Third-party premium has changed from 1st June. Renew now
అసలు ట్రాక్టర్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ట్రాక్టర్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది మీ ట్రాక్టర్‌ను అనుకోని విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, యాక్సిడెంట్లు, దొంగతనాల నుంచి కాపాడుతుంది.
ప్రస్తుతం ఉన్న ట్రాక్టర్ ఇన్సూరెన్స్ కేవలం థర్డ్ పార్టీ డ్యామేజ్లను మాత్రమే కవర్ చేస్తుంది. కాంప్రహెన్సివ్ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ స్వంత డ్యామేజ్లు, నష్టాల నుంచి మిమ్మల్ని, మీ బిజినెస్‌ను కవర్ చేస్తుంది. ఈ ఇన్సూరెన్స్ మీకు మంచి కవరేజ్‌ను అందిస్తుంది.
అసలు నేను ట్రాక్టర్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?
- మీకు కానీ మీ సంస్థకు కానీ ట్రాక్టర్ ఉండి, దానిని ప్రతి రోజు మీ వ్యాపార అవసరాలకు వాడుతుంటే కచ్చితంగా ఏదో ఒక ఇన్సూరెన్స్ పాలసీని మీరు కలిగి ఉండటం చాలా అవసరం. ఇండియన్ మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇది తప్పనిసరి. ఈ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వలన అది మిమ్మల్ని, మీ వ్యాపారాన్ని అనుకోని నష్టాల నుంచి కాపాడుతుంది.
- అన్ని రకాల వ్యాపారాలకు చిన్నవైనా పెద్దవైనా రిస్కులు తప్పకుండా ఉంటాయి. మీరు కనుక మీ వ్యాపారంలో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లను కలిగి ఉంటే మీరు తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకుని మీ ట్రాక్టర్లకు అయ్యే అదనపు ఖర్చు నుంచి ఊరట పొందండి. మీ ట్రాక్టర్లను డ్యామేజెస్ నుంచి కూడా కాపాడవచ్చు. ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన ట్రాక్టర్, డ్రైవర్ కాపాడబడుతారు.
- ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్ చేయడం వలన అది అనుకోని విపత్తుల నుంచి మిమ్మల్ని, మీ ట్రాక్టర్లను, మీ వ్యాపారాన్ని రక్షిస్తుంది. మీరు నష్టాల్లో ఉన్నపుడు ట్రాక్టర్ కోసం అదనంగా చెల్లించాల్సి వస్తే ఆ విషయం మిమ్మల్ని మరింత బాధిస్తుంది. కాబట్టి ట్రాక్టర్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా అవసరం.
డిజిట్ కమర్షియల్ ట్రాక్టర్ ఇన్సూరెన్స్నే ఎందుకు ఎంచుకోవాలి?
కమర్షియల్ ట్రాక్టర్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
కవర్ కానివి ఏంటి?
కమర్షియల్ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎటువంటి ప్రమాదాలు కవర్ కావో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలు తెలుసుకుంటే మీరు క్లెయిమ్ చేసుకునే సమయంలో ఎటువంటి గందరగోళం ఉండదు. అటువంటి కొన్ని సందర్భాలను కింద పేర్కొన్నాం.
మీరు కేవలం మీ ట్రాక్టర్‌కు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే చేయించినపుడు, స్వంత డ్యామేజ్లు, నష్టాలు కవర్ కావు.
పై రెండు సందర్భాల్లోనూ వాహన ఇన్సూరెన్స్ వర్తించదు. ట్రాక్టర్ నడిపిన వ్యక్తికి సరైన లైసెన్స్ లేదని నిరూపితమైనా, లేదా అతడు వాహనం నడుపుతున్న సమయంలో మద్యం సేవించి ఉన్నాడని తేలినా కానీ క్లెయిమ్ అప్రూవ్ కాదు.
కావాలని నిర్లక్ష్యం వ్యవహరించినపుడు ఇన్సూరెన్స్ కవర్ కాదు. ఉదాహరణకు మీ నగరంలో భారీ వరదలు సంభవించినపుడు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ట్రాక్టర్‌ను తీసుకొని వెళ్లినట్లయితే, అప్పుడు ఒకవేళ మీ ట్రాక్టర్ వరద నీటిలో మునిగిపోతే దానికి ఇన్సూరెన్స్ వర్తించదు.
అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటి వలన ప్రత్యక్ష్యంగా డ్యామేజ్లు సంభవించినపుడు
డిజిట్ అందించే కమర్షియల్ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ ప్రధాన ఫీచర్లు
ప్రధాన ఫీచర్లు | డిజిట్ ప్రయోజనం |
---|---|
క్లెయిమ్ ప్రాసెస్ | పేపర్‌లెస్ క్లెయిమ్స్ |
కస్టమర్ సపోర్ట్ | 24x7 సపోర్ట్ |
అదనపు కవరేజ్ | PA కవర్, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు మొదలయినవి |
థర్డ్ పార్టీ డ్యామేజ్లు | పర్సనల్ డ్యామేజ్లకు అపరిమిత లయబిలిటీ, ప్రాపర్టీ /వెహికిల్ డ్యామేజ్లకు రూ. 7.5 లక్షల వరకు కవరేజ్ |
కమర్షియల్ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో రకాలు11
మీ ట్రాక్టర్ రకాన్ని బట్టి, మీరు ఇన్సూరెన్స్ చేయించాలని అనుకుంటున్న ట్రాక్టర్ల సంఖ్యను బట్టి మేము మీకు రెండు రకాలైన ట్రాక్టర్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాం. అవి
లయబిలిటీ ఓన్లీ | స్టాండర్ట్ ప్యాకేజ్ |
ఎవరైనా థర్డ్ పార్టీ పర్సన్ లేదా ప్రాపర్టీకి మీ ట్రాక్టర్ వల్ల జరిగిన డ్యామేజ్లు |
|
థర్డ్ పార్టీ వాహనానికి మీ ట్రాక్టర్ వలన అయిన డ్యామేజ్లు |
|
ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, ప్రమాదాల వలన ట్రాక్టర్‌కు అయిన డ్యామేజ్లు |
|
ట్రాక్టర్ ఓనర్ లేదా డ్రైవర్‌కు గాయాలు/మరణం సంభవించిపుడుIf the owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
|
Get Quote | Get Quote |
క్లెయిమ్ చేయడం ఎలా?
1800-258-5956 కు కాల్ చేయండి లేదా hello@godigit.com కు ఈమెయిల్ చేయండి.
కాల్ చేసినపుడు లేదా మెయిల్ చేసినపుడు మీ పాలసీ నంబర్, యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం, తేదీ, సమయం వంటి వివరాలను దగ్గర ఉంచుకోండి. ఇన్సూరెన్స్ ఎవరి పేరు మీదైతే ఉందో వాళ్ల ఫోన్ నంబర్ దగ్గర పెట్టుకోండి.
భారతదేశంలో ఆన్లైన్ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ గురించి FAQs
ట్రాక్టర్ ఇన్సూరెన్స్ డ్రైవర్‌కు కూడా కవర్ అవుతుందా?
అవును. ట్రాక్టర్ ఇన్సూరెన్స్ అనేది వాహనం, యజమాని లేదా డ్రైవర్‌కు కూడా కవర్ అవుతుంది.
నేను నా అన్ని ట్రాక్టర్లకు ఒకే పాలసీ తీసుకోవచ్చా?
లేదు. అలా చేసేందుకు వీలులేదు. ప్రతీ ట్రాక్టర్‌కు ఒక రెస్పెక్టివ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. మీకు ఇన్సూరెన్స్ గురించి ఎటువంటి సందేహాలున్నా పైన పేర్కొన్న నంబర్లో కాల్ చేసి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోండి.
ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ చేయించడం తప్పనిసరా?
అవును. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం తప్పనిసరి. మీ ట్రాక్టర్ భారతదేశపు రోడ్లపై తిరగడానికి కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా చేయించాలి. ట్రాక్టర్లకు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ భద్రత అవసరం.
థర్డ్ పార్టీ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ పాలసీకి, కాంప్రహెన్సివ్ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ పాలసీకి మధ్య తేడా ఏంటి?
థర్డ్ పార్టీ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ కేవలం మిమ్మల్ని థర్డ్ పార్టీ నష్టాల నుంచి మాత్రమే కాపాడుతుంది. అదే మీరు కాంప్రహెన్సివ్ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది మీ ట్రాక్టర్‌ను ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, ప్రమాదాల నుంచి కూడా రక్షిస్తుంది.
ట్రాక్టర్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?
ఈ విషయం ప్రధానంగా మీ ట్రాక్టర్ రకం, మీరు ఉండే నగరంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏ నగరంలో వాహనం నడుపుతారనే విషయం తప్పనిసరి. ఇక్కడ మీరు మీ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను సులభంగా లెక్కించవచ్చు.