బైక్​ ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్

నేడే బైక్​ ఇన్సూరెన్స్​ కోట్​ పొందండి.

Third-party premium has changed from 1st June. Renew now

బైక్​ ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్​ అంటే ఏమిటి?

బైక్​ ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్​ అనేది ఒక ఆన్​లైన్​ సాధనం​. సరైన బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం పొందేందుకు ఇది​ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు బైక్​ పేరు, మోడల్​ నెంబర్, మీరు బైక్​ వాడుతున్న నగరం, రిజిస్ట్రేషన్​ తేదీ​, తీసుకోవాలనుకునే బైక్​ పాలసీ తదితర వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. మీకు నెలవారీ ఇన్సూరెన్స్​ ప్రీమియం వివరాలు వస్తాయి. మీకు కావాల్సిన అదనపు కవర్​లను ఎంచుకోవడం ద్వారా, మీ నో క్లెయిమ్​ బోనస్​ను జత చేయడం ద్వారా ఈ మొత్తాన్ని మరింత తగ్గించవచ్చు.

బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్​ను ఎలా వాడాలి?

బైక్​ ఇన్సూరెన్స్​ తీసుకునే సమయంలో ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుకులేటర్​ను వాడి ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలనేది కింద వివరంగా ఉంది.

స్టెప్​ 1

మీ బైక్​ మేక్​, మోడల్​, వేరియంట్​, రిజిస్ట్రేషన్​ తేదీ​, బండిని నడుపుతున్న నగరం వివరాలు నమోదు చేయాలి.

స్టెప్​ 2

గెట్​ కోట్​ బటన్​ నొక్కి మీకు కావాల్సిన ప్లాన్​ను ఎంచుకోవాలి.

స్టెప్​ 3

మీరు థర్డ్​ పార్టీ బైక్​ పాలసీని లేదా స్టాండర్డ్​/కాంప్రహెన్సివ్​ బైక్​ పాలసీని కానీ తీసుకోవచ్చు.

స్టెప్​ 4

మీ చివరి బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు తేదీ, క్లెయిమ్​ చరిత్ర, నో క్లెయిమ్​ బోనస్​ తదితర వివరాలను సమర్పించాలి.

స్టెప్​ 5

పేజి కింది భాగంలో మీరు మీ పాలసీ ప్రీమియంను చూస్తారు.

స్టెప్​ 6

మీరు స్టాండర్డ్​ ప్లాన్​ను ఎంచుకుంటే మీకు నచ్చిన ఐడీవీ (IDV), నచ్చిన యాడ్​–ఆన్స్​ను ఎంచుకుంటే సరిపోతుంది. జీరో డిప్రిషియేషన్​, రిటర్న్​ టూ ఇన్​వాయిస్​, ఇంజన్​, గేర్​ ప్రొటెక్షన్​ తదితర యాడ్​–ఆన్స్​ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

స్టెప్​ 7

పేజిలో కుడి వైపు​ మీకు ప్రీమియం పూర్తి వివరాలు కనిపిస్తాయి.

బైక్​ ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్​ ప్రయోజనాలు

సరైన ఐడీవీ (IDV) ని నిర్ణయించడంలో సహాయపడుతుంది– సరైన ఐడీవీ (IDV)ని ఎంచుకోవడం వలన మీ బైక్​ దొంగతనానికి గురైనపుడు లేదా పూర్తిగా పాడైనప్పుడు మీ బైక్​ మార్కెట్​ విలువకు సమానమనైన నష్టపరిహారం అందించడంలో ఇది సహాయపడుతుంది. బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్​ను ఉపయోగించి మీ వాహనం స్పెసిఫికేషన్లకు తగిన సరైన ఐడీవీ (IDV) ని ఎంచుకోండి.

సరైన యాడ్​–ఆన్​లను ఎంచుకోవడంలో సహాయపడుతుంది– బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకునేటపుడు సరైన యాడ్​–ఆన్స్​ను ఎంచుకోవడం వలన మీ బైక్​కు అదనపు సంరక్షణ అందుతుంది. ఇవి అన్ని రకాల విపత్కర పరిస్థితుల నుంచి మీ బైక్​ను కాపాడుతాయి. వివిధ రకాల యాడ్​–ఆన్స్​ మీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది బైక్​ ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్​ మీకు తెలియజేస్తుంది. ఇది మీ బైక్​కు సరైన యాడ్​–ఆన్​లను ఎంచుకునేందుకు సహాయపడుతుంది.

