గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్

గూడ్స్ క్యారీయింగ్ వాహనాలకు కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్

Third-party premium has changed from 1st June. Renew now

దీని పేరు సూచించినట్టే గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది ఒక కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్. ఇది సరుకులను (గూడ్స్​ను) ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేయడానికి ఉపయోగించే కమర్షియల్ వాహనాలను సంరక్షించేందుకు రూపొందించబడింది. సాధారణంగా ఈ వాహనాలు ఎక్కువ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున ప్రమాదాలు, ఢీ కొనడం, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాల వంటి అనిశ్చిత పరిస్థితుల్లో కలిగే నష్టాలను గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

 

సరుకులు రవాణా చేసే (గూడ్స్ క్యారీయింగ్) వాహనాల రకాలు:

భారతదేశంలోని వివిధ వ్యాపారాల స్వభావం ఆధారంగా వివిధ రకాల సరుకు రవాణా వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సరుకు రవాణా వాహనాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు:

  • ట్రక్కులు- ట్రక్కులు వివిధ ఆకారాలు, పరిమాణాల్లో ఉంటాయి. రోజువారీ నిత్యావసరాలను డెలివరీ చేసే చిన్న ట్రక్కుల నుంచి ఫర్నీచర్, ఉపకరణాల వంటి వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగించే పెద్ద ట్రక్కుల వరకు ఉంటాయి. అన్ని రకాల సరుకు రవాణా ట్రక్కులన్నీ కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ అవుతాయి.
  • టెంపోలు- ట్రక్కులతో పోలిస్తే టెంపోలు కాస్త చిన్నవిగా ఉంటాయి. ఏదైనా నగరం పరిధిలో సరుకుల రవాణా, డెలివరీ కోసం వీటిని ఎక్కువగా వాడుతారు. గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ కింద కూడా వీటిని కవర్ చేయవచ్చు.
  • త్రీవీల్ వెహికిల్స్- కార్గో ఆటోలు లేదా త్రీ వీల్ వెహికల్స్ అంటే నగరంలో చిన్నపాటి సరుకులను మోసుకెళ్లే వాహనాలు. నగరం లోపల సరుకులను డెలివరీ చేసేందుకు వినియోగిస్తారు. ఇవి పరిమాణంలో చిన్నవి కాబట్టి ట్రక్కులు, ట్రాయిలర్లతో పోలిస్తే ఇవి తక్కువ ప్రమాదాలకు గురవుతాయి. అయినా కానీ ఎక్కువ రక్షణ, వ్యాపారానికి తక్కువ నష్టం జరిగేలా ఉండేందుకు గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ కింద ఇవి కవర్ చేయబడతాయి.
  • ట్రాయిలర్లు- ట్రాయిలర్లు పెద్ద పెద్ద వస్తువులను మోసే వాహనాలు; తరచూ భారీ వస్తువుల రవాణా కోసం దేశవ్యాప్తంగా వీటిని ఉపయోగిస్తారు. వీటితో ఉన్న రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని, గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ కింద వీటిని కవర్ చేయడం తప్పనిసరి.
  • టిప్పర్లు- టిప్పర్లు ఒక రకమైన సరుకులను మోసే భారీ వాహనాలు; తరచూ నిర్మాణ వస్తువులను రవాణా చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. సంభావ్య ప్రమాదాల నుంచి రక్షించడానికి, డిజిట్ యొక్క కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కూడా వీటిని కూడా కవర్ చేయవచ్చు.

డిజిట్ అందించే గూడ్స్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్‌నే ఎందుకు ఎంచుకోవాలి?

గూడ్స్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?

ఏమేం కవర్ చేయబడవు?

మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఆశ్చర్యాలు కలగకుండా ఉండేందుకు మీ గూడ్స్ క్యారీయింగ్​ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ ఏమేం కవర్ చేయదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి:

థర్డ్-పార్టీ పాలసీ కలిగి ఉన్న వ్యక్తికి సొంత డ్యామేజీ అయితే

మీరు మీ కమర్షియల్ వాహనం కోసం థర్డ్-పార్టీ కమర్షియల్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉండి ఉంటే, మీకు జరిగే సొంత డ్యామేజీలు, నష్టాలు కవర్ కావు.

