ఇల్లు, బిల్డింగ్, షాప్, వ్యాపారాల కోసం ప్రాపర్టీ ఇన్సూరెన్స్
property-insurance
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

Terms and conditions apply*

back arrow
Home Insurance exchange icon
Zero Paperwork. Online Process.
home icon
shop icon
office icon
factory icon
Please enter property type
Please select property type
Enter Valid Pincode
+91
Please enter valid mobile number
I agree to the Terms & Conditions
background-illustration
background-illustration

అసలు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

అది ఒకరి నివాస సముదాయం, అపార్ట్​మెంట్​, వ్యాపార సముదాయం, కేఫ్ లేదా ఆసుపత్రి కావొచ్చు. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది బిల్డింగ్ మరియు దాని కంటెంట్​లను ప్రొటెక్ట్ చేసేందుకు రూపొందించిన ఇన్సూరెన్స్ పాలసీ. అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, కొండచరియలు విరిగి పడడం, రాళ్లు దొర్లుకుంటూ రావడం, ప్రకృతి విపత్తుల వలన సంభవించే లాసెస్​/డ్యామేజెస్​ను ఈ పాలసీ కవర్ చేస్తుంది. 

కావున మీరు మీ అందమైన ఇంటినైనా లేదా మీ స్టోర్​నైనా రక్షించాలని అనుకుంటే మీరు డిజిట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి. అనుకోని సందర్భాలలో తలెత్తే పొటెన్షియల్ లాసెస్ మరియు డ్యామేజెస్ వలన మీరు నష్టపోకుండా ఇది కవర్ చేస్తుంది. 

Read More

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం?

Burglary
ఇండియాలో 2021వ సంవత్సరంలో 1.6 మిలియన్ల అగ్ని ప్రమాదాలు రికార్డ్ అయ్యాయి. (1)
Loss of Property
ఇండియాలో 64% మంది ప్రజలు ఇంటి భద్రత విషయంలో ఏదైనా ప్రమాదం తలెత్తితే హ్యాండిల్ చేసేందుకు సరైన పరికరాలు కలిగి లేరు (2)
Fire Outbreak
వ్యాపారాలు సాఫీగా కొనసాగకుండా అడ్డుకోవడంలో అగ్ని ప్రమాదాలు 3వ అతిపెద్ద రిస్క్​గా ర్యాంక్ చేయబడ్డాయి. (3)
Home Theft
ఇండియాలో జరిగే దొంగతనాలలో 70% దొంగతనాలు ఇళ్లల్లోనే జరుగుతున్నాయి.(4)

డిజిట్ అందిస్తున్న ప్రాపర్టీ ఇన్సూరెన్స్​ గొప్పతనం ఏమిటి?

  • డబ్బుకు తగ్గ విలువ : ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద డీల్. దీని ద్వారా మీ బిల్డింగ్ అందులోని ఉన్న వస్తువులు కవర్ చేయబడతాయి. ఈ పాలసీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు మీకు ఎక్కువగా అనిపించొచ్చు. కానీ మీకు తక్కువ ధరకు పాలసీ ప్రీమియంలు అందించేందుకు మేము ప్రయత్నిస్తాం.

  • డిజిటల్ ఫ్రెండ్లీ : డిజిట్ ఇండియా మొట్టమొదటి ఆన్​లైన్ బీమా సంస్థగా నిలిచింది. మా వద్ద చాలా రకాల పనులు ఆన్​లైన్​లోనే పూర్తవుతాయి. బిల్డింగ్ ఇన్సూరెన్స్ కొనుగోలు నుంచి క్లెయిములు చేయడం వరకు ఇలా ప్రతీ ఒక్కటి ఆన్​లైన్​లోనే ఉంటుంది. క్లెయిముల కోసం తనిఖీ అవసరమైనపుడు కూడా ఆన్​లైన్​లోనే పూర్తి చేయొచ్చు. కానీ ఐఆర్​డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం రూ. 1 లక్ష కంటే ఎక్కువ విలువ గల క్లెయిముల కోసం మాన్యువల్​గా తనిఖీ చేయడం తప్పనిసరి.

