హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రమాదాలు, అనారోగ్యం లేదా గాయాల కోసం అయిన ఆసుపత్రి ఖర్చులకు కవరేజీని అందిస్తుంది. ఈ పాలసీలను నెలవారీ, వార్షిక కాలపరిమితులకు పొందొచ్చు లేదా పరిమిత కాలానికి పొందొచ్చు.
మీరు బీమా చేసిన కాలానికి మీకు ఏదైనా ఆసుపత్రి ఖర్చు వస్తే ఆ ఖర్చులను బీమా సంస్థ భరిస్తుంది.
అంతేకాకుండా మీ బీమా పాలసీలో అనేక యాడ్–ఆన్‌లను కూడా పొందొచ్చు. ఈ యాడ్–ఆన్ల వలన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పెరుగుతాయి. వాటిని సవివరంగా కింద పేర్కొనడం జరిగింది.
కానీ తొలుత
ఈ గణాంకాలను బట్టి చూస్తే భవిష్యత్తులో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు అర్థమవుతున్నాయి. ఇటువంటి వ్యాధులకు అయ్యే ఖర్చులను కవర్ చేసేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.
2022 నాటికి భారతదేశం ఆరోగ్య సంరక్షణ మార్కెట్ విలువ $372 బిలియన్ డాలర్లుగా ఉండనుందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో వైద్య ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయో ఇది ప్రతిబింబిస్తుంది.
ఇలా ఖర్చులు పెరుగుతున్న సందర్భంలో హెల్త్ ఇన్సూరెన్స్‌ల ప్రాముఖ్యత పెరిగిపోయింది. పాలసీదారులు చేసే క్రమానుగత ప్రీమియం చెల్లింపులను బట్టి ఈ పాలసీలు హెల్త్ కేర్ ఖర్చుల విషయంలో కాంప్రహెన్సివ్ కవరేజీని అందిస్తాయి.
ముఖ్యమైనది : భారతదేశంలో కరోనా వైరస్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, ప్రతికూలతల గురించి పూర్తిగా తెలుసుకోండి.
అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కవర్ చేస్తాయి. ఏదేమైనా ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులో లేకుంటే.. ఇంతకు ముందే వ్యాధి నిర్ధారణ కాకపోతే క్లెయిమ్స్ కేవలం ఉపేక్షించబడతాయి.
కింది పరిస్థితులలో ఆసుపత్రిలో చేరే ఖర్చులు కూడా ప్రసిద్ధ బీమా సంస్థలచే పొడిగించబడతాయి.
రోగ నిర్ధారణ ఖర్చులు, ఆసుపత్రిలో చేరే ముందు అయ్యే ఖర్చులను, డాక్టర్ ఫీజులను ఈ పాలసీ కవర్ చేస్తుంది.
అంతేకాకుండా మెడికేషన్, సాధారణ చెకప్స్, ఇంజెక్షన్స్ వంటి పోస్ట్ రిలీజ్ ఖర్చులను కూడా చాలా బీమా కంపెనీలు భరిస్తాయి. మీకు పరిహారం మొత్తం అనేది ఒకేసారి పెద్దమొత్తంగా రావొచ్చు లేదా సంబంధిత బిల్లులను సమర్పించడం వల్ల రావొచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఐసీయూ (ICU) పడకల చార్జీలను కూడా కవర్ చేస్తాయి. బీమా చేసిన వ్యక్తి తనకు నచ్చిన రూమ్‌లో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఈ రూమ్ బిల్లులు అన్నీ బీమా కంపెనీకి పంపబడతాయి. నిర్దిష్ట మొత్తంగా లేదా పూర్తి బీమా మొత్తంగా ఇవి పరిగణించబడతాయి.
మానసిక సమస్యలకు ఆసుపత్రిలో చేరినా కూడా ఈ పాలసీలో కవర్ చేయబడుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా మానసిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఈ సౌలభ్యం ద్వారా పాలసీదారులు నిపుణుల సాయం తీసుకుని చక్కని జీవితాన్ని పొందేందుకు సహాయపడుతుంది.
