కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్
I agree to the Terms & Conditions
I agree to the Terms & Conditions
కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది కమర్షియల్ వాహనం, యజమాని-డ్రైవర్‌కు లేదా వాటి వల్ల కలిగే డ్యామేజీ, నష్టాలను కవర్ చేయడానికి కస్టమైజ్ చేయబడిన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో ప్రమాదాలు, ఢీ కొట్టడాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు మొదలైన సందర్భాల్లో జరిగే డ్యామేజీలు, నష్టాలు కవర్ అవుతాయి. అన్ని బిజినెస్ ఆటో-రిక్షాలు, క్యాబ్‌లు, స్కూల్ బస్సులు, ట్రాక్టర్లు, కమర్షియల్ వ్యాన్లు, ట్రక్కుల వంటి వాహనాల కోసం కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కొనడం తప్పనిసరి.
ఎందుకంటే మేము మా కస్టమర్లను వీఐపీలలాగా చూసుకుంటాం. అదెలాగో తెలుసుకోండి.
కొన్నిసార్లు అన్ని స్థితిగతులను కవర్ చేయడానికి కేవలం స్టాండర్డ్ కవరేజీ సరిపోదు. అందుకే మేము మీ కమర్షియల్ వాహనాల కవరేజీని పొడిగించుకోవడానికి మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు ఎంపిక చేసుకోగలిగే ఆప్షనల్ కవర్లను అందిస్తున్నాం.
మీ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏది కవర్ కాదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. తద్వారా మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాంటివి కొన్ని తెలుసుకుందాం:
ముఖ్యమైన ఫీచర్లు |
డిజిట్ ప్రయోజనం |
క్లెయిమ్ ప్రాసెస్ |
పేపర్ లెస్ క్లెయిమ్స్ |
కస్టమర్ సపోర్టు |
24x7 సపోర్టు |
కవర్ అయ్యే కమర్షియల్ వాహనాల రకాలు |
క్యాబులు, ట్యాక్సీలు, ట్రక్కులు, లారీలు, బస్సులు, ఆటో రిక్షాలు, స్కూల్ వ్యాన్లు మొదలైనవి |
ప్రీమియం |
కమర్షియల్ వాహన రకం & ఇన్సూరెన్స్ చేయాల్సిన వాహనాల సంఖ్య ప్రకారం కస్టమైజ్ చేయబడుతుంది. |
అదనపు కవరేజీలు |
పీఏ (PA) కవర్లు, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి తగ్గింపులు మొదలైనవి. |
థర్డ్ పార్టీ డ్యామేజీలు |
వ్యక్తిగత నష్టాలకు అపరిమిత లయబిలిటీ, ఆస్తి/ వాహన డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవర్ అవుతుంది. |
మీ కమర్షియల్ వాహనం యొక్క అవసరాలకు తగ్గట్టు, మేము ప్రధానంగా రెండు పాలసీలను అందిస్తాం. అయితే కమర్షియల్ వాహనం ప్రమాదం, వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని, మీ సొంత కమర్షియల్ వాహనంతో పాటు దాన్ని వినియోగించే యజమాని లేదా డ్రైవర్‌కు కూడా ఆర్థికంగా రక్షణ కల్పించే ప్రామాణిక ప్యాకేజీ పాలసీని తీసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తున్నాం.
ఏదైనా థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి మీ కమర్షియల్ వాహనం వల్ల కలిగే డ్యామేజీలు |
✔
|
✔
|
మీ ఇన్సూరెన్స్ చేయబడిన గూడ్స్ క్యారీయింగ్ వాహనంతో టోయింగ్ చేసినప్పుడు థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి కలిగే నష్టాలు |
✔
|
✔
|
ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదం, దొంగతనం లేదా ప్రమాదాల కారణంగా సొంత సరుకు రవాణా వాహనానికి డ్యామేజీ లేదా నష్టం జరిగితే |
×
|
✔
|
యజమాని–డ్రైవర్‌కు గాయం/మరణం యజమాని–డ్రైవర్‌కు అంతకుముందు వ్యక్తిగత ప్రమాద బీమా లేకపోతే.. |
✔
|
✔
|
మా నంబర్ 1800-258-5956కు కాల్ చేయండి లేదా hello@godigit.comకు ఈ-మెయిల్ పంపండి.
