బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్ అంటే ఏమిటి?
బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్ అనేది ఒక ఆన్‌లైన్ సాధనం. సరైన బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం పొందేందుకు ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు బైక్ పేరు, మోడల్ నెంబర్, మీరు బైక్ వాడుతున్న నగరం, రిజిస్ట్రేషన్ తేదీ, తీసుకోవాలనుకునే బైక్ పాలసీ తదితర వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. మీకు నెలవారీ ఇన్సూరెన్స్ ప్రీమియం వివరాలు వస్తాయి. మీకు కావాల్సిన అదనపు కవర్లను ఎంచుకోవడం ద్వారా, మీ నో క్లెయిమ్ బోనస్‌ను జత చేయడం ద్వారా ఈ మొత్తాన్ని మరింత తగ్గించవచ్చు.
బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌ను ఎలా వాడాలి?
బైక్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుకులేటర్ను వాడి ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలనేది కింద వివరంగా ఉంది.
స్టెప్ 1
మీ బైక్ మేక్, మోడల్, వేరియంట్, రిజిస్ట్రేషన్ తేదీ, బండిని నడుపుతున్న నగరం వివరాలు నమోదు చేయాలి.
స్టెప్ 2
గెట్ కోట్ బటన్ నొక్కి మీకు కావాల్సిన ప్లాన్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 3
మీరు థర్డ్ పార్టీ బైక్ పాలసీని లేదా స్టాండర్డ్/కాంప్రహెన్సివ్ బైక్ పాలసీని కానీ తీసుకోవచ్చు.
స్టెప్ 4
మీ చివరి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు తేదీ, క్లెయిమ్ చరిత్ర, నో క్లెయిమ్ బోనస్ తదితర వివరాలను సమర్పించాలి.
స్టెప్ 5
పేజి కింది భాగంలో మీరు మీ పాలసీ ప్రీమియంను చూస్తారు.
స్టెప్ 6
మీరు స్టాండర్డ్ ప్లాన్‌ను ఎంచుకుంటే మీకు నచ్చిన ఐడీవీ (IDV), నచ్చిన యాడ్–ఆన్స్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. జీరో డిప్రిషియేషన్, రిటర్న్ టూ ఇన్‌వాయిస్, ఇంజన్, గేర్ ప్రొటెక్షన్ తదితర యాడ్–ఆన్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
స్టెప్ 7
పేజిలో కుడి వైపు మీకు ప్రీమియం పూర్తి వివరాలు కనిపిస్తాయి.
బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్ ప్రయోజనాలు
బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌ను వాడటం ఎందుకంత ముఖ్యం?
చాలా మంది వ్యక్తులు బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను త్వరగా ఎంచుకోవాలని చూస్తారు. తక్కువ ఖర్చులో ఉన్న బైక్ ఇన్సూరెన్స్ పాలసీని త్వరగా ఎంచుకోవాలా? లేదా కొంత సమయం కేటాయించినా సరే మీ బైక్‌కు కావాల్సిన పాలసీని ఎంచుకోవాలా? అనే విషయం ముఖ్యం. ఈ విషయంలో బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్ మీకు సహాయం చేస్తుంది.
కొత్త, పాత బైక్‌ల కోసం బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌ను వాడండి
కొత్త బైకులకు బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్
ఎన్ని విషయాలు పక్కన పెట్టినా కానీ మీ బైక్ అనేది మీకు ఎంతో ఇష్టమైనదే అయి ఉంటుంది. కాబట్టి, మీ బైక్‌ను సంరక్షించుకునే విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ అనేది మీరు ఉత్తమమైన కొత్త బైక్ పాలసీని తీసుకునేందుకు సహాయపడుతుంది. మీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎలా నిర్ణయిస్తారో చూసేందుకు ఇది మీకు సహాయపడుతుంది.
పాత బైకులకు బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్
మీకు పాత బైక్ ఉంటే, మీ ప్రీమియం ఖరీదు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బైక్ పాతది అవడం వలన కావొచ్చు. మీ బైక్‌కు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటే, మీరు మీ బైక్ కోసం పొందే యాడ్–ఆన్ల విషయంలో కూడా రాజీపడాల్సి వస్తుంది. మీ బైక్ రిటర్న్ టు ఇన్‌వాయిస్, జీరో డిప్రిఫియేషన్ కవర్లను పొందేందుకు అర్హత పొందదు.