సరైన​ ప్రీమియంను ఎంచుకోవడంలో సహాయపడుతుంది– బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్​ను ఉపయోగించి మీరు వివిధ రకాల బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం కోట్స్​ను పోల్చి చూసుకోవచ్చు. ఉత్తమ ధర ఉన్న ప్లాన్​ను ఎంచుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. అది మీ అవసరాలకు సరైన విధంగా సరిపోతుంది.

బైక్​ ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్​ను వాడటం ఎందుకంత ముఖ్యం​?

చాలా మంది వ్యక్తులు బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను త్వరగా ఎంచుకోవాలని చూస్తారు. తక్కువ ఖర్చులో ఉన్న బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని త్వరగా ఎంచుకోవాలా? లేదా కొంత సమయం కేటాయించినా సరే మీ బైక్​కు కావాల్సిన పాలసీని ఎంచుకోవాలా? అనే విషయం ముఖ్యం. ఈ విషయంలో బైక్​ ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్​ మీకు సహాయం చేస్తుంది.

మీ డబ్బును ఆదా​ చేస్తుంది

టూ వీలర్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్​ అనేది చౌకైన ప్రీమియంను ఎంచుకోవడంలో మీకు సహాయం చేయడం మాత్రమే కాకుండా సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడంలో కూడా సహాయం చేస్తుంది. వివిధ రకాల విషయాలు బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఇది మీకు వివరిస్తుంది. సరైన పాలసీని తీసుకొని మీ బైక్​ను కాపాడుకునేందుకు సహాయపడుతుంది.

బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను తగ్గిస్తుంది

టూ వీలర్​ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్​ను ఉపయోగించడం వలన మీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం విషయంలో పెరుగుదల లేదా తగ్గుదలను ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయనేది మీరు తెలుసుకోవచ్చు. ఆ విషయాలను బట్టి మీరు వివిధ రకాల ఆప్షన్లను ప్రయత్నించేందుకు వీలుంటుంది. మీ బైక్​కు ఏ పాలసీ సరిగా నప్పుతుందో మీరు సులభంగా తెలుసుకోవచ్చు.

సరైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది

మీ బైక్​ మీకు చాలా ప్రియమైనది. మీ ప్రియమైన బైక్​ కోసం అన్ని ప్రమాదాల నుంచి దానిని కాపాడేందుకు సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్​ పారదర్శకంగా ఉండి వివిధ రకాల లెక్కలను మీకు చూపిస్తుంది. మీ ఇన్సూరెన్స్​ ప్రీమియం ఎలా నిర్ణయించబడుతుందో మీరు తెలుసుకునేందుకు ఇది సహాయం చేస్తుంది.

కొత్త, పాత బైక్​ల కోసం బైక్​ ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్​ను వాడండి

కొత్త బైకులకు బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్

ఎన్ని విషయాలు పక్కన పెట్టినా కానీ మీ బైక్​ అనేది మీకు ఎంతో ఇష్టమైనదే అయి ఉంటుంది. కాబట్టి, మీ బైక్​ను సంరక్షించుకునే విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్​ అనేది మీరు ఉత్తమమైన కొత్త బైక్​ పాలసీని తీసుకునేందుకు సహాయపడుతుంది.  మీ ఇన్సూరెన్స్​ ప్రీమియం అనేది ఎలా నిర్ణయిస్తారో చూసేందుకు ఇది మీకు సహాయపడుతుంది.

పాత బైకులకు బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్

మీకు పాత బైక్​ ఉంటే, మీ ప్రీమియం ఖరీదు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బైక్​ పాతది అవడం వలన కావొచ్చు. మీ బైక్​కు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటే, మీరు మీ బైక్​ కోసం పొందే యాడ్​–ఆన్​ల విషయంలో కూడా రాజీపడాల్సి వస్తుంది. మీ బైక్​ రిటర్న్​ టు ఇన్​వాయిస్, జీరో డిప్రిఫియేషన్ కవర్​లను పొందేందుకు అర్హత పొందదు.

