మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్​గా మారండి

60,000+ భాగస్వాములు డిజిట్‌తో 1000 కోట్ల+ సంపాదించారు.

మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే నిర్ధిష్ట మోటార్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను విక్రయించడం కొరకు ఇన్సూరెన్స్ కంపెనీతో పని చేసే వ్యక్తి. ఒకవేళ మీరు మోటార్ ఏజెంట్ లేదా పివోఎస్​పీ (POSP) అయితే, అన్ని మోటార్ వాహనాల సంబంధిత ఇన్సూరెన్స్ ప్లాన్ల నుంచి తమ అవసరాలకు అనుగుణంగా సరైన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడానికి మీరు కస్టమర్లకు సహాయపడతాయి.

డిజిట్ తో, మీరు కార్, బైక్ (లేదా 2-వీలర్), కమర్షియల్ వెహికల్ పాలసీలను విక్రయించవచ్చు.

మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

కారు, టూ–వీలర్ వాహనాలు, ఆటో లేదా ట్రక్కుల వంటి వాణిజ్యపరమైన వాహనాన్ని కవర్ చేయడానికి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఉపయోగించవచ్చు. అలాగే, భారతదేశంలోని అన్ని వాహనాలకు ఇన్సూరెన్స్​ పాలసీ ఉండటం తప్పనిసరి. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వంటి డ్యామేజీలు, నష్టాలను కవర్ అయ్యేలా ప్రజలు దీనిని కలిగి ఉండటం కూడా ముఖ్యం.

ప్రధానంగా మూడు రకాల మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి - థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, ఓన్ డ్యామేజ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, కాంప్రహెన్సివ్ (లేదా స్టాండర్డ్) మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ.

  • భారతదేశంలో మోటార్ వాహనాల చట్టం ద్వారా థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది లేని వాహనదారులు భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. వారి కారు ఏదైనా థర్డ్ పార్టీ వాహనం, వ్యక్తి లేదా ఆస్తికి డ్యామేజీ కలిగించినట్లయితే తలెత్తే నష్టాల నుండి ఈ పాలసీ మీ జేబును రక్షిస్తుంది.
  • రెండోది ఓన్ డ్యామేజీ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ఒక కస్టమైజ్డ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది తమకు, తమ సొంత వాహనానికి అయ్యే డ్యామేజీలు, నష్టాల నుంచి సంరక్షించడానికి రూపొందించబడింది.
  • చివరగా కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ డ్యామేజీలు, నష్టాలతో పాటు సొంత డ్యామేజీల నుంచి కూడా పూర్తి సంరక్షణను అందిస్తుంది. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యం, మంటలు లేదా దొంగతనం వంటి ఊహించని నష్టాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది.

*డిస్​క్లెయిమర్ - ఏజెంట్ల కొరకు ఎలాంటి నిర్ధిష్ట కేటగిరీ అంటూ ఏమీ లేదు. మీరు సాధారణ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి నమోదు చేసుకుంటే చాలు, అన్ని సాధారణ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను విక్రయించవచ్చు.

భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ రంగం గురించి ఆసక్తికరమైన వాస్తవాలు

1

భారతదేశంలో నాన్​–లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్​లో మోటార్ ఇన్సూరెన్స్ వాటా 39.4% ఉంది. (1)

2

భారత కార్ల ఇన్సూరెన్స్ రంగం విలువ సుమారు రూ. 70,000 కోట్లు. (2)

3

కార్ల ఇన్సూరెన్స్ పరిశ్రమ 2012 నుంచి 11.3% వృద్ధి రేటును నమోదు చేసింది.(3)

డిజిట్​తో మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎందుకు అవ్వాలి?

మీరు మోటార్ ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా ఎందుకు మారాలి, దానికి డిజిట్​నే ఎందుకు ఎంచుకోవాలి అనే వాటి గురించి మరింత తెలుసుకోండి.

నేరుగా డిజిట్​తో కలిసి పని చేస్తారు

మా పీవోఎస్​పీ (POSP) భాగస్వామిగా, మీరు మాతో నేరుగా పనిచేస్తారు. ఇతర మధ్యవర్తులు ఎవరూ ఉండరు. భారతదేశంలో డిజిట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్సూరెన్స్ కంపెనీ. ఆసియాకు చెందిన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ది ఇయర్–2019 ను అందుకున్న అతి పిన్న వయసు కంపెనీగా మేము ఉన్నాం.

ఇన్సూరెన్స్ సులభతరం చేయండి

ఇన్సూరెన్స్​ను సరళతరం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందువల్లనే మా డాక్యుమెంట్లు అన్నీ చాలా సరళంగా ఉంటాయి. వాటిని 15 సంవత్సరాల వయస్సు వారు కూడా వాటిని అర్థం చేసుకోవచ్చు.

బలమైన బ్యాకెండ్​ సపోర్ట్

టెక్నాలజీ మా ప్రధాన పిల్లర్​గా మేము సేవలు మీకు అందిస్తున్నాం. పాలసీలను 24x7 విక్రయించడానికి అనుమతించే అధునాతన వెబ్, మొబైల్ యాప్​ను మేము మీకు అందిస్తున్నాం.

ఫేస్​బుక్​లో 4.8 రేటింగ్

మా కస్టమర్లను సంతృప్తిపరచడాన్ని మేము విశ్వసిస్తాం. అందుకే మా ఫేస్​బుక్ రేటింగ్ 4.8/5 అనేది ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల కన్నా అత్యధికంగా ఉంటుంది.

సూపర్–ఫాస్ట్ గ్రోత్

ఈ స్వల్ప కాలంలో, మోటార్ ఇన్సూరెన్స్ కేటగిరీలో మార్కెట్ వాటాలో (గత త్రైమాసికంలో) 2% కంటే ఎక్కువకు చేరుకున్నాం.

అధిక క్లెయిమ్ సెటిల్​మెంట్ నిష్పత్తి

మేము ప్రైవేట్ కార్లకు అధిక క్లెయిమ్ సెటిల్​మెంట్ నిష్పత్తిని కలిగి ఉన్నాము. ప్రైవేట్ కార్ల కోసం మేము అందుకున్న అన్ని క్లెయిమ్​లలో 96% పరిష్కరించాము.

పేపర్ లెస్ ప్రక్రియ

పాలసీ జారీ చేయడం నుంచి క్లెయిమ్ రిజిస్టర్ చేసుకోవడం వరకు మా అన్ని ప్రక్రియలు పూర్తిగా ఆన్​లైన్​లోనే జరుగుతాయి. మీరు ఎలాంటి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా స్మార్ట్ ఫోన్/కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. కాబట్టి మీరు ఇప్పుడు ఇంటి నుంచైనా లేదా మరెక్కడై నుంచైనా పని చేయవచ్చు!

వేగవంతమైన కమీషన్ సెటిల్​మెంట్

చింతించకండి, మీకు మేమున్నాం! మీ కమీషన్లన్నీ త్వరగా సెటిల్​ చేయబడతాయి. పాలసీ జారీ చేసిన ప్రతీ 15 రోజులకు మీ ఖాతాలో మీ కమీషన్ అమౌంట్​ క్రెడిట్ చేయబడుతుంది.

మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడం ఎలా?

పీవోఎస్​పీ (POSP) సర్టిఫికేషన్ పూర్తి చేయడం అనేది వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి సులభమైన మార్గం. నిర్ధిష్ట ఇన్సూరెన్స్ ఉత్పత్తులను విక్రయించగల ఇన్సూరెన్స్ ఏజెంట్​కు పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) అనే పేరు ఇవ్వబడుతుంది.

పీవోఎస్​పీ (POSP) కావడానికి, ఐఆర్​డీఏఐ (IRDAI) నిర్దేశించిన విధంగా కనీస విద్యార్హతలు  ఉండటంతో పాటు మా శిక్షణను పూర్తి చేసుకోవాలి. డిజిట్ మీ శిక్షణ ప్రక్రియను చూసుకుంటుంది. చింతించకండి!

మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి అర్హతలు ఏమిటి, ఏమేం అవసరం?

కార్ ఇన్సూరెన్స్ ఏజెంట్​గా ఎలా మారాలో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీకు 18 సంవత్సరాలు పైబడిన వారు అయి ఉండాలి. కనీసం 10వ తరగతి వరకు చదువుకొని ఉండాలి. చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు, పాన్ (PAN) కార్డును కలిగి ఉండాలి.

ఐఆర్​డీఏఐ (IRDAI) ద్వారా పేర్కొనబడిన విధంగా 15 గంటల శిక్షణను తప్పనిసరిగా పూర్తి చేయమని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మీరు తెలుసుకోవాల్సిన ప్రతిదీ నేర్చుకోవడానికి మేము మీకు సహాయం చేస్తామని మాటిస్తున్నాము!

ఎవరు మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కాగలరు?

మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి  ఏకైక ఆవశ్యకత ఏమిటంటే, అభ్యర్థికి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండటం, 10వ తరగతి పూర్తి చేసి ఉండటం.

అంటే ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించే ఆప్టిట్యూడ్ ఉన్న ఎవరైనా పీవోఎస్​పీ (POSP) ఏజెంట్ కావొచ్చు. దీనిలో కాలేజీ విద్యార్థులు, ఇంట్లోనే ఉండే జీవిత భాగస్వాములు, పదవీ విరమణ పొందిన వారు, వ్యాపారవేత్తలు/మహిళలు ఉంటారు.

డిజిట్​తో మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్/ పీవోఎస్​పీ (POSP)గా ఎలా మారాలి?

స్టెప్ 1

పైన ఇవ్వబడిన మా పీవోఎస్​ (POSP) ఫారాన్ని నింపి సైనప్ చేయండి. అందేలె అన్ని వివరాలను నింపండి. అలాగే, అవసరమైన డాక్యుమెంట్లను అప్​లోడ్ చేయండి.

స్టెప్ 2

మాతో కలిసి మీ 15-గంటల శిక్షణను పూర్తి చేయండి

స్టెప్ 3

సిఫారసు చేయబడిన పరీక్షను పూర్తి చేయండి.

స్టెప్ 4

మాతో ఒప్పందంపై సంతకం చేయండి, అంతే! మీరు సర్టిఫైడ్ పీవోఎస్​పీ (POSP) అవుతారు.

మీరు ఎంత సంపాదించగలరు?

 

ఇన్సూరెన్స్ ఏజెంట్​గా మీ ఆదాయం మీరు విక్రయించే పాలసీల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మీరు విక్రయించే పాలసీల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది. మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కార్, బైక్, కమర్షియల్ వాహనాల సంబంధిత ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించవచ్చు.

అంటే మీరు కాంప్రహెన్సివ్, స్టాండలోన్ పాలసీలు రెండింటినీ కస్టమర్లకు విక్రయించవచ్చు. దీని కొరకు కమిషన్ విధానం కింద ఇవ్వబడింది:

పాలసీ, వాహనం రకం వాహనం వయసు కమిషన్ యొక్క గరిష్ట రేటు
కాంప్రహెన్సివ్ పాలసీ - నాలుగు చక్రాల వాహనాలు, ఇతర రకాల ప్రైవేటు లేదా వాణిజ్యపరమైన వాహనాలు 1-3 సంవత్సరాల వయస్సు సొంత డ్యామేజీ ప్రీమియంలో 15%
కాంప్రహెన్సివ్ పాలసీ – టూ వీలర్లు 1-3 సంవత్సరాల వయస్సు సొంత డ్యామేజీ ప్రీమియంలో 17.5%
కాంప్రహెన్సివ్ పాలసీ - నాలుగు చక్రాల వాహనాలు, ఇతర రకాల ప్రైవేటు లేదా వాణిజ్యపరమైన వాహనాలు 4 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ 1సొంత డ్యామేజీ ప్రీమియంలో 15% + థర్డ్ పార్టీ ప్రీమియంలో 2.5%
కాంప్రహెన్సివ్ పాలసీ – టూ వీలర్లు 4 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ సొంత డ్యామేజీ ప్రీమియంలో 17.5% + థర్డ్ పార్టీ ప్రీమియంలో 2.5%
స్టాండలోన్ థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ - అన్ని రకాల వాహనాలు ఏ వయసైనా ప్రీమియంలో 2.5%

నేను మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్​గా ఎందుకు మారాలి?

మీకు మీరే బాస్ అవ్వండి

పీవోఎస్​పీ (POSP) గా ఉండటం యొక్క ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి మీ సౌకర్యానికి అనుగుణంగా పనిచేసే స్వేచ్ఛ. మీరు ఇప్పుడు మీ సొంత బాస్ కావచ్చు!

సమయ పరిమితులు లేవు!

మీరు పూర్తిసమయం లేదా పార్ట్ టైమ్ పని చేయాలనుకుంటున్నారా లేదా అని మీరు నిర్ణయించుకోవచ్చు. తదనుగుణంగా మీ సొంత పని గంటలను రూపొందించుకోవచ్చు.

వర్క్ ఫ్రం హోం

డిజిట్ ఇన్సూరెన్స్​లో మేము ప్రధానంగా ఇన్సూరెన్స్ పాలసీలను ఆన్​లైన్​లో విక్రయిస్తాం. అంటే పీవోఎస్​పీ (POSP)గా మీరు ఇంటి నుంచే పని చేయవచ్చు. పాలసీలను విక్రయించడానికి, జారీ చేయడానికి మా ఆన్​లైన్ ప్రక్రియలను ఉపయోగించుకోవచ్చు.

కేవలం 15 గంటల శిక్షణ

పీవోఎస్​పీ (POSP) గా సర్టిఫై చేయడం కొరకు ఐఆర్​డీఏఐ (IRDAI) ద్వారా అందించబడే 15 గంటల తప్పనిసరి శిక్షణను పూర్తి చేయడం ప్రధానం. నిజం చెప్పాలంటే ఇది పెద్దదేమీ కాదు! ఆన్–బోర్డ్ అవడానికి మీకు 15 గంటల పెట్టుబడి మాత్రమే పడుతుంది!

ఎక్కువ సంపాదించుకునే అవకాశం

మీ సంపాదన మీరు పని చేసిన గంటల సంఖ్యపై ఆధారపడదు. మీరు జారీ చేసే పాలసీల సంఖ్యపై ఆధారపడుతుంది. దీని గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, పైన మా ఇన్​కం క్యాలుక్యులేటర్​ను చూడండి. విక్రయించిన ప్రతి పాలసీతో మీరు ఎంత సంపాదించగలరో తెలుసుకోండి.

సున్నా పెట్టుబడి

మీరు పీవోఎస్​పీ (POSP) కావడానికి స్మార్ట్ ఫోన్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్, అవసరమైన 15 గంటల శిక్షణ తప్ప మరేమీ అవసరం లేదు. కాబట్టి మీ వైపు నుంచి ఎలాంటి డబ్బు పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం లేదు. అయితే, సంపాదించుకునే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంటుంది.

తరచూ అడిగే ప్రశ్నలు

పీవోఎస్​ (POSP) ఏజెంట్ కావడానికి ప్రమాణాలు ఏమిటి?

ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ కావాలనుకుంటే, మీకు 18 సంవత్సరాల వయస్సు దాటి ఉండాలి. కనీసం 10వ తరగతి వరకు చదువుకుని ఉండాలి. చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు, పాన్ (PAN) కార్డును కలిగి ఉండాలి.

నేను ఏ ఏ డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది?

రిజిస్ట్రేషన్ సమయంలో మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్లలో 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణులైన సర్టిఫికెట్, మీ పాన్ (PAN) కార్డు కాపీ, ఆధార్ కార్డు (ముందు, వెనుక భాగాలు), క్యాన్సెల్ చేయబడిన చెక్కు (దానిపై మీ పేరు ఉండాలి), ఫొటోగ్రాఫ్ ఉంటాయి.

