ఉద్యోగుల కోసం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్

26,000+

కార్పోరేట్లు కవర్ అయ్యారు

45 Lakh+

జీవితాలు ఇన్సూర్ చేయబడ్డాయి

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ఒకే సంస్థ కింద పనిచేసే వ్యక్తుల సమూహాన్ని కవర్ చేస్తుంది. దీనికి సంస్థ యజమాని ప్రీమియం చెల్లిస్తారు కనుక ఇది తరచుగా ఉద్యోగులకు విలువైన ప్రయోజనంగా అందించబడుతుంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా విస్తరించవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పథకం కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఎంప్లాయి హెల్త్ ఇన్సూరెన్స్‎గా కూడా పేర్కొనబడుతుంది. 

అయితే, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే దీనికి ధర చాలా తక్కువగా ఉంటుంది. పన్ను తగ్గింపుల్లో యజమానులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల ఇది అటు యజమాని, ఇటు ఉద్యోగి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

డిజిట్‎లో అన్ని అస్వస్థతలు, వ్యాధుల నుంచి మీ ఉద్యోగులను కవర్ చేయడం కొరకు కాంప్రహెన్సివ్ ఎంప్లాయి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, కోవిడ్​–19 లాంటి తీవ్రమైన మహమ్మారుల నుంచి మీ ఉద్యోగులు కవర్ అయ్యేలా చూడటం కొరకు కోవిడ్-19 స్పెసిఫిక్ గ్రూప్ కవర్‎ని మేం అందిస్తున్నాం.

డిజిట్ హెల్త్ ప్లస్ పాలసీ (రివిజన్) - GODHLGP21487V032021 (Digit Health Plus Policy (Revision) - GODHLGP21487V032021)

మీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో ఎందుకు సంరక్షించాలి?

ఎంప్లాయి రిటెన్షన్ (ఉద్యోగి నిలుపుదల)ను పెంచడం కోసం- ప్రజలు తమకు భద్రతనిచ్చే ఉద్యోగాలకు విలువ ఇస్తారు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు తగినంత ఆర్థిక భద్రతను ఇవ్వడమే కాకుండా, యజమాని వారి గురించి శ్రద్ధ వహిస్తున్నాడనే సంతృప్తికర భావనను ఇస్తుంది.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థికంగా వారిని సురక్షితంగా ఉంచడానికి- కోవిడ్​ మహమ్మారి కాలంలో ఆర్థిక వ్యవస్థ పతనం కావడం, వివిధ రంగాల్లో ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించడంతో ఆర్థిక భద్రత అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. కోవిడ్​–19 వైరస్ వల్ల అయ్యే చికిత్స ఖర్చుల నుంచి మీ ఉద్యోగులను సంరక్షించడం అనేది వారు ఆర్థికంగా, వైద్యపరంగా సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించుకోవడానికి ఉపయోగకరం.

ఉద్యోగుల్లో ప్రేరణ కల్పించడానికి- సంతోషకరమైన ఉద్యోగులు సంతోషకరమైన వర్క్ స్పేస్‎లను, స్పష్టంగా విజయవంతమైన కంపెనీలను తయారు చేస్తారు! సురక్షితమైన, సంతృప్తి చెందిన ఉద్యోగులు, ఎంతో సంతోషంగా, మరింత ప్రేరణ పొందిన భావనను పొందే అవకాశం ఉంది!

తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల నుంచి వారిని సంరక్షించండానికి- భారతదేశంలో 61% కంటే ఎక్కువ మంది జీవనశైలి సంబంధిత వ్యాధుల వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం, మరణించడం జరుగుతోంది. ఇలాంటి వ్యాధుల నుంచి మీ ఉద్యోగులను సంరక్షించడం; ఈ సమస్యలను కాస్త ముందే నిర్ధారించి, వాటికి ముందే చికిత్స అందించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.

వారి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి- చాలా మంది ఉద్యోగులు తరచూ ఆర్థిక సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఒత్తిడికి గురవుతారు. ఇది వారి పని మీద ప్రభావం చూపించడం వల్ల వారి ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది. మా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ వారి పొదుపును కాపాడటమే కాకుండా సరైన మద్దతుతో వారి మొత్తం మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

డిజిట్ అందించే గ్రూప్​ హెల్త్ ఇన్సూరెన్స్ గొప్పదనం ఏమిటి?

డిజిట్ అందించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‎లో ఏమేం కవర్ అవుతాయి?

ఏమేం కవర్ కావు?

ప్రసూతికి ముందు, అనంతర ఖర్చులు

ప్రసూతికి ముందు, ప్రసూతి అనంతర వైద్య ఖర్చులు, ఉద్యోగి లేదా వారి జీవిత భాగస్వామి ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తే తప్ప.

పీఈడీ (PED) వెయిటింగ్ పీరియడ్

ఒకవేళ ముందే ఏదైనా వ్యాధి ఉన్నట్లయితే, వెయిటింగ్​ పీరియడ్​ ముగియనట్లయితే, ఆ వ్యాధి లేదా అస్వస్థత కొరకు క్లెయిమ్​ చేయలేరు. అయితే, మీరు 50 మందికి పైగా సభ్యులను కవర్ చేయాలని అనుకుంటున్నట్లయితే, పీఈడీ (PED) వెయిటింగ్ పీరియడ్ మినహాయింపు ఉంటుంది.

వైద్యుని సిఫారసు లేకుండా ఆసుపత్రిలో చేరితే

మీ ఉద్యోగి ఆసుపత్రిలో చేరాల్సిన ఏ పరిస్థితికైనా, డాక్టర్ సిఫారసు లేకుండా మీ ఉద్యోగి ఆసుపత్రిలో చేరితే అది కవర్ కాదు.

సింగిల్ కవర్ కోసం మాత్రమే కోవిడ్ చికిత్స

ఒకవేళ మీరు కేవలం కోవిడ్ కవర్‎ని మాత్రమే ఎంచుకుంటున్నట్లయితే, ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ప్రభుత్వ అధీకృత పరీక్షా కేంద్రం నుంచి పాజిటివ్​గా తేలితే మాత్రమే వర్తిస్తుంది.

ప్రాథమిక వెయిటింగ్ పీరియడ్​కు ముందు చేయబడిన క్లెయిములు

కోవిడ్ సంబంధిత క్లెయిముల కొరకు, 15 రోజుల ప్రారంభ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది పూర్తి కావడానికి ముందు చేసిన క్లెయిములు కవర్ చేయబడవు.

డిజిట్ అందించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ముఖ్య ప్రయోజనాలు

ప్రీమియం ఒక్కో ఉద్యోగికి ₹1302 నుండి ప్రారంభం
కో–పేమెంట్ కో–పేమెంట్​కు వయసుతో సంబంధం లేదు
క్యాష్​లెస్ ఆస్పత్రులు భారతదేశ వ్యాప్తంగా 16400+ క్యాష్​లెస్ ఆస్పత్రులు
కొనుగోలు & క్లెయిమ్ ప్రక్రియ పేపర్ లెస్ ప్రక్రియ, డిజిటల్ ఫ్రెండ్లీ
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్
కరోనా వైరస్​కు చికిత్స గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడుతుంది. ప్రత్యేక గ్రూప్ కవర్​లా కూడా ఆఫర్ చేయబడుతుంది.

ఎలా క్లెయిమ్ చేయాలి?

క్లెయిమ్ ఎప్పుడు కావాలన్నా మాకు తెలియజేయండి! 1800-258-4242 పై మాకు కాల్ లేదా healthclaims@godigit.comకి ఈమెయిల్ చేయండి.

క్యాష్ లెస్ క్లెయిమ్ అయితే, మీ ఉద్యోగి చేయాల్సిందల్లా వారికి నచ్చిన నెట్​వర్క్ ఆసుపత్రిని ఎంచుకోవడం, వారి ఈ-హెల్త్ కార్డును చూపించడమే. మిగతాదంతా మేము చూసుకుంటాం. వైద్య ఖర్చుల అంచనాను అందించడం ద్వారా ఉద్యోగి 50% ముందస్తు నగదు ప్రయోజనాన్ని కూడా ఎంచుకోవచ్చు.

ఒకవేళ ఒక ఉద్యోగి మా నెట్​వర్క్​లో భాగం కాని ఆసుపత్రిని ఎంచుకోవాలని అనుకున్నట్లయితే, మెడికల్ బిల్లులు, టెస్ట్ రిపోర్టులు, కన్సల్టేషన్ సమ్మరీ మొదలగు అవసరమైన డాక్యుమెంట్లను అందించడం ద్వారా వారు రీఎంబర్స్​మెంట్​ను ఎంచుకోవచ్చు.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా పనిచేస్తుంది?