భారతదేశంలో ఉన్న వివిధ రకాల బైక్​ ఇన్సూరెన్స్​ ప్లాన్స్​

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

సొంత​ డ్యామేజీలు

మీ కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీలో మీ సొంత​ బైక్​కు డ్యామేజీ​ అయినా కూడా పాలసీ వర్తిస్తుంది. ఈ ప్రయోజనం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీ వాహనానికి ప్రమాదం జరిగి డ్యామేజీ​ అయినపుడు, వరదల వలన బండి పాడైపోయినపుడు మీకు నష్టపరిహారం వస్తుంది. కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం కూడా మీ వాహనం (మేకింగ్​, మోడల్​, వయసు, సీసీ (cc)), మీరు వాహనం నడిపే నగరం తదితర విషయాల మీద ఆధారపడి ఉంటుంది.

ఇన్సూర్​డ్​ డిక్లేర్డ్​ వ్యాల్యూ (ఐడీవీ)

ఇన్సూర్​డ్​ డిక్లేర్డ్​ వ్యాల్యూనే ఐడీవీ (IDV) అని పిలుస్తారు. ఇది మీ వాహనం మార్కెట్​ విలువను సూచిస్తుంది. మీ బైక్​ ఏదైనా సందర్భంలో దొంగిలించబడినా లేదా రిపేర్​ చేయలేని విధంగా పాడైపోయినా మీకు ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి వచ్చే పరిహారాన్ని ఇది సూచిస్తుంది. డిజిట్​ కాంప్రహెన్సివ్​ ప్రీమియం క్యాలుక్యులేటర్​ ద్వారా మీరు మీ వాహనం ఐడీవీ (IDV)ని మీకు నచ్చిన విధంగా మార్చుకునే వీలుంటుంది.

యాడ్​–ఆన్​ కవర్స్

ఇందులో కస్టమైజేషన్స్​ చాలా బాగుంటాయి. ఇవే కాంప్రహెన్సివ్​ బైక్​ పాలసీని ప్రత్యేకం​గా మారుస్తాయి. మీరు మీ బైక్​కు ఏ విధమైన రక్షణ కావాలని చూస్తున్నారో అటువంటి కవర్స్​ను ఎంచుకోవచ్చు. మీ కాంప్రహెన్సివ్​ బైక్​ పాలసీతో వివిధ రకాల యాడ్​–ఆన్​ కవర్స్​​ను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు జీరో డిప్రిషియేషన్​ కవర్​, రిటర్న్​ టు ఇన్‌వాయిస్​ కవర్​, బ్రేక్​డౌన్​ అసిస్టెన్స్​ మొదలైనవి.

మినహాయింపులు

మినహాయింపులనేవి మీరు క్లెయిమ్​ సెటిల్​మెంట్​ సమయంలో మీ జేబు నుంచి చెల్లించాల్సిన మొత్తం. కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీలో మీరు ఈ విలువను మీకు నచ్చిన విధంగా ఎంచుకోవచ్చు. మీరు ఎక్కువ మొత్తాన్ని ఎంచుకుంటే మీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ తక్కువ ఎంచుకుంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది.

నో క్లెయిమ్​ బోనస్

ఇన్సూరెన్స్ చేసిన తర్వాత ఏ విధమైనా క్లెయిమ్స్​ చేయని ప్రతీ సంవత్సరం మీకు మీ ఇన్సూరెన్స్​ కంపెనీ కొంత డిస్కౌంట్‌ను అందజేస్తుంది. ఆ డిస్కౌంట్ మొదటి సంవత్సరం మీకు 20 శాతం అందించబడుతుంది. మీకు ఒకవేళ ఎక్కువగా నో క్లెయిమ్​ బోనస్​ ఉంటే మీ కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.

థర్డ్​ పార్టీలకు జరిగే డ్యామేజీలు

థర్డ్​ పార్టీ వ్యక్తులను డ్యామేజీల నుంచి కాపాడటం కోసం కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ ఉపయోగపడుతుంది. చట్టప్రకారం తప్పనిసరిగా వారిని కాపాడాలి.  ఐఆర్​డీఏఐ (IRDAI) నిబంధనల్లోనూ ఇదే విషయాన్ని వివరించారు.

