డెంటల్‌ కవర్‌తో కూడిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌

Zero Paperwork. Quick Process.

సింపుల్‌గా చెప్పాలంటే, డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అంటే మీకు అవసరమయ్యే డెంటల్‌ చికిత్సల ఖర్చులను కూడా కవర్ చేసే హెల్త్​ ఇన్సూరెన్స్​ అని అర్థం. సాధారణంగా అనేక స్టాండర్డ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్లు డెంటల్​ ట్రీట్​మెంట్​కు ఇన్సూరెన్స్​ను అందించవు. అయితే, డిజిట్‌లో మేము దీన్ని మా డిజిట్ హెల్త్ కేర్ ప్లస్ ప్లాన్‌లో భాగంగా ఉన్న మా ఓపీడీ (OPD) బెనిఫిట్​ కింద కవర్‌ చేస్తాం.

మీకు డెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమవుతుంది?

1

కొత్తకొత్త ఆవిష్కరణలు, ద్రవ్యోల్బణం, ఖరీదైన సెటప్, మెటీరియల్స్​, ల్యాబ్ పని ఉంటుంది కాబట్టి డెంటల్‌ చికిత్సలు సాధారణంగా ఖరీదైనవిగానే ఉంటాయి.

2

భారతదేశంలో మొత్తం హెల్త్‌ కేర్‌ ఖర్చులో ఓపీడీ (OPD) ఖర్చులు దాదాపు 62 శాతం వరకు ఉంటాయి!  (2)

3

ప్రపంచవ్యాప్తంగా 3.9 మిలియన్ల మందికిపైగా ప్రజలు నోటి సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని వరల్డ్​ డెంటల్ ఫెడరేషన్ చెబుతోంది (3)

డెంటల్ ట్రీట్‌మెంట్‌లను కవర్ చేసే డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ గొప్పతనం ఏంటి?

సింపుల్‌ ఆన్‌లైన్ ప్రాసెస్​: డెంటల్‌ ట్రీట్​మెంట్​ను అందించే హెల్త్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడం దగ్గరి నుంచి డెంటల్‌ హెల్త్‌ ఇన్సురెన్స్‌ క్లెయిమ్‌ చేయడం వరకు ప్రతిదీ సరళంగా, డిజిటల్​గా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతుంది. పైగా, మీరు క్లెయిమ్‌ చేసుకునేటప్పుడు ఎలాంటి హార్డ్ కాపీలు కూడా అవసరం ఉండదు!

విపత్కర పరిస్థితుల్లో కూడా కవర్ చేస్తుంది : ప్రతిదీ అనుకోకుండా వస్తుందని మనకు 2020లో తెలిసొచ్చింది! అది కోవిడ్​-19 అయినా లేదా మరే ఇతర వైరస్ అయినా.. ఎలాంటి మహమ్మారిని అయినా ఇది కవర్‌ చేస్తుంది!

వయసు ఆధారిత చెల్లింపు ఉండదు : ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన మా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో డెంటల్​ చికిత్సలు కవర్‌ అవుతాయి. పైగా వయసు ఆధారిత చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు; అంటే క్లెయిమ్‌ సమయంలో మీరు మీ జేబు నుంచి ఏమీ చెల్లించరన్న మాట!

క్యుములేటివ్ బోనస్: మీరు సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయనప్పటికీ మీరు ప్రయోజనం పొందవచ్చు. మీరు క్లెయిమ్‌ చేసుకోని ప్రతీ సంవత్సరానికి వార్షిక, క్యుములేటివ్‌ బోనస్‌లను పొందవచ్చు!

కాంప్లిమెంటరీ వార్షిక హెల్త్‌ చెకప్‌లు: రెగ్యులర్ చెకప్‌లతో డెంటల్‌ కేర్‌ సహా చాలా ఆరోగ్య సమస్యలు నివారించొచ్చని మీకు తెలుసా? ఈ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కాంప్లిమెంటరీ వార్షిక హెల్త్‌ చెకప్‌ల రెన్యువల్‌ బెనిఫిట్‌తో వస్తుంది. కాబట్టి మీరు మీ పూర్తి హెల్త్‌ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని సంతోషంగా ఉండొచ్చు!

మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స పొందండి : క్యాష్​లెస్​ క్లెయిమ్‌ల కోసం లేదా రీయింబర్స్‌మెంట్‌ కోసం దేశంలోని 6400+ మా నెట్‌వర్క్ ఆసుపత్రుల నుంచి ఎంచుకోండి.

OPD కవర్తో కూడిన డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో దంత చికిత్సలతో పాటు ఇంకేం కవర్ అవుతాయి

స్మార్ట్ + OPD

దంత చికిత్సలు

దంత నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కొరకు ఔట్ పేషంట్ డెంటల్ ట్రీట్మెంట్; దంత వైద్యుడి ద్వారా తీసుకుంటే మాత్రమే, X-కిరణాలు, వెలికితీతలు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ మరియు వాటి కోసం సూచించిన మందులు యుక్తవయస్సులో వారికి దంతాల అమరిక కోసం మాత్రమే మేము డబ్బులు చెల్లిస్తాం.

OPD కవరేజెస్

ప్రొఫెషనల్ ఫీజులు

మీకు ఏదైనా అనారోగ్యం ఉందా అని తనిఖీ చేసేందుకు వైద్య నిపుణులకు చెల్లించే పరీక్ష రుసుములు.

రోగనిర్దారణ ఫీజులు

వైద్యపరంగా అవసరమైన ఔట్ పేషంట్ డయాగ్నోస్టిక్ పద్ధతులైన x-రేస్, పాతోలజీ, బ్రెయిన్ మరియు బాడీ స్కాన్స్ (MRI, CT స్కాన్స్) మొదలయినవి... డయాగ్నోస్టిక్ సెంటర్లో చికిత్స కోసం రోగ నిర్దారణ చేసేందుకు ఉపయోగిస్తారు.

సర్జికల్ చికిత్సలు

మెడికల్ ప్రాక్టీషనర్ నిర్వహించే చిన్నపాటి శస్త్రచికిత్సలైన POP, కోసిన చోట కుట్టడం, ప్రమాదాల కొరకు డ్రెస్సింగ్ మరియు జంతువులు కాటుకు సంబంధించిన అవుట్ పేషంట్ విధానాలు.

మందుల ఖర్చులు

మీ వైద్యుడు సూచించిన మందులు.

వినికిడి పరికరాలు

తీవ్రమైన వినికిడి సమస్యలు ఉన్న వారి కోసం వినికిడి పరికరాలు కవర్ చేయబడతాయి.

ఇతర కవరేజెస్

ఆసుపత్రులలో చేరినపుడు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు, కరోనా వైరస్కు కూడా

ఇది అనారోగ్యం, యాక్సిడెంట్ లేదా తీవ్రమైన జబ్బు వల్ల సంభవించే ఆసుపత్రి ఖర్చులను ఇది కవర్ చేస్తుంది. ఇన్సూర్ చేసిన అమౌంట్ ఉన్నంత వరకు ఇది మల్టీపుల్ హాస్పిటలైజేషన్స్ కొరకు ఉపయోగించబడుతుంది.

డే కేర్ ప్రొసీజర్స్

24 గంటల కంటే ఎక్కువగా ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నపుడు మాత్రమే జరిగిన వైద్యఖర్చులకు ఆరోగ్యబీమాలు వర్తిస్తాయి. టెక్నలాజికల్ అభివృద్ధి కారణంగా 24 గంటల కంటే తక్కువగా ఆసుపత్రిలో ఉన్న వారికి అయిన ఖర్చులను కూడా ఇవి కవర్ చేస్తాయి.