  • ఒక కంపెనీ సాధారణంగా తమ ఉద్యోగులను గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో కవర్ చేయడం కోసం సంబంధిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్​ని ఎంచుకుంటుంది. దీని ప్రీమియం సాధారణంగా సంబంధిత కంపెనీ ద్వారా చెల్లించబడుతుంది, హెల్త్ కేర్  ప్రయోజనంలా ఉద్యోగులకు అందించబడుతుంది.
  • కంపెనీలోని ఉద్యోగులందరికీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోబడుతుంది కనుక ప్రాథమిక ప్లాన్, ఇన్సూరెన్స్ మొత్తం కూడా ఉద్యోగులందరికీ ఒకేలా ఉంటుంది. అయితే, ఉద్యోగులు తమ జీవిత భాగస్వామి, పిల్లల వంటి తమపై ఆధారపడిన వారిని జోడించవచ్చు. కొన్ని సందర్భాల్లో, అదనపు ప్రీమియం చెల్లింపుతో వారి తల్లిదండ్రులను కూడా చేర్చవచ్చు. 

ఉద్యోగుల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్దేశ్యం ఏమిటి?

ఉద్యోగుల గురించి శ్రద్ధ వహించే యజమానిగా ఉండండి. పేరులో  సూచించినట్లుగా, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకే గొడుగు కింద పని చేసే వ్యక్తుల సమూహానికి సంబంధించినది.

సాధారణంగా కొత్త స్టార్టన్​లు, పెద్ద సంస్థల ఉద్యోగుల కోసం ఇది కొనుగోలు చేయబడుతుంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కేవలం ఉద్యోగులకు ప్రయోజనాలు అందించడమే కాకుండా, సంస్థకు కూడా ప్రయోజనం అందిస్తుంది.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎవరు కొనుగోలు చేయాలి?

సాధారణంగా, 10 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న ఏదైనా సంస్థ తమ ఉద్యోగులను హెల్త్ ఇన్సూరెన్స్‎తో సంరక్షించాలి. మీకు అవసరమో లేదో ఖచ్చితంగా తెలియకపోతే, మేము మీకు సాయం చేస్తాము.

చిన్న కంపెనీలు & యువ స్టార్టప్​లు

ఒకవేళ మీరు మీ సొంత యువ స్టార్టప్​ను ప్రారంభించి, కనీసం 15 మంది టీమ్ సభ్యులను కలిగి ఉన్నట్లయితే, అప్పుడు మీరు మీ ఉద్యోగులను సంరక్షించడమే కాకుండా, మీ పన్ను పొదుపును ఆదా చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొరకు సైనప్ అవ్వవచ్చు. ఒకవేళ మీరు ఖర్చుల గురించి చాలా ఆందోళన చెందుతున్నట్లయితే, ఆందోళన చెందవద్దు- కంపెనీ యొక్క ఆర్థిక, ఉద్యోగుల బలం ప్రకారం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎లు కస్టమైజ్ చేయబడతాయి.

మీడియం సైజ్ కంపెనీలు & వృద్ధి చెందుతున్న స్టార్టప్​లు

మీ కంపెనీ చిన్నది, కానీ గత కొంతకాలంగా కార్యకలాపాలు సాగిస్తోంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో మీ ఉద్యోగులను సంరక్షించడాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇది మీ ఉద్యోగుల సంతోషం, ప్రేరణను పెంచడానికి మాత్రమే కాకుండా ఆ ప్రేరణను ఎక్కువ కాలం నిలుపుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది.

పెద్ద సంస్థలు, బాగా పేరొందిన స్టార్టప్​లు

పెద్ద, బాగా పేరొందిన స్టార్టప్, ఆర్గనైజేషన్- కావడం వల్ల ఉద్యోగులు తమ ప్యాకేజీలో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలను ఆశిస్తారు. అందువల్ల మీకు 1,000 మంది సభ్యులు లేదా అంతకంటే తక్కువ మంది సభ్యులు ఉన్న కంపెనీ ఉన్నట్లయితే, వారిని, వారి పై ఆధారపడిన వారిని కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్​తో కవర్ చేయాలి. ఇది వారికి భద్రతా భావాన్ని కలిగించడమే కాకుండా, మీ సంస్థ యొక్క సుహృద్భావాన్ని కూడా పెంచుతుంది.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ లాభాలు

తక్కువ ధర ప్రీమియంలు

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వ్యక్తుల గ్రూపుపై పంచబడుతుంది. కాబట్టి, ఇతర హెల్త్ పాలసీల కంటే దీని ప్రీమియం చాలా చవక.

పన్ను ప్రయోజనాలు

భారత ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్​ను తమ ఉద్యోగులకు అందించే కంపెనీలు కొంత పన్నును ఆదా చేసుకోవచ్చు!

కంపెనీకి మంచి పేరు

తమ ఉద్యోగులకు విలువైన ప్రయోజనాలను అందించే సంస్థలు సంతోషకరమైన ఉద్యోగులు, పని వాతావరణాలకు దారితీస్తాయి. ఇది అంతిమంగా పెద్ద, చిన్న ఏ కంపెనీకైనా మంచి సుహృద్భావ వాతావరణానికి దారితీస్తుంది. ప్రతి ఒక్కరూ తమ గురించి ఆలోచించే తమ పాత సంస్థను ప్రేమిస్తారు!

భారతదేశంలో గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు యజమానులు దేనిని చూడాలి?

అర్థవంతమైన ప్రయోజనాలు

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రాథమిక ఉద్దేశ్యం ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడం. ఒక ఉద్యోగి నిజంగా విలువైనదిగా భావించే ప్రయోజనాలు మాత్రమే అర్ధవంతంగా ఉండాలి. అందువల్ల, మీ ఉద్యోగుల కొరకు అత్యుత్తమ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎ని ఎంచుకునేటప్పుడు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎లో ఎలాంటి ప్రయోజనాలు అందించబడాలి? ఉదాహరణకు: కోవిడ్-19 మహమ్మారి వల్ల భారతదేశం ఎంత ప్రభావితమైందో చూస్తే, మీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ దీనిని కవర్ చేసేలా  చూసుకోండి.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం

మొత్తానికి డబ్బు ముఖ్యం! అందుకే, మీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఎంత ఖర్చు అవుతుందనేది మదింపు చేయడం చాలా ముఖ్యం. అలాగే, అది అందించే లేదా అందించని ప్రయోజనాలు కూడా లెక్కలో ఉంటాయి. చవకైన ప్రీమియంల కోసం గుడ్డిగా వెళ్లవద్దు, దానితో వచ్చే ప్రయోజనాలను పోల్చుకోండి.

కమ్యూనికేషన్​ సమర్థత

మీరు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, ప్లాన్ ప్రయోజనాలు మాత్రమే కాదు, మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ప్రభావవంతంగా ప్రతిస్పందిస్తుందనేది కూడా ముఖ్యం. అవసరమైన సమయాల్లో, సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీతో కమ్యూనికేట్ చేయడం, వ్యవహరించడంలో మీ ఉద్యోగులకు ఆహ్లాదకరమైన అనుభవం ఉండేలా మీరు ధ్రువీకరించుకోవాలి. చాలాసార్లు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు థర్డ్ పార్టీలను కూడా మధ్యవర్తిగా ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో, సంబంధిత థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ తగినంత మంచిగా ఉన్నారా లేదా అని మీరు ధ్రువీకరించుకోవాలి.

సర్వీస్ ప్రయోజనాలు

హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, సర్వీస్ గతంలో కంటే ఎక్కువ ముఖ్యమైనది. ఆరోగ్య సంరక్షణ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా, సున్నితత్త్వంతో వ్యవహరించే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు అవసరం. అందువల్ల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎ని నిర్ణయించడానికి ముందు విభిన్న ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు అందిస్తున్న సేవలను మదింపు చేయండి, పోల్చి చూడండి.

భౌగోళిక కవరేజ్

ప్రమాదాలు, అస్వస్థతలు ఎక్కడైనా జరగవచ్చు! అందువల్ల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎ని ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన విషయాల్లో ఒకటి, ఇది మొత్తం దేశాన్ని కవర్ చేస్తుందా లేదా అనేది, ఒకవేళ అలా జరిగినట్లయితే దేశవ్యాప్తంగా ఎన్ని నెట్​వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి, మొదలగునవి పరిగణనలోకి తీసుకోవాలి.

ఉద్యోగుల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

డీఫాల్ట్ హెల్త్ కేర్ ప్రయోజనం

గ్రూప్ హెల్త్ ప్లాన్‎లను అందించే చాలా కంపెనీలు తమ ఉద్యోగి యొక్క వార్షిక ప్రయోజనాల్లో భాగంగా ఉంటాయి; అంటే మీరు ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా, మీ కంపెనీకి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నట్లయితే- ప్రీమియం మీ ద్వారా చెల్లించినా, చెల్లించకపోయినా, మీరు దానిలో కవర్ చేయబడతారు.

ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు

సాధారణంగా, మీరు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకున్నప్పుడు, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని జారీ చేయడానికి, ధ్రువీకరించడానికి ముందు మీ ఇన్సూరెన్స్​ కంపెనీ ముందస్తు వైద్య పరీక్షలను చేపట్టవచ్చు. అయితే, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ విషయంలో ఇది అవసరం లేదు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మీ పాలసీ చెల్లుబాటు అవుతుంది. 

ప్రీమియం ఉండదు

పైన పేర్కొన్నవిధంగా, చాలా మంది యజమానులు సాధారణంగా కంపెనీ అందించే మీ వార్షిక ప్రయోజనాల్లో మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎ని చేర్చుతారు. అంటే మీరు దాని ప్రీమియంకు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ కంపెనీనే మీ కొరకు చెల్లిస్తుంది. అయితే ఇది యజమాని నుండి యజమానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ, మీ యజమాని మీ వద్ద నుండి అదే వసూలు చేసినా లేదా చేయకపోయినా, దాని ప్రీమియం వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ కంటే చాలా తక్కువ.

సరళమైన క్లెయిమ్ ప్రక్రియ

మీ యజమాని సంబంధిత గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎ని ఎంచుకున్నవ్యక్తి కనుక వారు ప్రధానంగా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతుంటారు. అందువల్ల, ఇది ముందుకు, వెనుకకు సంప్రదింపులు జరపడంలో మీ ప్రయత్నాలను తగ్గిస్తుంది. తద్వారా మీ క్లెయిమ్ ప్రక్రియ చాలా సరళంగా మారుతుంది.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ కంటే ఏవిధంగా భిన్నమైనది?

ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్
ఈకేసులో ప్రతి వ్యక్తి నేరుగా ఇన్సూరెన్స్​ కంపెనీ​తో సంప్రదింపులు చేస్తుంటాడు ఈ కేసులో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కంపెనీతో నేరుగా కాంటాక్టులో ఉంటుంది
ప్రతి వ్యక్తి తనకు నచ్చిన సమయంలో పాలసీని రద్దు చేసుకునే హక్కును కలిగి ఉంటాడు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో, కేవలం యజమాని మాత్రమే రద్దు చేసే హక్కును కలిగి ఉంటాడు
వ్యక్తిగత పాలసీ ఒక వ్యక్తి ఎంత కాలం ప్రీమియంలు చెల్లిస్తే అన్ని సంవత్సరాలు కొనసాగుతుంది గ్రూప్ హెల్త్ పాలసీ విషయంలో ఉద్యోగి సదరు కంపెనీలో పని చేస్తున్నంత వరకు కొనసాగుతుంది
వ్యక్తిగత హెల్త్ పాలసీ ప్రాథమికంగా వ్యక్తి వయసు, వైద్య చరిత్ర, ఆరోగ్య పరిస్థితి మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది గ్రూప్ హెల్త్ పాలసీ ప్రాథమికంగా సంస్థ బలం మీద ఆధారపడి ఉంటుంది. అది ఆర్థికంగా, ఉద్యోగుల బలం మీద ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా, ఏదైనా వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్​లో ఇన్సూరెన్స్ కంపెనీ ముంద్తు వైద్య పరీక్షలు చేస్తుంది. దీని ఆధారంగానే పాలసీలు జారీ చేయబడతాయి. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎లో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ముందస్తు వైద్య పరీక్షలు చేయబడవు. ఇది పాలసీలు తిరస్కరించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, గ్రూప్ కరోనా వైరస్ కవర్ మధ్య తేడా

డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ డిజిట్ ఇల్ నెస్ గ్రూప్ ఇన్సూరెన్స్ (కోవిడ్-19)
డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక కాంప్రహెన్సివ్ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది అస్వస్థతలు, వ్యాధులు, ప్రమాదాల వల్ల ఉత్పన్నమయ్యే ఆసుపత్రిలో చేరే ఖర్చుల నుంచి ఒక సంస్థ యొక్క ఉద్యోగులందరినీ కవర్ చేస్తుంది. అదనంగా, డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోవిడ్-19ను కూడా కవర్ చేస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, ప్రీమియం ఖర్చులు, ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక అభద్రతల కారణంగా అనేక వ్యాపారాలు పూర్తి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్​ను ఎంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చని మేము అర్థం చేసుకున్నాము. అయితే, యజమానులు తమ ఉద్యోగులను కనీసం కోవిడ్-19 కోసం కవర్ చేయాలని సిఫారసు చేయబడుతోంది. అందుకే కోవిడ్-19 నుంచి ఉద్యోగులందరికీ అందరికీ అందుబాటులో ఉండే ప్రీమియంతో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‎తో సహాయపడటానికి మేము ప్రత్యేకంగా ఒక కవర్‎ని రూపొందించాం.

భారతదేశంలో ఉద్యోగుల కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‎లో కరోనా వైరస్ కవర్ అవుతుందా?

అవును, కరోనా వైరస్ డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‎లో కవర్ అవుతుంది. అలాగే, ప్రత్యేక కవర్ రూపంలో కూడా అందించబడుతుంది.

డిజిట్ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద వెయిటింగ్ పీరియడ్ ప్రాథమికంగా ఎంత కాలం ఉంటుంది?

ప్రాథమికంగా మా కార్పోరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియడ్ కేవలం 15 రోజులు మాత్రమే. అయితే 50+ సభ్యులను కవర్ చేసే సంస్థలకు దీనిని రద్దు కూడా చేయవచ్చు.

వెయిటింగ్ పీరియడ్ అంటే ఏమిటి?

నిర్ధిష్ట ప్రయోజనాల కోసం క్లెయిములు చేయడం ప్రారంభించడానికి ముందు వేచి ఉండాల్సిన సమయాన్ని వెయిటింగ్ పీరియడ్ తెలియజేస్తుంది.

నా ఉద్యోగుల కోసం నేను గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎప్పుడు కొనుగోలు చేయాలి?

ప్రతి కంపెనీ కనీసం తన ఉద్యోగులకు ప్రాథమిక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్​ను అందించాలని మేము భావిస్తున్నాం. ఒకవేళ మీ సంస్థలో కనీసం 10 మంది సభ్యులు ఉన్నట్లయితే,

వారందరినీ సంరక్షించడం కొరకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పొందడం గురించి మీరు ఆలోచించాలి.

అయితే, ప్రస్తుత పరిస్థితి కారణంగా మీరు అలా చేయలేకపోయినట్లయితే, కరోనా వైరస్ నుంచి మీ ఉద్యోగులను సరసమైన ఖర్చుతో కవర్ చేయడం కొరకు కరోనావైరస్ గ్రూప్ కవర్​ను అయినా మీరు ఎంచుకోవచ్చు.

మా వద్ద కేవలం 10 నుండి 15 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అయినా నేను వారి కోసం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చా?

అవును, మీరు తీసుకోవచ్చు. ఇతర గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగా కాకుండా కనీసం 10 మంది సభ్యులు ఉన్న కంపెనీలకు కూడా మా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

ముందస్తు నగదు ప్రయోజనం అంటే ఏమిటి?

ముందస్తు నగదు ప్రయోజనం అంటే ఇన్సూరెన్స్​ చేయబడిన వ్యక్తి చికిత్స ఖర్చుల అంచనా ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీ అందులో 50%ని నగదు రూపంలో ముందుగా (అడ్వాన్స్) చెల్లిస్తుంది.  తద్వారా వారు ఎల్లప్పుడూ కవర్ చేయబడతారని, వారి చికిత్స ముగిసే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇవ్వవచ్చు. మిగిలిన 50% అంచనా వ్యయాలను చికిత్స తరువాత తిరిగి చెల్లించవచ్చు.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎవరెవరు కవర్ అవుతారు?