పాన్ కార్డు హోల్డర్, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఒక్కరే ఉండాలా?

అవును, చెల్లించిన అన్ని కమీషన్లు టీడీఎస్​ (TDS) కు లోబడి ఉంటాయి. మీ పాన్ (PAN) కార్డు ఆధారంగా ఆదాయపు పన్ను శాఖకు టీడీఎస్​ (TDS) క్రెడిట్ చేయబడుతుంది.

మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను నేను ఎప్పుడు విక్రయించడం ప్రారంభించగలను?

మీరు మాతో రిజిస్టర్ చేసుకున్న వెంటనే, మీరు పీవోఎస్​పీ (POSP) పరీక్ష కొరకు మీ శిక్షణ ప్రారంభించవచ్చు. పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన తరువాత, మీరు ఈ–సర్టిఫికెట్ అందుకుంటారు. ఇక్కడితో పీవోఎస్​పీ (POSP) ఏజెంట్​గా ఇన్సూరెన్స్ అమ్మడం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లే.

పీవోఎస్​పీ (POSP) వ్యక్తిగా సర్టిఫికెట్ పొందడానికి శిక్షణ పొందడం తప్పనిసరా?

అవును, పీవోఎస్​ (POSP) కావడానికి మీరు శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇన్సూరెన్స్ ప్రాథమికాంశాలు, పాలసీ రకాలు, జారీ ప్రక్రియ, క్లెయిమ్​లు, నియమ నిబంధనలు మొదలైన అంశాలు ఉంటాయి.

నేను డిజిట్​తో పార్ట్​నర్ అయితే నాకు ఎటువంటి సపోర్ట్ సేవలు లభిస్తాయి?

డిజిట్ పార్ట్​నర్లు అందరికీ ఒక రిలేషన్​షిప్ మేనేజర్ కేటాయించబడతారు. ఆయన మీకు మార్గదర్శనం చేస్తారు. డిజిట్ ఫ్లాట్​ఫాంపై విక్రయించిన పాలసీలపై ఏజెంట్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. ఏజెంట్లు ఏదైనా సాయం కొరకు partner@godigit.com పై మాకు ఈమెయిల్ చేసి కస్టమర్ సపోర్ట్ టీమ్​ను కూడా సంప్రదించవచ్చు.

పీవోఎస్​ (POSP) సర్టిఫికేషన్ పూర్తి చేసిన తరువాత నా పరిజ్ఞానాన్ని నేను ఎలా పెంపొందించుకోగలను?

సర్టిఫికేషన్ తరువాత మా పీవోఎస్​పీ (POSP)ల కోసం మరో విస్తృతమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఇది మీ ఇన్సూరెన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, మీ అమ్మకాలు, సర్వీసింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ శిక్షణా కార్యక్రమాలు, ఈవెంట్లు దిగువ పేర్కొన్నవాటిని కవర్ చేస్తాయి:

  • సంక్లిష్టమైన కేసులను హ్యాండిల్ చేయడం కొరకు అవసరమైన అత్యాధునిక ఇన్సూరెన్స్ పరిజ్ఞానం
  • తాజా ఇన్సూరెన్స్ ఉత్పత్తులతో, వాటిని ఎలా పిచ్ చేయాలనే దాని గురించి
  • మీ అమ్మకాల పరిమాణాలను పెంచడంలో సహాయపడే వివిధ అమ్మకపు పద్ధతులను నేర్చుకోవడానికి సరదా, ఆసక్తికరమైన మార్గాలు

మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి నాకు సేల్స్ అనుభవం అవసరమా?

సేల్స్ అనుభవం ఖచ్చితంగా ఒక ప్రయోజనం. అయితే, మీకు ఏ అనుభవమూ లేనప్పటికి కూడా మీరు దరఖాస్తు చేయవచ్చు. ఈ రంగంలో మీ కెరీర్​ను పొందవచ్చు.

For list of Corporate & Individual Agents,  click here.