ఏజ్ మీద ఆధారపడి కోపేమెంట్స్ లేవు

హెల్త్ పాలసీ క్లెయిమ్ సమయంలో మీరు మీ జేబు నుంచి చెల్లించాల్సిన మొత్తాన్ని కోపేమెంట్ సూచిస్తుంది. మేము అందించే ప్లాన్లలో వయసు మీద ఆధారపడి ఎటువంటి కోపేమెంట్స్ ఉండవు.

ఎటువంటి రూం రెంట్ క్యాపింగ్ లేదు

వేర్వేరు రకాల గదులు వేర్వేరు రకాలుగా అద్దెలు కలిగి ఉంటాయి. ఎలాగైతే హోటల్లో వివిధ చార్జీలు ఉంటాయో అచ్చంగా అలాగే. డిజిట్లో ఉన్న కొన్ని ప్లాన్లు సమ్ ఇన్సూర్డ్ కంటే తక్కువగా ఉన్నంత వరకు గది అద్దె విషయంలో ఎటువంటి పరిమితులు విధించవు.

ICU రూమ్ రెంట్కు ఎటువంటి పరిమితి లేదు

ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్) సీరియస్ పేషంట్ల కొరకు ఉద్దేశించబడింది. ICUలలో కేరింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ సమ్ ఇన్సూర్డ్ కంటే తక్కువ మొత్తం ఉన్నంత వరకు డిజిట్ మీ రూం రెంట్ మీద ఎటువంటి పరిమితిని విధించదు.

క్యుములేటివ్ బోనస్

ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కు రివార్డ్ పొందండి. మీరు సంవత్సరం మొత్తంలో ఎటువంటి క్లెయిమ్ చేయకుండా ఉంటే… కొన్ని రకాల ప్లాన్స్ మీకు తదుపరి సంవత్సరంలో డిస్కౌంట్ అందజేస్తాయి. ఈ డిస్కౌంట్ను క్యుములేటివ్ బోనస్ అని అంటారు.

ప్రతి క్లెయిమ్ ఉచిత సంవత్సరానికి 10% CB (50% వరకు)

రోడ్ అంబులెన్స్ చార్జెస్

రోడ్ అంబులెన్స్ చార్జెస్

కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్స్(ఉచితంగా చేసే హెల్త్ చెకప్స్)

మీ మొత్తం ఆరోగ్యం బాగానే ఉందని మీరు నిర్దారించుకునేందుకు వార్షిక ఆరోగ్య తనిఖీలు చాలా ముఖ్యం. ఇది రెన్యూవల్ బెనిఫిట్. మీకు నచ్చిన ఆసుపత్రిలో వార్షిక పరీక్షలు చేయించుకుంటే ఆ ఖర్చులను తిరిగి చెల్లించేందుకు ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.

పోస్ట్ హాస్పిటలైజేషన్ లంప్సమ్ (ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత పెద్ద మొత్తంలో ఇచ్చే నగదు)

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో ఈ బెనిఫిట్ మీ అన్ని వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. దీనికి ఎటువంటి బిల్లులు అవసరం లేదు. రీయింబర్స్మెంట్ ప్రక్రియ ద్వారా ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకునేందుకు లేదా స్టాండర్ట్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాన్ని ఉపయోగించుకునేదుకు మీరు ఎంచుకోవచ్చు.

సైక్రియాట్రిక్ ఇల్నెస్ (మానసిక సమస్యలు) కవర్

గాయం కారణంగా మానసిక చికిత్స కోసం ఆసుపత్రిలో చేరవలసి వస్తే ఈ ప్రయోజనం కింద కవర్ చేయబడుతుంది. అయితే OPD కన్సల్టేషన్స్ దీని కింద కవర్ కావు.

బారియాట్రిక్(బరువు తగ్గించుకునేందుకు) సర్జరీ

ఈ కవరేజ్ అధిక ఊబకాయం(BMI > 35) వలన వివిధ అవయవాల సమస్యలను ఎదుర్కొంటున్న వారికి సరిగ్గా సరిపోతుంది. అయితే ఊబకాయం అనేది తినే డిజార్డర్స్, హార్మోన్ల వలన లేదా చికిత్స చేయగల పరిస్థితులు ఉంటే అప్పుడు సర్జరీ ఖర్చు కవర్ చేయబడదు.

