గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్​ ఆన్​లైన్​ రెన్యువల్​

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో రెన్యూ చేసుకోండి

మీరు ఒక కారు​ను మెయింటేన్​ చేస్తున్నపుడు మర్చిపోకుండా చేయాల్సిన ముఖ్యమైన పని ఆ కారు ఇన్సూరెన్స్​ను సకాలంలో రెన్యూ చేయడం. మీరు మీ కారు​ ఇన్సూరెన్స్​ను సకాలంలో రెన్యువల్​ చేయించినట్లయితే అన్ని విషయాలు చాలా హాయి​గా సాగిపోతాయి. మీ జీవితంలో ఎన్ని ఆశ్చర్యకర విషయాలు జరిగినా కానీ ఇది స్థిరంగా ఉంటుంది.

అనుకోని సందర్భాల్లో కలిగే డ్యామేజీలు, నష్టాల నుంచి కార్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని కాపాడుతుంది. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, దొంగతనాలు, అగ్ని ప్రమాదాల వలన మీ కారుకు ఎటువంటి డ్యామేజ్​ జరిగినా ఇది మీ కారు​ను సంరక్షిస్తుంది.

సాధారణంగా కారు​ ఇన్సూరెన్స్​ పాలసీలు అనేవి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాల పరిమితి​తో వస్తాయి. కావున గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యూ చేసుకోవాలి. మీ కారు​ ఇన్సూరెన్స్​ గడువు ముగిసిపోతే వెంటనే ఆన్​లైన్​లో రెన్యూ చేసేయండి.

మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు ముగిసిపోతే ఏం జరుగుతుంది?

ప్రతి ఒక్కటీ గడువు తేదీతోనే ఉంటుంది. చివరికి మీ కారు​ ఇన్సూరెన్స్​ పాలసీకి కూడా గడువు తేదీ ఉంటుంది. కారు​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు ముగిసిన తర్వాత మీరు ఎటువంటి ప్రయోజనాలను పొందలేరు.

మీ కారు​ ఇన్సూరెన్స్​ గడువు ముగిసిపోయిన తర్వాత కూడా మీరు రెన్యూ చేసుకోకపోతే కింది ప్రయోజనాలను మీరు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

1. నష్టం జరిగితే ఎటువంటి నష్టపరిహారం రాదు

ప్రజలు కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని కొనుగోలు చేసేది, రెన్యూ చేసేది నష్ట పరిహారం కోసమే. అనుకోని సందర్భాల్లో జరిగే డ్యామేజెస్​, నష్టాల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.

మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు కనుక పూర్తయి, మీరు దాన్ని సమయానికి రెన్యువల్​ చేసుకోకపోతే మీరు నష్టపరిహారాన్ని పొందలేరు.

2. న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది

చాలా మంది కారు యజమానులు కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకుంటారు. (కనీసం థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ అయినా) ఎందుకంటే ఇది చట్టప్రకారం చాలా అవసరం కనుక.

లేకుంటే రూ. 1000 నుంచి రూ. 2000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ కారు​ ఇన్సూరెన్స్​ గడువు ముగిసిన తర్వాత రెన్యూ చేసుకోకుండా కారు నడుపుతూ పట్టుబడినా కూడా మీరు జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

3. నో క్లెయిమ్​ బోనస్​’ కోల్పోతారు

మీకు కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ ఉంటే నో క్లెయిమ్​ బోనస్​ (no claim bonus) గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మీకు నో క్లెయిమ్​ బోనస్​ ఉంటే మీ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంలో డిస్కౌంట్​ వస్తుంది. గడువు తేదీ లోపే మీరు ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసినపుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.

కాబట్టి, మీకు నో క్లెయిమ్​ బోనస్​ వర్తించాలంటే గడువు ముగియక ముందే మీ పాలసీని రెన్యూ చేసుకోవాలి. ఒకవేళ పాలసీ గడువు ముగిసిన తర్వాత మీరు రెన్యూ చేస్తే మీకు నో క్లెయిమ్​ బోనస్ డిస్కౌంట్​ వర్తించదని గుర్తుంచుకోవాలి.

