Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
Terms and conditions apply*
అసలు బిల్డింగ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమో తెలియదా?
అయితే, ఇక్కడ పూర్తిగా చదవండి..
డిజిట్ అందించే బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లో గొప్పతనం ఏమిటి?
డిజిట్ అందించే బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు
డిజిట్లో మేము అందించే ఇన్సూరెన్స్ మీ బిల్డింగ్స్‌ను అగ్నిప్రమాదాలు, మరియు సహజ విపత్తులైన వరదలు, భూకంపాల నుంచి కాపాడుతాయి. గో డిజిట్ భారత్ లఘు ఉద్యమ్ సురక్ష, గో డిజిట్ భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, గో డిజిట్ భారత్ గృహ రక్ష వంటి పాలసీలు ఉన్నాయి. ఏదేమైనా కానీ భవనాలు దొంగతనాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకోసమే మేము దొంగతనాల వల్ల కలిగే నష్టాలను కవర్ చేసేందుకు బర్గ్లరీ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాం. ఈ విధంగా మీ భవనం అగ్ని ప్రమాదాలు మరియు సహజ విపత్తులైన భూకంపాలు, వరదల వల్ల సంభవించే నష్టాల నుంచి కాపాడటమే కాకుండా దోపిడీ వల్ల కలిగే నష్టాల నుంచి కూడా మీ భవనాలు సురక్షితంగా ఉంటాయి. మీ కోసం వీటిని సులభతరం చేసేందుకు మేము ఈ కింది విధంగా కవరేజ్ ఎంపికలను అందిస్తున్నాం.
ఆప్షన్ 1 |
ఆప్షన్ 2 |
ఆప్షన్ 3 |
మీ ఇల్లు లేదా వ్యాపార సముదాయంలో ఉన్న కంటెంట్స్‌ను మాత్రమే కవర్ చేస్తుంది. |
మీ బిల్డింగ్ మరియు మీ ఇంటిలో లేదా వ్యాపార సముదాయంలో ఉన్న కంటెంట్స్‌ను కూడా కవర్ చేస్తుంది. |
కేవలం మీ బిల్డింగ్‌ను మాత్రమే కవర్ చేస్తుంది. |
బిల్డింగ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
- కంటెంట్ – బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లో అసలు కంటెంట్ అనేది ఏం సూచిస్తుందని మీరు కన్య్పూజ్ అయితే మీరు ఇన్సూర్ చేసిన బిల్డింగ్ ప్రాంగణంలో ఉండే వస్తువులను ఇది సూచిస్తుంది. శాశ్వతంగా మీ ప్రాంగణానికి అటాచ్ అయి లేని వస్తువులను ఇది సూచిస్తుంది. ఉదాహరణకు: మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగి మీ ల్యాప్‌టాప్ దొంగిలించబడినట్లయితే మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ కంటెంట్స్‌లో ల్యాప్‌టాప్ కూడా కవర్ అవుతుంది.
- భవనం/స్ట్రక్చర్ – బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లోని బిల్డింగ్ లేదా స్ట్రక్చర్ అనేది మీరు కవర్ చేయాలనుకుంటున్న మొత్తం ఆస్తిని సూచిస్తుంది. ఉదాహరణకు మీరు మీ కుటుంబం సొంత భవనాన్ని సంరక్షించాలని అనుకుంటే... మీ మొత్తం భవనంగా ఒక భవనంగా సూచించబడుతుంది.
మా బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఏం ఏం అందిస్తుందంటే
బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?
ఎన్ని రకాల హోమ్ ప్రాపర్టీస్ కవర్ అవుతాయంటే..
ఎన్ని రకాల వ్యాపారాలు, దుకాణాల ఆస్తులు కవర్ అవుతాయంటే..
బిల్డింగ్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా క్యాలుక్యులేట్ చేస్తారు?
మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద పేర్కొన్న ఫ్యాక్టర్ల ద్వారా ప్రభావితం అవుతుంది.
- భవనం రకం : మీరు ఇన్సూరెన్స్ చేసే బిల్డింగ్ రకం ఎటువంటిదనే విషయం బీమా ప్రీమియాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు జనరల్ స్టోర్‌కు బీమా చేసిన దాని కన్నా ఫ్యాక్టరీకి బీమా చేసినపుడు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. భవన స్వభావంలో వ్యత్యాసం కూడా లెక్కించబడుతుంది.
- భవనం వయసు : ఇతర అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగానే వయసు అనేది ఇక్కడ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రీమియం ధరలను ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది. భవనం పాతదైతే దాని ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే భవనం కొత్తదైతే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
- ఆస్తి ఉన్న ప్రదేశం : ఆస్తి ఉన్న ప్రదేశం కూడా భవనం ప్రీమియం విషయంలో అధిక ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రీమియం మీద నేరుగా ప్రభావాన్ని కలగజేస్తుంది. పెద్ద ఆస్తి ఎక్కువ బీమా మొత్తం విలువను కలిగి ఉంటుంది. తద్వారా అధిక బీమా ప్రీమియాన్ని కలిగి ఉంటుంది.
- సెక్యూరిటీ మెజర్స్ : నేటి రోజుల్లో అనేక దుకాణాలు మరియు గృహాలు అగ్ని ప్రమాదాలు మరియు వివిధ రకాల ప్రమాదాల నుంచి తమ సముదాయాలను రక్షించుకునేందుకు అనేక రకాల భద్రతా చర్యలను పాటిస్తున్నాయి. మీరు బిల్డింగ్ ఇన్సూరెన్స్ చేయించాలని అనుకున్న ఇల్లు లేదా షాప్ ఇటువంటి భద్రతా చర్యలను పాటిస్తున్నట్లయితే మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువగా ఉంటుంది.
- అడిషనల్ కవరేజెస్: బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేది ప్రధానంగా బిల్డింగ్ మరియు అందులో ఉన్న కంటెంట్స్కు వర్తిస్తుంది. షాపులో లేదా ఇంట్లో ఉంచిన నగలకు ఏదైనా నష్టం వాటిల్లినా కానీ కవర్ చేసే విధంగా ఎక్కువ ధరతో కూడిన కవరేజెస్ ఉంటాయి. ఇవి పొందేందుకు మీరు ఎక్కువ ధరతో యాడ్ఆన్లను పొందాల్సి ఉంటుంది. ఇవి మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పెంచుతాయి.
బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పోల్చి చూసేందుకు కొన్ని సలహాలు
సరైన బిల్డింగ్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడంలో గందరగోళం ఉంటుంది. మీ ప్రియమైన ఇంటిని లేదా వ్యాపారాన్ని రక్షించుకునేందుకు నిర్ణయం తీసుకోవడం మేము చాలా సులభం చేశాం. మీరు బిల్డింగ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని భావించినపుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన మూడు సిఫారసులు ఇక్కడ ఉన్నాయి:
- కవరేజ్ ప్రయోజనాలు : మీ బీమా ప్లాన్‌లో ముఖ్యమైంది కవరేజ్ ప్రయోజనం. మీరు అందుకుంటున్న కవరేజ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఏదైనా అనుకోని సందర్భంలో విపత్తు వస్తే మీరు దేనికి కవర్ చేయబడతారు? దేనికి కవర్ చేయబడరు? అనే విషయాలను తప్పకుండా తెలుసుకుని ఉండాలి. అందుకోసమే ప్లాన్‌ను తీసుకునే ముందు కవరేజ్ గురించి తెలుసుకోండి.
- బీమా చేసిన మొత్తం : బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లో మీ బీమా మొత్తం విలువ ఒకవేళ మీరు క్లెయిమ్ చేసినపుడు కవర్ అయ్యే మొత్తాన్ని సూచిస్తుంది. కావున ఈ బీమా మొత్తం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది కేవలం బీమా ప్రీమియాన్ని ప్రభావితం చేయడం మాత్రమే కాదు. ఎప్పుడైనా నష్టం లేదా డ్యామేజ్ జరిగినపుడు మీరు అందుకునే క్లెయిమ్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
- అందుబాటులో ఉన్న యాడ్ ఆన్స్ : కొన్ని సందర్భాల్లో బేసిక్ ప్లాన్ ప్రయోజనాల కంటే ఎక్కువ కవరేజీ మీకు అవసరమవుతుంది. ఇక్కడే యాడ్–ఆన్లు ఉపయోగపడతాయి. వివిధ రకాల బీమా కంపెనీలు వివిధ రకాల యాడ్-ఆన్‌లను అందిస్తున్నాయి. మీ భవనానికి ఏ యాడ్–ఆన్లు అయితే అవసరం ఉంటుందో వాటిని పరిశోధించి తీసుకోండి.
సరైన బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?
సరైన బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఎంచుకునేందుకు ఉత్తమ మార్గం వివిధ సంస్థలు అందించే పాలసీలను పోల్చి చూసి, ఎవాల్యుయేట్ చేయడం. తద్వారా సరైన పాలసీని ఎంచుకోవాలి. ఎటువంటి పాలసీ తీసుకోవాలో ఎవరిని నమ్మాలో నిర్ణయం తీసుకునే ముందు.. కవరేజ్ ప్రయోజనాలు, బీమా మొత్తం, అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్, బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, కస్టమర్ సపోర్ట్, మొదలయినవి సరి చూసుకోవాలి.
బిల్డింగ్ ఇన్సూరెన్స్ కొరకు సరైన బీమా మొత్తం ఎలా ఎంచుకోవాలి?
మీ బీమా మొత్తం విలువ ఆస్తి విలువను సూచిస్తుంది. అంటే క్లెయిమ్ చేసిన సమయంలో మీరు పొందే గరిష్ట మొత్తం ఇదే అన్నమాట. ఇది మీ ఆస్తి సరైన విలువను సూచిస్తుందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోండి. మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్‌కు సరైన బీమా మొత్తం విలువను ఎంచుకునేందుకు ఇక్కడ మీరు మా క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. ఇది మీకు మీ ఆస్తి ఉన్న ప్రాంతాన్ని బట్టి బీమా మొత్తం విలువను నిర్ణయించడంలో సాయం చేస్తుంది.
బిల్డింగ్ ఇన్సూరెన్స్‌తో ప్రయోజనాలు ఏంటి?
భారతదేశంలో బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాల గురించి సమగ్ర సారాంశం.
- పూర్తి కవరేజ్ : బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం మీ ఆస్తులను కాపాడడమే కాదు (ఉదా. భవంతి, లేదా స్టోర్) అంతేకాకుండా అందులో ఉండే కంటెంట్లను కూడా కాపాడుతుంది. కాబట్టి మీ జేబుకు ఆర్థికంగా ఎటువంటి చిల్లు పడదు. చాలా రకాల బీమా సంస్థలు అదనంగా మీ అవసరాలకు తగిన విధంగా కవరేజిని పెంచుకోవడానికి యాడ్ ఆన్‌లను కూడా అందజేస్తాయి.
- వ్యాపార రిస్కులను తగ్గిస్తుంది : బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లో కస్టమైజ్డ్ పాలసీలు కూడా ఉన్నాయి. ఇవి మీ షాపు మరియు అందులోని కంటెంట్లను ప్రొటెక్ట్ చేస్తాయి. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, దొంగతనాలు వంటి అనుకోని సందర్భాల్లో మీకు జరిగే నష్టాలను ఇది కవర్ చేస్తుంది. మీకు ఆర్థిక భరోసాను అందిస్తుంది.
- ప్రశాంతత : ఒకవేళ అది మీ స్టోర్ అయినా కానీ లేక సొంత ఇల్లయినా కానీ పెద్ద మొత్తంలో ఆర్థిక సంపదను కలిగి ఉంటుంది. అనుకోని సందర్భాల్లో ఎదురయ్యే అన్ని రకాల నష్టాల నుంచి బిల్డింగ్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాకుండా మీరు దేని గురించి ఎక్కువగా చింతించకుండా ఉంచుతుంది. బీమా సంస్థ మీకు అన్నింటా సాయం చేస్తుంది.