మీరు ఎంచుకునేందుకు అడిషనల్ కవర్స్

న్యూ బార్న్ బేబీ కవర్‌తో మెటర్నటీ బెనిఫిట్

మీరు రాబోయే రెండేళ్లలో లేదా ఆ తర్వాత బిడ్డను కనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు దీనిని ఎంచుకోవచ్చు. ఇది చైల్డ్ డెలివరీ (వైద్యపరంగా అవసరమైన ఖర్చులు) వంధ్యత్వ ఖర్చులు మరియు కొత్తగా పుట్టిన శిశువుకు 90 రోజుల వరకు ఇది కవరేజీని అందిస్తుంది.

జోన్ అప్‌గ్రేడ్

ప్రతి నగరం జోన్ A, B లేదా Cలోకి వస్తుంది. జోన్ Aలో ఢిల్లీ, ముంబై, జోన్ Bలో బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వంటి నగరాలు ఉన్నాయి. వైద్య ఖర్చులను బట్టి జోన్లను నిర్ణయించారు. జోన్ A నగరాల్లో వైద్య ఖర్చులు అత్యధికంగా ఉంటాయి కాబట్టి ఈ నగరాల్లో ఆరోగ్య బీమా కింద చికిత్స పొందేందుకు ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది. మీరు నివసించే నగరం కాకుండా మిగతా నగరంలో చికిత్స చేయించుకోవాలనుకుంటే మీరు ప్లాన్ను అప్గ్రేడ్ చేసుకోవచ్చు.

Get Quote

కవర్ కానివి ఏంటి?

డెంటల్‌ ట్రీట్‌మెంట్‌ ఇన్సూరెన్స్‌లో కాస్మెటిక్ సర్జరీలు, కట్టుడు పళ్లు, డెంటల్‌ కృత్రిమ తొడుగులు, డెంటల్‌ ఇంప్లాంట్లు, ఆర్థోడాంటిక్స్, ఆర్థోగ్నాతిక్ సర్జరీలు, దవడ అమరిక లేదా టెంపోరోమాండిబ్యులర్ (దవడ) లేదా ఎగువ, దిగువ దవడ ఎముక సర్జరీ, టెంపోరమ్ సర్జరీకి సంబంధించిన ఖర్చులు వర్తించవు. దవడకు తీవ్రమైన గాయం లేదా కేన్సర్‌ తప్ప పైవేవీ వర్తించవు.

ఇవే కాకుండా, కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లు, ఫిజియోథెరపీ, కాస్మెటిక్ ప్రొసీజర్లు, వాకర్స్, బీపీ (BP) మానిటర్లు, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు డైటీషియన్ ఫీజులు, విటమిన్లు, సప్లిమెంట్‌ల వంటి అంబ్యులేటరీ పరికరాలకు అయ్యే ఖర్చులకు ఈ ఓపీడీ (OPD)లో కవర్‌ కావు.

క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు (Reimbursement Claims)- ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల్లోపు 1800-258-4242 ద్వారా మాకు తెలియజేయండి లేదా healthclaims@godigit.comకు ఈ-మెయిల్ చేయండి. మీ హాస్పిటల్ బిల్లులు, సంబంధిత పత్రాలు అప్‌లోడ్ చేసుందుకు వీలుగా లింక్‌ మీకు పంపుతాము.

నగదు రహిత క్లెయిమ్‌లు (Cashless Claims)- నెట్‌వర్క్ ఆసుపత్రిని ఎంచుకోండి. మీరు నెట్‌వర్క్ ఆసుపత్రుల పూర్తి జాబితాను ఇక్కడ తెలుసుకోవచ్చు. హాస్పిటల్ హెల్ప్‌డెస్క్‌లో ఈ-హెల్త్ కార్డును చూపించి, నగదు రహిత రిక్వెస్ట్‌ ఫారమ్‌ను తీసుకోండి. అన్నీ సవ్యంగా ఉంటే, మీ క్లెయిమ్ అప్పటికప్పుడు ప్రాసెస్ అవుతుంది.