మా పనిని సులభతరం చేసేందుకు పాలసీ నంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ & సమయం అలాగే ఇన్సూరెన్స్ చేయబడిన/ కాల్ చేసిన వ్యక్తి కాంటాక్టు నంబర్ తదితర వివరాలను దగ్గర ఉంచుకొని మాకు తెలియజేయండి.
మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీకు వచ్చే మొదటి అనుమానం ఇదే. ఇలా ఆలోచించడం మంచిదే!
డిజిట్ క్లెయిమ్‌ల రిపోర్టు కార్డును చదవండిమీరు మీ వ్యాపారం కోసం వాహనాన్ని ఉపయోగిస్తున్నా, లేకపోయినా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే అన్ని రకాల వాహనాలను సంరక్షించుకునేందుకు వాహన బీమా తప్పనిసరి. చట్టప్రకారం థర్డ్ పార్టీ (లయబులిటీ) పాలసీ తీసుకోవడం తప్పనిసరి. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం వలన మీ వాహన యజమాని–డ్రైవర్ సంరక్షించబడతారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల వంటి అనుకోని సందర్భాలు తలెత్తినపుడు ఇది మిమ్మల్ని కాపాడుతుంది.
మీ వ్యాపారం ఎక్కువగా వాహనాల మీద ఆధారపడి ఉంటే.. మీరు తప్పనిసరిగా స్టాండర్డ్ ప్యాకేజీని కలిగి ఉండాలి. ఇది వాహన యజమాని–డ్రైవర్‌ను సంరక్షించడమే గాక, మీ వ్యాపారాన్ని ఆర్థిక నష్టాల నుంచి కూడా కాపాడుతుంది. ఎంత చెప్పుకున్నా వ్యాపారం అనేది రిస్కుతో కూడుకునే ఉంటుంది. కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని కనీసం నష్టాల నుంచి అయినా సంరక్షిస్తుంది.
అవును, కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ముఖ్యమే. చట్టప్రకారం లయబులిటీ పాలసీని తీసుకోవడం తప్పనిసరి. మీ సొంత వాహనాన్ని సంరక్షించుకునేందుకు స్టాండర్డ్ ప్యాకేజ్ పాలసీని తీసుకోవడం చాలా అవసరం. కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దొంగతనం, ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు వంటి అనుకోని సందర్భాల్లో మీ వ్యాపారాన్ని రక్షిస్తుంది.
ఈరోజు మార్కెట్లో ఉన్న ఆప్షన్ల నుంచి మీకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉండే పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంచుకునే పాలసీ సులువుగా, విలువైనదిగా, అన్ని విపత్కర పరిస్థితుల నుంచి మీ వ్యాపారాన్ని కాపాడేదిగా ఉండాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ తొందగా పూర్తయ్యేలా ఉండాలి. ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ వేగం అనేది చాలా ముఖ్యం.
మీ వాహనానికి సరైన పాలసీని ఎంచుకోవడంలో మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు:
సరైన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV): ఐడీవీ (IDV) అంటే మీ వాహనం మార్కెట్ విలువ. మీరు బీమా చేయాలని అనుకుంటున్న వాహనం ప్రస్తుత అమ్మకపు ధర (తరుగుదలతో సహా). మీ ప్రీమియం అనేది ఈ విలువ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు సరైన కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునేందుకు ఐడీవీ (IDV)ని సరిగ్గా చూసుకోవాలి.
సర్వీస్ ప్రయోజనాలు : 24x7 కస్టమర్ సపోర్ట్, నగదు రహిత గ్యారేజీలు ఎన్ని ఉన్నాయనేది చూసుకోండి. ఈ సేవలు మీకు చాలా ఉపయోగపడుతాయి.
యాడ్–ఆన్స్‌ను సమీక్షించండి : మీ వాహనానికి సరైన కమర్షియల్ పాలసీని ఎంచుకున్నపుడు.. గరిష్ట ప్రయోజనాల కోసం అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్ ఏంటనేది సమీక్షించండి.
క్లెయిమ్ వేగం : పాలసీ ఏదైనా కానీ ఇది చాలా ముఖ్యం. క్లెయిములను తొందరగా సెటిల్ చేస్తుందని మీకు నమ్మకమున్న కంపెనీలోనే పాలసీ చేయండి.
