బస్ ఇన్సూరెన్స్​

ప్రయాణికుల బస్సులు, స్కూల్ బస్సుల కోసం కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్

Third-party premium has changed from 1st June. Renew now

బస్ ఇన్సూరెన్స్ అనేది కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఒక రకం. ఇది వాణిజ్యపరమైన (కమర్షియల్) వాహనాలను ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాల వల్ల కలిగే డ్యామేజీలు, నష్టాల నుంచి రక్షిస్తుంది. వీటిలో బేసిక్ ప్లాన్ కేవలం థర్డ్ పార్టీ లయబిలిటీలను (చట్టం ద్వారా తప్పనిసరి) మాత్రమే కవర్ చేస్తే, కాంప్రహెన్సివ్ పాలసీ సొంత డ్యామేజీలు, నష్టాలను కూడా కవర్ చేస్తుంది. ఈ రెండూ ఈ పాలసీ కింద కవర్ అవుతాయి.

కవర్ అయ్యే బస్ రకాలు:

  • స్కూల్ బస్సులు: స్కూల్​ లేదా కాలేజీల వంటి విద్యా సంస్థలలో భాగంగా ఉండే బస్సులు, ప్రధానంగా విద్యార్థుల రవాణా కొరకు ఉపయోగించే బస్సులను ఈ పాలసీ కింద కవర్ చేయవచ్చు.
  • పబ్లిక్ బస్సు‎లు: ప్రభుత్వ సొంత, నడుపుతున్న బస్సులు, నగరం లోపల ప్రయాణికులను రవాణా చేయడానికి లేదా ఒక నగరం నుంచి మరొక నగరానికి నడిపే బస్సులు కూడా ఈ పాలసీ కింద కవర్ అవుతాయి.
  • ప్రైవేట్ బస్సు‎లు: టూర్ బస్సులు లేదా తమ ఉద్యోగుల కోసం ఆఫీసులు ఉపయోగించే బస్సుల వంటి ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలోని బస్సులు కూడా ఈ పాలసీ కింద కవర్ అవుతాయి.
  • ప్రయాణికులను తీసుకెళ్లే ఇతర బస్సులు: ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేసే ఉద్దేశంతో ఉపయోగించే అన్ని ఇతర రకాల వాణిజ్యపరమైన బస్సులు, వ్యాన్లు ఈ పాలసీ కింద కవర్ చేయబడతాయి.

బస్ ఇన్సూరెన్స్‎ని ఎందుకు కొనుగోలు చేయాలి?

  • ఊహించని నష్టాల నుంచి రక్షించుకునేందుకు: థర్డ్ పార్టీకి లేదా మీ సొంత బస్సుకు వాటిల్లే నష్టాన్ని బస్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తే మీ ఇన్సూరెన్స్ సరైనది నిర్ధారణ అవుతుంది. తద్వారా మీ వ్యాపార నష్టాలను నిరోధిస్తుంది. మీ రోజువారీ లాజిస్టికల్ కార్యకలాపాల్లో కలిగే ఇబ్బందులను నివారిస్తుంది.
  • చట్టాన్ని పాటించేందుకు: మోటార్ వాహనాల చట్టం ప్రకారం, అన్ని వాహనాలకు, ముఖ్యంగా వాణిజ్య ప్రయోజనాల కొరకు ఉపయోగించే వారు, ఏదైనా అనుకోని సందర్భంలో కలిగే థర్డ్ పార్టీ డ్యామేజీలు, నష్టాలను కవర్ చేయడానికి కనీసం థర్డ్ పార్టీ కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్ పాలసీని అయినా కలిగి ఉండటం తప్పనిసరి. ఇది లేకుండా, వాహనం నడుపుతూ పట్టుబడితే మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
  • యజమాని-డ్రైవర్​ని కవర్ చేయడం: బస్​ ఇన్సూరెన్స్ మీ వాహనం లేదా థర్డ్ పార్టీ  వాహనానికి కలిగే డ్యామేజీలు, నష్టాలకు మాత్రమే కాకుండా, దాని యజమాని-డ్రైవర్​కు ఏదైనా శారీరక గాయాలు అయినా కవర్ చేస్తుంది.
  • ప్రయాణికుల సంరక్షణ: ప్రతీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్​లో భాగంగా మీరు ప్రయాణికులను కవర్ చేసేలా పాలసీలో ఉండే ఆప్షన్​ను ఎంచుకోవచ్చు. దీని వల్ల మీ ప్రయాణికులు ప్రమాదాలు, మంటలు, ప్రకృతి విపత్తుల వంటి వాటి నుంచి రక్షించబడతారు.

డిజిట్ అందించే కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్‎నే ఎందుకు ఎంచుకోవాలి?

కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

ఏమేం కవర్ కావు?

కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఏ ఏ అంశాలకు కవరేజ్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో క్లెయిమ్​ సమయంలో ఏవేవి కవర్ కావో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి కొన్ని పరిస్థితులను ఇక్కడ పేర్కొన్నాం:

థర్డ్ పార్టీ పాలసీదారుడి​ సొంత డ్యామేజీ‎లు

థర్డ్ పార్టీ కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే ఉంటే, మీ బస్సుకు కలిగే సొంత డ్యామేజీలు,​ నష్టాలు కవర్ కావు.

తాగి నడపడం లేదా లైసెన్స్ లేకుండా నడపడం

క్లెయిమ్ సమయంలో డ్రైవర్-యజమానికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా లేదంటే మద్యం సేవించి నడిపినా కవర్ కాదు.d.

స్వీయ నిర్లక్ష్యం

యజమాని-డ్రైవర్ యొక్క స్వీయ నిర్లక్ష్యం కారణంగా ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు. ఉదా: మీ ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు అది తెలిసి కూడా మీ వాహనాన్ని నడపడం వంటివి.

పర్యవసాన డ్యామేజీలు

ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం మొదలైన వాటి వల్ల ప్రత్యక్షంగా జరగని ఏదైనా డ్యామేజ్​.

డిజిట్ అందించే కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్ కీలక ఫీచర్లు

కీలక ఫీచర్లు డిజిట్ ప్రయోజనం
క్లెయిమ్ విధానం పేపర్ లెస్ క్లెయిమ్
కస్టమర్ సపోర్ట్ 24x7 సపోర్ట్
అదనపు కవరేజ్ పీఏ (PA) కవర్​లు, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు మొదలైనవి
థర్డ్ పార్టీకి అయ్యే డ్యామేజీలు పర్సనల్ డ్యామేజీలకు అపరిమిత బాధ్యత, ప్రాపర్టీ/వాహన డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు

కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో రకాలు11

ఇన్సూరెన్స్ చేయాల్సిన మీ బస్సు లేదా బస్సుల ఫ్లీట్ రకం ఆధారంగా, మేము ప్రధానంగా ఎంచుకోవడానికి రెండు రకాల ప్లాన్లను అందిస్తున్నాం.

లయబిలిటీ ఓన్లీ స్టాండర్డ్ ప్యాకేజ్

మీ బస్ వల్ల థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ప్రాపర్టీకి కలిగే డ్యామేజీ‎లు

×

మీ బస్ వల్ల థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజీ‎లు

×

ప్రకృతి వైపరీత్యాలు, మంటలు, దొంగతనం లేదా ప్రమాదాల వల్ల మీ సొంత బస్సుకు కలిగే నష్టం లేదా డ్యామేజీ‎లు

×

యజమాని-డ్రైవర్​కు గాయాలు/మరణం

If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before

×
Get Quote Get Quote

ఎలా క్లెయిమ్​ చేసుకోవాలి?

1800-258-5956కి కాల్ చేయండి లేదా hello@godigit.comపై ఈమెయిల్ పంపండి

మా ప్రాసెస్​ను సులభతరం చేయడానికి మీ పాలసీ నెంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, జరిగిన తేదీ, సమయం, కాంటాక్ట్ నెంబర్​ను దగ్గర ఉంచుకోండి.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​లు ఎంత త్వరగా సెటిల్ చేయబడతాయి? మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనస్సులో రావాల్సిన మొదటి ప్రశ్న ఇది. గుడ్​, మీరు బాగా ఆలోచిస్తున్నారు! డిజిట్​ క్లెయిమ్​ల రిపోర్టు కార్డును చదవండి

భారతదేశంలో కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి

స్కూల్ బస్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అంత ముఖ్యమా?