మీరు కరోనా వైరస్ కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ICMR - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణే అధీకృత కేంద్రం నుంచి పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ ఉండాలి.

డెంటల్‌ చికిత్సలను కవర్ చేసే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వల్ల ప్రయోజనాలు

మీ డెంటల్‌ ఖర్చులను అదుపులో ఉంచుతుంది.

కొత్తకొత్త ఆవిష్కరణలు, ద్రవ్యోల్బణం, ఖరీదైన సెటప్, మెటీరియల్స్​ ఉంటాయి కాబట్టి డెంటల్‌ చికిత్సలు ఖరీదైనవిగానే ఉంటాయి. డెంటల్​ కవరేజ్​తో కూడిన హెల్త్​ ఇన్సూరెన్స్​ కలిగి ఉంటే మీరు మీ డెంటల్​ చికిత్సల ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు. మీ నోటి సంరక్షణ చూసుకుంటూనే మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు!

మీకు ఎంతో ముఖ్యమైన డెంటల్ హెల్త్ను కాపాడుకునేలా చేస్తుంది!

సాధారణంగా అందరూ తమ డెంటల్​ హెల్త్​ను సరిగా పట్టించుకోరు. దీంతో తీవ్రమైన నోటి సంబంధిత ఆరోగ్య సమస్యల బారిన పడతారు. సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా డెంటిస్టులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే, భారతదేశంలో 67 శాతం మంది ఏదైనా సమస్య వస్తే తప్ప డెంటిస్ట్​లను సంప్రదించడం లేదని వెల్లడైంది. అదే, డెంటల్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ ఉంటే అలా చివరి నిమిషంలో డెంటిస్ట్​ను సంప్రదించాల్సిన అవసరం రాదు. డబ్బు గురించి ఆందోళన చెందకుండా సరైన సమయంలో చికిత్స పొందొచ్చు!

స్టాండర్డ్కు మించిన కవరేజ్ ఉంటుంది.

సాధారణంగా, చాలా వరకు స్టాండర్డ్​ హెల్త్‌ ఇన్సురెన్స్‌ ప్లాన్లు డెంటల్‌ చికిత్సలను కవర్ చేయవు. అయితే డెంటల్​ చికిత్సలు సహా ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన ఈ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా మీరు స్టాండర్డ్​కు మించి కవరేజీని పొందుతారు. ఇది దీని అతిపెద్ద ప్రయోజనం. మీరు స్టాండర్డ్​ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ యొక్క అన్ని ప్రయోజనాలను, డెంటల్‌ చికిత్సలు సహా ఓపీడీ (OPD) ఖర్చులను కవర్ చేసే ప్రయోజనాలు పొందుతారు!

డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో అదనపు ప్రయోజనాలు

పైన పేర్కొన్నట్లుగా, ఈ కేసులో, మీకు అవసరమైన డెంటల్‌ చికిత్సలకు కవరేజ్ ప్రయోజనాన్ని అందించడమే కాకుండా, డే కేర్ ప్రొసీజర్‌ కవరేజ్, కోవిడ్‌ సహా అన్ని ఇతర అనారోగ్యాల కోసం ఆసుపత్రిలో చేరడం వంటి ప్రయోజనాలను కూడా డెంటల్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తుంది. కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్‌లు, రూమ్​ రెంట్​ క్యాపింగ్​ విధించకపోవడం సహా అనేక ఇతర ప్రయోజనాలు పొందొచ్చు.

మీరు అన్ని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లలో లాగే పన్ను ఆదా పొందండి!

