మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారండి
Work
in spare time
Earn
side income
FREE
training by Digit
మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఎవరు?
భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ రంగం గురించి ఆసక్తికరమైన వాస్తవాలు
డిజిట్‌తో మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎందుకు అవ్వాలి?
మీరు మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఎందుకు మారాలి, దానికి డిజిట్నే ఎందుకు ఎంచుకోవాలి అనే వాటి గురించి మరింత తెలుసుకోండి.
మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడం ఎలా?
పీవోఎస్‌పీ (POSP) సర్టిఫికేషన్ పూర్తి చేయడం అనేది వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి సులభమైన మార్గం. నిర్ధిష్ట ఇన్సూరెన్స్ ఉత్పత్తులను విక్రయించగల ఇన్సూరెన్స్ ఏజెంట్‌కు పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) అనే పేరు ఇవ్వబడుతుంది.
పీవోఎస్‌పీ (POSP) కావడానికి, ఐఆర్డీఏఐ (IRDAI) నిర్దేశించిన విధంగా కనీస విద్యార్హతలు ఉండటంతో పాటు మా శిక్షణను పూర్తి చేసుకోవాలి. డిజిట్ మీ శిక్షణ ప్రక్రియను చూసుకుంటుంది. చింతించకండి!
మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి అర్హతలు ఏమిటి, ఏమేం అవసరం?
కార్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఎలా మారాలో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీకు 18 సంవత్సరాలు పైబడిన వారు అయి ఉండాలి. కనీసం 10వ తరగతి వరకు చదువుకొని ఉండాలి. చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు, పాన్ (PAN) కార్డును కలిగి ఉండాలి.
ఐఆర్డీఏఐ (IRDAI) ద్వారా పేర్కొనబడిన విధంగా 15 గంటల శిక్షణను తప్పనిసరిగా పూర్తి చేయమని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మీరు తెలుసుకోవాల్సిన ప్రతిదీ నేర్చుకోవడానికి మేము మీకు సహాయం చేస్తామని మాటిస్తున్నాము!
ఎవరు మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కాగలరు?
మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి ఏకైక ఆవశ్యకత ఏమిటంటే, అభ్యర్థికి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండటం, 10వ తరగతి పూర్తి చేసి ఉండటం.
అంటే ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించే ఆప్టిట్యూడ్ ఉన్న ఎవరైనా పీవోఎస్‌పీ (POSP) ఏజెంట్ కావొచ్చు. దీనిలో కాలేజీ విద్యార్థులు, ఇంట్లోనే ఉండే జీవిత భాగస్వాములు, పదవీ విరమణ పొందిన వారు, వ్యాపారవేత్తలు/మహిళలు ఉంటారు.
డిజిట్‌తో మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్/ పీవోఎస్‌పీ (POSP)గా ఎలా మారాలి?
స్టెప్ 1
పైన ఇవ్వబడిన మా పీవోఎస్ (POSP) ఫారాన్ని నింపి సైనప్ చేయండి. అందేలె అన్ని వివరాలను నింపండి. అలాగే, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
స్టెప్ 2
మాతో కలిసి మీ 15-గంటల శిక్షణను పూర్తి చేయండి
స్టెప్ 3
సిఫారసు చేయబడిన పరీక్షను పూర్తి చేయండి.
స్టెప్ 4
మాతో ఒప్పందంపై సంతకం చేయండి, అంతే! మీరు సర్టిఫైడ్ పీవోఎస్‌పీ (POSP) అవుతారు.
మీరు ఎంత సంపాదించగలరు?
ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మీ ఆదాయం మీరు విక్రయించే పాలసీల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మీరు విక్రయించే పాలసీల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది. మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కార్, బైక్, కమర్షియల్ వాహనాల సంబంధిత ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించవచ్చు.
అంటే మీరు కాంప్రహెన్సివ్, స్టాండలోన్ పాలసీలు రెండింటినీ కస్టమర్లకు విక్రయించవచ్చు. దీని కొరకు కమిషన్ విధానం కింద ఇవ్వబడింది:
పాలసీ, వాహనం రకం |
వాహనం వయసు |
కమిషన్ యొక్క గరిష్ట రేటు |
కాంప్రహెన్సివ్ పాలసీ - నాలుగు చక్రాల వాహనాలు, ఇతర రకాల ప్రైవేటు లేదా వాణిజ్యపరమైన వాహనాలు |
1-3 సంవత్సరాల వయస్సు |
సొంత డ్యామేజీ ప్రీమియంలో 15% |
కాంప్రహెన్సివ్ పాలసీ – టూ వీలర్లు |
1-3 సంవత్సరాల వయస్సు |
సొంత డ్యామేజీ ప్రీమియంలో 17.5% |
కాంప్రహెన్సివ్ పాలసీ - నాలుగు చక్రాల వాహనాలు, ఇతర రకాల ప్రైవేటు లేదా వాణిజ్యపరమైన వాహనాలు |
4 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ |
1సొంత డ్యామేజీ ప్రీమియంలో 15% + థర్డ్ పార్టీ ప్రీమియంలో 2.5% |
కాంప్రహెన్సివ్ పాలసీ – టూ వీలర్లు |
4 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ |
సొంత డ్యామేజీ ప్రీమియంలో 17.5% + థర్డ్ పార్టీ ప్రీమియంలో 2.5% |
స్టాండలోన్ థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ - అన్ని రకాల వాహనాలు |
ఏ వయసైనా |
ప్రీమియంలో 2.5% |
నేను మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఎందుకు మారాలి?
తరచూ అడిగే ప్రశ్నలు