బిల్డింగ్ ఇన్సూరెన్స్ మీ ఇల్లు, దుకాణం మరియు వ్యాపారం కోసం
జీరో పేపర్‌వర్క్. ఆన్‌లైన్ ప్రక్రియ

కమర్షియల్ బిల్డింగ్ కానీ లేదా మీరు నివసిస్తున్న అపార్ట్​మెంట్​ను కానీ కాపాడాలని అనుకుంటున్నారా? అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి విపత్తుల వంటి అనుకోని సందర్భాల్లో మీ ఇంటిని బిల్డింగ్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేది ఒక కస్టమైజ్​ చేయబడిన బీమా.

బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమో తెలియదా?

అయితే, ఇక్కడ పూర్తిగా చదవండి..

1

2021లో ఇండియాలో 1.6 మిలియన్ల అగ్ని ప్రమాదాలు రికార్డ్ అయ్యాయి. (1)

2

ఇండియాలో 64% శాతం మంది ప్రజలు హోం సేఫ్టీని హ్యాండిల్ చేసేందుకు సిద్ధంగా లేరు. (2)

3

వ్యాపారాలు కొనసాగించేందుకు మరియు ఆపరేషన్స్ నిర్వహించేందుకు అగ్ని ప్రమాదాలు పెద్ద ఆటంకంగా మారాయి. ఇది మూడో అతి పెద్ద రిస్క్​గా గుర్తింపు పొందింది. (3)

4

ఇండియాలో జరిగే 70% దొంగతనాలు ఇళ్లలోనే జరుగుతున్నాయి. (4)

డిజిట్ అందించే బిల్డింగ్ ఇన్సూరెన్స్​లో గొప్పతనం ఏమిటి?

డబ్బుకు విలువ : భవనాన్ని కవర్ చేసేందుకు బీమా అంటే చాలా ఖరీదైన విషయంలా అనిపించొచ్చు. కానీ మా పాలసీలు పూర్తిగా డిజిటల్ ఫ్రెండ్లీ, మా ధరలు చాలా తక్కువగా ఉండి.. ప్రీమియంలు కూడా తక్కువ​గా ఉంటాయి. మీరు ఊహించిన దానికంటే తక్కువ ధరకు పాలసీలు అందుతాయి.

డిజిటల్ ఫ్రెండ్లీ : డిజిట్ ఇండియా మొట్టమొదటి ఆన్​లైన్ బీమా సంస్థగా నిలిచింది. మా వద్ద చాలా రకాల పనులు ఆన్​లైన్​లోనే పూర్తవుతాయి. బిల్డింగ్ ఇన్సూరెన్స్ కొనుగోలు నుంచి క్లెయిమ్స్ లేవనెత్తడం వరకు ఇలా ప్రతీ ఒక్కటి ఆన్​లైన్​లోనే ఉంటుంది. క్లెయిమ్స్ కోసం తనిఖీ అవసరమైనపుడు కూడా ఆన్​లైన్​లోనే పూర్తి చేయొచ్చు. కానీ ఐఆర్​డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం రూ. 1 లక్ష కంటే ఎక్కువ విలువ గల క్లెయిమ్స్ కోసం మాన్యువల్​గా తనిఖీ చేయడం తప్పనిసరి.

అన్ని వ్యాపార కేటగిరీలను కవర్ చేస్తుంది : మీరు మీ కార్యాలయ భవనాలను లేదా మీ దుకాణాలను కవర్ చేయాలని చూస్తున్నా కానీ మేము అన్ని రకాల వ్యాపార కేటగిరీలను కవర్ చేస్తాం.

అద్దెకు ఉండేవారి కోసం ప్లాన్స్ : నేటి రోజుల్లో చాలా మంది అద్దె నివాసాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. అందుకోసం వారికి మొత్తం బిల్డింగ్ ఇన్సూరెన్స్ సబబుగా అనిపించకపోవచ్చు. అందుకే మేము వారికోసం కస్టమైజ్డ్ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకొచ్చాం. అద్దె అపార్ట్​మెంట్ల​లో ఉన్న వారి వస్తువులను మాత్రమే ఇది కవర్ చేస్తుంది.

డిజిట్ అందించే బిల్డింగ్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు

డిజిట్​లో మేము అందించే ఇన్సూరెన్స్ మీ బిల్డింగ్స్​ను అగ్నిప్రమాదాలు, మరియు సహజ విపత్తులైన వరదలు, భూకంపాల నుంచి కాపాడుతాయి. గో డిజిట్ భారత్​ లఘు ఉద్యమ్ సురక్ష, గో డిజిట్ భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, గో డిజిట్ భారత్ గృహ రక్ష వంటి పాలసీలు ఉన్నాయి. ఏదేమైనా కానీ భవనాలు దొంగతనాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకోసమే మేము దొంగతనాల వల్ల కలిగే నష్టాలను కవర్ చేసేందుకు బర్గ్​లరీ ఇన్సూరెన్స్​ను అందిస్తున్నాం. ఈ విధంగా మీ భవనం అగ్ని ప్రమాదాలు మరియు సహజ విపత్తులైన భూకంపాలు, వరదల వల్ల సంభవించే నష్టాల నుంచి కాపాడటమే కాకుండా దోపిడీ వల్ల కలిగే నష్టాల నుంచి కూడా మీ భవనాలు సురక్షితంగా ఉంటాయి. మీ కోసం వీటిని సులభతరం చేసేందుకు మేము ఈ కింది విధంగా కవరేజ్ ఎంపికలను అందిస్తున్నాం. 

ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3
మీ ఇల్లు లేదా వ్యాపార సముదాయంలో ఉన్న కంటెంట్స్​ను మాత్రమే కవర్ చేస్తుంది. మీ బిల్డింగ్ మరియు మీ ఇంటిలో లేదా వ్యాపార సముదాయంలో ఉన్న కంటెంట్స్​ను కూడా కవర్ చేస్తుంది. కేవలం మీ బిల్డింగ్​ను మాత్రమే కవర్ చేస్తుంది.

బిల్డింగ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

  • కంటెంట్ – బిల్డింగ్ ఇన్సూరెన్స్​లో అసలు కంటెంట్​ అనేది ఏం సూచిస్తుందని మీరు కన్య్పూజ్ అయితే మీరు ఇన్సూర్ చేసిన బిల్డింగ్ ప్రాంగణంలో ఉండే వస్తువులను ఇది సూచిస్తుంది. శాశ్వతంగా మీ ప్రాంగణానికి అటాచ్ అయి లేని వస్తువులను ఇది సూచిస్తుంది. ఉదాహరణకు: మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగి మీ ల్యాప్​టాప్ దొంగిలించబడినట్లయితే మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్​ కంటెంట్స్​లో ల్యాప్​టాప్ కూడా కవర్ అవుతుంది. 
  • భవనం/స్ట్రక్చర్ – బిల్డింగ్ ఇన్సూరెన్స్​లోని బిల్డింగ్ లేదా స్ట్రక్చర్ అనేది మీరు కవర్ చేయాలనుకుంటున్న మొత్తం ఆస్తిని సూచిస్తుంది. ఉదాహరణకు మీరు మీ కుటుంబం సొంత భవనాన్ని సంరక్షించాలని అనుకుంటే... మీ మొత్తం భవనంగా ఒక భవనంగా సూచించబడుతుంది.

మా బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఏం ఏం అందిస్తుందంటే

బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?

ఇంటి యజమానులు

మీ పాత ఇల్లు అయినా లేదా మీ కలల ఇల్లు అయినా కానీ అది చాలా విలువైనది. మీ చేతిలో లేని విపత్కర పరిస్థితుల నుంచి మీ ఇంటిని, మీ జేబుకు ఆర్థిక నష్టం కలగకుండా కాపాడుకునేందుకు బిల్డింగ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.

అద్దెకు ఉండేవారు

సాధారణంగా బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేది సొంతంగా భవనాలు ఉన్న వారికేనని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. ఇంటి కోసం కానీ ఆఫీసుల కోసం కానీ భవనాలను అద్దెకు తీసుకున్న వారి కోసం కూడా డిజిట్​లో కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. మీలో ఎవరైతే ఈ కేటగిరీకి చెందుతారో వారికోసం కూడా ఇన్సూరెన్స్ డిజైన్ చేసి ఉంది.

చిన్న వాపారాల యజమానులు

మీరు చిన్న బొటిక్ లేదా చిన్న జనరల్ స్టోర్ నడుపుతున్నా ఈ కస్టమైజ్డ్ బిల్డింగ్ ఇన్సూరెన్స్ మీకు సరిగ్గా సూటవుతుంది. స్వతంత్రంగా చిన్న వ్యాపారం నడుతుపుతున్నా కూడా బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఉండటం వలన అనుకోని సందర్భాల్లో కలిగే విపత్తుల నుంచి ఎటువంటి నష్టాలు కలగకుండా మిమ్మల్ని ఆర్థికంగా రక్షిస్తుంది.

మధ్య తరహా వ్యాపారాల యజమానులు

మీరు జనరల్ స్టోర్స్, రెస్టారెంట్లు లేదా మీడియం సైజ్ ఎంటర్​ప్రైజెస్ నడుపుతుంటే.. మేము అందించే బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేది అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, సహజ విపత్తులయిన వరదలు, భూకంపాలు, తుఫానుల వంటి వాటి వల్ల సంభవించే నష్టాల నుంచి మీడియం సైజ్ బిజినెస్ ఓనర్లను కూడా కాపాడుతుంది. 

పెద్ద సంస్థలు

మీరు కనుక అనేక ప్రాంతాల్లో శాఖలను తెరిచి వ్యాపారం చేస్తున్నట్లయితే.. మీకు ఒకటి కంటే ఎక్కువగా భవనాలు ఉంటే వాటికి బీమా చేయించడం చాలా అవసరం. ఇది కేవలం మీ వ్యాపార రిస్కును తగ్గించడమే కాకుండా బాధ్యతాయుతమైన వ్యాపార సంస్థగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఎన్ని రకాల హోమ్ ప్రాపర్టీస్ కవర్ అవుతాయంటే..

సొంత అపార్ట్​మెంట్

మీరు నివసిస్తున్న అద్దెకు తీసుకున్న ప్లాట్ హౌసింగ్ సొసైటీలో భాగమైనా, లేదా సొంత బిల్డింగ్ అయినా కానీ మేము అందించే కస్టమైజ్డ్ ప్లాన్లు మీకు బాగా సూటవుతాయి.

ఇండిపెండెంట్ బిల్డింగ్

మీరు మీ కుటుంబం ఒక ప్లాట్​ను అద్దెకు తీసుకుని లేదా ఒక సొంత భవనంలో నివసిస్తున్నారని అనుకుందాం. ఇటువంటి సందర్భంలో డిజిట్ అందిస్తున్న బిల్డింగ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన మీరు ఇంటిలోని వారందరినీ కవర్ చేసేందుకు ఎంచుకోవచ్చు.

ఇండిపెండెంట్ విల్లా

మీరు సొంత విల్లాను కలిగి ఉన్నా లేదా విల్లాను అద్దెకు తీసుకున్నా కానీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఏవైనా అనుకోని ప్రమాదాలైన అగ్నిప్రమాదాలు, వరదలు, తుఫానులు, భూకంపాలు సంభవించి మీ ఇల్లు లేదా అందులోని కంటెంట్స్​కు నష్టం వాటిల్లినా కానీ కవర్ అందుతుంది. 

ఎన్ని రకాల వ్యాపారాలు, దుకాణాల ఆస్తులు కవర్ అవుతాయంటే..

మొబైల్ మరియు ఇతర ఎలక్ట్రానిక్స్

మొబైల్​ ఫోన్లు, మొబైల్ పరికరాలను విక్రయించే వ్యాపారాలు లేదా వేరే రకమైన ఎలక్ట్రానిక్ స్టోర్లకు బిల్డింగ్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. క్రోమా, వన్​ ప్లస్, రెడ్​మీ వంటి స్టోర్స్ అటువంటి వ్యాపారాలకు మంచి ఉదాహరణలు. ఇటువంటి దుకాణాలకు కానీ అందులో ఉన్న కంటెంట్స్​కు కానీ ఏవైనా అనుకోని నష్టాలు సంభవించినా బిల్డింగ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

గ్రాసరీ, జనరల్ స్టోర్స్

మీ పక్కనే ఉన్న కిరాణా దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల వరకు అన్ని రకాల దుకాణ సముదాయాలు కవర్ చేయబడతాయి. బిగ్ బజార్ (Big Bazaar), స్టార్ బజార్ (Star Bazaar), రిలయన్స్ సూపర్ మార్కెట్ల (Reliance Supermarkets) వంటివి కొన్ని ఉదాహరణలు.