ఊబకాయం సమస్యలతో సర్జరీ చేసుకునే వారి వైద్య ఖర్చులను భరించేందుకు కేవలం కొన్ని బీమా కంపెనీలు మాత్రమే అంగీకరిస్తాయి. అధిక రక్తపోటు, గుండె సమస్యలు, మధుమేహం వంటి సమస్యలకు స్థూలకాయం ఒక కారణం. కాబట్టి ఇది పాలసీదారులు భవిష్యత్‌లో ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉండే ఈ ఫీచర్లు అన్ని వైద్య ఖర్చులను తీర్చడంలో సాయం చేస్తాయి. దీనికి ప్రీమియం చార్జీలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రముఖ బీమా కంపెనీలు అధిక కవరేజ్ రూపంలో ప్రయోజనాలను అందిస్తాయి.
ఆసుపత్రులలోని రూమ్ రెంట్ కూడా ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది. బీమా చేయబడిన వ్యక్తి కోలుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఇటువంటి సందర్భాలలో పంపిణీ చేయబడే మొత్తం అమౌంట్‌ను బీమా కంపెనీ ముందుగా నిర్ణయిస్తుంది.
డయాలసిస్, క్యాటరాక్ట్, ట్రాన్సిలెక్టమీ వంటి డేకేర్ చికిత్సలకు అయ్యే ఖర్చులను చాలా బీమా కంపెనీలు కవర్ చేస్తున్నాయి.
స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంబులెన్స్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఇది మెడికల్ ఎమర్జెన్సీలలో బాగా ఉపయోగపడుతుంది. కొన్ని ప్రీమియం ఆసుపత్రులు పెద్ద మొత్తంగా అంబులెన్స్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. కావున ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
మీ బీమా మొత్తం (సమ్ ఇన్సూర్డ్) వరకు మీరు ఏడాదికి రెండు సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతీసారి తలెత్తే వ్యాధులు, వాటికి చికిత్సలు వేరుగా ఉంటాయి కనుక.
ప్రతీ క్లెయిమ్ చేయని సంవత్సానికి బీమా చేయబడిన వ్యక్తులు డిస్కౌంట్లను పొందుతారు. మీ బీమా విలువ పెరుగుతుంది (ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే). తదుపరి సంవత్సరాల్లో అది వారి ప్రీమియం చార్జీలను తగ్గిస్తుంది లేదా అదనపు బీమా మొత్తం విలువను అందజేస్తుంది.
డైలీ క్యాష్ అలవెన్స్ అనేది కొన్ని సంస్థల ద్వారా అందించబడుతుంది. ఆసుపత్రిలో చేరిన సమయంలో చెల్లింపు నష్టాన్ని పూరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
సున్నా కో–పేమెంట్ అనేది రోగిని ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయకుండా ఉంచుతుంది. చాలా కంపెనీలు బీమా చేయబడిన వ్యక్తి యొక్క బీమా మొత్తం విలువ వరకు ఉన్నంతలో మెడికల్ బిల్లులను కవర్ చేస్తాయి. సున్నా కో–పేమెంట్ రోగి పూర్తి రికవరీ మీద దృష్టి పెట్టేలా చేస్తుంది.
మరింత తెలుసుకోండి.
మన దేశంలో చికిత్స ఖర్చులు అనేవి ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. ఢిల్లీ, ముంబై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ ఖర్చులు మరింత ఎక్కువగా ఉంటాయి.
జోన్ అప్‌గ్రేడ్ ఫెసిలిటీతో zone upgrade మీకు వివిధ నగరాల్లో చికిత్స కోసం అధిక ఆర్థిక కవరేజీని పొందవచ్చు. వివిధ నగరాల్లో ఉండే వైద్య ఖర్చుల ప్రకారం జోన్స్ వర్గీకరించబడ్డాయి. ఎక్కడైతే వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయో అటువంటి హైయ్యర్ జోన్స్‌గా విభజించబడ్డాయి.
ఈ యాడ్ ఆన్ వివిధ జోన్లలోని చికిత్సా ఖర్చుల వ్యత్యాసాన్ని కొంచెం అధిక ప్రీమియంతో లెక్కించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతే కాకుండా మీ మొత్తం ప్రీమియంలో 10–20 శాతం ఆదా అయ్యేలా చేస్తుంది.
*ప్రస్తుతం డిజిట్లో ఎటువంటి జోన్ అప్‌గ్రేడ్ యాడ్ ఆన్ లేదు. మీరు కనుక జోన్ Bలో ఉన్నట్లయితే మీరు ప్రీమియం మీద అదనపు తగ్గింపును పొందుతారు. మా వద్ద ఎటువంటి జోన్ బేస్డ్ కో పేమెంట్ లేదు.
హోమ్ హాస్పిటలైజేషన్‌లో అయిన అన్ని ఖర్చులను కాంప్రహెన్సివ్ హెల్త్ పాలసీ కవర్ చేస్తుంది. ఇందులో మెడికేషన్, నర్సు ఫీజులు, ఇంజెక్షన్లు మొదలయినవి ఉంటాయి. రోగికి సమగ్ర చికిత్స కోసం చెల్లింపులు చేస్తుంది.
అవయవ దానం కోసం అయ్యే అన్ని వైద్యఖర్చులకు క్లెయిమ్స్ చేయొచ్చు.
చాలా బీమా కంపెనీలు పైన పేర్కొన్న నిబంధనలను పాటిస్తాయి. వివిధ రకాల బీమా కంపెనీలు నిర్దిష్ట వయో గ్రూప్ వారికి ప్రత్యేక వ్యాధులకు మాత్రమే అందజేస్తాయి.
ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పేరులో ఉన్న విధంగానే కేవలం ఒకే వ్యక్తికి వర్తిస్తుంది. ఈ కవర్‌ను మీతో పాటు మీ తల్లిదండ్రులు, పిల్లలు, భార్య మొదలయిన వారికి తీసుకోవచ్చు.
ఈ ప్లాన్ కింద ప్రతీవ్యక్తి వేర్వేరు బీమా మొత్తాన్ని పొందుతారు. ఉదాహరణకు మీ బీమా మొత్తం విలువ రూ. 10 లక్షలు అయితే మీ కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ పాలసీ గడువులోగా రూ. 10 లక్షలు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మీరు కనుక ముగ్గురు వ్యక్తుల కోసం రూ. 10 లక్షల బీమా మొత్తంతో ఇండివిజువల్ పాలసీని కొనుగోలు చేస్తే అప్పుడు మొత్తం బీమా మొత్తం విలువ రూ. 30 లక్షలు అవుతుంది.
ఈ పాలసీలో ఉండే సెపరేట్ బీమా మొత్తం వలన మీ కుటుంబ సభ్యులకు ఒకేసారి ఏదైనా జరిగితే ఇది కవర్ చేస్తుంది.
ఇటువంటి పాలసీల్లో ఒక బీమా మొత్తం విలువ కుటుంబంలోని అందరికీ వర్తిస్తుంది. ఈ బీమా మొత్తం విలువ మొత్తం ఒకరికే అయిపోతే అటువంటి సందర్భంలో ఈ పాలసీ మీద ఇంకా ఎటువంటి క్లెయిమ్స్ కవర్ కావు. కావున ఖర్చులు కవర్ చేయబడవు.
వయోవృద్ధులు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌కు అర్హులు కారు. ఎందుకంటే వారి వైద్యపరమైన అవసరాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి.
ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
ఈ ప్లాన్ వృద్ధుల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ప్లాన్‌ను 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే పొందేందుకు అర్హులు. వృద్ధాప్యం వలన వచ్చే చాలా రకాల వ్యాధులకు చికిత్స ఖర్చులను ఈ పాలసీ అందజేస్తుంది.
కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఇటువంటి పాలసీలను తీసుకుంటాయి. ప్రీమియంను కంపెనీ యజమాని చెల్లిస్తాడు. బీమా మొత్తం విలువ రీఫిల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఖర్చుతో కూడుకున్నవి.
మీరు సదరు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నంత కాలం మాత్రమే ఈ పాలసీ ప్రయోజనాలను పొందుతారు. ఒకవేళ మీరు ఉద్యోగం మానేసినా లేదా కంపెనీయే మిమ్మల్ని తీసేసినా కానీ మీరు ఈ ప్రయోజనాలను పొందలేరు.
గర్భదారణ సమయంలో ప్రీ, పోస్ట్ నేటల్ ఖర్చులు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో కవర్ అవుతాయి. పుట్టిన నవజాత శిశువు మొదటి మూడు నెలల మెడికల్ బిల్లులు కూడా కవర్ అవుతాయి. కానీ ఇటువంటి పాలసీలకు రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
మెటర్నటీ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
మీరు తరుచుగా హెల్త్ పాలసీ తీసుకుంటున్నప్పటికీ, మీ చికిత్సల ఖర్చులు అనేవి దినదినం పెరుగుతూ పోతాయి. మీ బీమా మొత్తం విలువ మారకపోయినా చికిత్స ఖర్చులు పెరిగిపోతాయి.
అటువంటి సందర్భాల్లో మరలా మీరు ప్రత్యేకించి పాలసీని కొనుగోలు చేయడానికి బదులుగా టాప్–అప్ను వాడుకోవచ్చు. ఈ టాప్–అప్ పాలసీ మీ బీమా మొత్తం విలువను పెంచుతుంది.
కానీ టాప్–అప్ ప్లాన్ పొందాలంటే మీరు ముందు డిడక్టబుల్ అమౌంట్ ఎంచుకోవాలి. ఉదాహరణకు రూ. 3 లక్షల టాప్–అప్ మీరు ఎంచుకుంటే రూ. 50,000 డిడక్టబుల్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
మీరు క్లెయిమ్ చేసుకున్న సమయంలో ముందుగా డిడక్టబుల్ అమౌంట్ రూ. 50,000 మీ జేబు నుంచి భరించాల్సి ఉంటుంది. డిడక్టబుల్ అమౌంట్ పూర్తయిన తర్వాత బీమా కంపెనీ మిగతా ఖర్చులను రూ. 3 లక్షల వరకు భరిస్తుంది.
ఒక వ్యక్తి తన జీవితంలో చేసే అన్ని రకాల హెల్త్ ఖర్చులను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కవర్ చేస్తాయి. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా ఉండవు. బీమా చేసిన వ్యక్తి జీవితం లేదా మరణం ఆధారంగానే ఆర్థిక కవరేజీని అందిస్తాయి.
భారతదేశంలో ఉన్న వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్‌ల గురించి తెలుసుకోండి.
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది బీమా చేసిన వ్యక్తి అకాల మరణం చెందితే అతని మీద ఆధారపడిన కుటుంబసభ్యులకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. కానీ అదే సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ బీమా చేసుకున్న వారికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.
పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్ |
హెల్త్ ఇన్సూరెన్స్ |
లైఫ్ ఇన్సూరెన్స్ |
లక్ష్యం (ఎయిమ్) |
కొన్ని రకాల వ్యాధులతో నిర్ధారణ అయినపుడు చికిత్సకు అవసరమైన అన్ని రకాల మెడికల్ ఖర్చులను కవర్ చేస్తుంది. |
ఒక వేళ అకాల మరణం సంభవిస్తే కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం |
అమౌంట్ పేయబుల్ |
సమ్ ఇన్సూర్డ్ వరకు |
డెత్ బెనిఫిట్ (ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ప్రీ మెచురిటీ ముగిసిన తర్వాత) మెచురిటీపై ఒకేసారి మొత్తం చెల్లింపు |
ట్యాక్స్ బెనిఫిట్లు |
రూ. 1 లక్ష వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ బెనిఫిట్లు (ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D ప్రకారం) |
సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్లు (ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం) |
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందినట్లయితే మీరు పన్ను ప్రయోజనాలు పొందేందుకు అర్హులవుతారు. ఆదాయపు పన్ను చట్టం–1961లోని సెక్షన్–80D ప్రకారం మీకు ఇది వర్తిస్తుంది. మీరు ఎటువంటి ప్లాన్లకు ఎంత పన్ను మినహాయింపు పొందుతారో కింద వివరించబడింది.