మీ బైక్​ మేక్​, మోడల్

థర్డ్​ పార్టీ డ్యామేజీల​ నుంచి కాపాడటం చట్ట ప్రకారం తప్పనిసరి. కావున మీ కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ అలానే చేస్తుంది. ఐఆర్​డీఏఐ (IRDAI) రెగ్యులేటరీలో ఈ అంశం ముందుగానే నిర్ణయించబడి ఉంది.

ఓనర్​,​ డ్రైవర్​కు పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్

థర్డ్​ పార్టీ వ్యక్తులకు అయిన డ్యామేజీల​ నుంచి కవర్​ చేయడం చట్ట ప్రకారం తప్పనిసరి. కావున ఈ విషయం మీ కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​లో ఉంటుంది. ఐఆర్​డీఏఐ (IRDAI) ద్వారా ఈ విషయం ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది.

మీ బైక్​ వయస్సు

మీ బైక్​ ఎంత కొత్తగా ఉంటే అంత ఎక్కువ ప్రమాదాలకు గురవుతుంది. కావున మీరు కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ తీసుకునేటపుడు బైక్​ వయస్సు​ కూడా పరిగణనలోనికి తీసుకోబడుతుంది.

థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్​

భారతదేశంలో రోడ్ల మీద బండి నడపాలంటే కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా కలిగి ఉండాలి. మోటార్​ వాహనాల చట్టం ప్రకారం ఇది చాలా అవసరం. ఈ పాలసీ కేవలం థర్డ్​ పార్టీకి అయిన డ్యామేజీలు​, నష్టాల​ను మాత్రమే కవర్​ చేస్తుంది. వాహన యజమానికి ఎలాంటి రక్షణ ఇవ్వదు.

థర్డ్​ పార్టీ డ్యామేజీలు​

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ కేవలం థర్డ్​ పార్టీకి అయిన డ్యామేజీలు​, నష్టాల​ను మాత్రమే కవర్​ చేస్తుంది. మీ థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ ప్రీమియం అనేది థర్డ్​ పార్టీ లయబిలిటీల​ మీద ఆధారపడి ఉంటుంది. ఐఆర్​డీఏఐ (IRDAI) ద్వారా ఇన్సూరెన్స్​ పరిమితి​ ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది.

ఓనర్​ లేదా రైడర్​కు పర్సనల్ యాక్సిడెంట్​ కవర్

వాహనం నడిపేటప్పుడు​ హెల్మెట్​ ఎంత ముఖ్యమో బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకునేటపుడు పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​ కూడా అంతే ముఖ్యం.

మీ బైక్​ సీసీ (CC)

మీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంలో వాహనం సీసీ (cc) ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీ బైక్​ ఎక్కువ సీసీ (cc) ని కలిగి ఉంటే ఎక్కువ వేగంగా వెళ్లే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున మీ బైక్​ ప్రీమియం అధికంగా ఉంటుంది. ఐఆర్​డీఏఐ (IRDAI) ద్వారా వివిధ సీసీ (cc) బైకులకు ముందుగానే ప్రీమియం రేట్లు నిర్ణయించబడ్డాయి.

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లు

టూ వీలర్​ ఇంజన్​ సామర్థ్యం ప్రీమియం రేటు
75cc కన్నా తక్కువ ₹538
75cc కన్నా ఎక్కువ ఉండి 150cc మించకుండా ఉన్నవి ₹714
50cc కన్నా ఎక్కువ ఉండి 350cc మించనివి ₹1,366
350cc కన్నా పెద్ద బైకులకు ₹2,804

మీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను తగ్గించుకునేందుకు చిట్కాలు

మీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను తగ్గించుకునేందుకు కింద కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.

మీ వాలంటరీ మినహాయింపును పెంచండి

మీరు జాగ్రత్తగా బండి నడిపేవారైతే, మీరు చాలా రోజులుగా క్లెయిమ్​ చేయకపోతే అప్పుడు మీరు మీ వాలంటరీ మినహాయింపును పెంచుకోవాలి. అలా చేయడం వలన మీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియాన్ని తగ్గించొచ్చు.