కార్యాలయాలు, విద్యాలయ స్థలాలు

విద్యా సంస్థలైన కళాశాలలు, పాఠశాలలు, శిక్షణా సంస్థలకు తగిన విధంగా ఈ పాలసీని రూపొందించారు. విద్యాసంస్థలకు బీమా చేయడం వలన నష్టాలను కవర్ చేసుకోవడమే కాకుండా సదరు విద్యాసంస్థ మీద ఉపాధ్యాయులు, విద్యార్థులకు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

వ్యక్తిగత జీవనశైలి, ఫిట్​నెస్

మీకు అత్యంత ఇష్టమయిన మాల్స్, బట్టల షాపులు, స్పాలు, జిమ్స్ వంటి ఇతర స్టోర్లకు కూడా డిజిట్ అందించే బీమా వర్తిస్తుంది. ఉదాహరణకు చెప్పుకుంటే.. ఎన్​రిచ్ సెలూన్లు (Enrich Salons), కల్ట్ ఫిట్​నెస్ సెంటర్లు (Cult Fitness Centers), ఫొయెనిక్స్ మార్కెట్ సిటీ (Phoenix Market City), ఇతర స్టోర్లు.

ఆహారం, తినుబండారాలు

ప్రతీ ఒక్కరూ తినేది కేఫ్​లు, ఫుడ్ ట్రక్కుల వద్ద. అంతేకాకుండా రెస్టారెంట్ చెయిన్స్, బేకరీల వద్ద కూడా రద్దీ బాగానే ఉంటుంది. కావున డిజిట్ అందజేసే బిల్డింగ్ ఇన్సూరెన్స్ తినుబండారాల షాపులకు వర్తిస్తుంది.

ఆరోగ్య సంరక్షణ

ఆరోగ్య సంరక్షణ విషయంలో ముఖ్యమైన ఆస్తులు ఆస్పత్రులు. ఈ బీమా పాలసీలో ఆస్పత్రులు, క్లినిక్​లు, డయగ్నోస్టిక్ సెంటర్లు, ఫార్మసీలు, ఇతర మెడికల్ స్టోర్లు కూడా కవర్ అవుతాయి.

ఇంటి మరమ్మతు సేవలు

వడ్రంగులు, ప్లంబింగ్ మరమ్మతుల నుంచి మోటార్ గ్యారేజ్, ఇంజనీరింగ్ వర్క్​షాపుల వరకు ఈ కేటగిరీలో ఉంటాయి.

ఇతరాలు

పైన పేర్కొన్న కేటగిరీలు మాత్రమే కాకుండా డిజిట్ బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేది అన్ని పరిమాణాలు, వ్యాపారా​లకు సరిగ్గా సూటవుతుంది. ఒక వేళ లిస్టులో మీ బిల్డింగ్​కు సంబంధించిన కేటగిరీ దొరక్కపోతే మమ్మల్ని సంప్రదించేందుకు సంకోచించకండి. మేము మీకు ఈ విషయంలో సాయం చేస్తాం. సరైన బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఎంచుకునేలా సాయం చేస్తాం.

బిల్డింగ్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.

బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా క్యాలుక్యులేట్ చేస్తారు?

మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద పేర్కొన్న ఫ్యాక్టర్ల ద్వారా ప్రభావితం అవుతుంది. భవనం రకం : మీరు ఇన్సూరెన్స్ చేసే బిల్డింగ్ రకం ఎటువంటిదనే విషయం బీమా ప్రీమియాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు జనరల్ స్టోర్​కు బీమా చేసిన దాని కన్నా ఫ్యాక్టరీకి బీమా చేసినపుడు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. భవన స్వభావంలో వ్యత్యాసం కూడా లెక్కించబడుతుంది. భవనం వయసు : ఇతర అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగానే వయసు అనేది ఇక్కడ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రీమియం ధరలను ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది. భవనం పాతదైతే దాని ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే భవనం కొత్తదైతే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఆస్తి ఉన్న ప్రదేశం : ఆస్తి ఉన్న ప్రదేశం కూడా భవనం ప్రీమియం విషయంలో అధిక ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రీమియం మీద నేరుగా ప్రభావాన్ని కలగజేస్తుంది. పెద్ద ఆస్తి ఎక్కువ బీమా మొత్తం విలువను కలిగి ఉంటుంది. తద్వారా అధిక బీమా ప్రీమియాన్ని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ మెజర్స్ : నేటి రోజుల్లో అనేక దుకాణాలు మరియు గృహాలు అగ్ని ప్రమాదాలు మరియు వివిధ రకాల ప్రమాదాల నుంచి తమ సముదాయాలను రక్షించుకునేందుకు అనేక రకాల భద్రతా చర్యలను పాటిస్తున్నాయి. మీరు బిల్డింగ్ ఇన్సూరెన్స్ చేయించాలని అనుకున్న ఇల్లు లేదా షాప్ ఇటువంటి భద్రతా చర్యలను పాటిస్తున్నట్లయితే మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువగా ఉంటుంది.  అడిషనల్ కవరేజెస్:  బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేది ప్రధానంగా బిల్డింగ్ మరియు అందులో ఉన్న కంటెంట్స్​కు వర్తిస్తుంది. షాపులో లేదా ఇంట్లో ఉంచిన నగలకు ఏదైనా నష్టం వాటిల్లినా కానీ కవర్ చేసే విధంగా ఎక్కువ ధరతో కూడిన కవరేజెస్ ఉంటాయి. ఇవి పొందేందుకు మీరు ఎక్కువ ధరతో యాడ్​ఆన్​లను పొందాల్సి ఉంటుంది. ఇవి మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పెంచుతాయి. 

మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద పేర్కొన్న ఫ్యాక్టర్ల ద్వారా ప్రభావితం అవుతుంది.

  • భవనం రకం : మీరు ఇన్సూరెన్స్ చేసే బిల్డింగ్ రకం ఎటువంటిదనే విషయం బీమా ప్రీమియాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు జనరల్ స్టోర్​కు బీమా చేసిన దాని కన్నా ఫ్యాక్టరీకి బీమా చేసినపుడు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. భవన స్వభావంలో వ్యత్యాసం కూడా లెక్కించబడుతుంది.
  • భవనం వయసు : ఇతర అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగానే వయసు అనేది ఇక్కడ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రీమియం ధరలను ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది. భవనం పాతదైతే దాని ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే భవనం కొత్తదైతే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
  • ఆస్తి ఉన్న ప్రదేశం : ఆస్తి ఉన్న ప్రదేశం కూడా భవనం ప్రీమియం విషయంలో అధిక ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రీమియం మీద నేరుగా ప్రభావాన్ని కలగజేస్తుంది. పెద్ద ఆస్తి ఎక్కువ బీమా మొత్తం విలువను కలిగి ఉంటుంది. తద్వారా అధిక బీమా ప్రీమియాన్ని కలిగి ఉంటుంది.
  • సెక్యూరిటీ మెజర్స్ : నేటి రోజుల్లో అనేక దుకాణాలు మరియు గృహాలు అగ్ని ప్రమాదాలు మరియు వివిధ రకాల ప్రమాదాల నుంచి తమ సముదాయాలను రక్షించుకునేందుకు అనేక రకాల భద్రతా చర్యలను పాటిస్తున్నాయి. మీరు బిల్డింగ్ ఇన్సూరెన్స్ చేయించాలని అనుకున్న ఇల్లు లేదా షాప్ ఇటువంటి భద్రతా చర్యలను పాటిస్తున్నట్లయితే మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. 
  • అడిషనల్ కవరేజెస్:  బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేది ప్రధానంగా బిల్డింగ్ మరియు అందులో ఉన్న కంటెంట్స్​కు వర్తిస్తుంది. షాపులో లేదా ఇంట్లో ఉంచిన నగలకు ఏదైనా నష్టం వాటిల్లినా కానీ కవర్ చేసే విధంగా ఎక్కువ ధరతో కూడిన కవరేజెస్ ఉంటాయి. ఇవి పొందేందుకు మీరు ఎక్కువ ధరతో యాడ్​ఆన్​లను పొందాల్సి ఉంటుంది. ఇవి మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పెంచుతాయి. 

బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పోల్చి చూసేందుకు కొన్ని సలహాలు

సరైన బిల్డింగ్ ఇన్సూరెన్స్​ను ఎంచుకోవడంలో గందరగోళం ఉంటుంది. మీ ప్రియమైన ఇంటిని లేదా వ్యాపారాన్ని రక్షించుకునేందుకు నిర్ణయం తీసుకోవడం మేము చాలా సులభం చేశాం. మీరు బిల్డింగ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని భావించినపుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన మూడు సిఫారసులు ఇక్కడ ఉన్నాయి: కవరేజ్ ప్రయోజనాలు : మీ బీమా ప్లాన్​లో ముఖ్యమైంది కవరేజ్ ప్రయోజనం. మీరు అందుకుంటున్న కవరేజ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఏదైనా అనుకోని సందర్భంలో విపత్తు వస్తే మీరు దేనికి కవర్ చేయబడతారు? దేనికి కవర్ చేయబడరు? అనే విషయాలను తప్పకుండా తెలుసుకుని ఉండాలి. అందుకోసమే ప్లాన్​ను తీసుకునే ముందు కవరేజ్ గురించి తెలుసుకోండి. బీమా చేసిన మొత్తం : బిల్డింగ్ ఇన్సూరెన్స్​లో మీ బీమా మొత్తం విలువ ఒకవేళ మీరు క్లెయిమ్ చేసినపుడు కవర్ అయ్యే మొత్తాన్ని సూచిస్తుంది. కావున ఈ బీమా మొత్తం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది కేవలం బీమా ప్రీమియాన్ని ప్రభావితం చేయడం మాత్రమే కాదు. ఎప్పుడైనా నష్టం లేదా డ్యామేజ్ జరిగినపుడు మీరు అందుకునే క్లెయిమ్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుబాటులో ఉన్న యాడ్ ఆన్స్ : కొన్ని సందర్భాల్లో బేసిక్ ప్లాన్ ప్రయోజనాల కంటే ఎక్కువ కవరేజీ మీకు అవసరమవుతుంది. ఇక్కడే యాడ్–ఆన్లు ఉపయోగపడతాయి. వివిధ రకాల బీమా కంపెనీలు వివిధ రకాల యాడ్-ఆన్లను అందిస్తున్నాయి. మీ భవనానికి ఏ యాడ్–ఆన్లు అయితే అవసరం ఉంటుందో వాటిని పరిశోధించి తీసుకోండి.

సరైన బిల్డింగ్ ఇన్సూరెన్స్​ను ఎంచుకోవడంలో గందరగోళం ఉంటుంది. మీ ప్రియమైన ఇంటిని లేదా వ్యాపారాన్ని రక్షించుకునేందుకు నిర్ణయం తీసుకోవడం మేము చాలా సులభం చేశాం. మీరు బిల్డింగ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని భావించినపుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన మూడు సిఫారసులు ఇక్కడ ఉన్నాయి:

  • కవరేజ్ ప్రయోజనాలు : మీ బీమా ప్లాన్​లో ముఖ్యమైంది కవరేజ్ ప్రయోజనం. మీరు అందుకుంటున్న కవరేజ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఏదైనా అనుకోని సందర్భంలో విపత్తు వస్తే మీరు దేనికి కవర్ చేయబడతారు? దేనికి కవర్ చేయబడరు? అనే విషయాలను తప్పకుండా తెలుసుకుని ఉండాలి. అందుకోసమే ప్లాన్​ను తీసుకునే ముందు కవరేజ్ గురించి తెలుసుకోండి.
  • బీమా చేసిన మొత్తం : బిల్డింగ్ ఇన్సూరెన్స్​లో మీ బీమా మొత్తం విలువ ఒకవేళ మీరు క్లెయిమ్ చేసినపుడు కవర్ అయ్యే మొత్తాన్ని సూచిస్తుంది. కావున ఈ బీమా మొత్తం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది కేవలం బీమా ప్రీమియాన్ని ప్రభావితం చేయడం మాత్రమే కాదు. ఎప్పుడైనా నష్టం లేదా డ్యామేజ్ జరిగినపుడు మీరు అందుకునే క్లెయిమ్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
  • అందుబాటులో ఉన్న యాడ్ ఆన్స్ : కొన్ని సందర్భాల్లో బేసిక్ ప్లాన్ ప్రయోజనాల కంటే ఎక్కువ కవరేజీ మీకు అవసరమవుతుంది. ఇక్కడే యాడ్–ఆన్లు ఉపయోగపడతాయి. వివిధ రకాల బీమా కంపెనీలు వివిధ రకాల యాడ్-ఆన్లను అందిస్తున్నాయి. మీ భవనానికి ఏ యాడ్–ఆన్లు అయితే అవసరం ఉంటుందో వాటిని పరిశోధించి తీసుకోండి.

