బైక్‌కు ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది ఒక స్టాండలోన్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది డ్యామేజ్‌లు, నష్టాల నుంచి మీ సొంత వాహనాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. ప్రమాదం, తాకిడి, ప్రకృతి వైపరీత్యం లేదా అగ్నిప్రమాదం సంభవించడం వంటి వాటికి కూడా కవర్ అవుతుంది.
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టడంలో అర్థం ఏమిటి?
ఇంతకుముందు వరకు రెండు రకాల బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు మాత్రమే ఉండేవి. అయితే, ఇటీవల IRDAI ఇప్పటికే థర్డ్ పార్టీ పాలసీలు తీసుకున్న వ్యక్తులు తమ సొంత బైక్ డ్యామేజ్‌లు, నష్టాలను కూడా కవర్ చేసేకునేందుకు సహాయపడటానికి ఒక స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ కవర్‌ను ప్రవేశపెట్టింది.
బైక్‌లకు స్టాండలోన్ OD ఇన్సూరెన్స్ ఎలా పని చేస్తుంది?
దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఒక కొత్త వాహనాన్ని కొన్నారని అనుకుందాం. దానికి మీరు వెంటనే మూడు సంవత్సరాల లాంగ్ టర్మ్ థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ని లీగల్, థర్డ్ పార్టీ లయబలిటీల కోసం తీసుకున్నారని అనుకుందాం.
కానీ, ఒక సంవత్సరం తర్వాత మీరు మీ సొంత బైక్ యొక్క డ్యామేజ్ లేదా నష్టాల గురించి ఆలోచించారని అనుకుందాం. అప్పుడు మీరు మీ కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ వరకు వేచి ఉండాలి.
కానీ, ఇదే సందర్భంలో మీరు కేవలం మీ ఓన్ డ్యామేజ్ కవర్‌ను కొనుగోలు చేయాల్సింది. దీని ద్వారా తక్కువ ధరలో మీరు మీ బైక్‌ను సంరక్షించుకోవచ్చు.
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎవరు పొందాలి?
OD ఇన్సూరెన్స్ కింద ఏమేం కవర్ అవుతాయి?
OD బైక్ ఇన్సూరెన్స్‌తో యాడ్-ఆన్ కవర్స్
ఏమేం కవర్ కావు?
మీ వాహనం రక్షణ కోసం ఓన్ డ్యామేజ్ కవర్ మంచిది. అయితే, ఇక్కడ కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి.
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను Digit నుంచే ఎందుకు కొనుగోలు చేయాలి?
మీ OD బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ సూపర్ ఈజీ క్లెయిమ్ ప్రాసెస్‌తో రావడం మాత్రమే కాకుండా, క్యాష్‌లెస్ సెటిల్మెంట్ను ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
మీ OD బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు లేదా రెన్యూ చేసిన తర్వాత కేవలం 3 స్టెప్స్‌లో డిజిటల్ పద్ధతిలో క్లెయిమ్ చేయవచ్చు!
స్టెప్ 1
1800-258-5956కి కాల్ చేయండి. ఎలాంటి ఫామ్‌లు నింపాల్సిన అవసరం లేదు.
స్టెప్ 2
సెల్ఫ్ ఇన్స్పెక్షన్ కోసం మీ మొబైల్ నెంబర్‌పై లింక్ పొందండి. మీ వాహన డ్యామేజ్‌లను మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా చెప్పిన విధంగా స్టెప్ల ప్రకారం చేయండి.
స్టెప్ 3
మా నెట్వర్క్ గ్యారేజీల్లో మీరు రిపేర్ సమయంలో రీఎంబర్స్మెంట్ లేదా క్యాష్‌లెస్ సర్వీస్‌ను ఎంచుకోవచ్చు
Digit ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత వేగంగా సెటిల్ అవుతాయి?
మీ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన, మీ మదిలో రావాల్సిన మొదటి ప్రశ్న. మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు!
Digit క్లెయిమ్స్ రిపోర్టును చదవండిఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేషన్
OD బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?
సాంకేతికంగా మాట్లాడుకుంటే, OD ప్రీమియం ఎలా లెక్కిస్తారనేది ఇక్కడ చూడండి:
IDV X [ప్రీమియం రేట్ (ఇన్సూరర్ ద్వారా నిర్ణయించబడుతుంది)] + [యాడ్-ఆన్స్ (ఉదా. బోనస్ కవరేజ్)] – [డిస్కౌంట్ & బెనిఫిట్లు (నో క్లెయిమ్ బోనస్, థెఫ్ట్ డిస్కౌంట్ మొదలైనవి)]
OD ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలి?
వాలంటరీ మినహాయింపులను పెంచండి: ఇది క్లెయిమ్‌ల సమయంలో మీరు చెల్లించడానికి ఎంచుకున్న అమౌంట్‌ను సూచిస్తుంది. అందువల్ల మీ ఫీజిబిలిటీ ఆధారంగా మీరు మీ వాలంటరీ మినహాయింపు (డిడక్టిబుల్) శాతాన్ని పెంచవచ్చు. ఇది నేరుగా మీ OD ప్రీమియంను తగ్గిస్తుంది.
సరైన IDVని డిక్లేర్ చేయండి: Digitతో మీకు మీరుగా మీ వాహనానికి సంబంధించిన IDVని కస్టమైజ్ చేయవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో మీ క్లెయిమ్ అమౌంట్‌ను, OD ప్రీమియంను IDV ప్రభావితం చేస్తుంది. కాబట్టి IDV ముందు నుంచే సరిగ్గా ఉండేలా చూసుకోండి.
మీ NCBని ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోకండి – ఇప్పటికే చెప్పుకున్నట్లు నో క్లెయిమ్ బోనస్ ద్వారా మీ OD ప్రీమియంపై డిస్కౌంట్ పొందవచ్చు. అదే సమయంలో దీనిని OD ప్రీమియం కొనుగోలు చేసే సమయంలో ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకోండి.
OD బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు
OD డ్యామేజ్స్ పాలసీకి సంబంధించిన ప్రీమియం మీ బైక్ సీసీ, బైక్ IDV ఆధారంగా లెక్కించబడుతుంది. వాటితో పాటు ఓన్ డ్యామేజ్ కవర్ ప్రీమియం అనేది కింది వాటిపై కూడా ఆధారపడుతుంది:
పోల్చండి: థర్డ్ పార్టీ, ఓన్ డ్యామేజ్ & కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ |
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ |
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ |
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది బైక్ ఇన్సూరెన్స్‌లో ప్రాథమికమైనది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతీ బైక్ ఓనర్ తన బైక్‌ను నడపాలంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. |
బైక్ ఓన్ డ్యామేజ్‌లను, నష్టాలను కవర్ చేయడానికి అందుబాటులో ఉన్న స్టాండలోన్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీనే ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్. |
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్, ఓన్ డ్యామేజ్ కవర్‌ను కలిపితే కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అవుతుంది. ఇది మీకు థర్డ్ పార్టీ డ్యామేజ్లతో పాటు మీ సొంత బైక్ డ్యామేజ్‌లను కూడా కవర్ చేస్తుంది. |
థర్డ్ పార్టీ లయబిలిటీలను కవర్ చేయడానికి తప్పకుండా బైక్ ఇన్సూరెన్స్ ఉండాలని చట్టంలో పేర్కొనబడింది. |
ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని చట్టంలో ఏమీ లేదు. కానీ ఇది నడిపేవారికి ఉపయోగపడుతుంది. ఇది సొంత డ్యామేజ్‌లు, నష్టాలను కవర్ చేస్తుంది. |
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరేమీ కాదు. కానీ, ఇది అత్యుత్తమ పాలసీ. ఎందుకంటే దీనిలో దాదాపుగా అన్నీ కవర్ అవుతాయి. |
ప్రతీ బైక్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కు అర్హత కలిగి ఉంటుంది. |
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కలిగిన బైకులకు మాత్రమే స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. |
ఏ బైక్‌కు అయినా కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ దాదాపు అన్ని అవసరాలను తీరుస్తుంది. దీనిని తీసుకున్నాక వేరే ఏ బైక్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించనక్కర్లేదు. |
ఈ పాలసీపై యాడ్-ఆన్‌లు అందుబాటులో ఉండవు. |
యాడ్–ఆన్‌లు అందుబాటులో ఉంటాయి. |
యాడ్–ఆన్‌లు అందుబాటులో ఉంటాయి. |