అవును, తప్పకుండా! స్కూళ్లు లేదా థర్డ్ పార్టీ సంస్థలు స్కూల్ బస్సులను ప్రాథమికంగా పిల్లలను ఇంటి నుంచి స్కూళ్లకు, తిరిగి రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నాయి. అందువల్ల, మీరు కనీసం ఒక బస్సు ఇన్సూరెన్స్‎ని పొందడం ముఖ్యం. ఇది ఊహించని నష్టాల నుంచి మీ సంస్థను రక్షించడమే కాకుండా, రోజువారీగా ఈ బస్సుల్లో ప్రయాణించే పిల్లలు, టీచర్లను కూడా కవర్ చేస్తుంది.

అవును, తప్పకుండా! స్కూళ్లు లేదా థర్డ్ పార్టీ సంస్థలు స్కూల్ బస్సులను ప్రాథమికంగా పిల్లలను ఇంటి నుంచి స్కూళ్లకు, తిరిగి రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నాయి. అందువల్ల, మీరు కనీసం ఒక బస్సు ఇన్సూరెన్స్‎ని పొందడం ముఖ్యం. ఇది ఊహించని నష్టాల నుంచి మీ సంస్థను రక్షించడమే కాకుండా, రోజువారీగా ఈ బస్సుల్లో ప్రయాణించే పిల్లలు, టీచర్లను కూడా కవర్ చేస్తుంది.

సరైన బస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడానికి చిట్కాలు

మీ బస్సు కొరకు ఆన్​లైన్​లో సరైన బస్సు ఇన్సూరెన్స్‎ని ఎంచుకోవడానికి, దిగువ అంశాలను పోల్చడం, పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం: సరైన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ: ఐడీవీ (IDV) అనేది మీరు ఇన్సూరెన్స్​ చేయాలనుకుంటున్న వాహనం యొక్క తయారీదారుని అమ్మకపు ధర (దాని తరుగుదలతో సహా). మీ ప్రీమియం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆన్​లైన్​లో సరైన బస్ ఇన్సూరెన్స్ కొరకు చూస్తున్నప్పుడు, మీరు కూడా మీ వాహన ఐడీవీ (IDV) సరిగ్గా ఉండేలా ధ్రువీకరించుకోండి. సర్వీస్ బెనిఫిట్లు: 24x7 కస్టమర్ సపోర్ట్, క్యాష్​లెస్ గ్యారేజీల యొక్క విస్తృత నెట్​వర్క్ వంటి సేవలను పరిగణనలోకి తీసుకోండి. అవసరమైన సమయాల్లో ఈ సేవలు అత్యంత ముఖ్యమైనవి. యాడ్-ఆన్​లను చూడండి: మీ బస్ కొరకు సరైన బస్ ఇన్సూరెన్స్​ను ఎంచుకునేటప్పుడు గరిష్ట ప్రయోజనాలు పొందేలా చూసుకునేందుకు ఏ ఏ యాడ్–ఆన్​లు లభ్యం అవుతున్నాయనే దానిని కూడా పరిగణనలోకి తీసుకోండి. క్లెయిమ్​ వేగం: ఏదైనా ఇన్సూరెన్స్​లో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. ఏ కంపెనీ క్లెయిమ్​లను త్వరగా సెటిల్ చేస్తుందో ఆ కంపెనీనే ఎంచుకోండి. ఉత్తమ విలువ: సరైన ప్రీమియం నుంచి సేవలు, క్లెయిమ్​ సెటిల్​మెంట్లు, యాడ్-ఆన్​ల వరకు; మీకు సాధ్యమైనంత ఉత్తమ విలువతో అవసరమైన ప్రతీదీ సౌకర్యవంతంగా కవర్ చేసే ఇన్సూరెన్స్​నే ఎంచుకోండి.

మీ బస్సు కొరకు ఆన్​లైన్​లో సరైన బస్సు ఇన్సూరెన్స్‎ని ఎంచుకోవడానికి, దిగువ అంశాలను పోల్చడం, పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం:

  • సరైన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ: ఐడీవీ (IDV) అనేది మీరు ఇన్సూరెన్స్​ చేయాలనుకుంటున్న వాహనం యొక్క తయారీదారుని అమ్మకపు ధర (దాని తరుగుదలతో సహా). మీ ప్రీమియం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆన్​లైన్​లో సరైన బస్ ఇన్సూరెన్స్ కొరకు చూస్తున్నప్పుడు, మీరు కూడా మీ వాహన ఐడీవీ (IDV) సరిగ్గా ఉండేలా ధ్రువీకరించుకోండి.
  • సర్వీస్ బెనిఫిట్లు: 24x7 కస్టమర్ సపోర్ట్, క్యాష్​లెస్ గ్యారేజీల యొక్క విస్తృత నెట్​వర్క్ వంటి సేవలను పరిగణనలోకి తీసుకోండి. అవసరమైన సమయాల్లో ఈ సేవలు అత్యంత ముఖ్యమైనవి.
  • యాడ్-ఆన్​లను చూడండి: మీ బస్ కొరకు సరైన బస్ ఇన్సూరెన్స్​ను ఎంచుకునేటప్పుడు గరిష్ట ప్రయోజనాలు పొందేలా చూసుకునేందుకు ఏ ఏ యాడ్–ఆన్​లు లభ్యం అవుతున్నాయనే దానిని కూడా పరిగణనలోకి తీసుకోండి.
  • క్లెయిమ్​ వేగం: ఏదైనా ఇన్సూరెన్స్​లో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. ఏ కంపెనీ క్లెయిమ్​లను త్వరగా సెటిల్ చేస్తుందో ఆ కంపెనీనే ఎంచుకోండి.
  • ఉత్తమ విలువ: సరైన ప్రీమియం నుంచి సేవలు, క్లెయిమ్​ సెటిల్​మెంట్లు, యాడ్-ఆన్​ల వరకు; మీకు సాధ్యమైనంత ఉత్తమ విలువతో అవసరమైన ప్రతీదీ సౌకర్యవంతంగా కవర్ చేసే ఇన్సూరెన్స్​నే ఎంచుకోండి.

నా బస్సు ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపించే కారకాలు ఏమిటి?

మీ బస్సు ఇన్సూరెన్స్ రేట్లను అంతిమంగా ప్రభావితం చేసే వివిధ కారకాలు ఉన్నాయి, అవి: వాహనం మోడల్, ఇంజన్, మేక్: ఏ రకమైన మోటార్ ఇన్సూరెన్స్ కొరకైనా సరైన ఇన్సూరెన్స్ ప్రీమియంను తెలుసుకోవడంలో మోడల్, మేక్, ఇంజన్ చాలా ముఖ్యమైనవి. అందువల్ల, మీ బస్ ఇన్సూరెన్స్ ప్రధానంగా మీ బస్ ఇంజన్ రకం, అది తయారైన సంవత్సరం, అదనపు ఫీచర్లు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతం: మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించేటప్పుడు మీరు రిజిస్టర్ చేసుకొని మీ బస్సును నడపడానికి ఎంచుకున్న ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనది. ఎక్కువ ట్రాఫిక్, నేరాలు, ప్రమాద రేట్లు ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో అధిక ప్రీమియంను వసూలు చేయబడుతుంది. సురక్షితమైన, చిన్న నగరాల్లో తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. నో–క్లెయిమ్​ బోనస్: మీరు ఇంతకు ముందు బస్ ఇన్సూరెన్స్​​ను కలిగి ఉండి, ప్రస్తుతం మీ పాలసీని రిన్యూ  చేయడమో లేదా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మారాలనో చూస్తున్నట్లయితే- ఈ సందర్భంలో మీ NCB (నో క్లెయిమ్​ బోనస్) పరిగణించబడుతుంది. మీ ప్రీమియం డిస్కౌంట్ రేటు వద్ద ఉంటుంది! నో క్లెయిమ్​ బోనస్ అంటే మీ బస్సుకు గత పాలసీ కాలంలో ఒక్క క్లెయిమ్​ కూడా లేకపోవడం. ఇన్సూరెన్స్ ప్లాన్ రకం: మీ బస్సుకు కాంప్రహెన్సివ్ బస్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నా లేదా థర్డ్ పార్టీ లయబిలిటి ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలని చూస్తున్నా; ఈ ప్రతీ ప్లాన్​లో అందించే కవరేజీ ప్రయోజనాలు విభిన్నంగా ఉంటాయి. కనుక రెండింటి కొరకు బస్ ఇన్సూరెన్స్ ప్రీమియం విభిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

