇంజిన్ సామర్థ్యం | ప్రీమియం రేట్ ( జూన్ 1, 2022 నుండి అమల్లోకి) |
---|---|
6HP వరకు | ₹910 |
ఆటోరిక్షా మరియు ఈ-రిక్షాల థర్డ్ పార్టీ ప్రీమియం
సెగ్మెంట్ | ప్రీమియం రేట్ ( జూన్ 1, 2022 నుండి అమల్లోకి) |
---|---|
ఆటోరిక్షా | ₹2,539 |
ఈ-రిక్షా | ₹1,648 |
బస్సుల కోసం థర్డ్ పార్టీ ప్రీమియం
సెగ్మెంట్ | ప్రీమియం రేట్ ( జూన్ 1, 2022 నుండి అమల్లోకి ) |
---|---|
విద్యాసంస్థల బస్సులు | ₹12,192 |
విద్యాసంస్థల బస్సులు కానివి | ₹14,343 |
థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
- ఒకవేళ మీ కమర్షియల్ వాహనం ప్రమాదానికి గురైనట్లయితే, సంబంధిత థర్డ్ పార్టీ విధిగా FIR ఫైల్ చేసి ఛార్జ్ షీట్‌ను పొందాలి.
- ఒకవేళ ఏదైనా నష్టపరిహారం అవసరం అయితే, మీ తరఫున మేము దానిని చూసుకుంటాం. 1800-103-4448 పై మాకు కాల్ చేయండి.
- నిబంధనలను ఉల్లంఘించనంత కాలం, మీ తరఫున నాన్ మానిటరీ సెటిల్మెంట్ కొరకు మేము ప్రయత్నిస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తితే, మేము మీ తరఫున కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తాము.
- ఒకవేళ కమర్షియల్ వాహనం డ్రైవర్ మంచి పౌరుడై, తాను నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తప్పు ఒప్పుకొంటే, మీ డిజిట్ థర్డ్ పార్టీ ఇంకా ఉంటుంది.
- ఒకవేళ వ్యక్తిగత ప్రమాదానికి సంబంధించిన క్లెయిమ్ ఉన్నట్లయితే, మీరు చేయాల్సిందల్లా 1800-258-5956 పై మాకు కాల్ చేయడమే. ఆ తర్వాత మిగిలిన ప్రతీది మేము చూసుకుంటాం!
థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు
- ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే, డ్యామేజీ సమయంలో సంబంధిత థర్డ్ పార్టీ FIR ఫైల్ చేయాల్సి ఉంటుంది. దీని తరువాత బీమా కంపెనీకి కూడా విషయాన్ని తెలియజేయాలి. ఒకవేళ అలా చేయనట్లయితే, అవసరమైన నష్టపరిహారం చెల్లించబడదు.
- ఒక దుర్ఘటనలో, అవతలి పార్టీ తప్పు చేసిందని రుజువు చేయడానికి థర్డ్ పార్టీకి సరైన సాక్ష్యాధారాలు ఉండటం చాలా ముఖ్యం.
- స్వల్ప డ్యామేజీలు, నష్టాల విషయంలో, మీరు వాటిని కోర్టు బయట పరిష్కరించడానికి ప్రయత్నించాలని సలహా ఇవ్వబడుతోంది. ఎందుకంటే FIR దాఖలు చేసే ప్రక్రియ, మోటారు వాహన ట్రిబ్యునల్‌తో డీల్ చేసే ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది.
- ఐఆర్డీఏఐ (IRDAI) నియమ నిబంధనల ప్రకారం, క్లెయిమ్ మొత్తాన్ని నిర్ణయించడం పూర్తిగా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌పై ఆధారపడి ఉంటుంది. థర్డ్ పార్టీకి పర్సనల్ డ్యామేజీలపై గరిష్ట పరిమితి లేనప్పటికీ, థర్డ్ పార్టీ వాహనం లేదా ఆస్తికి కలిగే డ్యామేజీలు, నష్టాల విషయంలో రూ. 7.5 లక్షల వరకు లయబిలిటీ ఉంటుంది.
మీ అవసరాలకు సరిపోయే కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
ఏదైనా థర్డ్ పార్టీ వాహనానికి మీ కమర్షియల్ వాహనం వల్ల కలిగే డ్యామేజీలు |
|
ఏదైనా థర్డ్ పార్టీ ఆస్తికి మీ కమర్షియల్ వాహనం వల్ల కలిగే డ్యామేజీలు |
|
మా చేయబడ్డ కమర్షియల్ వెహికల్ ద్వారా లాగబడుతున్న వాహనం ద్వారా ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి కలిగే డ్యామేజీలు |
|
అగ్నిప్రమాదం వల్ల సొంత వాహనాన్ని కోల్పోవడం లేదా డ్యామేజీ కావడం |
|
ప్రకృతి వైపరీత్యాల కారణంగా సొంత కమర్షియల్ వాహనానికి కలిగే నష్టం లేదా డ్యామేజీలు |
|
ప్రమాదం కారణంగా సొంత కమర్షియల్ వెహికల్ కు కలిగే నష్టం లేదా డ్యామేజీలు |
|
దొంగతనం వల్ల మీ కమర్షియల్ వెహికల్ ను కోల్పోవడం |
|
కస్టమైజ్డ్ యాడ్-ఆన్లతో అదనపు సంరక్షణ |
|
థర్డ్ పార్టీ వ్యక్తికి కలిగే గాయాలు/మరణం |
|
ఓన్ డ్రైవర్కు కలిగే గాయాలు/మరణం |
|
Get Quote | Get Quote |
కమర్షియల్ వెహికల్స్ కొరకు థర్డ్ పార్టీ పాలసీ యొక్క ప్రయోజనాలు
పర్సల డ్యామేజీల విషయంలో థర్డ్ పార్టీని కవర్ చేస్తుంది: ఒకవేళ మీరు ప్రమాదానికి గురై, ఎవరినైనా శారీరకంగా గాయపరిచినట్లయితే (లేదా అత్యంత దారుణమైన సందర్భంలో మరణానికి కారణమైనట్లయితే), మీ థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఆ నష్టాలను అపరిమిత లయబిలిటితో కవర్ చేస్తుంది- థర్డ్ పార్టీ ప్రాపర్టీ, వాహన డ్యామేజీల కొరకు కవర్: డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కమర్షియల్ వాహనం ప్రమాదవశాత్తు వేరొకరి యొక్క ఆస్తి లేదా వాహనాన్ని డ్యామేజీ చేసినట్లయితే, మీ థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ దాని నష్టాలను కవర్ చేస్తుంది.
- ఏదైనా ఊహించని నష్టాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి: ఈ రోజుల్లో ట్రాఫిక్‌తో చాలా తప్పులు జరుగుతాయి! అందువల్ల మీ కమర్షియల్ వాహనం ఎవరికైనా లేదా వేరే వారి వాహనం/ఆస్తికి హాని కలిగించినట్లయితే, ఈ డ్యామేజీలకు అయ్యే ఖర్చులను పాలసీ కవర్ చేస్తుంది. అందువల్ల మీరు ఊహించని నష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.
- మీరు చట్టబద్ధంగా డ్రైవింగ్ చేస్తున్నారని ధృవీకరించుకోండి: భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం, అన్ని వాహనాలకు కనీసం థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఒకవేళ మీరు మీ వాహనాన్ని కూడా సంరక్షించాలనుకుంటే, మీరు కాంప్రహెన్సివ్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవచ్చు. ఇందులో థర్డ్ పార్టీ డ్యామేజీలు, మీ సొంత వాహనం కొరకు సంరక్షణ రెండింటికీ కవర్ ఉంటుంది.
- ట్రాఫిక్ పెనాల్టీలు, జరిమానాల నుంచి రక్షణ: మీ వాహనం కనీసం థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డుపై ఉన్నట్లు తేలితే, మీరు రూ .2,000 జరిమానా మరియు / లేదా మూడు నెలల వరకు జైలు శిక్షకు గురవుతారు!·
కమర్షియల్ వెహికల్స్ కొరకు థర్డ్ పార్టీ పాలసీ యొక్క ప్రతికూలతలు
- స్వంత డ్యామేజీలను కవర్ చేయదు: ఒక కమర్షియల్ థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ దురదృష్టవశాత్తు మీ సొంత కమర్షియల్ వాహనానికి సంభవించే డ్యామేజీలు, నష్టాలను కవర్ చేయదు (ఎందుకంటే ఇది థర్డ్ పార్టీలకు నిర్దిష్టమైన పాలసీ). ఒకవేళ మీరు మీ సొంత వాహనాన్ని కవర్ చేయాలనుకుంటే, అప్పుడు మీరు కాంప్రహెన్సివ్ పాలసీకి వెళ్లాలి.
- ప్రకృతి వైపరీత్యాలకు వర్తించదు: భూకంపం లేదా వరదల వంటి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ వాహనానికి నష్టం వాటిల్లినట్లయితే, మీ కమర్షియల్ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీ సొంత వాహనాన్ని కవర్ చేయదు. మీకు ఈ కవరేజీ అవసరమని మీరు అనుకుంటే, మీరు కాంప్రహెన్సివ్ కమర్షియల్ వెహికల్ పాలసీని ఎంచుకోవచ్చు.
- ·కస్టమైజ్డ్ ప్లాన్లు లేవు: కమర్షియల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మీ కమర్షియల్ వాహనం కొరకు మీరు కలిగి ఉండే అత్యంత ప్రాథమిక ప్లాన్. దొంగతనం లేదా మంటలు వంటి అదనపు బెనిఫిట్లు మరియు కవర్లతో దీనిని కస్టమైజ్ చేయలేము. అయితే మీరు కాంప్రహెన్సివ్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్లో దీనిని ఎంచుకోవచ్చు.
కవర్ చేయబడ్డ కమర్షియల్ వెహికల్స్ యొక్క రకం
- ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్స్: ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటో రిక్షాలు, స్కూలు బస్సులు, ప్రైవేట్ బస్సులు మొదలైన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్యాసింజర్లను రవాణా చేసే వాహనాలకు నిర్ధిష్టంగా ఇన్సూరెన్స్.
- హెవీ వెహికల్స్: బుల్డోజర్లు, క్రేన్లు, లారీలు, ట్రయిలర్లు తదితర హెవీ డ్యూటీ వెహికల్స్ కొరకు ఏవైనా డ్యామేజీలు, నష్టాల కొరకు కవర్ చేయబడుతుంది.
- సరుకులు తీసుకెళ్లే వాహనాలు: సాధారణంగా సరుకులు తీసుకెళ్లే వాహనాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేయబడతాయి. వీటిలో ప్రధానంగా ట్రక్కులు, టెంపోలు, లారీలు ఉంటాయి.
- ప్యాసింజర్ బస్/స్కూల్ బస్: స్కూలు బస్సులు, పబ్లిక్ బస్సులు, ప్రయివేట్ బస్సులు లేదా ఇతర ప్యాసింజర్ క్యారీయింగ్ బస్సులు వంటి కమర్షియల్ బస్సులను థర్డ్ పార్టీ నుండి నష్టం వాటిల్లకుండా సంరక్షిస్తుంది.
- ట్రాక్టర్లు/వ్యవసాయ వాహనాలు: మీ ట్రాక్టర్ లేదా ఇతర వ్యవసాయ వాహనాలను ఏదైనా థర్డ్ పార్టీకి సంభవించే ఏవైనా ప్రమాదాలు, డ్యామేజీలు, నష్టాల నుంచి సంరక్షించాలి.
- కమర్షియల్ వ్యాన్: స్కూలు వ్యాన్లు, ప్రయివేట్ వ్యాన్లు, ప్యాసింజర్ లేదా సరుకులను రవాణా చేయడానికి ఉపయోగించే ఇతర వ్యాన్ల వంటి వ్యాపార ప్రయోజనాల కొరకు ఉపయోగించే వ్యాన్ల కొరకు కవర్.
- ఇతర & ప్రత్యేక వాహనాలు: క్యాబ్‌లు, ట్యాక్సీలు, ట్రక్కులు, బస్సులు కాకుండా, అనేక ఇతర వాహనాలు తరచుగా వ్యాపారాల కొరకు వాటి ద్వారా ఉపయోగించబడతాయి. వీటిలో కొన్ని వ్యవసాయం, మైనింగ్, నిర్మాణం కోసం ఉపయోగించే ప్రత్యేక వాహనాలను కలిగి ఉండవచ్చు.
కమర్షియల్ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?
భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం, అన్ని వాహనాలకు కనీసం థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ అయినా ఉండాలి. దీని అర్థం మీ కమర్షియల్ వాహనానికి కూడా ఇది అవసరం అవుతుంది. ఒకవేళ అది లేకుండా పట్టుబడినట్లయితే మీరు జరిమానా మరియు/లేదా మూడు నెలల వరకు జైలు శిక్షను కూడా ఎదుర్కొనవలసి రావచ్చు!
బీమా లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎంత జరిమానా పడుతుంది?
భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాబట్టి మీ వాహనానికి బీమా లేకుండా రోడ్డుపై ఉన్నట్లు తేలితే మీరు రూ.2,000 జరిమానాను ఎదుర్కొంటారు (మరీ బాగోలేని కేసులో 3 నెలల వరకు జైలు శిక్ష కూడా). అందువల్ల అలాంటి ఆందోళన పడకుండా ఉండటానికి, మీ వాహనం సరైన బీమాతో కవర్ చేయబడిందని ధ్రువీకరించుకోండి.
TP కవర్ లో చేర్చబడ్డ ఫైర్ డ్యామేజీలు ఏమిటి?
మా ప్యాకేజీ పాలసీ కింద ఈ ఎండార్స్మెంట్, అగ్నిప్రమాదాల వల్ల కలిగే నష్టం లేదా డ్యామేజీ విషయంలో కవరేజీని అందిస్తుంది. ఇది పేలుళ్లు, స్వీయ-దహనాలు లేదా మెరుపులు వంటి దేని వల్లనైనా సంభవించవచ్చు. అయితే ఇది 20 టన్నుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు మాత్రమే.
నేను నా వాహనాన్ని ఎక్కువగా ఉపయోగించడం లేదు, అందువల్ల నేను ఏ ప్లాన్ ని కొనుగోలు చేయాలి?
ఇది మీ కమర్షియల్ వాహనం యొక్క ఉద్దేశ్యం, వినియోగంపై ఆధారపడి ఉండాలి. ఒకవేళ వాహనాన్ని ఎక్కువగా ఉపయోగించనట్లయితే లేదా మీరు దానిని స్వల్ప కాలం పాటు మాత్రమే ఉపయోగించాలని అనుకున్నట్లయితే, అప్పుడు మీరు థర్డ్ పార్టీ కవరేజీ తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిని కలిగి ఉండటం తప్పనిసరి. అన్ని వాహనాలకు కనీసం థర్డ్ పార్టీ కమర్షియల్ ఇన్సూరెన్స్‌తో ఎల్లప్పుడూ బీమా చేయబడాలి.
కానీ, మీరు మంచి దీర్ఘకాలిక అవసరాలు, మీ సొంత వాహనాలకు మరిన్ని రక్షణలతో సహా మరింత కవరేజీ కోసం వెళ్లాలనుకుంటే కాంప్రహెన్సివ్ పాలసీని ఎంచుకోండి.
కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ లో కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ పాలసీ మధ్య తేడా ఏమిటి?
థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ యొక్క ఆస్తి, వ్యక్తి లేదా వాహనానికి, అంటే మీ ప్రమాదం ద్వారా ప్రభావితమైన ఇతర వ్యక్తులకు కలిగే డ్యామేజీలు, నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. అయితే ఒక కాంప్రహెన్సివ్ పాలసీ థర్డ్ పార్టీకి సంబంధించిన రెండింటితో పాటు మీ సొంత డ్యామేజీలు, నష్టాల కొరకు కూడా కవర్ చేస్తుంది.
థర్డ్ పార్టీ లేదా కాంప్రహెన్సివ్, వీటిలో ఏది బెటర్?
మీరు మీ కమర్షియల్ వాహనాన్ని ఎలా వాడతారనే దానిని బట్టి ఇది ఉంటుంది. కమర్షియల్ వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండటం చట్టం ప్రకారం తప్పనిసరి. అయితే మీరు మీ కమర్షియల్ వాహనాన్ని బాగా వాడుతున్నారని, దానికి అదనపు కవరేజ్ ఇవ్వాలనుకుంటే కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకోవచ్చు. అదనపు కవరేజ్ అంటే అనుకోకుండా వచ్చే సహజ ప్రమాదాలు, చిన్న, పెద్ద ప్రమాదాలు, దొంగతనం, అగ్నిప్రమాదం, ఇంకా మరెన్నో ఇందులో వస్తాయి.