భారతదేశంలో ఉన్న వివిధ రకాల బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్స్
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్
భారతదేశంలో రోడ్ల మీద బండి నడపాలంటే కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కలిగి ఉండాలి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఇది చాలా అవసరం. ఈ పాలసీ కేవలం థర్డ్ పార్టీకి అయిన డ్యామేజీలు, నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. వాహన యజమానికి ఎలాంటి రక్షణ ఇవ్వదు.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు
టూ వీలర్ ఇంజన్ సామర్థ్యం |
ప్రీమియం రేటు |
75cc కన్నా తక్కువ |
₹538 |
75cc కన్నా ఎక్కువ ఉండి 150cc మించకుండా ఉన్నవి |
₹714 |
50cc కన్నా ఎక్కువ ఉండి 350cc మించనివి |
₹1,366 |
350cc కన్నా పెద్ద బైకులకు |
₹2,804 |
మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకునేందుకు చిట్కాలు
మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకునేందుకు కింద కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.
బైక్ ఇన్సూరెన్స్ కోసం డిజిట్నే ఎందుకు ఎంచుకోవాలి?
మీ బైక్ ఇన్సూరెన్స్ కేవలం సూపర్ ఫాస్ట్ ఈజీ క్లెయిమ్ ప్రాసెస్‌తో మాత్రమే రాదు. క్యాష్‌లెస్ సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది.
డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ముఖ్య లక్షణాలు
ముఖ్యమైన లక్షణాలు |
డిజిట్ ప్రయోజనం |
ప్రీమియం |
₹714 నుంచి మొదలు |
నో క్లెయిమ్ బోనస్ |
50% వరకు డిస్కౌంట్ |
కస్టమైజబుల్ యాడ్–ఆన్స్ |
5 యాడ్–ఆన్స్ లభిస్తాయి |
క్యాష్‌లెస్ రిపేర్లు |
4400+ గ్యారేజీల్లో లభ్యం |
క్లెయిమ్ ప్రక్రియ |
స్మార్ట్ ఫోన్ ఆధారిత క్లెయిమ్ ప్రక్రియ అందుబాటులో ఉంది. దీని వలన కేవలం 7 నిమిషాల్లోనే మీ క్లెయిమ్ సెటిల్ అవుతుంది. |
సొంత డ్యామేజ్ కవర్ |
అందుబాటులో ఉంది |
థర్డ్ పార్టీ డ్యామేజీలు |
పర్సనల్ డ్యామేజీలు అయితే అపరిమిత లయబులిటీ అందుబాటులో ఉంటుంది. ఆస్తులు, వాహనాలు డ్యామేజ్ అయితే 7.5 లక్షల వరకు కవర్ అవుతుంది. |
మాతో, వీఐపీ (VIP) క్లెయిమ్స్‌కు యాక్సెస్ పొందండి
మా వద్ద 3 స్టెప్పుల డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియ ఉంటుంది. దీని వలన మీరు ఎలాంటి చింత లేకుండా ఉంటారు. కావున, మీరు మా ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసి నిశ్చింతంగా ఉండండి.
స్టెప్ 1
1800-258-5956 అనే నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి దరఖాస్తు ఫామ్‌లు నింపాల్సిన అవసరం లేదు.
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు సెల్ఫ్ ఇన్స్పెక్షన్ లింక్ పంపించబడుతుంది. ఆ లింక్ ద్వారా మీ వాహనానికి జరిగిన డ్యామేజీ ఫొటోలను మాకు పంపిస్తే సరిపోతుంది. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఫొటోలను ఎలా పంపాలో దశలవారీగా వివరిస్తూ గైడ్ ఉంటుంది.
స్టెప్ 3
ఆ తర్వాత మీరు రిపేర్ మోడ్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. రీయింబర్స్మెంట్ లేదా మా నెట్‌వర్క్ గ్యారేజీలలో క్యాష్‌లెస్ రిపేర్లను ఎంచుకోవచ్చు.
డిజిట్ క్లెయిమ్స్ ఎంత తొందరగా సెటిల్ చేయబడతాయి?
మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకునే ముందు మీ మదిలో మెదిలో మొదటి ప్రశ్న ఇది. ఇలా ఆలోచించడం వలన చాలా ప్రయోజనం పొందవచ్చు.
డిజిట్ రిపోర్ట్ కార్డు చదవండిభారతదేశంలో లభించే పలు ప్రముఖ మోడల్ బైకులకు ఇన్సూరెన్స్
భారతదేశంలోని ప్రముఖ బ్రాండ్లకు బైక్ ఇన్సూరెన్స్