4. మరోమారు తనిఖీ చేయండి!

మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని మీరు రెన్యూ చేయాలని చూస్తుంటే, మీరు మరో సారి తనిఖీ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్​ తీసుకునే విషయంలో తనిఖీ అనేది చాలా అవసరం.

డిజిట్​లో మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని స్మార్ట్​ ఫోన్​ ఆధారిత ప్రక్రియ​తో పూర్తి చేయొచ్చు. ఇది చాలా సులభం​గా ఉంటుంది. మీరు ఈ విధానం ద్వారా సరైన సమయం​లో కార్​ ఇన్సూరెన్స్​ను రెన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది.

గడువు తేదీ లోపే కార్​ ఇన్సూరెన్స్​ను రెన్యూ చేయడం చాలా ఉత్తమం. దీని ద్వారా మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఒక వేళ పాలసీని రెన్యూ చేయకపోతే వెంటనే ఆన్​లైన్​లో డిజిట్​తో రెన్యూ చేసుకోండి. ఎలా రెన్యూ చేయాలో ఇక్కడ మరింత తెలుసుకోండి.

గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని డిజిట్​తో ఆన్​లైన్​లో రెన్యూ చేయడమెలా?

మీరు గడువు ముగిసన మీ కార్​ ఇన్సూరెన్స్​ను రెన్యూ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

స్టెప్​ 1

మీ కారు నెంబర్​ను కానీ, మీ వాహనం వివరాలు (మోడల్​, వేరియంట్​, రిజిస్ట్రేషన్​ తేదీ​, మీ కారును నడిపే నగరం) కానీ ఎంటర్​ చేయాలి. తర్వాత ‘గెట్​ కోట్​’ ఆప్షన్​ మీద క్లిక్​ చేసి మీ పాలసీని ఎంచుకోవాలి.

స్టెప్​ 2

థర్డ్​ పార్టీ లయబిలిటీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ లేదా స్టాండర్ట్/కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది.

స్టెప్​ 3

మీకు అంతకుముందే కార్​ ఇన్సూరెన్స్​ ఉండి ఉంటే దాని వివరాలు ఇవ్వాలి. అందులో మీరు చేసిన క్లెయిమ్స్, పాలసీ గడువు తేదీ తదితరాలు తెలియజేయాలి

స్టెప్​ 4

అంతే, మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ పూర్తవుతుంది. మీరు స్టాండర్ట్​ ప్లాన్​ ఎంచుకుంటే మీకు నచ్చిన యాడ్​–ఆన్స్​ను ఎంపిక చేసుకోవాలి. మీ వాహప​ ఐడీవీ (IDV)ని ఎంచుకొని మీ కారు సీఎన్​జీ (CNG) కారే అని నిర్ధారించాలి. ఇక అప్పుడు తదుపరి పేజీలో మీకు తుది ప్రీమియం అమౌంట్​ ఎంత అనేది చూపిస్తుంది.

డిజిట్​ కార్​ ఇన్సూరెన్స్​నే మీరు ఎందుకు ఎంచుకోవాలి?

మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ ముగిసినపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మీ కారు ఇన్సూరెన్స్​ పాలసీ తేదీ గడువు దగ్గరపడుతున్నట్లైతే మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని వెంటనే రెన్యూ చేసుకోవాలి. కానీ, కొన్ని సందర్భాల్లో మీరు పాలసీని రెన్యూ చేసేందుకు కొంత సమయం పడుతుంది. దానిని మేము అర్థం చేసుకోగలం.

మీరు కొత్త ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకున్నపుడు పూర్వాపరాల పరిశీలనకు సమయం పడుతుంది. తనిఖీ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి.

మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు ముగిసి ఉంటే మీ కారు భద్రంగా ఉండటం కోసం ఇక్కడ ఉన్న విషయాలను తెలుసుకోండి.

  • ఒకవేళ మీరు ఇన్సూరెన్స్​ పాలసీ లేకుండా కారును నడుపుతూ పోలీసులకు పట్టుబడితే భారీ జరిమానా​ను చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా కారుకు ఏదైనా ప్రమాదం జరిగితే మీరు అనవసరంగా ఖర్చులపాలు అవుతారు.
  • మీరు మీ పాత ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి పాలసీని మార్చడానికి తికమక పడుతుంటే ఒకసారి మీరు ఆన్​లైన్​లో ఉన్న ఆప్షన్లను చూసి ఒక నిర్ణయం తీసుకోండి. మీ కారు అనేది మీరు అత్యధికంగా ఇష్టపడే వస్తువు. కాబట్టి మీ కారు సేఫ్టీ కోసం సరైన ఇన్సూరెన్స్​ కంపెనీనీ ఎంచుకోండి.
  • మీరు ఆన్​లైన్​లో పాలసీని రెన్యూ చేసినపుడు దీర్ఘకాలిక పాలసీని ఎంచుకుంటే కొన్ని రోజుల వరకు రెన్యువల్స్​కు సంబంధించిన బాధల​ నుంచి దూరంగా ఉండొచ్చు.
  • మీ కారు ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసుకునేందుకు కొన్ని వివరాలు అవసరమవుతాయి. కావున మీ కారు ఇన్సూరెన్స్​ వివరాల​ను సరిగ్గా భద్రపర్చుకోండి. సమర్పించేటపుడు కూడా సరైన వివరాలనే సమర్పించండి.

గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ రెన్యువల్​కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు

నా కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు రెండు రోజుల క్రితం ముగిసిపోయంది. మరి నా నో క్లెయిమ్​ బోనస్​ అలాగే ఉంటుందా?

ఉండదు. దురదృష్టవశాత్తు మీరు మీ నో క్లెయిమ్​ బోనస్​ను కోల్పోతారు. అందుకే, మీరు మీ పాలసీని గడువు తేదీ కంటే ముందుగానే రెన్యూ చేయాలి.

గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్​తో నేను భారతదేశంలో తిరిగితే ఎంత జరిమానా వేస్తారు?

కారుకు ఇన్సూరెన్స్​ పాలసీ లేకుండా నడపడం ఎంత నేరమో, గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్ పాలసీతో నడపడం కూడా అంతే నేరం. ఇలా చేస్తూ మీరు ట్రాఫిక్​ పోలీసులకు గనుక చిక్కితే రూ. 1000 నుంచి రూ. 2000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్​ జరిమానాల జాబితాను ఇక్కడ చూడండి.

నా కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు ముగిసిన తర్వాత నేను దానిని రెన్యూ చేయొచ్చా?

చేసుకోవచ్చు. కానీ మీ కారు ఇన్సూరెన్స్​ గడువు ముగిసిన తర్వాత ఇది నెల రోజులు మాత్రమే ఉంటుంది. నెల దాటితే మీ ఇన్సూరెన్స్​ పాలసీ లాప్స్​ అవుతుంది. అప్పుడు మీరు కొత్త పాలసీని కొనుగోలు చేయాల్సి వస్తుంది.

నా కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు తేదీని ఎలా తెలుసుకోవాలి?

మీరు డిజిట్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని కొనుగోలు చేసినట్లైతే మీ పాలసీకి సంబంధించిన ఒక డాక్యుమెంట్​ మీ రిజిస్టర్డ్​ మెయిల్​కు వస్తుంది. మీరు అందులో మీ పాలసీ గడువు తేదీని చూసుకోవచ్చు.

నేను గడువు తేదీ కంటే ముందుగానే నా కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసుకోవచ్చా?

నిశ్చింతగా రెన్యూ చేసుకోవచ్చు. అదే మంచి నిర్ణయం కూడా. కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు ముగియక ముందే రెన్యూ చేసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి పాలసీ గడువు కంటే 2–3 రోజుల ముందుగానే రెన్యూ చేసుకునేందుకు ప్రయత్నించండి.