ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?

థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్, దీనిని థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. ఏదైనా థర్డ్ పార్టీ వాహనం, వ్యక్తి లేదా ప్రాపర్టీకి నష్టం లేదా డ్యామేజ్‌ జరిగినట్లయితే మిమ్మల్ని ఇది కవర్ చేస్తుంది. దురదృష్టవశాత్తు, ఇది మీ స్వంత వాహన డ్యామేజ్‌లను మాత్రం కవర్ చేయదు.

భారతదేశంలో మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది లేకుంటే మీరు భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. మీ కారు ఏదైనా థర్డ్ పార్టీ వాహనం, వ్యక్తి లేదా ప్రాపర్టీకి డ్యామేజ్‌ కలిగించినట్లైతే తలెత్తే నష్టాల నుంచి కూడా ఇది మీ జేబును సంరక్షిస్తుంది.

ఉదాహరణకు, ఒకవేళ మీరు అనుకోకుండా మరో కారు హెడ్‌లైట్‌లను డ్యామేజ్​ చేసినట్లయితే, దీని వల్ల థర్డ్ పార్టీకి కలిగే నష్టాలకు మీ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది.

కార్ ఇన్సూరెన్స్ లను పోల్చడం గురించి మరింత తెలుసుకోండి

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ధర

కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌ లా కాకుండా, థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌ మీ ఇంజన్ సీసీపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీమియంలను ఐఆర్​డీఏఐ (IRDAI) ముందే నిర్ణయిస్తుంది.

ప్రైవేట్ కార్ల ఇంజన్ కెపాసిటీ ప్రీమియం రేటు
1000ccని మించకపోతే ₹2,072
1000ccని మించినవి కానీ 1500cc కన్నా తక్కువ ₹3,221
1500cc కన్నా మించినవి ₹7,890

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ లో ఏవి కవర్ కావు?

మీ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్ కావనే విషయం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఏమేం కవర్ కావో ముందే తెలిస్తే క్లెయిమ్‌ చేసుకునే సమయంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. అలాంటి కొన్ని పరిస్థితులు:

సొంత డ్యామేజ్‌లు

మీ సొంత కార్ డ్యామేజ్ అయితే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ దానిని కవర్ చేయదు.

తాగి నడపడం లేదా లైసెన్స్ లేకుండా నడపడం

మీరు మద్యం తాగి వాహనం నడిపినా, లేదంటే వ్యాలిడ్‌ ఫోర్​–వీలర్​ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపినా థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ కాదు.

సరైన డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేయడం

ఒకవేళ మీరు లెర్నర్ లైసెన్స్ కలిగి ఉండి, ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో సరైన డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లయితే- అప్పుడు ఆ పరిస్థితుల్లో మీ క్లెయిమ్‌ కవర్ చేయబడదు.

డిజిట్​ అందించే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన ఫీచర్లు

ప్రధాన ఫీచర్లు డిజిట్​ ప్రయోజనం
ప్రీమియం ₹2072/- నుంచి ప్రారంభం
కొనుగోలు విధానం స్మార్ట్ ఫోన్ ఆధారిత ప్రక్రియ. కేవలం 5 నిమిషాల్లో పూర్తవుతుంది.
క్లెయిమ్‌ సెటిల్మెంట్లు ప్రైవేట్ కార్లకు 96% క్లెయిమ్‌లు సెటిల్ చేయబడ్డాయి.
థర్డ్ పార్టీకి పర్సనల్ డ్యామేజ్‌లు అన్‌లిమిటెడ్ లయబిలిటీ
థర్డ్ పార్టీకి ప్రాపర్టీ డ్యామేజ్‌లు 7.5 లక్షల వరకు
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ 15 లక్షల వరకు
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ప్రీమియం ₹220/-

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలి?

  • ప్రమాదం జరిగినట్లయితే సంబంధిత థర్డ్ పార్టీ విధిగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఛార్జ్ షీట్ పొందాలి.
  • ఒకవేళ పరిహారం ఉంటే, మీ తరఫున మేము దాన్ని చూసుకుంటాము. కేవలం 1800-103-4448కి కాల్ చేయండి చాలు.
  • నిబంధనల ఉల్లంఘన లేనట్లయితే, మీ తరఫున నాన్-మానిటరీ సెటిల్మెంట్ కోసం మేం ప్రయత్నిస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తినట్లైతే, మేం మీకు కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తాం.
  • మరీ ముఖ్యంగా, మీరు మంచి పౌరుడై, ఏదైనా నిర్లక్ష్యానికి మీ తప్పును అంగీకరించినట్లయితే, మీ డిజిట్​ థర్డ్ పార్టీ కవర్ అప్పటికి కూడా బాగానే ఉంటుంది.
  • వ్యక్తిగత ప్రమాద సంబంధిత క్లెయిమ్‌ విషయంలో, మీరు చేయాల్సిందల్లా 1800-258-5956 పై మాకు కాల్ చేయడమే. మిగిలిందంతా మేం చూసుకుంటాం!

థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ చేసే సమయంలో గుర్తించుకోవాల్సినవి

  • ఒకవేళ ప్రమాదం జరిగినట్లయితే, డ్యామేజ్ సమయంలో సంబంధిత థర్డ్ పార్టీ విధిగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి- దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి. ఇలా చేయకపోతే, అవసరమైన పరిహారం అందించలేము.
  • ప్రమాదం జరిగిన సందర్భాల్లో అపోజిషన్‌ పార్టీ యొక్క తప్పును నిరూపించడానికి థర్డ్-పార్టీ వద్ద తగిన సాక్ష్యాలు ఉండటం ముఖ్యం.
  • స్వల్ప డ్యామేజ్‌లు, నష్టాలు మాత్రమే జరిగినట్లైతే, అలాంటి వాటిని కోర్టు బయటే సెటిల్‌ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, మోటార్‌ వెహికిల్‌ ట్రైబ్యూనల్‌ మొదలైనవన్నీ చాలా సమయం తీసుకునే ప్రక్రియలు.
  • ఐఆర్​డీఏఐ (IRDAI) నియమ, నిబంధనల ప్రకారం, క్లెయిమ్‌ మొత్తాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్‌ల ట్రైబ్యూనల్‌పై ఉంటుంది. థర్డ్ పార్టీకి వ్యక్తిగత డ్యామేజ్‌లపై గరిష్ట పరిమితి లేనప్పటికీ, థర్డ్ పార్టీ వాహనం లేదా ప్రాపర్టీకి డ్యామేజ్‌లు, నష్టాలు సంభవించినట్లయితే రూ. 7.5 లక్షల వరకు పరిమిత బాధ్యత మాత్రమే ఉంటుంది.

డిజిట్​ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ సెటిల్మెంట్ ఎంత త్వరగా జరుగుతుంది? మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనస్సులో రావాల్సిన మొదటి ప్రశ్న ఇది. గుడ్, బాగా ఆలోచిస్తున్నారు! డిజిట్​ క్లెయిమ్‌ రిపోర్ట్ కార్డ్‌ను చదవండి

మా గురించి మా కస్టమర్లు ఏం చెబుతున్నారు

రవి మిశ్రా
★★★★★

టీమ్ గో డిజిట్​, మీ మద్దతు, వేగంగా స్పందించే విధానం నిజంగా ప్రశంసనీయం. వాస్తవానికి నా కారును ఓ మోటార్‌ సైకిల్‌ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. బంపర్, ట్రంక్, టెయిల్ లైట్ విరిగిపోయాయి. మీరు త్వరగా స్పందించడమే గాక సులభంగా క్యాష్‌లెస్‌, పేపర్‌లెస్‌గా పూర్తి చేశారు. బాగా పనిచేశారు. థ్యాంక్స్‌.

దీపక్ కోటియన్
★★★★★

అద్భుతమైన సర్వీస్. పేపర్ లెస్ క్లెయిమ్‌ రిజిస్టర్, సెటిల్మెంట్లు. మీ సపోర్ట్, వెంటనే స్పందించినందుకు శ్రీ అరవింద్ రెడ్డి & టీమ్‌కు ధన్యవాదాలు. వారి ప్రొఫెషనలిజం, నిబద్ధత దృష్ట్యా గో డిజిట్​ కార్ ఇన్సూరెన్స్‌ను బాగా సిఫారసు చేస్తాను.

త్రిశాంత్ వర్మ
★★★★★

డిజిట్​ ద్వారా నా కారు పాలసీని రెన్యువల్ చేయడం ఇది రెండోసారి. డిజిట్​ ఎగ్జిక్యూటివ్ గోకుల్ అయ్యంగార్ నాకు నచ్చే, ఉత్తమమైన ఆఫర్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. సంవత్సరం పొడవునా నాకు అదే మద్దతు, సర్వీస్ లభిస్తుందని ఆశిస్తున్నాను.

Show all Reviews

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

సమయాన్ని & శ్రమని ఆదా చేస్తుంది

టెక్నాలజీకి ధన్యవాదాలు, ఆన్​లైన్​లో థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి మీకు కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. మీకు ప్రాథమికంగా కావాల్సిందల్లా మీ కారు వివరాలు (కారు రిజిస్ట్రేషన్ నెంబరు/కారు మేక్, మోడల్), ఐడీ ప్రూఫ్ (ఆధార్/పాన్) అంతే. మీ పాలసీ మీకు ఈమెయిల్ చేయబడుతుంది!

పర్సనల్ డ్యామేజ్​లు జరిగినట్లయితే థర్డ్–పార్టీ వ్యక్తిని కవర్ చేస్తుంది

మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు దురదృష్టశాత్తు యాక్సిడెంట్ చేస్తే అవతలి వ్యక్తికి గాయాలు కావచ్చు. దురదృష్టం మరీ ఎక్కువైతే మరణం కూడా సంభవించవచ్చు. ఈ సందర్భంలో థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పూర్తిగా కవర్ చేస్తుంది.

థర్డ్-పార్టీ ప్రాపర్టీ లేదా వాహనం డ్యామేజ్​లను కవర్ చేస్తుంది

మీరు ఒకరి ప్రాపర్టీ లేదా వాహనానికి డ్యామేజ్​ కలిగించినట్లయితే, మీ థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ వారి నష్టాలను 7.5 లక్షల వరకు కవర్ చేస్తుంది!

ఏవైనా శారీరక గాయాలైతే మిమ్మల్ని సంరక్షిస్తుంది

ఒకవేళ మీకు ఇప్పటికే ఏదైనా ఇతర పాలసీ నుంచి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లేనట్లయితే (మీ హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి), థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని అది ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. తద్వారా శాశ్వత వైకల్యం లేదా మరణానికి దారితీసే ప్రమాదంలో మిమ్మల్ని మీరు సంరక్షించుకోవచ్చు.

అనుకోకుండా వచ్చే నష్టాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది

రోడ్డు మీదున్న అనేక కార్ల వల్ల, ట్రాఫిక్ తప్పుల వల్ల కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. మీ కార్ వేరే వ్యక్తులను లేదా వారి వాహనం​/ప్రాపర్టీకి నష్టం కలిగించినప్పుడు, ఆ నష్టాలను థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. మీరు వాటిని భరించాల్సిన అవసరం లేదు.

చట్టబద్ధంగా డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది

మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం, ప్రతీ కారు యజమానికి కనీసం థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఒకవేళ మీరు మీ కారును మరింతగా సంరక్షించాలని అనుకుంటే, మీరు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ (Comprehensive Car Insurance Policy) కూడా ఎంచుకోవచ్చు. దీనిలో థర్డ్–పార్టీ అవసరాల కొరకు కవరేజ్, మీ స్వంత కారుకు సంరక్షణ ఉంటుంది.

ట్రాఫిక్ పెనాల్టీలు, ఫైన్​ల నుంచి రక్షిస్తుంది

ఒకవేళ మీరు కనీసం థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డుపై కనిపించినట్లయితే, మీరు రూ. 2,000 మరియు/లేదా 3 నెలల వరకు జైలు శిక్షకు అర్హులు అవుతారు.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ యొక్క ప్రతికూలతలు

సొంత డ్యామేజ్​లను కవర్ చేయదు

దురదృష్టవశాత్తు, థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ సొంత డ్యామేజ్​లు లేదా నష్టాలను కవర్ చేయదు.

ప్రకృతి వైపరీత్యాలను కవర్ చేయదు

ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినట్లయితే, మీ ఫోర్ వీలర్​కు కలిగే డ్యామేజ్​లను థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు.

కస్టమైజ్​ చేసిన ప్లాన్లు ఉండవు

థర్డ్–పార్టీ కార్​ ఇన్సూరెన్స్ అనేది మీ ఫోర్ వీలర్ కొరకు లభ్యమయ్యే అత్యంత ప్రాథమిక ప్లాన్. దీన్ని అదనపు ప్రయోజనాలు, కవర్​లతో మరింత కస్టమైజ్ చేయలేం. అయితే కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తో మీరు అలా చేయవచ్చు.

