Third-party premium has changed from 1st June. Renew now
హెవీ వెహికిల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
హెవీ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్‌లలో ఓ రకం. హెవీ డ్యూటీ వెహికిల్స్‌ను కవర్ చేసేందుకు ఇది అత్యుత్తమమైది. బుల్డోజర్లు, క్రేన్లు, లారీలు, ట్రయిలర్లు మొదలయినవి. థర్డ్ పార్టీ హెవీ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది మీ వాహనానం వలన థర్డ్ పార్టీ వాహనాలకు సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. మీరు కాంప్రహెన్సివ్ హెవీ వెహికిల్ ఇన్సూరెన్స్‌ను తీసుకున్నట్లయితే అది మీ వాహనాన్ని థర్డ్ పార్టీ ప్రమాదాల నుంచి మాత్రమే కాకుండా స్వంత డ్యామేజీల నుంచి కూడా కాపాడుతుంది. మీ వాహనానికి అధిక రక్షణను కల్పిస్తుంది.
హెవీ వెహికల్స్‌లో రకాలు
భారతదేశంలో చాలా రకాల హెవీ డ్యూటీ వెహికిల్స్ ఉన్నాయి. కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్‌లో కవర్ అయ్యే వాహనాల వివరాలు కింద పేర్కొనబడ్డాయి. అవేంటంటే..
- బుల్డోజర్స్ – హెవీ డ్యూటీ వెహికిల్స్‌ను ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉపయోగిస్తారు. ఇసుక మట్టిని ముందుకు, వెనక్కు జరిపేందుకు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. హెవీ వెహికిల్ ఇన్సూరెన్స్ కింద కూడా ఇవి కవర్ అవుతాయి.
- క్రేన్స్ – క్రేన్లను కూడా ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లోనే ఉపయోగిస్తారు. వీటికి కూడా కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కింద ఇన్సూరెన్స్ చేయించవచ్చు.
- బ్యాక్‌హో డిగ్గర్ – బ్యాక్‌హో డిగ్గర్లను కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లోనే ఉపయోగిస్తారు. ఇవి మరో రకమైన హెవీ డ్యూటీ వెహికిల్స్.
- ట్రయిలర్స్ – అన్ని రకాల ట్రయిలర్లను రవాణా చేసేందుకు ఉపయోగిస్తారు. వివిధ రంగాల్లో వీటిని వాడుతారు. వీటికి కూడా హెవీ డ్యూటీ కమర్షియల్ వెహికిల్స్ కింద ఇన్సూరెన్స్ చేయొచ్చు.
- లారీలు – టిప్పర్ ట్రక్కులు, లారీలను భారతదేశంలో ఎక్కువగా వాడుతారు. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి పెద్ద ఎత్తున సరుకులను తరలించేందుకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
డిజిట్ అందించే హెవీ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
హెవీ వెహికిల్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
ఏమేం కవర్ కావు?
ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటపుడు ఏమేం కవర్ అవుతాయో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కవర్ కాని విషయాల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కవర్ కాని అంశాల గురించి మీకు తెలియకపోతే క్లెయిమ్ చేసేటపుడు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
మీకు థర్డ్ పార్టీ పాలసీ మాత్రమే ఉండి, ఏదైనా ప్రమాదంలో మీకు డ్యామేజీలు జరిగితే కవర్ కావు.
మీ ఆటో రిక్షాకు ప్రమాదం జరిగినప్పుడు ఆ రిక్షాను నడిపే వ్యక్తి మద్యం సేవించి ఉన్నా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా ఇన్సూరెన్స్ కవర్ కాదు.
ఆటో రిక్షాకు డ్రైవర్ లేదా యజమాని వ్యక్తిగత నిర్లక్ష్యం వలన ఏదైనా డ్యామేజ్ జరిగితే (ఉదా. మీ నగరంలో వరదలు వస్తుంటే మీరు వాహనం తీసుకుని బయటకు వెళ్లినప్పుడు)
ప్రమాదాలు, ప్రకృతి విపత్తులతో సంబంధం లేని డ్యామేజీలు.
డిజిట్ అందించే హెవీ వెహికిల్ ఇన్సూరెన్స్‌లో ముఖ్యమైన ఫీచర్లు
ముఖ్యమైన ఫీచర్లు | డిజిట్ ప్రయోజనం |
---|---|
క్లెయిమ్ ప్రక్రియ | పేపర్‌లెస్ క్లెయిమ్స్ |
కస్టమర్ సపోర్ట్ | 24x7 సపోర్ట్ |
అదనపు కవరేజీ | పీఏ కవర్, లీగల్ లయబులిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు మొదలయినవి |
థర్డ్ పార్టీకి డ్యామేజ్ జరిగినప్పుడు | వ్యక్తిగత డ్యామేజీలు జరిగినప్పుడు అపరిమిత లయబులిటీ, వాహన లేదా ప్రాపర్టీ డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ |
హెవీ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు 11
మీ హెవీ డ్యూటీ వాహనం రకం, ఎన్ని వాహనాలకు మీరు ఇన్సూరెన్స్ చేయించాలని అనుకుంటున్నారనే దాని ఆధారంగా, మేము ప్రధానంగా రెండు రకాల ప్లాన్లను అందిస్తున్నాం.
లయబులిటీ ఓన్లీ | స్టాండర్డ్ ప్యాకేజ్ |
మీ హెవీ వెహికిల్ వలన ఎవరైనా థర్డ్ పార్టీ పర్సన్ లేదా ప్రాపర్టీకి డ్యామేజ్ అయితే |
|
ఇన్సూరెన్స్ చేయించిన మీ హెవీ వెహికిల్‌ను టోయింగ్ చేసేటపుడు ఎవరైనా థర్డ్ పార్టీ పర్సన్ లేదా ప్రాపర్టీకి డ్యామేజ్ అయినపుడు |
|
ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, యాక్సిడెంట్స్ వలన జరిగే నష్టాలు, డ్యామేజీలు. |
|
హెవీ వెహికిల్ ఓనర్ కానీ, డ్రైవర్ కానీ గాయాల పాలయినా లేక చనిపోయినాIf the owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
|
Get Quote | Get Quote |
ఎలా క్లెయిమ్ చేయాలి?
1800-258-5956 అనే నెంబర్‌కు కాల్ చేయండి. లేదా hello@godigit.com అనే మెయిల్ ఐడీకి మెయిల్ చేస్తే సరిపోతుంది.
మీ పాలసీ వివరాలను దగ్గర ఉంచుకోండి. పాలసీ నెంబర్, ప్రమాదం ఎక్కడ జరిగింది, ప్రమాదం జరిగిన తేదీ, సమయం, ఇన్సూరర్ కాంటాక్ట్ నెంబర్‌ను కలిగి ఉండటం వలన మా పని మరింత సులువు అవుతుంది.
హెవీ వెహికల్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?
హెవీ డ్యూటీ వాహనాలు ఏదైనా వ్యాపారం కోసం ఆపరేషనల్ ఇన్వెస్ట్ మెంట్ లో పెద్ద భాగం. ఒక వ్యాపారం చేయవలసిన కనీస పని.. దానిని ఇన్సూరెన్స్ తో సంరక్షించడం, ఇది అవసరమైన సమయాల్లో నష్టాలను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.
మోటారు వాహన చట్టం ప్రకారం, కమర్షియల్ వాహనాలతో సహా అన్ని వాహనాలకు కనీసం థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి. ఇది లేకుంటే మీరు భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది మరియు ఇతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మీ హెవీ డ్యూటీ వెహికల్ కి ఇన్సూరెన్స్ చేయడం వల్ల మీ వ్యాపారం నష్టాల నుండి రక్షించబడటమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు, మంటలు, ప్రమాదాలు మరి యాక్సిడెంట్లు వంటి ఊహించని పరిస్థితులలో మీ వాహనాన్ని మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది.
భారతదేశంలో ఆన్లైన్లో తీసుకునే హెవీ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన FAQలు
హెవీ వెహికిల్ ఇన్సూరెన్స్ డ్రైవర్‌కు కూడా వర్తిస్తుందా?
అవును వర్తిస్తుంది. హెవీ డ్యూటీ వెహికిల్‌కు కమర్షియల్ ఇన్సూరెన్స్ చేయిస్తే ఆ ట్రక్కు ఓనర్ లేదా డ్రైవర్‌కు కూడా వర్తిస్తుంది.
హెవీ డ్యూటీ వెహికిల్‌కు ఇన్సూరెన్స్ చేయించడం తప్పనిసరా?
అవును. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ చేయించడం తప్పనిసరి. ఇన్సూరెన్స్ లేకపోతే భారతదేశంలోని రోడ్ల మీద తిరగడం సాధ్యపడదు. ఏదేమైనప్పటికీ హెవీ వెహికిల్స్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగు పాలసీని తీసుకోవడం మంచిది. అదనపు ప్రయోజనాల కోసం యాడ్–ఆన్ కవర్లను కూడా ఎంచుకోవచ్చు.
హెవీ డ్యూటీ వెహికిల్‌కు కమర్షియల్ ఇన్సూరెన్స్ చేయించేందుకు ఎంత ఖర్చవుతుంది?
ఇది మీరు ఎటువంటి హెవీ డ్యూటీ వెహికిల్‌కు ఇన్సూరెన్స్ చేయాలని చూస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఆ వెహికిల్ తిరిగే సిటీ కూడా పరిగణనలోకి తీసుకోబడుతుంది. మీ వాహనానికి ఇన్సూరెన్స్ చేయించడం కోసం ఎంత ఖర్చవుతుందనేది మీరు ఇక్కడ తనిఖీ చేయొచ్చు.
కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఎన్ని వాహనాలను కవర్ చేయొచ్చు?
ప్రతి ఒక కమర్షియల్ వెహికిల్ ప్రత్యేక ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఒకే పాలసీ కింద మీరు ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కవర్ చేయలేరు.