ఉత్తమ విలువ : ప్రీమియం విలువ, సేవలు, క్లెయిమ్ సెటిల్మెంట్ వేగం, యాడ్–ఆన్స్ తర్వాత ఉత్తమ విలువ ఉందని అనిపించే బీమా పాలసీనే ఎంచుకోండి.
తక్కువ ఖర్చుతో అయిపోయే కమర్షియల్ వెహికిల్ పాలసీని తీసుకోవడం మంచిగానే అనిపిస్తుంది. కానీ పలు రకాల కంపెనీల కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కోట్స్‌ను పోల్చి చూసిన తర్వాత మాత్రమే పాలసీ తీసుకోవాలి. పోల్చి చూసేటపుడు సర్వీస్ ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్మెంట్ వేగం వంటివి తనిఖీ చేయాలి.
మీ వాహనం రకాన్ని బట్టి వాణిజ్య వాహనాలు చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కావున అన్ని సందర్భాల్లో మీ వాహనాన్ని సంరక్షించే పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన అంశాలను ఖచ్చితంగా తనిఖీ చేయాలి.
సర్వీస్ ప్రయోజనాలు : మనం ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో సర్వీస్ ప్రయోజనాలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి పాలసీ తీసుకునే ముందు వివిధ బీమా కంపెనీలు అందిస్తున్న సర్వీస్ ప్రయోజనాలను ఒకసారి తెలుసుకొని మంచి పాలసీని తీసుకోవడం చాలా అవసరం.
డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ 24*7 కస్టమర్ కేర్ మద్దతును అందిస్తుంది. పైగా ఈ కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా 1,400 కు పైచిలుకు నగదు రహిత గ్యారేజీలు ఉన్నాయి.
త్వరితమైన క్లెయిమ్ సెటిల్మెంట్ : క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది బీమాలో చాలా ముఖ్యం. కాబట్టి త్వరితగతిన క్లెయిములను సెటిల్ చేసే బీమా కంపెనీనే ఎంచుకోండి.
డిజిట్లో ‘జీరో హార్డ్ కాపీ’ విధానం అమలులో ఉంది. అంటే మేము ప్రతీ దానికి కేవలం సాఫ్ట్ కాపీలను మాత్రమే అడుగుతాం. ప్రతీది కాగిత రహితంగా, చాలా వేగంగా ఉంటుంది.
మీ ఐడీవీ (IDV)ని తనిఖీ చేయండి : మనకు ఆన్లైన్లో లభించే అనేక రకాల బీమా కంపెనీల కోట్స్ తక్కువ ఐడీవీ (IDV–ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ)తో ఉంటాయి. ఈ విలువ మార్కెట్లో మీ వెహికిల్ ధరను చూపిస్తుంది. ఐడీవీ (IDV) అనేది మీ ప్రీమియాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా క్లెయిమ్ చేసినపుడు మీకు సరైన మొత్తం వచ్చేలా ఇది చూస్తుంది.
దొంగతనం జరిగినప్పుడు, లేదా మరమ్మతు చేయలేని విధంగా ధ్వంసం జరిగినప్పుడు మీ ఐడీవీ (IDV) విలువ చాలా తక్కువగా ఉందని మీరు తెలుసుకుంటారు. కానీ మీరు చేయగలిగింది ఏమీ ఉండదు. డిజిట్లో మీకు నచ్చిన విధంగా ఐడీవీ (IDV)ని సెట్ చేసుకునే సౌలభ్యం ఉంది. కావున దీని వలన మీకు సరైన క్లెయిమ్ వస్తుంది.
ఉత్తమ విలువ : చివరగా.. మీకు సరైనదిగా అనిపించే ఉత్తమ పాలసీని ఎంచుకోండి. సరైన ధరలు, సర్వీస్ ప్రయోజనాలు, త్వరితంగా క్లెయిములు వచ్చేవి.
మీ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కింది అంశాలు ప్రభావితం చేస్తాయి.
మోడల్, ఇంజిన్, వాహన తయారీదారు : మీ వాహనానికి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ప్రమాద స్థాయి అనేది మొదట ఉన్న వాహనం మీద ఆధారపడి ఉంటుంది.
సాధారణ క్యాబ్ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది గూడ్స్ తీసుకెళ్లే ట్రక్కుతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. సులభమైన మాటల్లో చెప్పాలంటే ఇది పరిమాణాన్ని, వాహన రకాన్ని బట్టి ఉంటుంది. అదనంగా ఏ సంవత్సరంలో వాహనం తయారు చేయబడింది, వాహన కండీషన్ వంటివి కూడా ప్రీమియం మీద ప్రభావం చూపుతాయి.