భారతదేశంలోని కార్ ఇన్సూరెన్స్ ప్లాన్​ల రకాలు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదం వల్ల స్వంత కారుకు జరిగే డ్యామేజ్​లు/నష్టాలు

×

అగ్నిప్రమాదం వల్ల స్వంత కారుకు కలిగే డ్యామేజ్​లు/నష్టాలు

×

ప్రకృతి వైపరీత్యం వల్ల స్వంత కారుకు సంభవించే డ్యామేజ్​లు/నష్టాలు

×

థర్డ్–పార్టీ వాహనానికి జరిగే డ్యామేజ్​లు

×

థర్డ్–పార్టీ ప్రాపర్టీకి కలిగే డ్యామేజ్​లు

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్–పార్టీ వ్యక్తి అయ్యే గాయాలు/ మరణం

×

మీ కారు దొంగతనం జరిగినప్పుడు

×

డోర్​స్టెప్​ పికప్ & డ్రాప్

×

మీ ఐడీవీ (IDV) కస్టమైజేషన్​

×

కస్టమైజ్డ్​ యాడ్-ఆన్స్​తో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​ల మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQ's)

సరైన థర్డ్–పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా నేను డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఏమి జరుగుతుంది?

ఒకవేళ మీరు సరైన థర్డ్–పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే, మీరు రూ. 2,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా మీ లైసెన్స్ కూడా రద్దు కావచ్చు, మరియు/లేదా 3 నెలల వరకు జైలు శిక్ష విధింపబడవచ్చు.

మీరు థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్​ చేసినట్లయితే, మీరు మీ ఎన్​సీబీ (NCB)ని కోల్పోతారా?

అలాంటిదేమీ లేదు. మీ ఎన్​సీబీ లేదా నో క్లెయిమ్​ బోనస్ అలానే ఉంటుంది.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?

అవును, మోటార్ వెహికిల్ చట్టం–1988 ప్రకారం కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అయినా కలిగి ఉండాలి.

ప్రమాదం జరిగిన సమయంలో నేను కాకుండా వేరే ఎవరైనా నా కారును నడుపుతున్నట్లయితే, నా నష్టాలను డిజిట్​ కవర్ చేస్తుందా?

అవును, ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు కారు నడుపుతున్నప్పటికీ డిజిట్​ ఇన్సూరెన్స్ మీ నష్టాలను కవర్ చేస్తుంది. కానీ, డ్రైవర్​కు వ్యాలిడ్​ లైసెన్స్ లేనట్లయితే లేదా లెర్నింగ్ లైసెన్స్ లేనట్లయితే, సహ–డ్రైవర్ సీటుపై లైసెన్స్ హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే, అవి కవర్ చేయబడవు. అలాంటి సందర్భాల్లో మీ క్లెయిమ్​ రద్దు చేయబడుతుంది.

నా కారుకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సరిపోతుందా?

హేయ్​, మీ స్వంత కారుకు జరిగే అన్ని డ్యామేజ్​లకు చెల్లించడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా? అది మీకు ఖర్చు అవుతుందని మీకు తెలుసు. థర్డ్ పార్టీ, నిర్వచనం ప్రకారం థర్డ్ పార్టీని మాత్రమే కవర్ చేస్తుంది. అంటే మీ ప్రమాదం వల్ల ప్రభావితమైన ఇతర వ్యక్తులను మాత్రమే అది కవర్ చేస్తుంది. థర్డ్ పార్టీ కవర్ ద్వారా కవర్ చేయబడని డ్యామేజ్​ను కాంప్రహెన్సివ్​ పాలసీ సంరక్షిస్తుంది. థర్డ్ పార్టీకి, కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్​కు మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

వేరే నగరం/రాష్ట్రంలో నేను ప్రమాదానికి గురైతే ఏమి జరుగుతుంది?

నగరం, రాష్ట్రం అనే తేడా లేకుండా ప్రమాదం ఎక్కడ జరిగినా డిజిట్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని కవర్ చేస్తుంది.

ఈ పాలసీలో భాగంగా ఇవ్వబడే గరిష్ట పరిహారం ఎంత?

థర్డ్ పార్టీకి పర్సనల్​ డ్యామేజ్​ జరిగినట్లయితే, గరిష్ట పరిహారం అంటూ ఉండదు. అయితే, థర్డ్ పార్టీకి చెందిన ప్రాపర్టీ లేదా వాహనానికి డ్యామేజ్​ జరిగినట్లయితే, గరిష్టంగా రూ. 7.5 లక్షల వరకు నష్టపరిహారం అందుతుంది.

ఆన్​లైన్​లో థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్​ను క్లెయిమ్​ చేసేటప్పుడు నేను ఏ ఏ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి?

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​ విషయంలో ప్రత్యేకంగా అడిగితే తప్ప మీకు వ్యక్తిగతంగా ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. ఒకవేళ థర్డ్ పార్టీ క్లెయిమ్​ ఉన్నట్లయితే, నష్టాలు, డ్యామేజీలకు పరిహారం చెల్లించాలని అతడు/ఆమె కోరుకున్నట్లయితే, సంబంధిత థర్డ్ పార్టీ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది.