గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ఒకే సంస్థ కింద పనిచేసే వ్యక్తుల సమూహాన్ని కవర్ చేస్తుంది. దీనికి సంస్థ యజమాని ప్రీమియం చెల్లిస్తారు కనుక ఇది తరచుగా ఉద్యోగులకు విలువైన ప్రయోజనంగా అందించబడుతుంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా విస్తరించవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పథకం కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఎంప్లాయి హెల్త్ ఇన్సూరెన్స్‌గా కూడా పేర్కొనబడుతుంది.
అయితే, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే దీనికి ధర చాలా తక్కువగా ఉంటుంది. పన్ను తగ్గింపుల్లో యజమానులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల ఇది అటు యజమాని, ఇటు ఉద్యోగి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.
డిజిట్లో అన్ని అస్వస్థతలు, వ్యాధుల నుంచి మీ ఉద్యోగులను కవర్ చేయడం కొరకు కాంప్రహెన్సివ్ ఎంప్లాయి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, కోవిడ్–19 లాంటి తీవ్రమైన మహమ్మారుల నుంచి మీ ఉద్యోగులు కవర్ అయ్యేలా చూడటం కొరకు కోవిడ్-19 స్పెసిఫిక్ గ్రూప్ కవర్ని మేం అందిస్తున్నాం.
డిజిట్ హెల్త్ ప్లస్ పాలసీ (రివిజన్) - GODHLGP21487V032021 (Digit Health Plus Policy (Revision) - GODHLGP21487V032021)
ప్రీమియం |
ఒక్కో ఉద్యోగికి ₹1302 నుండి ప్రారంభం |
కో–పేమెంట్ |
కో–పేమెంట్‌కు వయసుతో సంబంధం లేదు |
క్యాష్‌లెస్ ఆస్పత్రులు |
భారతదేశ వ్యాప్తంగా 16400+ క్యాష్‌లెస్ ఆస్పత్రులు |
కొనుగోలు & క్లెయిమ్ ప్రక్రియ |
పేపర్ లెస్ ప్రక్రియ, డిజిటల్ ఫ్రెండ్లీ |
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ |
సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ |
కరోనా వైరస్‌కు చికిత్స |
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడుతుంది. ప్రత్యేక గ్రూప్ కవర్లా కూడా ఆఫర్ చేయబడుతుంది. |
ఉద్యోగుల గురించి శ్రద్ధ వహించే యజమానిగా ఉండండి. పేరులో సూచించినట్లుగా, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకే గొడుగు కింద పని చేసే వ్యక్తుల సమూహానికి సంబంధించినది.
సాధారణంగా కొత్త స్టార్టన్లు, పెద్ద సంస్థల ఉద్యోగుల కోసం ఇది కొనుగోలు చేయబడుతుంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కేవలం ఉద్యోగులకు ప్రయోజనాలు అందించడమే కాకుండా, సంస్థకు కూడా ప్రయోజనం అందిస్తుంది.
సాధారణంగా, 10 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న ఏదైనా సంస్థ తమ ఉద్యోగులను హెల్త్ ఇన్సూరెన్స్‌తో సంరక్షించాలి. మీకు అవసరమో లేదో ఖచ్చితంగా తెలియకపోతే, మేము మీకు సాయం చేస్తాము.
ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ |
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ |
ఈకేసులో ప్రతి వ్యక్తి నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీతో సంప్రదింపులు చేస్తుంటాడు |
ఈ కేసులో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కంపెనీతో నేరుగా కాంటాక్టులో ఉంటుంది |
ప్రతి వ్యక్తి తనకు నచ్చిన సమయంలో పాలసీని రద్దు చేసుకునే హక్కును కలిగి ఉంటాడు |
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో, కేవలం యజమాని మాత్రమే రద్దు చేసే హక్కును కలిగి ఉంటాడు |
వ్యక్తిగత పాలసీ ఒక వ్యక్తి ఎంత కాలం ప్రీమియంలు చెల్లిస్తే అన్ని సంవత్సరాలు కొనసాగుతుంది |
గ్రూప్ హెల్త్ పాలసీ విషయంలో ఉద్యోగి సదరు కంపెనీలో పని చేస్తున్నంత వరకు కొనసాగుతుంది |
వ్యక్తిగత హెల్త్ పాలసీ ప్రాథమికంగా వ్యక్తి వయసు, వైద్య చరిత్ర, ఆరోగ్య పరిస్థితి మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది |
గ్రూప్ హెల్త్ పాలసీ ప్రాథమికంగా సంస్థ బలం మీద ఆధారపడి ఉంటుంది. అది ఆర్థికంగా, ఉద్యోగుల బలం మీద ఆధారపడి ఉంటుంది. |
సాధారణంగా, ఏదైనా వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ ముంద్తు వైద్య పరీక్షలు చేస్తుంది. దీని ఆధారంగానే పాలసీలు జారీ చేయబడతాయి. |
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ముందస్తు వైద్య పరీక్షలు చేయబడవు. ఇది పాలసీలు తిరస్కరించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. |
డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ |
డిజిట్ ఇల్ నెస్ గ్రూప్ ఇన్సూరెన్స్ (కోవిడ్-19) |
డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక కాంప్రహెన్సివ్ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది అస్వస్థతలు, వ్యాధులు, ప్రమాదాల వల్ల ఉత్పన్నమయ్యే ఆసుపత్రిలో చేరే ఖర్చుల నుంచి ఒక సంస్థ యొక్క ఉద్యోగులందరినీ కవర్ చేస్తుంది. అదనంగా, డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోవిడ్-19ను కూడా కవర్ చేస్తుంది. |
ప్రస్తుత పరిస్థితిని బట్టి, ప్రీమియం ఖర్చులు, ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక అభద్రతల కారణంగా అనేక వ్యాపారాలు పూర్తి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చని మేము అర్థం చేసుకున్నాము. అయితే, యజమానులు తమ ఉద్యోగులను కనీసం కోవిడ్-19 కోసం కవర్ చేయాలని సిఫారసు చేయబడుతోంది. అందుకే కోవిడ్-19 నుంచి ఉద్యోగులందరికీ అందరికీ అందుబాటులో ఉండే ప్రీమియంతో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో సహాయపడటానికి మేము ప్రత్యేకంగా ఒక కవర్ని రూపొందించాం. |
డిస్క్లైమర్: ఈ డేటాలో డిజిట్ హెల్త్ ప్లస్ పాలసీ (రివిజన్), డిజిట్ ఇల్నెస్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడిన సభ్యుల సంఖ్యను 13 సెప్టెంబర్, 2021 వరకు లెక్కలోకి తీసుకోవడం జరిగింది.