ఎలిజిబులిటీ |
మినహాయింపు పరిమితి |
స్వీయ, కుటుంబ (భార్య, మీ మీద ఆధారపడ్డ పిల్లలు) |
రూ. 25,000 వరకు |
స్వీయ, కుటుంబ + తల్లిదండ్రులు (60 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు) |
(రూ.25,000 + రూ.25,000) = రూ.50,000 వరకు |
స్వీయ, కుటుంబ (పెద్ద వయసున్న వారు 60 సంవత్సరాల కంటే తక్కువ వయసుండాలి) + తల్లిదండ్రులు (60 సంవత్సరాలకు పైబడినవారు) |
(రూ.25,000 + రూ.50,000) = రూ.75,000 వరకు |
స్వీయ, కుటుంబ (పెద్ద సభ్యుడు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుండాలి) + తల్లిదండ్రులు (60 సంవత్సరాలకు పైబడినవారు) |
(రూ.50,000 + రూ.50,000) = రూ.1,00,000 వరకు |
ప్రజలు ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునేముందు కింది అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునే ముందు వయసు, మెడికల్ చరిత్రను చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా బీమా సంస్థ అందించే కవరేజీ ప్రయోజనాలను కూడా పరిశీలించాలి. అలాగే వెయిటింగ్ పీరియడ్‌ను కూడా తనిఖీ చేయాలి.
ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది క్లెయిమ్ అమౌంట్‌కు సంబంధించినది కావున జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎటువంటి అవాంతరాలు లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు మీ ఇన్సూరెన్స్ కంపెనీ కింది షరతులను అనుసరిస్తుంది.
అధిక సంఖ్యలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉంటే నగదు రహిత క్లెయిమ్ బదిలీని నిర్ధారిస్తాయి. చికిత్సలో థర్డ్ పార్టీ ప్రమేయాన్ని తగ్గిస్తాయి. అవాంతరాలు లేని చికిత్సను అందిస్తాయి.
ప్రముఖ బీమా కంపెనీలు ప్రీ–యాన్యువల్ చెకప్స్‌ను వాటి పాలసీదారుల కోసం అందిస్తాయి. ఈ చెకప్స్ వలన వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఏ బీమా పాలసీలలో అయితే జీవితాంతం రెన్యూవబులిటీ ఆప్షన్ ఉంటుందో అటువంటి వాటిని ఎంచుకోండి. ఈ సౌలభ్యం వలన వ్యక్తులు ఎటువంటి పరిస్థితిలో అయినా ఆర్థికంగా భద్రంగా ఉంటారు. కంపెనీలు స్థిరమైన ప్రీమియంలను కలిగి ఉంటాయి.
మీరు ఈ కింది పాయింటర్లను అనుసరించడం వలన మీకు సరిపోయే హెల్త్ పాలసీని ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుంది. నామమాత్రపు ప్రీమియం చార్జీలతో హెల్త్ పాలసీని తీసుకోవడం వలన మీ జీవితంలో హెల్త్ ఖర్చులకు సంబంధించి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఇది చూస్తుంది.
చాలా మంది వ్యక్తులు తమ జీవితంలో ఒకే ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకుంటారు. సమయం ప్రకారం ఆ ప్లాన్‌ను పునరుద్ధరించుకుంటూ ఉంటారు. సరైన ప్లాన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం.