Third-party premium has changed from 1st June. Renew now
వాడిన బైక్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సింది
టూ వీలర్‌ను కలిగి ఉండటం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు యుక్త వయసులో ఉండి ఉంటే ఈ విషయం మిమ్మల్ని మరింత ఉత్తేజానికి గురి చేస్తుంది. ఏదైనా వాహనం కలిగి ఉండటమనేది ఓ రకమైన విలాసాన్ని సూచిస్తుంది. భారతదేశంలో చాలా మంది కారు యజమానులు ఉన్నప్పటికీ, చాలా మంది యువ మిలియనీర్లు తమ బైకులను, దాని మీద రైడింగ్ చేయడాన్నే ఎక్కువగా ఇష్టపడతారు.
భారతీయ మార్కెట్లోకి ఎన్నో రకాల కొత్త మోడల్స్ వస్తున్నాయి. రోజువారీ అవసరాలకు కాకుండా అనేక ఫీచర్లు ఈ బైక్‌ల సొంతం. మీ బైక్ పాతదైనా, కొత్తదైనా మంచి బైక్ ఎల్లప్పుడూ మంచిదే. పాత బైక్‌లను ఉపయోగించే వారు, వాటిని ఇష్టపడే వారు నేటికీ మన దేశంలో చాలా మంది ఉన్నారు.
మన దేశంలో టూ వీలర్స్‌ను చాలా అవసరాల కోసం వాడుతున్నారు. ఉదాహరణకు ఫుడ్ డెలివరీ, కొరియర్ సర్వీస్, వంటి అనేక అవసరాలకు వాడుతున్నారు. కాబట్టి భారతదేశంలో రోజురోజుకూ బైక్‌లకు డిమాండ్ పెరుగుతోంది. అది సెకండ్ హ్యాండ్ బైకయినా, లేదా కొత్త బైకయినా.
మంచి కండిషన్లో ఉంటే సెకండ్ హ్యాండ్ బండి కొనడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు ఏదైనా ప్రదేశానికి సమయానికి చేరుకోవాలని భావించినపుడు బైక్ మీద వెళ్లడం కొంచెం ప్రమాదకరమే.
ట్రాఫిక్, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. కాబట్టి మీ బండికి ఇన్సూరెన్స్ చేయించడం తప్పనిసరి. ఇన్సూరెన్స్ ఉంటే మిమ్మల్ని, మీ బండిని కవర్ చేస్తుంది.
సెకండ్ హ్యాండ్ బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
అన్ని టూ వీలర్ ఇన్సూరెన్స్‌ల మాదిరిగానే సెకండ్ హ్యాండ్ బైక్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ బైక్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని అనేక నష్టాల నుంచి కాపాడుతుంది. అలాగే థర్డ్ పార్టీ లయబిలిటీల నుంచి కూడా రక్షిస్తుంది.
సెకండ్ హ్యాండ్ బైక్‌కు ఇన్సూరెన్స్ ఎందుకు చేయించాలి?
సెకండ్ హ్యాండ్ బైక్ మీకు బాగా నచ్చిందా? కానీ కొన్ని ప్రమాదాల వలన మీ అత్యంత ఇష్టమైన బైక్ నష్టపోయినపుడు ఇన్సూరెన్స్ మిమ్మల్ని కవర్ చేస్తుంది. కావున మీ బండికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మీ సెకండ్ హ్యాండ్ బైక్‌కు ఇన్సూరెన్స్ చేసే ముందు కింది విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం.
# మీ సెకండ్ హ్యాండ్ బైక్‌కు గేర్లు వదులుగా ఉంటే మీరు చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ట్రాఫిక్‌లో వెళ్తున్నపుడు మీ గేర్లు సరిగా పని చేయకపోతే మీ బండి అకస్మాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు మీకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదం వలన మీ బండి మడ్‌గార్డ్ దెబ్బతింటుంది.
ఇటువంటి సమయంలో మీ బండికి ఇన్సూరెన్స్ ఉంటే మిమ్మల్ని ఖర్చుల నుంచి కాపాడుతుంది. కాబట్టి మీ బండికి తప్పకుండా ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కవర్ చేస్తుంది.
# లీగల్ లయబిలిటీల నుంచి కూడా ఇన్సూరెన్స్ మిమ్ములను కాపాడుతుంది. ఎవరైనా సరే రోడ్డు దాటేటపుడు మీరు వారిని ఢీకొంటే ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ లైట్ పడే సమయంలో ముందుగా ఎల్లో లైట్ వస్తుంది. ఆ సమయంలో మీరు త్వరగా బండిని కదిలిస్తే ఎవరైనా పాదచారులు రోడ్డు దాటుతుంటే వారికి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. అటువంటి సమయంలో మీరు ఏమీ చేయలేరు. కనుక ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి.
ఆ సమయంలో మీరు అవతలి వ్యక్తి గాయాలకు చికిత్స చేస్తే అయిన ఖర్చులను మీ జేబు నుంచి భరించాల్సి వస్తుంది. కావున ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి.
# రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటపుడు ఇతరులకు గాయాలు కాకుండా ఉండటం కోసం కూడా మీరు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలి.
అబ్బాయిలు తప్పనిసరిగా బండి వేసుకుని షికారుకు వెళ్తారు. వారు అలా బైక్ రైడ్‌కు వెళ్లినపుడు వారిని ఓ కారు ఢీకొట్టి తీవ్ర గాయాలపాలై చనిపోతే, ఒకవేళ అతడు యజమాని–డ్రైవర్ కోసం పీఏ కవర్ తీసుకొని ఉండి ఉంటే అతడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తుంది.
ప్రమాదం తర్వాత మీ బైక్ రిపేర్ల కు అయ్యే ఖర్చుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు బైక్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఒకవేళ మీరు గాయాలపాలై ఆస్పత్రిలో చేరినా, ఇన్సూరెన్స్ ఉంటే ఆస్పత్రి ఖర్చులకు చింతించాల్సిన అవసరం ఉండదు. బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించి మీ సెకండ్ హ్యాండ్ బైక్‌కు ప్రీమియం ఎంత పడుతుందనే వివరాలను తనిఖీ చేయండి.
సెకండ్ హ్యాండ్ బైక్ ఇన్సూరెన్స్‌కు యాడ్–ఆన్ కవర్లు
మీరు బేసిక్ కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ తీసుకున్నపుడు మీరు తప్పక యాడ్–ఆన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల యాడ్ ఆన్స్ వివరాలు..
ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ప్రమాదం జరిగిన సమయంలో రిపేర్ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ పాక్షికంగానే చెల్లిస్తుంది. ఇటువంటి సమయంలో మీకు నిల్ డెప్రిసియేషన్ కవర్ యాడ్–ఆన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ కవర్‌ను తీసుకుంటే ప్రీమియం కాస్త పెరిగినా రిపేర్ ఖర్చుల విషయంలో మాత్రం మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఐదు సంవత్సరాల కంటే వయసు పైబడిన వాహనాలకు నిల్ డెప్రిసియేషన్ కవర్ యాడ్ ఆన్ లభించదు.
మీ బైక్ దొంగతనానికి గురైనపుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు చేయించిన రిపేర్ ఖర్చులకు మీ ఇన్సూరెన్స్ పాలసీ విలువ మొత్తం చెల్లించినా కానీ మీరు ఇంకా అదనంగా చెల్లించాల్సి వచ్చినపుడు మిమ్మల్ని అదనపు ఖర్చుల నుంచి రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ యాడ్–ఆన్ కాపాడుతుంది. ఈ కవర్ మీ రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా తిరిగి చెల్లిస్తుంది.
ప్రమాదం జరిగినా, జరగకపోయినా ఇంజన్, గేర్ బాక్స్‌కు అదనపు సంరక్షణ చాలా అవసరం. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇంజన్ & గేర్ ప్రొటెక్షన్ యాడ్–ఆన్ వలన ఈ సంరక్షణ సాధ్యపడుతుంది. ఎటువంటి సందరర్భాల్లో మీ గేర్ బాక్స్ పాడైపోయినా ఇది కవర్ చేస్తుంది.
రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్–ఆన్ తీసుకోవడం వలన మీ బండికి ఏదైనా సందర్భంలో బ్రేక్‌డౌన్ అయినపుడు మీరు దానికయ్యే ఖర్చును ఈ యాడ్ ఆన్ కవర్ చేస్తుంది. కానీ ఇది ఒక క్లెయిమ్‌గా పరిగణించబడదు.
బైకులో ముఖ్య భాగాలైన ఇంజన్ ఆయిల్, స్క్రూలు, నట్లు, బోల్టులకు సంబంధించిన కవర్ ఇది.
కొన్ని ప్రమాదాలు చాలా తీవ్రతను కలిగి ఉంటాయి. ఒక్కోసారి ఈ ప్రమాదాల వలన బండి నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మొదట కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలో కేవలం బండి యజమాని మాత్రమే కవర్ అయ్యేవాడు. కానీ తర్వాత రోజుల్లో వెనుకాల కూర్చున్న వ్యక్తి కూడా కవర్ అయ్యేలా పాలసీ నిబంధనలు మార్చారు.
ఐఆర్డీఏ (IRDA) ప్రస్తుత నిబంధనల మేరకు వెనుకాల కూర్చున్న వ్యక్తి థర్డ్ పార్టీ కిందకు వస్తారు. ప్రమాదంలో అతడికి అయిన గాయాలకు రూ. 3 లక్షలు, అతడు మరణించినట్లయితే అతడి బంధువులకు రూ. 5 లక్షల మేర నష్టపరిహారం అందుతుంది.
బైక్ ఓనర్‌షిప్, ఇన్సూరెన్స్ బదిలీ చేయించుకోండి
మీరు సెకండ్ హ్యాండ్ బండి మీద రైడ్‌కి వెళ్లాలని భావించినపుడు అన్ని రకాల బండి పేపర్లు మీ పేరు మీద ఉన్నాయో లేదో ఒక్కసారి తనిఖీ చేసుకోండి. ఆర్సీ (RC) బదిలీ అనేది చాలా ముఖ్యం.
మీరు బదిలీ అభ్యర్థన పెట్టినట్లయితే మీకు ముందుగా బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రవాణా శాఖ కార్యాలయం (RTO) నుంచి పొందిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) అవసరం అవుతుంది. ఒకవేళ మీరు కొనుగోలు చేసిన వాహనం లోన్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే బ్యాంకు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇవ్వాల్సి ఉంటుంది.
మీ సెకండ్ హ్యాండ్ బండిని పూర్తిగా మీ పేరు మీదకు మార్పించుకునేందుకు మీరు కింద పేర్కొన్న సులభమైన స్టెప్స్‌ను పాటిస్తే సరిపోతుంది:
మీరు అన్ని ఫీజులు కట్టిన తర్వాత ఓనర్‌షిప్ బదిలీకి 10-15 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో బండికి ఇన్సూరెన్స్ ఉందా? లేదా అనే విషయం తనిఖీ చేయాలి. ఆ బండికి ఉన్న ఇన్సూరెన్స్‌ను తనిఖీ చేయాలని భావిస్తే కొత్త పాలసీని మీకు ఇష్టం వచ్చిన సర్వీస్ ప్రొవైడర్ నుంచి తీసుకోవచ్చు.
ఇన్సూరెన్స్ ఉండి దానిని మీ పేరుకు బదిలీ చేయించుకోవాలని భావిస్తే అటువంటి సమయంలో మీరు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. గత యజమానితో కలిసి మీరు ఆ వాహన ఇన్సూరెన్స్‌కు సంబంధించిన పత్రాలను తీసుకొని మీరు సదరు కంపెనీని సంప్రదించాలి. అక్కడ ఫామ్–20, ఫామ్–30 వివరాలతో పాటు గుర్తింపు కార్డు, ఇన్సూరెన్స్ కాపీని సబ్మిట్ చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు మీ అభ్యర్థనను పూర్తి చేసేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుంది.
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ముందు చూడాల్సిన విషయాలు
తెలివైన వ్యక్తులెవరూ కూడా సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ముందు దాని ప్రయోజనాలను తనిఖీ చేయకుండా అస్సలు కొనుగోలు చేయరు. సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసేటపుడు తనిఖీ చేయాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
- బైక్‌ను భౌతికంగా తనిఖీ చేయండి: సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనేముందు సరిగ్గా చూడండి. మీరు చూసిన బండిని భౌతికంగా తనిఖీ చేయండి. ఆ బండికి ఏ విధమైన గీతలు కానీ, ఇంతకు ముందు ప్రమాదాలు జరిగిన గుర్తులు కానీ ఉన్నాయో సరిగ్గా చూడండి.
- శబ్ధం ఎలా వస్తుందో పరిశీలించండి: మీరు బైక్‌ను భౌతికంగా తనిఖీ చేస్తున్నపుడు దానిని స్టార్ట్ చేసి శబ్ధం ఎలా వస్తుందో యాక్సిలరేషన్ ఇచ్చి చూడండి. మీరు యాక్సిలరేషన్ ఇచ్చినపుడు బండి శబ్ధాన్ని చెక్ చేయండి. ఇండికేటర్, హర్న్ సౌండ్ ఎలా వస్తుందో చూడండి.
- డాక్యుమెంట్లను పరిశీలించండి: ఆర్సీ (RC) సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి. ఇంజన్ వివరాలను సరి చూసుకోండి. ఏవైనా వివరాలు సరిగా లేకపోతే మీరు క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.
- సర్వీస్ వివరాలను తెలుసుకోండి: మీరు ఆ బండి సర్వీస్ వివరాలను గురించి ఆ బండి యజమానిని అడిగి తెలుసుకోండి.
- టెస్ట్ రైడ్‌కు వెళ్లండి: పైన పేర్కొన్న అన్ని వివరాలు సరిగానే ఉంటే అప్పుడు మీరు ఆ బండిని టెస్ట్ రైడ్‌కు తీసుకెళ్లండి. ఆ బండి బ్రేకులు, సస్పెన్షన్ ఎలా పని చేస్తున్నాయో బండి నడుపుతున్న సమయంలో గమనించండి.
మీరు సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసే ముందు ఈ వివరాలను కచ్చితంగా తనిఖీ చేయండి. ఓనర్‌షిప్‌ను మీ పేరు మీదకి ఎలా మార్చుకోవాలనే విధానం గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు కొత్త ఇన్సూరెన్స్ తీసుకోవాలని భావించినపుడు ఈ విషయం మిమ్మల్ని అధికంగా ఇబ్బంది పెడుతుంది. కావున సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకునేటపుడు అన్ని విషయాలను తనిఖీ చేయాల్సిందే. మీ సెకండ్ హ్యాండ్ బైక్‌కు ఎలా ఇన్సూరెన్స్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ సెకండ్ హ్యాండ్ బండికి కొత్త ఇన్సూరెన్స్ తీసుకోవాలని చూస్తున్నారా?
మీరు కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ బైక్‌కు సరైన ఇన్సూరెన్స్ లేకపోయినా లేదా ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్‌తో మీరు సంతృప్తి చెందకపోయినా కింద పేర్కొన్న సులభమైన స్టెప్పులను ఉపయోగించి సెకండ్ హ్యాండ్ బైక్‌కు ఇన్సూరెన్స్ చేయించండి:
# చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆన్లైన్ సేవలు అందిస్తున్నాయి. కాబట్టి మీరు కావాలనుకుంటున్న కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
# మీ ఆర్సీ (RC) స్కాన్ కాపీని అక్కడ సమర్పిస్తే సరిపోతుంది. మీ ఇన్వాయిస్ కాపీ, గుర్తింపు కార్డు కాపీని ఆన్లైన్లో పోర్టల్‌లో సమర్పించాలి. లేదంటే మీరు ఏ నగరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో తెలిపితే సరిపోతుంది. మోడల్ పేరు, వేరియంట్, రిజిస్ట్రేషన్ తేదీ తదితర వివరాలను సమర్పించాలి.
# మీకు ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీ మీ బైక్ తనిఖీ కోసం ఓ తేదీని చెప్తుంది. అప్పుడు మీరు ప్రీమియం కట్టే సదుపాయం ఉంటుంది.
# ఆ తర్వాత మీరు ఎంత మాత్రం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. మీరు వెంటనే ఇన్సూరెన్స్ కాపీని పొందుతారు.
చివరగా మీరు మీ కలల బైక్‌ను పొందుతారు. మీ జీవితం ఎన్నో సాహసాలతో కూడుకున్నదే అయినా చాలా విలువైనది కూడా. మీరు కొనుగోలు చేసిన బైక్ ఇదివరకే వాడింది అయినా కానీ మీరు బైక్‌ను నడిపేటపుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు బైక్‌ను జాగ్రత్తగా నడపడం వలన అది కేవలం మిమ్మలను మాత్రమే కాకుండా రోడ్డు మీద వెళ్లే ఇతరులను కూడా కాపాడుతుంది.