  • అన్ని వ్యాపార కేటగిరీలను కవర్ చేస్తుంది : మీరు మీ కుటుంబ వ్యాపారం లేదా కిరాణా దుకాణాలను అలాగే స్టోర్స్​ను కవర్ చేయాలని భావించినా మా బీమా అన్ని రకాల వ్యాపారా​లకు సరిపోతుంది. ఆ వ్యాపారం పెద్దదైనా చిన్నదైనా మా బీమా కవర్ చేస్తుంది.

  • అద్దెదారులకు కూడా ప్లాన్లు : నేటి రోజుల్లో అద్దె ఇళ్లల్లో నివసించే వారు పెరిగిపోతున్నారు. అద్దెకు ఉన్న ఇల్లు ఎప్పటికీ సొంతం కాదు. అందుకోసమే అద్దెకు ఉండే వారి సొంత వస్తువుల కోసం మేము మీకు బీమా అందిస్తాం.

డిజిట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

Fires

అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదాల వల్ల మీ ఆస్తులకు సంభవించే నష్టాలు మరియు డ్యామేజెస్ నుంచి ఇది మిమ్మల్ని కవర్ చేస్తుంది.

Explosion & Implosion

పేలుళ్లు

పేలుళ్ల వలన మీ ఆస్తులకు ఏదైనా నష్టం వాటిల్లినపుడు ఇది కవర్ చేస్తుంది.

Storms

తుఫానులు

తుఫానుల వల్ల మీ ఆస్తులు చిన్నాభిన్నం అయినా కూడా... ఆ తుఫానులు, లేదా హరికేన్స్​ వల్ల మీకు కలిగిన నష్టాలకు నష్టపరిహారం చెల్లిస్తుంది. అవి పెద్దవయినా కానీ చిన్నవయినా కానీ నష్టపరిహారం వస్తుంది.

Floods

తుఫానులు

వర్షాలు కంట్రోల్ తప్పి వరదలకు కారణం అయినపుడు అందువల్ల మీ ఆస్తులకు ఏదైనా నష్టం వాటిల్లితే కలిగే నష్టాలు కవర్ అవుతాయి.

Earthquakes

భూకంపాలు

ప్రకృతి ప్రకోపాలను ఎవరూ నివారించలేరు. కానీ భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తుల వలన కలిగే నష్టాన్ని ఇది కవర్ చేస్తుంది.

Impact Damage of any kind

దేని వల్లయినా నష్టం కలిగితే

వాహనాలు లేదా చెట్లు పడిపోవడం వంటి బాహ్య వస్తువుల వలన మీ ఆస్తులకు నష్టం జరిగినా కానీ ఇది కవర్ చేస్తుంది.

ముష్కరుల (తీవ్రవాదం) వలన నష్టం కలిగితే

ముష్కరుల (తీవ్రవాదం) వలన నష్టం కలిగితే

ఏదైనా ఉగ్రవాద కార్యకలాపం వలన మీరు బీమా చేసిన ఆస్తికి నష్టం వాటిల్లితే మీకు నష్టపరిహారం వస్తుంది.

Riots, Strikes

అల్లర్లు లేదా సమ్మెలు

అల్లర్లు లేదా సమ్మెల వల్ల మీ ఆస్తికి ఎటువంటి నష్టం వాటిల్లినా కానీ ఈ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది.

మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అందజేసేవి (మీకు ఆఫర్ చేసేవి)

Home Insurance

హోమ్ ఇన్సూరెన్స్

హోమ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఇంటికి సరిగ్గా సరిపోయేలా డిజైన్ చేయబడింది. అది అపార్ట్​మెంట్​ లేదా విల్లా లేదా సొంత భవనం అయినా కానీ అనుకోని విపత్తులయిన అగ్నిప్రమాదాలు, పేలుళ్లు, వరదలు, తుఫానుల వంటి వాటి నుంచి మీ ఇంటిని మరియు అందులో ఉన్న కంటెంట్స్​ను హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

Business & Shop Insurance

బిజినెస్ మరియు షాప్ ఇన్సూరెన్స్

బిజినెస్ లేదా షాప్ ఇన్సూరెన్స్ పాలసీ బిజినెస్ రిలేటెడ్ ప్రాపర్టీస్​ ప్రొటెక్ట్ చేయడం కొరకు డిజైన్ చేయబడింది. అగ్ని ప్రమాదాలు మరియు సహజ విపత్తుల వలన ఏర్పడే సంభావ్య నష్టాల నుంచి కిరాణా దుకాణాలు, బొటిక్స్, జనరల్ స్టోర్స్, కార్యాలయ ప్రాంగణాలు, ఫ్యాక్టరీలు, మరియు మాల్స్​ వంటి వాటిని ప్రొటెక్ట్ చేసేందుకు డిజైన్ చేయబడింది.

వివిధ రకాల ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్స్

డిజిట్​లో మేము అందించే గో డిజిట్ భారత్ లఘు ఉద్యమ్ సురక్ష, గో డిజిట్ భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, గో డిజిట్ భారత్ గృహ రక్ష పాలసీ వంటి ఇన్సూరెన్స్ పాలసీలు మీ ఆస్తులను అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, భూకంపాల వంటి వాటి నుంచి కవర్ చేస్తాయి. ఆస్తులు దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది కావున దొంగతనాల నుంచి మీ ఆస్తులను రక్షించేందుకు మేము డిజిట్ బర్గ్​లరీ ఇన్సూరెన్స్ పాలసీని కూడా అందిస్తున్నాం. ఇలా మీ ఆస్తి అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించబడటమే కాకుండా దొంగతనాల నుంచి కూడా రక్షించబడుతుంది. మీకు సులభంగా అర్థమయ్యేందకు కవరేజెస్​ను మేము ఈ కింది విధంగా వర్గీకరించాం. 

ఆప్షన్ 1

ఆప్షన్ 2

ఆప్షన్ 3

మీ ఇల్లు లేదా బిజినెస్​లో ఉండే కంటెంట్స్​ను మాత్రమే కవర్ చేస్తుంది.

భవనం మరియు కంటెంట్స్​ రెండింటినీ ఇది కవర్ చేస్తుంది.

మీ బిల్డింగ్​ను మాత్రమే కవర్ చేస్తుంది.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

  • కంటెంట్ - ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో కంటెంట్స్ అంటే ఏమిటని మీరు ఇంకా గందరగోళంలో ఉంటే.. మీ ప్రాంగణంలో ఉండే మరియు శాశ్వతంగా మీ బిల్డింగ్ స్ట్రక్చర్​కు జోడించకుండా ఉండే వస్తువులను కంటెంట్స్ అని సూచిస్తారు.
  • బిల్డింగ్/స్ట్రక్చర్ – పేరుకు తగ్గట్లుగానే మీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో బిల్డింగ్ లేదా స్ట్రక్చర్ అనేది మీరు కవర్ చేసే మొత్తం ప్రాపర్టీని సూచిస్తుంది. మీరు మీ ఇంటిని లేదా మీ సొంత విల్లాను సంరక్షించాలని చూస్తున్నట్లయితే అవి భవనాన్ని సూచిస్తాయి.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?

మీరు నివసించే ఇల్లు అయినా లేదా వ్యాపార కార్యాలయం అయినా వాటిని అనుకోని విపత్తుల నుంచి రక్షించుకునేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అవసరం. దొంగతనాలు లేదా సహజ ప్రకృతి విపత్తుల వలన సంభవించే భారీ ఆర్థిక నష్టాల నుంచి ఇది మిమ్మల్ని కవర్ చేస్తుంది.

