కరోనా వైరస్, వెక్టర్​ (జంతువుల ద్వారా సంక్రమించే) డిసీజెస్ కవర్​ చేయడం ఎందుకు ముఖ్యం?

1
భారతదేశం కోవిడ్-19 వల్ల చాలా ప్రభావితమయింది. (1)
2
ఏటా అనేక మంది ప్రజలు వెక్టర్ డిసీజెస్ (జంతువుల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల)తో సతమతమవుతున్నారు. అంటువ్యాధుల ద్వారా సంక్రమించే వ్యాధులలో ఇవి దాదాపు 17 శాతం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ వ్యాధుల వలన ఏటా దాదాపు 700,000 మంది చనిపోతున్నారు. (2)
3
మలేరియా మహమ్మారి వలన భారతదేశం చాలా ఇబ్బంది పడింది. భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అనేక మంది మలేరియా బారిన పడి పోరాడారు. 2018వ సంవత్సరంలోనే మన దేశంలో 4,29,928 మలేరియా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 96 మంది మలేరియాతో ప్రాణాలు కోల్పోయారు. (3)

కోవిడ్-19, వెక్టర్​ డిసీజెస్​ ను కవర్​ చేసే డిజిట్ హెల్త్​ ఇన్సూరెన్స్​ గొప్పతనం ఏంటి?

  • కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ప్రత్యేక కవర్​:  ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి, వారిని బాగా చూసుకోవాలని ఆలోచిస్తారు. కాబట్టి ఈ ప్లాన్​ ను తీసుకోవడం చాలా మంచిది.
  • రూమ్ రెంట్​ పరిమితి​ లేదు:  ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం వేర్వేరుగా ఉంటుంది. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. అందుకోసమే గది అద్దె, ఐసీయూ (ICU) గది అద్దెపై మేము ఎటువంటి పరిమితులనూ విధించలేదు. ఇక ఇప్పుడు మీకు నచ్చిన రూమ్​ ను ఎంచుకోండి.
  • మీ ఇన్సూరెన్స్​ మొత్తాన్ని కస్టమైజ్​ చేసుకోండి: అందరి అవసరాలు ఒకేలా ఉండవు. అందుకోసమే మీ వ్యక్తిగత అవసరాలను బట్టి ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకునే ఆప్షన్​ను మేము మీకు కల్పిస్తున్నాం.
  • మినిమమ్ వెయిటింగ్​ పీరియడ్​: ఈ పాలసీలో మరో అద్భుతమైన విషయం వెయిటింగ్​ పీరియడ్​. ఈ పాలసీ తీసుకున్న రోజు నుంచి కేవలం 15 రోజుల వెయిటింగ్​ పీరియడ్​ మాత్రమే ఉంటుంది
  •  సింపుల్​, డిజిటల్​ ఫ్రెండ్లీ: ఆన్​లైన్​. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ఈ పాలసీ కూడా కొనుగోలు నుంచి క్లెయిమ్స్​ సెటిల్​మెంట్​ వరకూ మొత్తం ఆన్​లైన్​లోనే ఉంటుంది.

ఈ పాలసీ కింద ఏమేం కవర్​ అవుతాయి?

IRDAI అథారిటీ నిబంధనల ప్రకారం ఈ పాలసీ కవర్​ చేయబడింది. ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 442/IRDAI/HLT/GEN/GOD-SB/2019-20

మీరు కోవిడ్-19, డెంగీ, మలేరియా, ఫైలేరియాసిస్​ (జీవిత కాలంలో ఒకసారి మాత్రమే), కాలా అజర్​, చికెన్​ గున్యా, జపనీస్​ ఎన్సెఫాలిటీస్​ (జపనీస్​ మెదడు వాపు), జికా వైరస్​ వంటి వ్యాధులతో ఆస్పత్రిపాలైతే మీకు ఇన్సూరెన్స్​ వర్తిస్తుంది.

30 రోజుల వరకు ప్రీ-హాస్పిటలైజేషన్​ ఖర్చులు

60 రోజుల వరకు పోస్ట్​ హాస్పిటలైజేషన్ ఖర్చులు కవర్​ అవుతాయి.