మీ బస్సు ఇన్సూరెన్స్ రేట్లను అంతిమంగా ప్రభావితం చేసే వివిధ కారకాలు ఉన్నాయి, అవి:

  • వాహనం మోడల్, ఇంజన్, మేక్: ఏ రకమైన మోటార్ ఇన్సూరెన్స్ కొరకైనా సరైన ఇన్సూరెన్స్ ప్రీమియంను తెలుసుకోవడంలో మోడల్, మేక్, ఇంజన్ చాలా ముఖ్యమైనవి. అందువల్ల, మీ బస్ ఇన్సూరెన్స్ ప్రధానంగా మీ బస్ ఇంజన్ రకం, అది తయారైన సంవత్సరం, అదనపు ఫీచర్లు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
  • ప్రాంతం: మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించేటప్పుడు మీరు రిజిస్టర్ చేసుకొని మీ బస్సును నడపడానికి ఎంచుకున్న ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనది. ఎక్కువ ట్రాఫిక్, నేరాలు, ప్రమాద రేట్లు ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో అధిక ప్రీమియంను వసూలు చేయబడుతుంది. సురక్షితమైన, చిన్న నగరాల్లో తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది.
  • నో–క్లెయిమ్​ బోనస్: మీరు ఇంతకు ముందు బస్ ఇన్సూరెన్స్​​ను కలిగి ఉండి, ప్రస్తుతం మీ పాలసీని రిన్యూ  చేయడమో లేదా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మారాలనో చూస్తున్నట్లయితే- ఈ సందర్భంలో మీ NCB (నో క్లెయిమ్​ బోనస్) పరిగణించబడుతుంది. మీ ప్రీమియం డిస్కౌంట్ రేటు వద్ద ఉంటుంది! నో క్లెయిమ్​ బోనస్ అంటే మీ బస్సుకు గత పాలసీ కాలంలో ఒక్క క్లెయిమ్​ కూడా లేకపోవడం.
  • ఇన్సూరెన్స్ ప్లాన్ రకం: మీ బస్సుకు కాంప్రహెన్సివ్ బస్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నా లేదా థర్డ్ పార్టీ లయబిలిటి ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలని చూస్తున్నా; ఈ ప్రతీ ప్లాన్​లో అందించే కవరేజీ ప్రయోజనాలు విభిన్నంగా ఉంటాయి. కనుక రెండింటి కొరకు బస్ ఇన్సూరెన్స్ ప్రీమియం విభిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

భారతదేశంలో ఆన్​లైన్​లో బస్ ఇన్సూరెన్స్ పొందడానికి సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)

నా సంస్థలో పదికి పైగా స్కూల్ బస్సులు ఉన్నాయి. నేను వాటన్నింటినీ ఇన్సూర్ చేయగలనా?

అవును, ఖచ్చితంగా! మీ స్కూలు బస్సుల ఫ్లీట్ వంటి బస్సులను సంరక్షించడం కొరకు బస్ ఇన్సూరెన్స్ రూపొందించబడింది. వాటన్నింటీ మీరు డిజిట్ ద్వారా కవర్ చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా మమ్మల్ని సంప్రదించడం, తద్వారా మీ సంస్థ కొరకు మేం కస్టమైజ్డ్ ప్లాన్​ను అందించగలం.

ఏ రకమైన బస్సులను కవర్ చేయవచ్చు?

స్కూలు బస్సులు, వ్యాన్లు, మినీ బస్సులు, టూర్ బస్సులతో సహా అన్ని బస్సులు కూడా మా కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడతాయి.

స్కూలు బస్సు ఇన్సూరెన్స్​కు ఎంత ఖర్చు అవుతుంది?

మీరు ఇన్సూరెన్స్​ తీసుకోవాలనుకుంటున్న బస్సు రకం, మీ ప్రాంతం ఆధారంగా, మీ బస్ ఇన్సూరెన్స్ ఖర్చు భిన్నంగా ఉంటుంది. మీ స్కూలు బస్సు ఇన్సూరెన్స్​కు ఎంత ఖర్చు కాగలదో అర్థం చేసుకోవడానికి, మీ వివరాలను ఇక్కడ నమోదు చేయండి.