ఇంటి యజమానులు

కొన్నేళ్ల నుంచి ఇది మీ ఇల్లు అయినా లేదా మీ కలల సౌధం అయినా కానీ అది చాలా విలువైనది. మీ చేతిలో లేని విపత్కర పరిస్థితుల నుంచి మీ ఇంటిని, మీ జేబుకు ఆర్థిక నష్టం కలగకుండా కాపాడుకునేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.

అద్దెదారులు

సాధారణంగా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది సొంతంగా భవనాలు ఉన్న వారికేనని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. ఇంటి కోసం కానీ ఆఫీసుల కోసం కానీ భవనాలను అద్దెకు తీసుకున్న వారి కోసం కూడా డిజిట్​లో కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. మీలో ఎవరైతే ఈ కేటగిరీకి చెందుతారో వారికోసం కూడా ఇన్సూరెన్స్ రూపొందించబడి ఉంది.

చిన్న వ్యాపారాల యజమానులు

కస్టమైజ్​డ్ ఫ్యాషన్ మరియు హస్తకళలతో కూడిన ఒక చిన్న బొటిక్​ను లేదా చిన్న జనరల్ స్టోర్​ను మీరు నడుపినా కానీ మీరు మీ బిజినెస్​కు డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీలు అన్ని రకాల వ్యాపారాలకు సరిగ్గా సరిపోతాయి. మీరు కనుక చిన్న వ్యాపారం లేదా సొంతంగా చిన్న షాపు నడుపుతున్నట్లయితే సంభావ్య నష్టాల నుంచి మీ వ్యాపారాలను రక్షించుకోవడానికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా అవసరం. 

మీడియం వ్యాపారాల యజమానులు

మీరు కనుక రెస్టారెంట్లు, జనరల్ స్టోర్స్ చెయిన్, లేదా ఒక మీడియం సైజ్ ఎంటర్​ప్రైజెస్​ను నడుపుతున్నా కానీ మీరు మీ వ్యాపారాలకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, తుఫానులు, భూకంపాల వలన మీడియం సైజ్ వ్యాపారాలకు ఎటువంటి సంభావ్య నష్టాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ సరిగ్గా సరిపోతుంది.

పెద్ద వ్యాపారాలు

మీరు కనుక మల్టీపుల్ ప్రాపర్టీలను కలిగి ఉండి మీ వ్యాపారాలలో భారీ కార్యకలాపాలు చేస్తుంంటే.. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ముఖ్యం. ఇది కేవలం మీ ఒక్క ప్రాపర్టీని కాపాడటమే కాకుండా అన్ని ప్రాపర్టీస్​ను రక్షిస్తుంది

కవర్ అయ్యే హోమ్ ప్రాపర్టీలు

వ్యక్తిగత అపార్ట్​మెంట్

హౌజింగ్ సొసైటీలు లేదా సొంత బిల్డింగ్​లలో ఉన్న సొంత ఫ్లాట్​లలోని వారికి ఇది సరిపోతుంది. పైన పేర్కొన్న వాటిలో మీరు ఫ్లాట్​ను కలిగి ఉన్నా లేదా అద్దెకు తీసుకున్నా కానీ ఇది రెండింటికీ సరిపోతుంది.

 

సొంత భవనం

మీరు మీ పెద్ద కుటుంబం ఇండిపెండెంట్ బిల్డింగ్​లోని మొత్తం ప్లాట్లను మీరు సొంతంగా కలిగి ఉన్నా లేక అద్దెకు తీసుకొని జీవిస్తున్నా కానీ ఇటువంటి సందర్భంలో మీరు డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీతో వాటిని కవర్ చేయొచ్చు. 

ఇండిపెండెంట్ విల్లా

మీరు సొంతంగా విల్లాను కలిగి ఉన్న లేదా దానిని అద్దెకు తీసుకున్నా కానీ పొటెన్షియల్ ప్రమాదాల నుంచి మీ విల్లాను మరియు అందులోని కంటెంట్స్​ను ప్రొటెక్ట్ చేసేందుకు మీరు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. 