ప్రాంతం : మీ వాణిజ్య వాహనం ఎక్కడ నమోదు చేయబడింది, ఎక్కడ ఉపయోగించబడుతుందనేది కూడా ప్రీమియాన్ని ప్రభావితం చేస్తుంది.
ఎందుకంటే ఒక్కో నగరంలో సంభవించే రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు.. మెట్రో నగరాలైన ముంబై, బెంగుళూర్, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో మీ వాహనానికి నాన్–మెట్రో నగరాల కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఆ మేరకు ప్రీమియం విలువ కూడా పెరుగుతుంది.
నో క్లెయిమ్ బోనస్ : మీకు ఇంతకుముందు కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ఉండి.. ప్రస్తుతం దానిని పునరుద్ధరించడానికి లేదా బీమా కంపెనీని మార్చేందుకు చూస్తుంటే.. అటువంటి సందర్భంలో మీ ఎన్సీబీ (NCB–నో క్లెయిమ్ బోనస్) కూడా పరిగణించబడుతుంది. అప్పుడు మీ ప్రీమియం కూడా తగ్గింపు రేటులో వస్తుంది.
నో క్లెయిమ్ బోనస్ అనేది మీ వాణిజ్య వాహనం మీద క్రితం ఏడాది ఎటువంటి క్లెయిములు చేయకపోతే వర్తిస్తుంది.
బీమా ప్లాన్ రకం: కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కింద ప్రధానంగా రెండు రకాల పాలసీలు ఉంటాయి. కాబట్టి మీరు ఎంచుకున్న పాలసీ వలన కూడా మీ ప్రీమియం ప్రభావితమవుతుంది.
లయబులిటీ ప్లాన్ తక్కువ ప్రీమియం కలిగి ఉంటుంది. ఇది కేవలం థర్డ్ పార్టీ డ్యామేజీలను మాత్రమే కవర్ చేస్తుంది. అదే స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీ విషయానికి వస్తే.. దీనికి కాస్త ప్రీమియం ఎక్కువగా ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ వ్యక్తులతో పాటుగా సొంత వాహన నష్టాలను కూడా కవర్ చేస్తుంది. వాహన యజమాని లేదా డ్రైవర్‌కు జరిగే నష్టాలకు ఆర్థిక కవర్‌ను అందిస్తుంది.
వాణిజ్య వాహనం ఉద్దేశం: ప్రతీ వాణిజ్య వాహనం వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. కొన్ని ప్రయాణికులను చేరవేయడానికి, మరికొన్ని సరుకులను రవాణా చేసేందుకు, అలాగే భవన నిర్మాణ పనుల్లో కూడా ఉపయోగించబడతాయి. కాబట్టి.. మీ బీమా ప్రీమియం విలువ అనేది ఈ విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
మనం ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే.. సాధారణ ఆటో రిక్షా ఇన్సూరెన్స్ అనేది సరుకుల రవాణాకు వాడే ట్రక్ ఇన్సూరెన్స్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. కేవలం వాటి పరిమాణం వల్లే ఇలా జరుగుతుందని అనుకోవడం సరికాదు. ట్రక్ ఇన్సూరెన్స్‌లో ట్రక్‌తో పాటు అందులో రవాణా చేసే సరుకులకు కూడా బీమా వర్తిస్తుంది.
ఐడీవీ(IDV) అంటే ఏమిటి?
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అనేది ఏదైనా సందర్భంలో మీ వాహనం దొంగతనానికి గురయినప్పుడు, లేదా మరమ్మతు చేయలేని విధంగా పాడైపోయినప్పుడు బీమా కంపెనీ మీకు చెల్లించే గరిష్ట విలువ. తయారీదారుడి అమ్మకపు ధర నుంచి వాహన తరుగుదలను తీసేస్తే ఈ విలువ వస్తుంది.
NCB (నో క్లెయిమ్ బోనస్) అంటే ఏమిటి?
నో క్లెయిమ్ బోనస్ (NCB) అనేది ప్రీమియంలో అందించే తగ్గింపు. మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఏడాదిలో ఎటువంటి క్లెయిములు చేయకుంటే ఇది మీకు లభిస్తుంది. నో క్లెయిమ్ బోనస్ 20 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందజేస్తుంది. మీ వాణిజ్య వాహనానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా బండి నడపడం ద్వారా ఇది మీకు వర్తిస్తుంది.
డిడక్టబుల్స్ అంటే ఏమిటి?
డిడక్టబుల్స్ (మినహాయింపులు) అనేవి పాలసీదారుడు క్లెయిమ్ సమయంలో చెల్లించాల్సిన మొత్తం. సాధారణంగా రెండు రకాల డిడక్టబుల్స్ ఉన్నాయి. ఒకటి.. తప్పనిసరిది, రెండోది స్వచ్చందమైనది. మీ వ్యాపార విలువను బట్టి, ఈ రెండింటిలో నుంచి ఏదైనా ఒకటి ఎంచుకోండి.
మీ స్వచ్చంద క్లెయిమ్ ఎంత ఎక్కువగా ఉంటే మీ బీమా ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. స్వచ్చంద డిడక్టబుల్స్ అనేది మీరు క్లెయిమ్ చేసిన సమయంలో మీకు రాని అమౌంట్. ఈ మొత్తం విలువను మీరే భరించాల్సి ఉంటుంది.
క్యాష్‌లెస్ క్లెయిమ్ అంటే ఏమిటి?
మీరు మీ వాణిజ్య వాహనాన్ని డిజిట్ ఆధీకృత రిపేర్ సెంటర్లో మరమ్మతు చేయించుకుంటే ఆమోదించబడిన క్లెయిమ్ అమౌంట్ మొత్తాన్ని మేము రిపేర్ సెంటర్‌కే నేరుగా చెల్లిస్తాం. దీనినే క్యాష్‌లెస్ క్లెయిమ్ (నగదు రహిత క్లెయిమ్) అని అంటారు.
దయచేసి ఇది గమనించండి. మీకు ఏవైనా డిడక్టబుల్స్ ఉంటే, మీ బీమా కవర్ చేయని మరమ్మతు చార్జీలు ఉంటే ఆ ఖర్చులను మీ జేబు నుంచి మీరే భరించాల్సి ఉంటుంది.
థర్డ్ పార్టీ లయబులిటీ అంటే ఏమిటి?
మీ వాణిజ్య వాహనం ఏదైనా థర్డ్ పార్టీ ఆస్తులకు గానీ, వ్యక్తులకు గానీ డ్యామేజీ కలిగిస్తే దానినే థర్డ్ పార్టీ లయబులిటీ అంటారు. ఇటువంటి తరుణంలో మీ బీమా పాలసీ (లయబులిటీ ఓన్లీ పాలసీ /స్టాండర్డ్ ప్యాకేజ్ పాలసీ) జరిగే నష్టాలను ఆర్థికంగా కవర్ చేస్తుంది.
సాధారణ వాహనం కంటే వాణిజ్య వాహనానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. కావున సాధారణ కార్ ఇన్సూరెన్స్ కంటే కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం. ఉదాహరణకు చూసుకుంటే.. మీ సరుకు రవాణా వాహనాన్ని తీసుకున్నట్లయితే ఏదైనా సందర్భంలో ప్రకృతి విపత్తు, ప్రమాదం వలన దానికి నష్టం కలిగితే దానిలో ఉన్న సరుకు కారణంగా మీకు అధిక మొత్తంలో నష్టం కలుగుతుంది.
ట్యాక్సీలు, బస్సులకు ఎక్కువ ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంటుంది. ప్రతీరోజు ఇవి ఎంతో మంది ప్రయాణికులను తీసుకెళ్తుంటాయి. కావున వీటికి ఎక్కువ లయబులిటీ ఉంటుంది.
సులభంగా చెప్పాలంటే.. సాధారణ కార్ ఇన్సూరెన్స్ అనేది మీ సొంత వాహనాల కోసం రూపొందించబడింది. వ్యాపారంలో భాగంగా ఉన్న వాహనాల కోసం ప్రత్యేకంగా కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ రూపొందించబడింది.
ఈ రెండు రకాల వాహనాలు ఎదుర్కొనే రిస్క్, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకు తగిన విధంగానే పాలసీలు కూడా రూపొందించబడ్డాయి.
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు/రెన్యూ చేయడం ఎందుకోసం ముఖ్యమంటే..
ఇతర ముఖ్యమైన కథనాలు