మంచి రైడింగ్​ రికార్డును కలిగి ఉండండి

ఇది చాలా ముఖ్యం. ప్రతి ఒక్క రైడర్ జాగ్రత్తగా బండి నడిపి క్లెయిమ్స్​ చేయకుండా ఉండండి. నో క్లెయిమ్​ బోనస్​ను పొందండి. ఇలా చేయడం వలన మీ బైక్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్​ సమయంలో మీ ప్రీమియం అమౌంట్​ తగ్గుతుంది.

మీ ఇన్సూరెన్స్​ కంపెనీతో మాట్లాడండి

మాట్లాడటం ప్రతీసారి సాయపడుతుంది. మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో వాటిని ఇన్సూరెన్స్​ కంపెనీ ప్రతినిధికి తెలియజేయండి. వారు మీకోసం మరింత సులభమైన తక్కువ ధర ప్రీమియం ఉన్న ప్లాన్​ను సిఫారసు చేసే అవకాశం ఉంటుంది.

మీ పాలసీని సమయానికల్లా పునరుద్ధరించుకోండి

మనం ఎక్కువ సందర్భాల్లో వాయిదా వేస్తాం. కానీ, బైక్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్​ చేయడాన్ని వాయిదా వేయడం మంచిది కాదు. కావున, మీ గడువుతేదీకి ముందే బైక్​ ఇన్సూరెన్స్​ను పునరుద్ధరించుకోండి. ఇలా చేయడం వలన మీ నో క్లెయిమ్​ బోనస్​ అనేది రాయితీని అందిస్తుంది.

మీకు ఉపయోపడే యాడ్​–ఆన్లను మాత్రమే ఎంచుకోండి

యాడ్​–ఆన్స్​ అనేవి బైక్​కు అదనపు రక్షణ అందిస్తాయని అందరికీ తెలుసు. అంతేగాక, ఇవి ప్రీమియం రేటును కూడా పెంచుతాయి. కాబట్టే మీకు అవసరమైన యాడ్​–ఆన్స్​ను మాత్రమే ఎంచుకోవాలి.

బైక్​ ఇన్సూరెన్స్​ కోసం డిజిట్​నే​ ఎందుకు ఎంచుకోవాలి?

డిజిట్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ ముఖ్య లక్షణాలు​

ముఖ్యమైన లక్షణాలు డిజిట్​ ప్రయోజనం
ప్రీమియం ₹714 నుంచి మొదలు
నో క్లెయిమ్​ బోనస్ 50% వరకు డిస్కౌంట్​
కస్టమైజబుల్​ యాడ్–ఆన్స్ 5 యాడ్​–ఆన్స్​ లభిస్తాయి
క్యాష్​లెస్​ రిపేర్లు​ 4400+ గ్యారేజీల్లో లభ్యం
క్లెయిమ్​ ప్రక్రియ​ స్మార్ట్​ ఫోన్​ ఆధారిత క్లెయిమ్​ ప్రక్రియ అందుబాటులో ఉంది. దీని వలన కేవలం 7 నిమిషాల్లోనే మీ క్లెయిమ్​ సెటిల్​ అవుతుంది.
సొంత​ డ్యామేజ్​ కవర్​ అందుబాటులో ఉంది
థర్డ్​ పార్టీ డ్యామేజీలు​ పర్సనల్​ డ్యామేజీలు అయితే అపరిమిత లయబులిటీ అందుబాటులో ఉంటుంది. ఆస్తులు, వాహనాలు డ్యామేజ్​ అయితే 7.5 లక్షల వరకు కవర్​ అవుతుంది.

మాతో, వీఐపీ (VIP) క్లెయిమ్స్​కు​ యాక్సెస్​ పొందండి

మా వద్ద 3 స్టెప్పుల​ డిజిటల్​ క్లెయిమ్​ ప్రక్రియ ఉంటుంది. దీని వలన మీరు ఎలాంటి చింత లేకుండా ఉంటారు. కావున, మీరు మా ఇన్సూరెన్స్​ ప్లాన్ కొనుగోలు చేసి నిశ్చింతంగా ఉండండి.

స్టెప్​ 1

1800-258-5956 అనే నెంబర్​కు కాల్​ చేస్తే సరిపోతుంది. ఎటువంటి దరఖాస్తు ఫామ్​లు నింపాల్సిన అవసరం లేదు.

స్టెప్​ 2

మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​కు సెల్ఫ్​ ఇన్​స్పెక్షన్​ లింక్​ పంపించబడుతుంది. ఆ లింక్​ ద్వారా మీ వాహనానికి జరిగిన డ్యామేజీ ఫొటోలను మాకు పంపిస్తే సరిపోతుంది. మీ స్మార్ట్​ ఫోన్​ ద్వారా ఫొటోలను ఎలా పంపాలో దశలవారీగా వివరిస్తూ గైడ్​ ఉంటుంది.

స్టెప్​ 3

ఆ తర్వాత మీరు రిపేర్​ మోడ్​ను ఎంచుకుంటే సరిపోతుంది. రీయింబర్స్​మెంట్​ లేదా మా నెట్​వర్క్​ గ్యారేజీలలో క్యాష్‌లెస్​ రిపేర్లను ఎంచుకోవచ్చు.

డిజిట్​ క్లెయిమ్స్​ ఎంత తొందరగా సెటిల్​ చేయబడతాయి? మీరు ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చుకునే ముందు మీ మది​లో మెదిలో మొదటి ప్రశ్న ఇది. ఇలా ఆలోచించడం వలన చాలా ప్రయోజనం పొందవచ్చు. డిజిట్​ రిపోర్ట్​ కార్డు చదవండి

బైక్​ ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్​ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)

టూ వీలర్​ ఇన్సూరెన్స్​లో స్వచ్చంద మినహాయింపు అంటే ఏమిటి? అది ఎలా ప్రయోజనకరం?

మీ బైక్​ ఇన్సూరెన్స్​ను క్లెయిమ్​ చేసినపుడు వచ్చే క్లెయిమ్​ మొత్తంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మేము చెల్లించేది, మరొకటి మీరు కట్టాల్సింది (తప్పనిసరి). మీరు కట్టేది స్వచ్చందం, తప్పనిసరి రెండూ కావొచ్చు. స్వచ్చందం అనేది క్లెయిమ్​ సమయంలో మీరు చెల్లించేందుకు ఎంచుకునే మొత్తం. అసలు ప్రజలు స్వచ్చంద మినహాయింపులను ఎందుకు ఎంచుకుంటారని చాలా మందికి అనిపిస్తుంటుంది? టూ వీలర్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను తగ్గించుకునేందుకు ప్రజలు స్వచ్చంద మినహాయింపులను ఎంచుకుంటారు.

చిట్కా​ (Tip): ప్రీమియం విషయంలో అత్యాశకు పోకండి. మీరు 50 శాతం నో క్లెయిమ్​ బోనస్​ ఉన్నపుడు మాత్రమే ఈ సౌలభ్యాన్ని​ ఉపయోగించండి. (బైక్​ కొన్న 5 సంవత్సరాల నుంచి ఎటువంటి క్లెయిమ్స్​ చేయకుండా ఉన్నపుడు) మీరు తక్కువ క్లెయిమ్స్​ చేస్తే మీ ప్రీమియంను ఇట్టే తగ్గించుకోవచ్చు.

టూ వీలర్​ ఇన్సూరెన్స్​లో తప్పనిసరి ఎక్సెస్​ అంటే ఏమిటి?

మినహాయింపులకు బదులుగా వాడే మరో పదమే తప్పనిసరి ఎక్సెస్. మీ క్లెయిమ్​లో భాగంగా చెల్లించే మొత్తాన్ని ఇది సూచిస్తుంది.

నేను నా ఇన్సూరెన్స్​ కంపెనీని ఆన్​లైన్​లో మార్చుకునేటపుడు ఏ ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది?

ఆన్​లైన్​లో ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చుకునే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అవేంటంటే..

. క్లెయిమ్​ సెటిల్ చేసే​ వేగం – మీరు మీ డబ్బుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండటాన్ని ఇష్టపడరు. నిజమే కదా.