కవర్ అయ్యే షాప్, వ్యాపార ఆస్తుల రకాలు

మొబైల్, ఎలక్ట్రానిక్స్

ప్రధానంగా మొబైల్ ఫోన్లు లేదా మొబైల్ యాక్సెసరీలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను అమ్మే అమ్మే వ్యాపారాలు. క్రోమా (Croma), వన్​ప్లస్ (OnePlus), రెడ్​మీ (Redmi) వంటి స్టోర్లు ఇందుకు ఉదాహరణ. సంభవించగల నష్టాలు, డ్యామేజీల నుంచి ఇటువంటి ఆస్తులకు ఆస్తి నష్టం జరిగితే ఇది కవర్ చేస్తుంది. దొంగతనాల వలన ఇక్కడ ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది.

గ్రోసరీ, జనరల్ స్టోర్స్

మీకు ఇరుగు పొరుగున ఉన్న కిరాణా షాపుల నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్​ మార్కెట్లు, జనరల్ స్టోర్ల వరకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో కవర్ అవుతాయి. బిగ్ బజార్ (Big Bazaar), స్టార్ బజార్ (Star Bazaar), రిలయన్స్ సూపర్​ మార్కెట్ (Reliance Supermarkets) వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు.

కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణలు

మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో ఈ కేటగిరీ అనేది కార్యాలయాలు, విద్యాసంస్థలకు సరిపోయేలా రూపొందించబడింది. ఇందులో పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు వస్తాయి. ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేయడం వలన మీరు ఆర్థిక నష్టాల నుంచి కవర్ అవడమే కాకుండా మీ విద్యార్థులు, ఉద్యోగులకు ఇన్​స్టిట్యూట్ పట్ల విశ్వాసం మరింతగా పెరుగుతుంది.

హోమ్ రిపేర్ సర్వీసులు

వడ్రంగి, ప్లంబింగ్ మరమ్మతుల నుంచి మోటారు గ్యారేజీలు, ఇంజనీరింగ్ వర్క్​షాపుల వరకు ఇటువంటి వ్యాపారాలు ఉంటాయి.

పర్సనల్ లైఫ్ మరియు ఫిట్​నెస్

మీకు అత్యంత ఇష్టమైన బట్టల దుకాణాల నుంచి స్పాస్ వరకు అలాగే జిమ్స్ నుంచి ఇతర స్టోర్స్​ వరకు డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ పర్సనల్ లైఫ్ స్టైల్ మరియు ఫిట్​నెస్ సెక్టార్​లో ఉండే అన్ని వ్యాపారాలను కవర్ చేస్తుంది. 

ఆహారం మరియు తినుబండరాలు

అందరూ తినే స్థలాలైన కేఫ్స్ మరియు ఫుడ్ ట్రక్స్ నుంచి మొదలుకుని రెస్టారెంట్లు మరియు బేకరీల వరకు డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ అన్నింటికీ చక్కగా సరిపోతుంది. 

హెల్త్​కేర్

ఎంతో విలువైన ఆస్తులైన ఆసుపత్రులు, క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, మరియు మందుల దుకాణాలు కూడా డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతాయి. 

ఇతర ప్రాపర్టీస్

పైన పేర్కొన్న కేటగిరీలు మాత్రమే కాకుండా వివిధ రకాల సైజెస్ ఉన్న ఆస్తులకు కూడా డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ కరెక్టుగా సూట్ అవుతుంది. లిస్ట్​లో మీ బిజినెస్ కేటగిరీని మీరు కనుక్కోలేకపోతే మమ్మల్ని ఎటువంటి సంకోచం లేకుండా మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రాపర్టీకి బెస్ట్ పాలసీని ఎంచుకునేలా మేము మీకు సహాయం చేస్తాం. 

భారతదేశంలో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.

భారతదేశంలో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)