మీరు ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నారా? మీ సమాధానం అవును అయితే, మీ కోసం సంతోషిస్తున్నాము. అయితే మీరు భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉంటారని 100% ఖచ్చితంగా అనుకుంటున్నారా? లేదు, మనలో ఎవరూ అలా అనుకోలేరు. మీ కోసం మరియు మీ ప్రియమైన వారి కోసం ప్లాన్ చేసుకోవడం మరియు భవిష్యత్తులో ఒత్తిడి లేకుండా ఉండటం మంచిది.
మీకు ఎక్కడ నుండి ప్రారంభించాలో తెలియదు కదా? చింతించకండి, మేము మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము😊
వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో మీరు ఉత్తమ ప్రయోజనాలను పొందేందుకు రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి మెడిక్లెయిమ్ కలిగి ఉండటం మరియు మరొకటి హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని కలిగి ఉండటం. మీరు సరిగ్గా అంచనా వెయ్యడంలో మీకు సహాయపడేందుకు రెండింటి గురించి మేము మీకు వివరిస్తాము.
మెడిక్లెయిమ్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మీకు నిర్దిష్ట ఆర్థిక రక్షణను అందించే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఆసుపత్రిలో చేరినప్పుడు కింది అన్ని ఖర్చులను ఇది చూసుకుంటుంది;
మెడిక్లెయిమ్లో రెండు రకాలు ఉంటాయి-నగదు రహిత మరియు రీయింబర్స్మెంట్.
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అత్యవసర పరిస్థితుల్లో వైద్య మరియు శస్త్రచికిత్స ఖర్చుల కోసం మీకు పూర్తి కవరేజీని అందించే ఇన్సూరెన్స్ రక్షణ. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే, మీ ఖర్చులను మీరు చెల్లిస్తారు, అది మీ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా తిరిగి చెల్లించబడుతుంది లేదా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా ఆసుపత్రిలో బిల్లును సెటిల్ చేస్తుంది.
రెండూ ఒకేలా అనిపిస్తున్నాయి కదా? అయితే వీరిద్దరి మధ్య ఉన్న తేడాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మెడిక్లెయిమ్ |
హెల్త్ ఇన్సూరెన్స్ |
మెడిక్లెయిమ్ ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే కవరేజీని ఇస్తుంది; అంటే మీరు ఆసుపత్రిలో చేరినట్లయితే మాత్రమే మీరు దీని కోసం క్లెయిమ్ చేయవచ్చు. |
హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం ఆసుపత్రిలో చేరే ఖర్చుల కంటే మరింత ఎక్కువగా కాంప్రహెన్సివ్మైన కవర్ను అందిస్తుంది. ఈ ఖర్చులలో కొన్ని వార్షిక ఆరోగ్య పరీక్షలు, రోజువారీ ఆసుపత్రి నగదు, OPD ఖర్చులు మరియు ఆయుష్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయి. |
మెడిక్లెయిమ్తో యాడ్-ఆన్ కవర్లు ఉండవు. |
క్రిటికల్ ఇల్నెస్ కవర్, మెటర్నిటీ బెనిఫిట్ మరియు ఇన్ఫెర్టిలిటీ కవర్ మొదలైన అనేక యాడ్-ఆన్ల కవర్లు ఉంటాయి. |
మెడిక్లెయిమ్లో హాస్పిటలైజేషన్ కవర్ పరిమితం మరియు రూ. 5 లక్షలకు మించదు. |
హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ విస్తృతమైనది మరియు వయస్సు, నగరం, ఒక ప్లాన్లోని సభ్యుల సంఖ్య మొదలైన వాటి ఆధారంగా నిర్ణయించబడుతుంది. |
మెడిక్లెయిమ్ ఫ్లెక్సిబుల్ గా ఉండదు. |
హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి మరియు కస్టమైజ్ చెయ్యబడతాయి. |
మీ నిర్ణయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది, అవి:
పైన పేర్కొన్న అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని మీకు మరియు మీ ప్రియమైనవారికి ఏది ఉత్తమంగా ఉంటుందో మీకు తెలిస్తే రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవడం కష్టం కాదు. మరియు మీకు మరింత సమాచారం కావాలంటే, సంప్రదించండి! మీకు సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము.
ముఖ్య గమనిక: కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రయోజనాలు & కవర్ చేయబడిన వాటి గురించి మరింత తెలుసుకోండి