Third-party premium has changed from 1st June. Renew now
బైక్‌కు ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది ఒక స్టాండలోన్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది డ్యామేజ్లు, నష్టాల నుంచి మీ సొంత వాహనాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. ప్రమాదం, తాకిడి, ప్రకృతి వైపరీత్యం లేదా అగ్నిప్రమాదం సంభవించడం వంటి వాటికి కూడా కవర్ అవుతుంది.
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టడంలో అర్థం ఏమిటి?
ఇంతకుముందు వరకు రెండు రకాల బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు మాత్రమే ఉండేవి. అయితే, ఇటీవల IRDAI ఇప్పటికే థర్డ్ పార్టీ పాలసీలు తీసుకున్న వ్యక్తులు తమ సొంత బైక్ డ్యామేజ్లు, నష్టాలను కూడా కవర్ చేసేకునేందుకు సహాయపడటానికి ఒక స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ కవర్‌ను ప్రవేశపెట్టింది.
బైక్‌లకు స్టాండలోన్ OD ఇన్సూరెన్స్ ఎలా పని చేస్తుంది?
దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఒక కొత్త వాహనాన్ని కొన్నారని అనుకుందాం. దానికి మీరు వెంటనే మూడు సంవత్సరాల లాంగ్ టర్మ్ థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ని లీగల్, థర్డ్ పార్టీ లయబలిటీల కోసం తీసుకున్నారని అనుకుందాం.
కానీ, ఒక సంవత్సరం తర్వాత మీరు మీ సొంత బైక్ యొక్క డ్యామేజ్ లేదా నష్టాల గురించి ఆలోచించారని అనుకుందాం. అప్పుడు మీరు మీ కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ వరకు వేచి ఉండాలి.
కానీ, ఇదే సందర్భంలో మీరు కేవలం మీ ఓన్ డ్యామేజ్ కవర్‌ను కొనుగోలు చేయాల్సింది. దీని ద్వారా తక్కువ ధరలో మీరు మీ బైక్‌ను సంరక్షించుకోవచ్చు.
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎవరు పొందాలి?
మీరు ఇటీవల బైక్ కొనుగోలు చేసి, ఇప్పటికే మీ బైక్ కొరకు Digit యొక్క థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేశారనుకుందాం. ఇప్పుడు మీరు మీ సొంత బైక్‌ను కూడా డ్యామేజ్లు, నష్టాల నుంచి సంరక్షించుకునేందుకు మీ టూ వీలర్ కోసం ఓన్ డ్యామేజ్ కవర్ కొనుగోలు చేయాలనీ మీరు అనుకోవచ్చు.
మీరు ఇప్పటికే మరో ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే, Digit ఇన్సూరెన్స్ నుంచి స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. తద్వారా నష్టాల నుంచి మీ సొంత బైక్ కూడా కవర్ చేయబడుతుంది.
OD ఇన్సూరెన్స్ కింద ఏమేం కవర్ అవుతాయి?
OD బైక్ ఇన్సూరెన్స్‌తో యాడ్-ఆన్ కవర్స్
దీన్ని మీ బైక్, దాని భాగాలకు సమర్థవంతమైన యాంటీ ఏజింగ్ క్రీమ్‌లాగా ఆలోచించండి. సాధారణంగా, క్లెయిమ్‌ల సమయంలో అవసరమైన తరుగుదల (డిప్రిషియేషన్) మొత్తం ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకోబడుతుంది. అయితే, జీరో డిప్రియేషన్ కవర్ ఎలాంటి తరుగుదల పరిగణనలోకి తీసుకోబడదని ధృవీకరిస్తుంది. అందువల్ల క్లెయిమ్‌ల సమయంలో రిపేర్/రీప్లేస్మెంట్ ఖర్చు యొక్క పూర్తి విలువను మీరు పొందుతారు.
ఒకవేళ మీ బైక్ దొంగిలించబడినా లేదా రిపేర్ చేయలేనంతగా డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉన్నట్లయితే, ఈ యాడ్-ఆన్ బాగా ఉపయోగపడుతుంది. ఇన్వాయిస్ కవర్ యాడ్-ఆన్ ద్వారా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులతో సహా మీకు సేమ్ లేదా అదేవిధమైన బైక్ పొందడానికి అయ్యే ఖర్చులను మేం కవర్ చేస్తాం.
మీ ఇంజన్‌ను మార్చడానికి అయ్యే అసలు ఖర్చు దాని మొత్తం ఖర్చులో సుమారు 40% అని మీకు తెలుసా? ఒక స్టాండర్డ్ టూ–వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో, ప్రమాద సమయంలో కలిగే నష్టాలు మాత్రమే కవర్ చేయబడతాయి. అయితే ఈ యాడ్–ఆన్‌తో ప్రమాదం తరువాత కలిగే ఏవైనా పర్యవసన నష్టాల కొరకు, మీ వాహనం యొక్క జీవితకాలం కొరకు మీరు ప్రత్యేకంగా కవర్ చేయవచ్చు. వాటర్ రిగ్రెషన్, లూబ్రికేటింగ్ ఆయిల్ లీక్ కావడం, అండర్ క్యారేజ్ డ్యామేజ్ల వల్ల ఇది జరగవచ్చు.
కన్జ్యూమబుల్ కవర్ మీ టూ–వీలర్‌కు మరింత రక్షణనిస్తుంది. ఈ యాడ్-ఆన్‌లో యాక్సిడెంట్ సమయంలో స్క్రూలు, ఇంజన్ ఆయిల్స్, నట్లు, బోల్ట్‌లు, గ్రీజ్ వంటి భాగాలను రీప్లేస్ చేయడానికి అయ్యే ఖర్చును కవర్ చేయబడతాయి.
ఏదైనా బ్రేక్‌డౌన్ అయినట్లయితే, మీకోసం, మీ టూ–వీలర్ కోసం మేం ఎల్లప్పుడూ ఉన్నామనే భరోసాను రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్–ఆన్ ఇస్తుంది. ఇందులో బెస్ట్ విషయం ఏంటి? మా సహాయం అడగడం కూడా క్లెయిమ్‌గా పరిగణించబడదు.
ఏమేం కవర్ కావు?
మీ వాహనం రక్షణ కోసం ఓన్ డ్యామేజ్ కవర్ మంచిది. అయితే, ఇక్కడ కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి.
ఇది స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి, మీ థర్డ్-పార్టీ లయబిలిటీలు ఇందులో చేర్చబడవు. మీ థర్డ్-పార్టీ వాహన ఇన్సూరెన్స్ దాని సంగతి చూసుకుంటుంది.
ఇది చట్ట విరుద్ధం. కాబట్టి మీరు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే క్లెయిమ్‌లు కవర్ చేయబడవు.
క్లెయిమ్ చేసే వ్యక్తి చట్టవిరుద్ధంగా డ్రైవింగ్ చేస్తున్నట్లయితే ఏ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఆమోదించబడవు అనేది ఒక స్టాండర్డ్ రూల్. కాబట్టి, మీరు సరైన డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేసినట్లయితే మాత్రమే క్లెయిమ్‌లు చేయవచ్చు.
మీరు ప్రత్యేకమైన యాడ్–ఆన్‌ను కొనుగోలు చేయకపోతే, దాని వల్ల వచ్చే ప్రయోజనాన్ని పొందలేరు!
యాక్సిండెంట్ జరిగినప్పుడు కాకుండా మిగతా సమయాల్లో అయ్యే డ్యామేజ్లు కవర్ కావు.
సింపుల్‌గా చెప్పాలంటే, చేయకూడని పనిని మీరు చేసినట్లయితే మీ వాహనం కవర్ చేయబడదని దీని అర్థం. ఉదాహరణకు; మీ నగరం వరదలకు గురైన సమయంలో మీ కారు లేదా బైక్‌ను వరదల్లోకి తీసుకెళ్లడం లాంటి పనులు చేసినప్పుడు.
చట్టం ప్రకారం, మీరు లెర్నర్ లైసెన్స్ మాత్రమే కలిగి ఉంటే, మీ వెంట శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉండాలి. అలా లేకపోతే, మీ వాహనం కవర్ చేయబడదు.
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను Digit నుంచే ఎందుకు కొనుగోలు చేయాలి?
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
మీ OD బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు లేదా రెన్యూ చేసిన తర్వాత కేవలం 3 స్టెప్స్‌లో డిజిటల్ పద్ధతిలో క్లెయిమ్ చేయవచ్చు!
స్టెప్ 1
1800-258-5956కి కాల్ చేయండి. ఎలాంటి ఫామ్‌లు నింపాల్సిన అవసరం లేదు.
స్టెప్ 2
సెల్ఫ్ ఇన్స్పెక్షన్ కోసం మీ మొబైల్ నెంబర్‌పై లింక్ పొందండి. మీ వాహన డ్యామేజ్లను మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా చెప్పిన విధంగా స్టెప్ల ప్రకారం చేయండి.
స్టెప్ 3
మా నెట్వర్క్ గ్యారేజీల్లో మీరు రిపేర్ సమయంలో రీఎంబర్స్మెంట్ లేదా క్యాష్‌లెస్ సర్వీస్‌ను ఎంచుకోవచ్చు
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేషన్
OD బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?
సాంకేతికంగా మాట్లాడుకుంటే, OD ప్రీమియం ఎలా లెక్కిస్తారనేది ఇక్కడ చూడండి:
IDV X [ప్రీమియం రేట్ (ఇన్సూరర్ ద్వారా నిర్ణయించబడుతుంది)] + [యాడ్-ఆన్స్ (ఉదా. బోనస్ కవరేజ్)] – [డిస్కౌంట్ & బెనిఫిట్లు (నో క్లెయిమ్ బోనస్, థెఫ్ట్ డిస్కౌంట్ మొదలైనవి)]
OD ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలి?
వాలంటరీ మినహాయింపులను పెంచండి: ఇది క్లెయిమ్‌ల సమయంలో మీరు చెల్లించడానికి ఎంచుకున్న అమౌంట్‌ను సూచిస్తుంది. అందువల్ల మీ ఫీజిబిలిటీ ఆధారంగా మీరు మీ వాలంటరీ మినహాయింపు (డిడక్టిబుల్) శాతాన్ని పెంచవచ్చు. ఇది నేరుగా మీ OD ప్రీమియంను తగ్గిస్తుంది.
సరైన IDVని డిక్లేర్ చేయండి: Digitతో మీకు మీరుగా మీ వాహనానికి సంబంధించిన IDVని కస్టమైజ్ చేయవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో మీ క్లెయిమ్ అమౌంట్‌ను, OD ప్రీమియంను IDV ప్రభావితం చేస్తుంది. కాబట్టి IDV ముందు నుంచే సరిగ్గా ఉండేలా చూసుకోండి.
మీ NCBని ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోకండి – ఇప్పటికే చెప్పుకున్నట్లు నో క్లెయిమ్ బోనస్ ద్వారా మీ OD ప్రీమియంపై డిస్కౌంట్ పొందవచ్చు. అదే సమయంలో దీనిని OD ప్రీమియం కొనుగోలు చేసే సమయంలో ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకోండి.
OD బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు
OD డ్యామేజ్స్ పాలసీకి సంబంధించిన ప్రీమియం మీ బైక్ సీసీ, బైక్ IDV ఆధారంగా లెక్కించబడుతుంది. వాటితో పాటు ఓన్ డ్యామేజ్ కవర్ ప్రీమియం అనేది కింది వాటిపై కూడా ఆధారపడుతుంది:
IDV అనేది మీ బైక్ యొక్క మార్కెట్ విలువను సూచిస్తుంది. అంటే దీని ఆధారంగా మీ OD ప్రీమియం ఎంత ఉంటుందనేది లెక్కించబడుతుంది.
మీ బైక్ సీసీ అనేది మీ బైక్‌కు ఎంత రిస్క్ ఉందనేది తెలుపుతుంది. అంటే మీ బైక్ సీసీ OD ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ సీసీ ఉంటే ఎక్కువ OD ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.
మీ బైక్ ఎప్పుడు తయారైంది, దాని మోడల్ ఏదనేదానిపై కూడా OD ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ప్రీమియం బైక్ అయితే దానికి OD ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
మీ బైక్ వయసును బట్టి OD ప్రీమియం మారుతుంది. మీ బైక్ వయస్సు ఎంత ఎక్కువైతే OD ప్రీమియం అంత తక్కువ ఉంటుంది!
మీరు గతంలో ఓన్ డ్యామేజ్ కవర్ ఉన్న కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్‌ను తీసుకొని, దానిని క్లెయిమ్ చేసుకోకపోతే మీరు నో క్లెయిమ్ బోనస్‌ను ట్రాన్స్ఫర్ చేసుకొని OD ప్రీమియం మీద డిస్కౌంట్ పొందవచ్చు.
ప్రతి యాడ్-ఆన్ భిన్నమైనదే. కాబట్టి మీరు ఎంచుకునే యాడ్–ఆన్‌లు, ఎన్ని ఎంచుకున్నారనే దానిపై కూడా OD ప్రీమియం ఆధారపడి ఉంటుంది.
పోల్చండి: థర్డ్ పార్టీ, ఓన్ డ్యామేజ్ & కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ | ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ | కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ |
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది బైక్ ఇన్సూరెన్స్‌లో ప్రాథమికమైనది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతీ బైక్ ఓనర్ తన బైక్‌ను నడపాలంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. | బైక్ ఓన్ డ్యామేజ్లను, నష్టాలను కవర్ చేయడానికి అందుబాటులో ఉన్న స్టాండలోన్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీనే ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్. | థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్, ఓన్ డ్యామేజ్ కవర్‌ను కలిపితే కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అవుతుంది. ఇది మీకు థర్డ్ పార్టీ డ్యామేజ్లతో పాటు మీ సొంత బైక్ డ్యామేజ్లను కూడా కవర్ చేస్తుంది. |
థర్డ్ పార్టీ లయబిలిటీలను కవర్ చేయడానికి తప్పకుండా బైక్ ఇన్సూరెన్స్ ఉండాలని చట్టంలో పేర్కొనబడింది. | ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని చట్టంలో ఏమీ లేదు. కానీ ఇది నడిపేవారికి ఉపయోగపడుతుంది. ఇది సొంత డ్యామేజ్లు, నష్టాలను కవర్ చేస్తుంది. | కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరేమీ కాదు. కానీ, ఇది అత్యుత్తమ పాలసీ. ఎందుకంటే దీనిలో దాదాపుగా అన్నీ కవర్ అవుతాయి. |
ప్రతీ బైక్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కు అర్హత కలిగి ఉంటుంది. | థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కలిగిన బైకులకు మాత్రమే స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. | ఏ బైక్‌కు అయినా కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ దాదాపు అన్ని అవసరాలను తీరుస్తుంది. దీనిని తీసుకున్నాక వేరే ఏ బైక్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించనక్కర్లేదు. |
ఈ పాలసీపై యాడ్-ఆన్‌లు అందుబాటులో ఉండవు. | యాడ్–ఆన్‌లు అందుబాటులో ఉంటాయి. | యాడ్–ఆన్‌లు అందుబాటులో ఉంటాయి. |
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
ఒకే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ దగ్గర నేను స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ కవర్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలా?
అవసరం లేదు. ఒకే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ దగ్గరే స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ కవర్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలన్న నియమేమీ లేదు.
ఎన్ని రకాల బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి?
ఎన్ని రకాల బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి?
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ కొనడానికి ఎవరు అర్హులు?
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉన్న ఎవరైనా తమ బైక్‌కు డ్యామేజ్లు, నష్టాలను కవర్ చేయడానికి ఓన్ డ్యామేజ్ పాలసీని తీసుకోవడానికి అర్హులవుతారు.
OD అన్నింటిని పర్సనల్ యాక్సిడెంట్‌తో సహా కవర్ చేస్తుందా?
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది ప్రతి బైక్ ఓనర్‌కు తప్పనిసరి. ఇది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో ఉంటుంది. ఒకవేళ మీకు లేకపోతే OD దీనిని కవర్ అయ్యేలా ఎంచుకోవచ్చు.
చట్టం ప్రకారం ఏ బైక్ ఇన్సూరెన్స్ తప్పనిసరి?
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ప్రతీ బైక్ ఓనర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి. ఇది లేకుండా భారతదేశంలో బైక్ నడపడం చట్ట విరుద్ధం. అది ట్రాఫిక్ పెనాల్టీలకు దారి తీయవచ్చు.