సరైన బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను ఎలా ఎంచుకోవాలి?

సరైన బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఎంచుకునేందుకు ఉత్తమ మార్గం వివిధ సంస్థలు అందించే పాలసీలను పోల్చి చూసి, ఎవాల్యుయేట్ చేయడం. తద్వారా సరైన పాలసీని ఎంచుకోవాలి. ఎటువంటి పాలసీ తీసుకోవాలో ఎవరిని నమ్మాలో నిర్ణయం తీసుకునే ముందు.. కవరేజ్ ప్రయోజనాలు, బీమా మొత్తం, అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్, బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, కస్టమర్ సపోర్ట్, మొదలయినవి సరి చూసుకోవాలి.

సరైన బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఎంచుకునేందుకు ఉత్తమ మార్గం వివిధ సంస్థలు అందించే పాలసీలను పోల్చి చూసి, ఎవాల్యుయేట్ చేయడం. తద్వారా సరైన పాలసీని ఎంచుకోవాలి. ఎటువంటి పాలసీ తీసుకోవాలో ఎవరిని నమ్మాలో నిర్ణయం తీసుకునే ముందు.. కవరేజ్ ప్రయోజనాలు, బీమా మొత్తం, అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్, బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, కస్టమర్ సపోర్ట్, మొదలయినవి సరి చూసుకోవాలి.

బిల్డింగ్ ఇన్సూరెన్స్ కొరకు సరైన బీమా మొత్తం ఎలా ఎంచుకోవాలి?

మీ బీమా మొత్తం విలువ ఆస్తి విలువను సూచిస్తుంది. అంటే క్లెయిమ్ చేసిన సమయంలో మీరు పొందే గరిష్ట మొత్తం ఇదే అన్నమాట. ఇది మీ ఆస్తి సరైన విలువను సూచిస్తుందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోండి. మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్​కు సరైన బీమా మొత్తం విలువను ఎంచుకునేందుకు ఇక్కడ మీరు మా క్యాలుక్యులేటర్​ను ఉపయోగించవచ్చు. ఇది మీకు మీ ఆస్తి ఉన్న ప్రాంతాన్ని బట్టి బీమా మొత్తం విలువను నిర్ణయించడంలో సాయం చేస్తుంది.

మీ బీమా మొత్తం విలువ ఆస్తి విలువను సూచిస్తుంది. అంటే క్లెయిమ్ చేసిన సమయంలో మీరు పొందే గరిష్ట మొత్తం ఇదే అన్నమాట. ఇది మీ ఆస్తి సరైన విలువను సూచిస్తుందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోండి. మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్​కు సరైన బీమా మొత్తం విలువను ఎంచుకునేందుకు ఇక్కడ మీరు మా క్యాలుక్యులేటర్​ను ఉపయోగించవచ్చు. ఇది మీకు మీ ఆస్తి ఉన్న ప్రాంతాన్ని బట్టి బీమా మొత్తం విలువను నిర్ణయించడంలో సాయం చేస్తుంది.

బిల్డింగ్ ఇన్సూరెన్స్​తో ప్రయోజనాలు ఏంటి?

భారతదేశంలో బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాల గురించి సమగ్ర సారాంశం. పూర్తి కవరేజ్ : బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం మీ ఆస్తులను కాపాడడమే కాదు (ఉదా. భవంతి, లేదా స్టోర్‌‌) అంతేకాకుండా అందులో ఉండే కంటెంట్లను కూడా కాపాడుతుంది. కాబట్టి మీ జేబుకు ఆర్థికంగా ఎటువంటి చిల్లు పడదు. చాలా రకాల బీమా సంస్థలు అదనంగా మీ అవసరాలకు తగిన విధంగా కవరేజిని పెంచుకోవడానికి యాడ్ ఆన్లను కూడా అందజేస్తాయి. వ్యాపార రిస్కులను​ తగ్గిస్తుంది : బిల్డింగ్ ఇన్సూరెన్స్​లో కస్టమైజ్డ్ పాలసీలు కూడా ఉన్నాయి. ఇవి మీ షాపు మరియు అందులోని కంటెంట్లను ప్రొటెక్ట్ చేస్తాయి. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, దొంగతనాలు వంటి అనుకోని సందర్భాల్లో మీకు జరిగే నష్టాలను ఇది కవర్ చేస్తుంది. మీకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. ప్రశాంతత : ఒకవేళ అది మీ స్టోర్ అయినా కానీ లేక సొంత ఇల్లయినా కానీ పెద్ద మొత్తంలో ఆర్థిక సంపదను కలిగి ఉంటుంది. అనుకోని సందర్భాల్లో ఎదురయ్యే అన్ని రకాల నష్టాల నుంచి బిల్డింగ్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాకుండా మీరు దేని గురించి ఎక్కువగా చింతించకుండా ఉంచుతుంది. బీమా సంస్థ మీకు అన్నింటా సాయం చేస్తుంది.

భారతదేశంలో బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాల గురించి సమగ్ర సారాంశం.

  • పూర్తి కవరేజ్ : బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం మీ ఆస్తులను కాపాడడమే కాదు (ఉదా. భవంతి, లేదా స్టోర్‌‌) అంతేకాకుండా అందులో ఉండే కంటెంట్లను కూడా కాపాడుతుంది. కాబట్టి మీ జేబుకు ఆర్థికంగా ఎటువంటి చిల్లు పడదు. చాలా రకాల బీమా సంస్థలు అదనంగా మీ అవసరాలకు తగిన విధంగా కవరేజిని పెంచుకోవడానికి యాడ్ ఆన్లను కూడా అందజేస్తాయి.
  • వ్యాపార రిస్కులను​ తగ్గిస్తుంది : బిల్డింగ్ ఇన్సూరెన్స్​లో కస్టమైజ్డ్ పాలసీలు కూడా ఉన్నాయి. ఇవి మీ షాపు మరియు అందులోని కంటెంట్లను ప్రొటెక్ట్ చేస్తాయి. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, దొంగతనాలు వంటి అనుకోని సందర్భాల్లో మీకు జరిగే నష్టాలను ఇది కవర్ చేస్తుంది. మీకు ఆర్థిక భరోసాను అందిస్తుంది.
  • ప్రశాంతత : ఒకవేళ అది మీ స్టోర్ అయినా కానీ లేక సొంత ఇల్లయినా కానీ పెద్ద మొత్తంలో ఆర్థిక సంపదను కలిగి ఉంటుంది. అనుకోని సందర్భాల్లో ఎదురయ్యే అన్ని రకాల నష్టాల నుంచి బిల్డింగ్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాకుండా మీరు దేని గురించి ఎక్కువగా చింతించకుండా ఉంచుతుంది. బీమా సంస్థ మీకు అన్నింటా సాయం చేస్తుంది.

భారతదేశంలో ఆన్​లైన్​లో బిల్డింగ్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)

బిల్డింగ్​ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండడం చట్టపరంగా అవసరమా(తప్పనిసరా)?

లేదు. ఇండియాలో బిల్డింగ్ ఇన్సూరెన్స్​ను కలిగి ఉండడం చట్టపరంగా తప్పనిసరి కాదు. అయినప్పటికీ వాణిజ్య మరియు నివాస భవనాలకు వచ్చే నష్టాలు చాలా ఖరీదైనవి కాబట్టి ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం. 

వాణిజ్య ఆస్తుల విషయంలో బిల్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియాన్ని ఎవరు చెల్లించాలి?

కమర్షియల్ ప్రాపర్టీల విషయంలో బిల్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంను చెల్లించడం ఓనర్ బాధ్యత. అయితే కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్​లో బిల్డరే అన ఆధీనంలో ఉన్న అన్ని బిల్డింగ్స్​కు కూడా ఒక్కోసారి బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చెల్లించవచ్చు.