గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ రెన్యువల్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
మీరు ఒక కారును మెయింటేన్ చేస్తున్నపుడు మర్చిపోకుండా చేయాల్సిన ముఖ్యమైన పని ఆ కారు ఇన్సూరెన్స్‌ను సకాలంలో రెన్యూ చేయడం. మీరు మీ కారు ఇన్సూరెన్స్‌ను సకాలంలో రెన్యువల్ చేయించినట్లయితే అన్ని విషయాలు చాలా హాయిగా సాగిపోతాయి. మీ జీవితంలో ఎన్ని ఆశ్చర్యకర విషయాలు జరిగినా కానీ ఇది స్థిరంగా ఉంటుంది.
అనుకోని సందర్భాల్లో కలిగే డ్యామేజీలు, నష్టాల నుంచి కార్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, దొంగతనాలు, అగ్ని ప్రమాదాల వలన మీ కారుకు ఎటువంటి డ్యామేజ్ జరిగినా ఇది మీ కారును సంరక్షిస్తుంది.
సాధారణంగా కారు ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాల పరిమితితో వస్తాయి. కావున గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యూ చేసుకోవాలి. మీ కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసిపోతే వెంటనే ఆన్లైన్లో రెన్యూ చేసేయండి.
ప్రతి ఒక్కటీ గడువు తేదీతోనే ఉంటుంది. చివరికి మీ కారు ఇన్సూరెన్స్ పాలసీకి కూడా గడువు తేదీ ఉంటుంది. కారు ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసిన తర్వాత మీరు ఎటువంటి ప్రయోజనాలను పొందలేరు.
మీ కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసిపోయిన తర్వాత కూడా మీరు రెన్యూ చేసుకోకపోతే కింది ప్రయోజనాలను మీరు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
ప్రజలు కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేది, రెన్యూ చేసేది నష్ట పరిహారం కోసమే. అనుకోని సందర్భాల్లో జరిగే డ్యామేజెస్, నష్టాల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.
మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు కనుక పూర్తయి, మీరు దాన్ని సమయానికి రెన్యువల్ చేసుకోకపోతే మీరు నష్టపరిహారాన్ని పొందలేరు.
చాలా మంది కారు యజమానులు కార్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటారు. (కనీసం థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా) ఎందుకంటే ఇది చట్టప్రకారం చాలా అవసరం కనుక.
లేకుంటే రూ. 1000 నుంచి రూ. 2000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసిన తర్వాత రెన్యూ చేసుకోకుండా కారు నడుపుతూ పట్టుబడినా కూడా మీరు జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
మీకు కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే నో క్లెయిమ్ బోనస్ (no claim bonus) గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మీకు నో క్లెయిమ్ బోనస్ ఉంటే మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో డిస్కౌంట్ వస్తుంది. గడువు తేదీ లోపే మీరు ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసినపుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.
కాబట్టి, మీకు నో క్లెయిమ్ బోనస్ వర్తించాలంటే గడువు ముగియక ముందే మీ పాలసీని రెన్యూ చేసుకోవాలి. ఒకవేళ పాలసీ గడువు ముగిసిన తర్వాత మీరు రెన్యూ చేస్తే మీకు నో క్లెయిమ్ బోనస్ డిస్కౌంట్ వర్తించదని గుర్తుంచుకోవాలి.
మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు రెన్యూ చేయాలని చూస్తుంటే, మీరు మరో సారి తనిఖీ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ తీసుకునే విషయంలో తనిఖీ అనేది చాలా అవసరం.
డిజిట్లో మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని స్మార్ట్ ఫోన్ ఆధారిత ప్రక్రియతో పూర్తి చేయొచ్చు. ఇది చాలా సులభంగా ఉంటుంది. మీరు ఈ విధానం ద్వారా సరైన సమయంలో కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది.
గడువు తేదీ లోపే కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడం చాలా ఉత్తమం. దీని ద్వారా మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఒక వేళ పాలసీని రెన్యూ చేయకపోతే వెంటనే ఆన్లైన్లో డిజిట్‌తో రెన్యూ చేసుకోండి. ఎలా రెన్యూ చేయాలో ఇక్కడ మరింత తెలుసుకోండి.
మీరు గడువు ముగిసన మీ కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
ఈ సారికి డిజిట్లో మీ కార్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు ప్రయత్నించండి. డిజిట్ వలన ఎటువంటి మార్పులు ఉంటాయంటే..
మీ కారు ఇన్సూరెన్స్ పాలసీ తేదీ గడువు దగ్గరపడుతున్నట్లైతే మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని వెంటనే రెన్యూ చేసుకోవాలి. కానీ, కొన్ని సందర్భాల్లో మీరు పాలసీని రెన్యూ చేసేందుకు కొంత సమయం పడుతుంది. దానిని మేము అర్థం చేసుకోగలం.
మీరు కొత్త ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నపుడు పూర్వాపరాల పరిశీలనకు సమయం పడుతుంది. తనిఖీ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి.
మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసి ఉంటే మీ కారు భద్రంగా ఉండటం కోసం ఇక్కడ ఉన్న విషయాలను తెలుసుకోండి.