రోడ్ అంబులెన్స్​ చార్జీలు (మీరు ఎంచుకున్న SI నుంచి 1 శాతం, రూ. 5,000 పరిమితి మించకుండా)

సెకండ్​ మెడికల్​ ఒపీనియన్​ కవర్​ అవుతుంది.

ఏమేం కవర్​ కావు?

మేము పారదర్శకంగా ఉండేందుకు ఇష్టపడతాం. కావున ఈ పాలసీలో ఏమేం కవర్​ కావనేవి మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. లేకపోతే చివరి నిమిషంలో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

పాలసీ హోల్డర్​కు కోవిడ్-19 పాజిటివ్​ అని తేలినా లేదా ఈ పాలసీలో కవర్​ చేయబడిన ఏడు వెక్టర్​ డిసీజెస్​ వలన ఆస్పత్రిలో చేరినా ఈ పాలసీ వర్తిస్తుంది.

ఈ పాలసీలో కేవలం 15 రోజుల వెయిటింగ్​ పీరియడ్​ మాత్రమే ఉంటుంది. ఆ వెయిటింగ్​ పీరియడ్​లో జబ్బు పడితే పాలసీ వర్తించదు.

పరీక్ష నివేదిక సానుకూలంగా లేనపుడు చికిత్స చేయించుకున్నా కానీ వర్తించదు.

ICMR అధీకృత పరీక్షా కేంద్రాలు, లేదా నేషనల్​ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ, పుణే ద్వారా కోవిడ్-19 పాజిటివ్​ అనే రిపోర్ట్​ను కలిగి ఉండాలి. భారతదేశంలో ఉన్న వేరే ఏ ల్యాబ్​ లో టెస్ట్​ చేయించుకున్నా కానీ అది చెల్లదు.

కేవలం భారతదేశంలో చేయించుకున్న చికిత్సకు మాత్రమే పాలసీ వర్తిస్తుంది. భారతదేశంలో కాకుండా వేరే దేశాల్లో చికిత్స చేయించుకుంటే పాలసీ వర్తించదు.

ప్రీ ఎగ్జిస్టింగ్​ కండిషన్స్​ (ముందుగా తెలిపినా, తెలపకపోయినా కానీ) వర్తించదు.

ఇన్సూరెన్స్​ చేయించుకున్న వ్యక్తులు గత 2 వారాల ముందు నుంచి తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు వంటి వ్యాధులతో బాధపడకూడదు. ఇన్సూరెన్స్ చేయించుకునే వ్యక్తులు డయాబెటీస్, హైపర్ టెన్షన్​, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధులతో బాధపడకూడదు. అంతేకాకుండా క్యాన్సర్​, స్ట్రోక్​ వంటి వ్యాధులు కూడా ఉండకూడదు. ఇటువంటి వ్యాధులకు చికిత్స తీసుకుంటే ఈ పాలసీ కవర్​ కాదు.

ఈ పాలసీలో కోవిడ్-19, ఇతర 7 వెక్టర్​ డిసీజెస్​ వలన ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటే మాత్రమే పాలసీ కవర్​ అవుతుంది.

ఈ పాలసీని తీసుకునేటపుడు పాలసీ హోల్డర్​ కోవిడ్-19 తో లేదా ఇతర వెక్టర్​ డిసీజెస్​తో బాధపడితే వారు చేయించుకున్న చికిత్సకు పాలసీ వర్తించదు.

పాలసీ తీసుకునే సమయంలో పాలసీ హోల్డర్లకు కోవిడ్-19 పాజిటివ్​గా తేలితే ఈ పాలసీ వర్తించదు.

ఇంట్లో చికిత్స చేయించుకుంటే ఈ పాలసీ వర్తించదు.

ఈ పాలసీలో ఏ వెక్టర్​ డిసీజెస్​ కవర్​ అవుతాయి?

ఈ పాలసీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

వెక్టర్​ డిసీజెస్,​ కోవిడ్ హెల్త్​ ఇన్సూరెన్స్​ కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు