టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో యాడ్–ఆన్ కవర్ అంటే ఏమిటి?
చాలా మంది కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మీ వాహనానికి అయిన ఖర్చులను అన్నింటినీ కవర్ చేస్తుందని మేము నమ్ముతాం. ఏం కాదంటారా?
సరే ఈ విషయాన్ని అలా పక్కన పెట్టండి. మీరు మీ ఫేవరేట్ పిజ్జాను ఆర్డర్ చేశారని అనుకుందాం. దాని రుచి చాలా బాగుంటుంది. కానీ ఇంకా ఆ పిజ్జా మీద యాడ్–ఆన్స్ వంటి సాస్, పికిల్డ్ పెప్పర్, ఆలివ్స్ వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఏంటి నోరు ఊరుతోందా?😊
అచ్చం ఇలాగే.. మీ టూ వీలర్ కాంప్రహెన్సివ్ ప్లాన్స్ విషయంలో కూడా అనేక బీమా సంస్థలు మీకు నచ్చిన యాడ్–ఆన్స్‌ను అందిస్తున్నాయి. వీటిని ఎంచుకోవడం వలన మీ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మరింత రక్షణనిస్తుంది.
మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో బాగా ఉపయోగపడే టాప్ 5 యాడ్–ఆన్ కవర్లను మేము మీకు సిఫారసు చేస్తున్నాం. బేసిక్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కంటే తక్కువ ఖర్చులోనే ఈ యాడ్–ఆన్స్ లభిస్తాయి. ఇవి మీ జేబుకు చిల్లు పెడతాయని అస్సలుకే చింతించకండి. ఇవి వాటి కోసం ఖర్చు చేసిన ప్రతీ రూపాయికి న్యాయం చేస్తాయి.
చెక్ (Check): యాడ్–ఆన్స్‌తో ప్రీమియం ఎంత పడుతుందో టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించి లెక్కించండి.
డిజిట్ అందించే టూ వీలర్ ఇన్సూరెన్స్ యాడ్–ఆన్లు
యాడ్–ఆన్స్ తీసుకున్న తర్వాత మీరు చాలా నిశ్చింతగా బండి నడుపుకోవచ్చు. మీకు కేవలం సెక్యూరిటీ మాత్రమే కాదు సూపర్ సెక్యూరిటీ అందుతుంది. 😊