. స్పందించే తీరు – మీరు మీ సమస్యను చెప్పాలని అనుకున్నప్పుడు కొన్ని గంటల పాటు కస్టమర్​ కేర్​తో మాట్లాడటం కోపం తెప్పిస్తుంది.

. మీ టూ వీలర్​ రిపేర్లకు క్యాష్​లెస్​ ఆప్షన్​ ఉందా? లేదా? చూసుకోవాలి.

. నెట్​వర్క్​ కనెక్టివిటీ – మీ ఫోన్ నెట్​వర్క్​ కాదండి బాబు. సర్వీస్​ సెంటర్ల నెట్​వర్క్​ ఎలా ఉందో చూసుకోవాలి.

. కంపెనీ క్లెయిమ్​ సెటిల్​మెంట్​ చరిత్రను తనిఖీ చేయాలి.

ఆన్​లైన్​లో ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చుకునే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అవేంటంటే..

  • క్లెయిమ్​ సెటిల్ చేసే​ వేగం – మీరు మీ డబ్బుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండటాన్ని ఇష్టపడరు. నిజమే కదా.
  • స్పందించే తీరు – మీరు మీ సమస్యను చెప్పాలని అనుకున్నప్పుడు కొన్ని గంటల పాటు కస్టమర్​ కేర్​తో మాట్లాడటం కోపం తెప్పిస్తుంది.
  • మీ టూ వీలర్​ రిపేర్లకు క్యాష్​లెస్​ ఆప్షన్​ ఉందా? లేదా? చూసుకోవాలి.
  • నెట్​వర్క్​ కనెక్టివిటీ – మీ ఫోన్ నెట్​వర్క్​ కాదండి బాబు. సర్వీస్​ సెంటర్ల నెట్​వర్క్​ ఎలా ఉందో చూసుకోవాలి.
  • కంపెనీ క్లెయిమ్​ సెటిల్​మెంట్​ చరిత్రను తనిఖీ చేయాలి.

ఆన్​లైన్​లో టూ వీలర్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేసేటప్పుడు నేను ఏవైనా హార్డ్​ కాపీలను సబ్మిట్​ చేయాల్సి వస్తుందా?

మాకు కూడా మీలాగే డాక్యుమెంట్లు అంటే చెడ్డ చిరాకు. అందుకే మీరు కొత్త పాలసీని కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉండదు.

నేను ఆన్​లైన్​లో టూ వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీని కొనుగోలు చేసినపుడు ఆ పాలసీ నా దగ్గరికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది?

మీరు ఒకసారి పేమెంట్​ పూర్తి చేయగానే మీ పాలసీ సాఫ్ట్​ కాపీ మీ మెయిల్​ ఇన్​బాక్స్​లో ఉంటుంది. ఇది చాలా వేగంగా జరిగే ప్రక్రియ. మేము పేపర్​లెస్​గా ఉండి పర్యావరణానికి హాని చేయకుండా ఉంటాం. కావున హార్డ్ కాపీలను పంపము. కానీ మీకు హార్డ్​ కాపీ కావాలని తెలిపితే మాత్రం తప్పకుండా హార్డ్​ కాపీని మీ చిరునామా​కు పంపిస్తాం.

నేను ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చినపుడు నా నో క్లెయిమ్​ బోనస్​ ఏమవుతుంది?

మీరు ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చినంత మాత్రాన మీ నో క్లెయిమ్​ బోనస్​ను మీరు కోల్పోరు. మీ మంచి డ్రైవింగ్​కు నో క్లెయిమ్​ బోనస్​ (NCB) ఇస్తారు. కనుక ఇన్సూరెన్స్​ కంపెనీ మారిస్తే అది కూడా మారుతుంది.

ఆన్​లైన్​లో ఇన్సూరెన్స్​ పాలసీను కొనడం వలన ఏవైనా ప్రతికూలతలు ఉన్నాయా?

ఏ విధమైన ప్రతికూలతలూ ఉండవు. ఇంకా చెప్పాలంటే ఇది చాలా తెలివైన ఎంపిక. సెకన్లలో పని పూర్తవుతుంది. పలు రకాల ఇన్సూరెన్స్​ కంపెనీలను కూడా ఆన్‌లైన్​లో పోల్చి చూడవచ్చు.