ఐడివి క్యాలుక్యులేటర్

digit car insurance
usp icon

9000+ Cashless

Network Garages

usp icon

96% Claim

Settlement (FY23-24)

usp icon

24*7 Claims

Support

Up to 90% Off with PAYD Add-On

Click here for new car

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

కార్ ఇన్సూరెన్స్‌లో ఐడివి గురించి తెలుసుకోండి

ఐడివి క్యాలుక్యులేటర్- మీ కారు కోసం IDVని లెక్కించండి

ఐడివి క్యాలుక్యులేటర్ అనేది అత్యంత ముఖ్యమైన ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్ టూల్స్​లో ఒకటి, ఎందుకంటే ఇది మీ కార్​ మార్కెట్ విలువను మాత్రమే కాకుండా మీ కార్​ ఇన్సూరెన్స్​ కోసం మీరు చెల్లించాల్సిన ప్రీమియం యొక్క సరైన అమౌంట్​ను నిర్ణయించడంలో కూడా సహాయపడుతుంది.

క్లెయిమ్‌ల సమయంలో చెల్లించాల్సిన సరైన అమౌంట్​ను నిర్ణయించడం, మీ కారు దొంగిలించబడిన లేదా రిపేర్​ చేయలేనంతగా పాడైపోయిన సందర్భాల్లో ఇది మాకు (ఇన్సూరర్​) మరింత సహాయపడుతుంది.

కారు వయస్సు

డిప్రిషియేషన్​ %

6 నెలలు, అంతకంటే తక్కువ

5%

6 నెలల నుంచి 1 సంవత్సరం

15%

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు

20%

2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు

30%

3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు

40%

4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు

50%

ఉదాహరణకు: మీరు కారు​ తీసుకుని 6 నెలల అయ్యి, దాని ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 100 అయినట్లయితే, డిప్రిషియేషన్​ రేటు 5% మాత్రమే.

అంటే దాని కొనుగోలు తర్వాత, మీ ఐడివి రూ. 95 కి పడిపోతుంది - 1 సంవత్సరం మించకుండా వాహనం వయస్సు 6 నెలల కంటే ఎక్కువ అయితే రూ. 85 కి పడిపోతుంది. వాహనం వయస్సు 2 సంవత్సరాలకు మించకుండా 1 సంవత్సరం కంటే ఎక్కువ అయితే రూ. 80 అవుతుంది. వాహనం వయస్సు 3 సంవత్సరాలకు మించకుండా 2 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే రూ. 70 అవుతుంది. ఇంకా - దాని 5వ సంవత్సరంలో 50% తరుగుదల తర్వాత రూ. 50 వరకు ఉంటుంది.

ఒకవేళ మీ కారు 5 సంవత్సరాల కంటే పాతదైతే, దాని ఐడివి ఆ కారు మ్యానుఫ్యాక్చరర్​, మోడల్, దాని విడిభాగాల లభ్యత, దాని ప్రస్తుత కండిషన్​పై ఆధారపడి ఉంటుంది.

తిరిగి అమ్మే సమయంలో, మీ ఐడివి మీ కారు మార్కెట్ విలువను సూచిస్తుంది. అయితే, మీరు మీ కారును బాగా మెయింటేన్​ చేస్తూ, అది ఇంకా కొత్తదానిలా మెరుస్తూ ఉంటే, మీ ఐడివి మీకు అందించే దానికంటే ఎక్కువ ధరను మీరు ఆశించవచ్చు. చివరికి, మీరు మీ కారుపై ఎంత ప్రేమ చూపించారో ఈ విలువ తెలియజేస్తుంది.

మీ కారు ఐడివిని గుర్తించడంలో సహాయపడే కారకాలు ఏమిటి?

  • కారు వయస్సు: ఐడివి మీ కారు మార్కెట్ విలువను సూచిస్తుంది కాబట్టి, సరైన ఐడివిని గుర్తించడంలో మీ కారు వయస్సు చాలా ముఖ్యం. మీ కారు ఎంత పాతదైతే, దాని ఐడివి అంత తక్కువగా ఉంటుంది. 
  • మ్యానుఫ్యాక్చరర్​ మేక్​, వాహనం మోడల్: మీ కారు మేక్​, మోడల్ నేరుగా మీ ఐడివిపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు; Lamborghini Venen వంటి కారు మేక్​, మోడల్‌లో వ్యత్యాసం కారణంగా Aston Martin One కంటే ఎక్కువ ఐడివిని కలిగి ఉంటుంది.

  • సిటీ రిజిస్ట్రేషన్​ వివరాలు: మీ కారు రిజిస్ట్రేషన్ వివరాలు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో ఉంటాయి. అలాగే, మీ కారు రిజిస్టర్ చేయబడిన సిటీ, దాని ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వ్యాల్యూపై ప్రభావం చూపుతుంది. మెట్రో సిటీలో ఉండే మీ కారు ఐడివి, టైర్-II సిటీలోని దాని ఐడివి కంటే తక్కువగా ఉండవచ్చు.
  • స్టాండర్డ్​ డిప్రియేషన్​ (ఇండియన్​ మోటార్ టారిఫ్ ప్రకారం): మీరు షోరూమ్ నుంచి బయటకు వెళ్లిన క్షణం నుంచి మీ కారు వ్యాల్యూలో తరుగుదల ప్రారంభమవుతుంది - ప్రతి సంవత్సరం దాని డిప్రియేషన్​ పర్సంటేజ్​ పెరుగుతుంది. ఇది కూడా అంతిమంగా మీ ఐడివిని ప్రభావితం చేస్తుంది. మీ కారు వయస్సుతో పాటు సంబంధిత డిప్రియేషన్​ రేట్లను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే పట్టిక ఇక్కడ ఉంది.

ఐడివి మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

నాకు ఐదు సంవత్సరాల వయస్సు అనుకుని వివరించండి

మేము ఇన్సూరెన్స్​ను సులభతరం చేస్తున్నాము. ఎంతలా అంటే, ఇప్పుడు 5 ఏళ్ల పిల్లలు కూడా దానిని అర్థం చేసుకునేలా.

మీకో ఖరీదైన వాచ్ ఉంది. ఒక రోజు, మీరు దానిని అమ్మితే మీకు ఎంత లభిస్తుందో తెలుసుకోవాలని అనుకున్నారు. మీరు దానిని వాచ్‌మేకర్ దగ్గరకు తీసుకెళ్లారు. వాచ్‌మేకర్ మీ గడియారాన్ని చూసి, వాచ్ ఎంత పాతది అని అడిగాడు, మీరు దాని వయస్సు 5 సంవత్సరాలు అని చెప్పండి. అప్పుడు అతను అది గాజు, లోహం, తోలు, ఏ స్క్రూలతో తయారు చేశారు, దాని వయస్సు ఎంత అనేది రాసుకొని, మొదట వాచ్​లో ఉపయోగించిన మెటీరియల్ ధరను జోడించి వీటన్నింటి ఆధారంగా, మీరు మీ గడియారాన్ని అమ్మితే, మీకు రూ. 500 లభిస్తాయని అతను మీకు చెప్తాడు. ఈ సందర్భంలో, మీ ఐడివి రూ. 500!

కార్ ఇన్సూరెన్స్‌లో ఐడివి గురించి తరచూ అడిగే ప్రశ్నలు