ఏదైనా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో ఉత్తమమైన అంశం ఏంటంటే, మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలను పొందడమే కాకుండా, మీరు చెల్లించే హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం ఆధారంగా రూ. 25,000 వరకు వార్షిక పన్ను పొదుపు (ట్యాక్స్​ సేవింగ్) వంటి ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు!

హెల్తీ డెంటల్‌ హైజీన్ ఎలా నిర్ధారించాలి?

మీరు బాల్యం నుంచి దీని గురించి విని ఉండవచ్చు. కానీ ఇప్పటికీ ఇది నిజమని, వింతగా అనిపిస్తోంది కదూ. ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది! నోటి పరిశుభ్రతకు రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం కీలకం. పళ్ల మధ్య దంత ఫలకం లేకుండా ఉండేందుకు అవసరమైనప్పుడు మీరు దారం ద్వారా శుభ్రం (ఫ్లాస్‌) చేసుకోవచ్చు.

ఆరోగ్య నిపుణులు ఇచ్చే అత్యంత సాధారణమైన సిఫార్సుల్లో ఒకటి ఏంటంటే.. మీకు దంత సమస్యలు లేవని మీరు అనుకు, కనీసం సంవత్సరానికి రెండు సార్లు కాకపోయినా ఒకసారైనా మీ డెంటిస్ట్​ను సందర్శించాలి. చాలాసార్లు ఆలస్యం అయ్యేవరకు లోపల ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. పళ్ల​ నొప్పులు చాలా దారుణంగా ఉంటాయి. తరచౌ డెంటల్ చెకప్‌లకు వెళ్లడం వల్ల మీ నోటి ఆరోగ్యం అదుపులో ఉంటుందని గుర్తించండి!

నీరు ఎక్కువగా తాగండి. అవును, ఈ పాతకాలపు అలవాటు మొత్తం మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, దంత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది!

మీకు మధుమేహం ఉన్నట్లయితే, మీ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం మొత్తం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ నోటి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మీరు చిగుళ్ల వ్యాధులకు దూరంగా ఉండేలా చేస్తుంది. ఒకవేళ మీకు చిగుళ్ల వ్యాధి వచ్చేటట్లు అనిపిస్తే వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోండి!

ధూమపానం సహా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి. అవి మీ ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, మీ నోటి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు!

డెంటల్‌ ట్రీట్మెంట్ను కవర్ చేసే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రూట్ కెనాల్ చికిత్సలను కవర్ చేస్తుందా?

అవును, మీ వైద్యుడు అవసరం అని సూచిస్తే, రూట్ కెనాల్ చికిత్సలు కూడా ఈ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కింద కవర్ అవుతాయి.

పళ్లను తొలగించేందుకు డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవర్ అవుతుందా?

అవును, తీవ్రమైన నొప్పి, అసౌకర్యం కారణంగా తరచూ పళ్లను తొలగించాల్సి వస్తుంది. అవి ఈ డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కింద కవర్ అవుతాయి.

డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ డెంటల్‌ ఇంప్లాంట్‌ను కవర్ చేస్తుందా?

లేదు, ఈ డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇంప్లాంట్‌లను కవర్ చేయదు.

బ్రేస్‌ల కోసం డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవర్ అవుతుందా?

అవును, ఈ డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ దంతాల అమరిక (బ్రేస్​)లకు వర్తిస్తుంది. కానీ యుక్త వయసులోని వారికి మాత్రమే.

ఓపీడీ (OPD) అంటే ఏమిటి?

మీరు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని అన్ని చికిత్సలు, మెడికల్‌ ప్రొసీజర్లను ఓపీడీ (OPD) (ఔట్-పేషెంట్ విభాగం)గా పేర్కొంటారు. మీ డాక్టర్ సంప్రదింపులు, డయాగ్నసిస్​ పరీక్షలన్నీ దీని కిందకు వస్తాయి 😊. మీరు ఇక్కడ ఓపీడీ (OPD) ప్రయోజనాల గురించి మరింత చదవవచ్చు.