మద్యం సేవించి బండి నడపడం, లేదా సరైన లైసెన్స్ లేకుండా నడిపితే

క్లెయిమ్ సమయంలో డ్రైవర్-యజమాని సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మద్యం మత్తులో ఇన్సూరెన్స్​ చేయబడిన వాహనాన్ని నడిపారని గుర్తిస్తే క్లెయిమ్ ఆమోదించబడదు.

స్వీయ నిర్లక్ష్యం

స్వీయ నిర్లక్ష్యం కారణంగా మీ సరుకు రవాణా వాహనానికి సంభవించే డ్యామేజీలు లేదా నష్టాలు దీనిలో కవర్ చేయబడవు. ఉదాహరణకు, మీ నగరంలో వరదలు వచ్చినప్పుడు, ఆ విషయం తెలిసి కూడా మీరు మీ వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ఇన్సూరెన్స్ కవర్ కాదు.

పర్యావసాన నష్టాలు

ఏవైనా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా అగ్నిప్రమాదం వల్ల నేరుగా జరగని డ్యామేజీలు, నష్టాలు కవర్ చేయబడవు. అంటే, ఈ ఘటనల వల్ల కాకుండా తదనంతర కాలంలో వాటి పర్యావసానాల వల్ల జరిగే నష్టాలు.

డిజిట్ అందించే గూడ్స్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ ముఖ్య లక్షణాలు

ముఖ్యమైన ఫీచర్లు డిజిట్ ప్రయోజనం
క్లెయిమ్ ప్రక్రియ పేపర్ లెస్ క్లెయిమ్స్
కస్టమర్ సపోర్ట్ 24x7 సపోర్ట్
అడిషనల్ కవరేజీ పీఏ కవర్స్, లీగల్ లయబిలిటీ కవర్స్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు తదితరాలు
థర్డ్ పార్టీకి జరిగే డ్యామేజీలు వ్యక్తిగత డ్యామేజీకి అపరిమిత లయబిలిటీ, ఆస్తి లేదా వాహనం డ్యామేజీకి రూ. 7.5 లక్షల వరకు

గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల రకాలు11

మీ హెవీ డ్యూటీ వాహనం రకం, మీరు ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్న వాహనాల సంఖ్య ఆధారంగా, మీరు ఎంపిక చేసుకోగల రెండు ప్రాథమిక ప్లాన్‌లను మేం మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.

లయబిలిటీ ఓన్లీ స్ఠాండర్డ్ ప్యాకేజీ

మీ గూడ్స్​ క్యారీయింగ్​ వెహికిల్​ వల్ల ఏదైనా థర్డ్​ పార్టీ ప్రాపర్టీకి కానీ, వ్యక్తికి గానీ జరిగే డ్యామేజ్​

×

మీ ఇన్సూరెన్స్​ చేయబడిన గూడ్స్​ క్యారీయింగ్​ వెహికిల్​తో టోయింగ్​ చేస్తున్న వెహికిల్​ ఏదైనా థర్డ్​ పార్టీ వ్యక్తి లేదా ప్రాపర్టీకి డ్యామేజీ కలిగించినప్పుడు

×

ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, దొంగతనం, ప్రమాదాల వల్ల సొంత గూడ్స్​ క్యారీయింగ్​ వెహికిల్​కు జరిగే నష్టాలు లేదా డ్యామేజీలు

×

గూడ్స్​ క్యారీయింగ్​ వెహికిల్​ యొక్క యజమాని–డ్రైవర్​ గాయాలపాలైనా/మరణించినా

If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before

×
Get Quote Get Quote

ఎలా క్లెయిమ్ చేయాలి?

1800-258-5956 నెంబర్​కు కాల్ చేయండి. లేదా hello@godigit.com కు మెయిల్ పంపండి.

పాలసీ నెంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ, సమయం, ఇన్సూరెన్స్ పాలసీదారుడి రిజిస్టర్డ్​ మొబైల్ నెంబర్ వంటి వాటిని దగ్గర ఉంచుకోండి. వీటిని దగ్గరగా ఉంచుకోవడం వలన క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభంగా పూర్తవుతుంది.

డిజిట్ క్లెయిమ్స్ ఎంత త్వరగా సెటిల్ అవుతాయి? ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు ప్రతి ఒక్కరికీ వచ్చే మొదటి ప్రశ్న ఇదే. ఇలా ప్రశ్నించుకోవడం సరైన పద్ధతే. డిజిట్ క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డ్​ను చదవండి

నేను గూడ్స్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్​ను ఎందుకు కొనుగోలు చేయాలి?

  • మీ సరుకు రవాణా వాహనానికి ఇన్సూరెన్స్ చేయడం వల్ల ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఢీకొట్టడాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల వంటి అనూహ్య పరిస్థితుల కారణంగా సంభవించే మీ వ్యాపార రిస్కులను, నష్టాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.
  • మోటారు వాహన చట్టం ప్రకారం, సరుకు రవాణా వాహనాలు సహా అన్ని వాహనాలకు కనీసం థర్డ్-పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయినా ఉండాలి. ఎందుకంటే అది అనుకోకుండా జరిగే అవకాశమున్న ఏదైనా థర్డ్ పార్టీ డ్యామేజీలు, నష్టాలను కవర్ చేయడానికి సహాయపడుతుంది.
  • భారీ వాహనాలు, పెద్ద పెద్ద సరుకులు రవాణా చేసే వాహనాలు ఎక్కువ శాతం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది; వాహనం పరిమాణం, వాణిజ్యపరమైన ప్రయోజనం కారణంగా జరిగే ఆ అవకాశం ఉంది. వెహికిల్ ఇన్సూరెన్స్​తో కూడిన వస్తువులు అగ్ని ప్రమాదాలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనాల వంటి అనుకోకుండా జరిగే అవకాశమున్న ప్రమాదాల నుంచి కవర్ అయ్యేందుకు సహాయపడతాయి.

భారతదేశంలో గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో పొందడం గురించి తరచూ అడిగే ప్రశ్నలు

గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ డ్రైవర్‌కు కూడా వర్తిస్తుందా?

అవును, సరుకు రవాణా వాహనాలకు ఇచ్చే ఈ కమర్షియల్ వెహికిల్​ ఇన్సూరెన్స్ యజమాని-డ్రైవర్‌కు కూడా వర్తిస్తుంది.

హెవీ డ్యూటీ వాహనానికి ఇన్సూరెన్స్ చేయడం తప్పనిసరా?

అవును. మోటారు వాహన చట్టం ప్రకారం, దేశ రహదారులపై చట్టబద్ధంగా నడపడానికి మీ సరుకు రవాణా వాహనానికి కనీసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అయినా కలిగి ఉండటం తప్పనిసరి.

గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్స్ ఇన్సూరెన్స్ కింద సరుకులు (గూడ్స్​) కూడా కవర్ అవుతాయా?

లేదు, కుదరదు. వెహికిల్ ఇన్సూరెన్స్​ను కలిగి ఉన్న సరుకు రవాణా వాహనం డ్యామేజీ/నష్టాల నుంచి, యజమాని-డ్రైవర్‌కు అయ్యే ఏవైనా శారీరక గాయాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

సరుకు రవాణా వాహనానికి కమర్షియల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది?

ఇది మీరు ఇన్సూరెన్స్​ చేయాలనుకుంటున్న సరుకు రవాణా వాహనం రకం, దాన్ని ఏ నగరంలో నడుపుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ గూడ్స్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​ కోసం ఎంత ప్రీమియం ఉండవచ్చనే దాని గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.