ఒక సంస్థలో పని చేస్తున్న 18 సంవత్సరాల పైబడిన, 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులు అందరూ ఆ సంస్థ యొక్క గ్రూప్ హెల్త్ పాలసీ కింద కవర్ కావడానికి అర్హులు. అదనంగా, వారు తమ జీవిత భాగస్వామిని, 3 నెలల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలను కూడా జోడించవచ్చు.

కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కన్నా చవకైనదా?

అవును, సాధారణంగా కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ధరతో వస్తుంది. ఎందుకంటే గ్రూపులోని సభ్యుల అందరి మీద ఇది ఆధారపడుతుంది కాబట్టి.

నా చిన్న వ్యాపారానికి ఉద్యోగుల మెడికల్ ఇన్సూరెన్స్​ను ఎలా పొందవచ్చు?

డిజిట్‎లో పెద్ద, చిన్న వ్యాపారాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్​ని మేము అందిస్తాం. మీ ప్లాన్ ప్రారంభించడానికి, పైన మీ వివరాలను నమోదు చేయండి. కస్టమైజ్డ్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోట్​తో మేము మీ వద్దకు తిరిగి వస్తాం.

నాకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. డిజిట్ యొక్క వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్​కు నా ప్లాన్‎ను పోర్ట్ చేయడం సాధ్యమేనా?

ఇది ప్రధానంగా మీ వద్ద ఉన్న కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీ సంబంధిత యజమాని ద్వారా చెల్లించబడతాయి. మీరు ఆ కంపెనీని విడిచిపెట్టిన తరువాత అవి రద్దు చేయబడతాయి.

అయితే, మీరు చేయగలిగింది వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడం. ఇది వ్యక్తిగతంగా మీరు చెల్లించాల్సిన పన్నును కూడా పొదుపు చేస్తుంది. మీకు అదనపు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందిస్తుంది.

నేను ఒకే సమయంలో కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెండింటినీ కలిగి ఉండవచ్చా?

అవును, పైన పేర్కొన్నవిధంగా మీరు ఖచ్చితంగా కార్పొరేట్ హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెండింటినీ కలిగి ఉండవచ్చు.

ధరల పరంగా ఎంప్లాయర్​ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఎలా ఉంటాయి?

ప్రతీ కంపెనీ విభిన్న ఉద్యోగుల బలంతో (సంఖ్యతో) ఉంటుంది కాబట్టి ఎంప్లాయర్​ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎ల ధర ఒక్కో కంపెనీకి ఒక్కోలా  ఉంటుంది.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?

సంబంధిత గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎లో మీరు కవర్ చేయాలని అనుకుంటున్న ఉద్యోగుల సంఖ్య, వారి వయస్సులు, ప్రాంతం, వారిపై ఆధారపడిన వారి సంఖ్య ఆధారంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించబడుతుంది.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితులు ఏమిటి?

గ్రూప్ హెల్త్​ ఇన్సూరెన్స్​ యజమాని, ఉద్యోగి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, దాని అతిపెద్ద పరిమితుల్లో ఒకటి ఏమిటంటే, ఒక ఉద్యోగికి సంబంధించి, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ ఆవశ్యకతలకు అనుగుణంగా కస్టమైజ్ చేయగల వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎లలా కాకుండా, చాలా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎లు పరిమితంగా, జనరిక్ స్వభావం కలిగి ఉంటాయి. కనుక అన్ని ఆరోగ్య సంరక్షణ అవసరాలను కవర్ చేయడానికి అవి సరిపోకపోవచ్చు.

అయితే దీని కన్నా ఆదర్శవంతమైన మార్గం ఏమిటంటే, ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఒక వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‎ రెండింటినీ కలిగి ఉండటం వల్ల ఆరోగ్య అవసరాలకు ఉపయోగడపడటంతో పాటు పన్ను ప్రయోజనాలు చేకూరతాయి.

డిస్‎క్లైమర్: ఈ డేటాలో డిజిట్ హెల్త్ ప్లస్ పాలసీ (రివిజన్), డిజిట్ ఇల్​నెస్ గ్రూప్​ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడిన సభ్యుల సంఖ్యను 13 సెప్టెంబర్, 2021 వరకు లెక్కలోకి తీసుకోవడం జరిగింది.