జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

అసలు జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ అనేది ఒక కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​  పాలసీ. ఈ ఇన్సూరెన్స్​ ద్వారా మీకు సున్నా డిప్రిషియేషన్​ కలపబడుతుంది. ఈ ఇన్సూరెన్స్​ వలన మీరు క్లెయిమ్స్​ చేసేటపుడు మీ కారు విలువలో తరుగుదల ఉండదు. తద్వారా మీకు ఎక్కువ క్లెయిమ్​ డబ్బులు వస్తాయి.

మీకు జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ లేకపోయినట్లయితే మీరు క్లెయిమ్​ చేసే సమయంలో ఇన్సూరెన్స్​ కంపెనీ వాళ్లు మీ కారు పార్ట్స్​కు డిప్రిషియేషన్​ చేస్తారు. అలాంటప్పుడు మీరు ఎంతో కొంత డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్​ కంపెనీ వాళ్లు డిప్రిషియేషన్​ అమౌంట్​ను తీసేసిన తర్వాతే మీకు మీ క్లెయిమ్​ అమౌంట్​ చెల్లిస్తారు. కాబట్టి మీరు జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ యాడ్​–ఆన్​ కనుక తీసుకుంటే ఎటువంటి డిప్రిషియేషన్​ కటింగ్​ లేకుండా పూర్తి క్లెయిమ్​ చెల్లిస్తారు

అసలు డిప్రిషియేషన్ అంటే ఏమిటి?

డిప్రిషియేషన్​ అనేది మీ కారు మొత్తం విలువలో తగ్గుదల. కారు కొన్న సమయాన్ని బట్టి అది ఎంత పాతదనే విషయం ఆధారంగా దాని డిప్రిషియేషన్​ ఎంతనేది లెక్కిస్తారు. మీ కారు ఎంత పాతదైతే డిప్రిషియేషన్​ వ్యాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది.

డిప్రిషియేషన్​ను ఎలా లెక్కిస్తారు?

ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (IRDAI) ప్రకారం డిప్రిషియేషన్​ రేట్లు ఈ కింది విధంగా ఉంటాయి. ఈ రేట్లను బట్టే మీ కారు డిప్రిషియేషన్​ విలువను లెక్కిస్తారు.

  • రబ్బర్​, నైలాన్,​ ప్లాస్టిక్​ పార్ట్స్​, బ్యాటరీలకు: 50%
  • ఫైబర్​ గ్లాస్​ కాంపోనెంట్స్​:  30%
  • కలపతో చేసిన​ పార్ట్స్​: మొదటి సంవత్సరంలో 5%, రెండో సంవత్సరంలో 10% ఉంటుంది. ఈ విధంగానే డిప్రిషియేషన్​ చార్జీలు కట్​ చేస్తారు.

డిప్రిషియేషన్​ చార్జీలు ఏ వాహనాలకు ఎంత శాతం ఉంటాయంటే..

వాహనం​ వయసు డిప్రిషియేషన్​ శాతం
6 నెలలకు మించని వాహనాలకు 5%
6–12 నెలల మధ్యలోని వాహనాలకు 15%
1–2 సంవత్సరాల మధ్య వాహనాలకు 20%
2–3 సంవత్సరాల మధ్య వాహనాలకు 30%
3–4 సంవత్సరాలకు మధ్య వాహనాలకు 40%
4–5 సంవత్సరాల మధ్య వాహనాలకు 50%

డిప్రిషియేషన్​ చార్జ్​ శాతం (లోహపు భాగాలకు)

వాహనం వయస్సు డిప్రిషియేషన్​ చార్జ్
6 నెలల కంటే తక్కువ వయసున్న వాహనాలు Nil
6–12 నెలల మధ్య ఉన్న వాహనాలు 5%
1–2 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు 10%
2–3 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు 15%
3–4 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు 25%
4–5 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు 35%
5–10 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు 40%
10 సంవత్సరాలకు పైబడిన వాహనాలకు 50%

జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ యాడ్​–ఆన్​తో లాభాలు

డబ్బు ఆదా

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​తో మొదటి ప్రయోజనం డబ్బును ఆదా చేసుకోగలగడం​. జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కనుక మీరు కలిగి ఉంటే, మీ క్లెయిమ్​ సెటిల్​ చేసుకునే సమయంలో మీరు అదనంగా మీ జేబు నుంచి డబ్బులను ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ లేకపోతే మీరు క్లెయిమ్​ సమయంలో అదనంగా డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​​ వలన మీరు అదనపు ఖర్చుల నుంచి రక్షించబడతారు.

ఎక్కువ క్లెయిమ్​ అమౌంట్​ పొందండి

మీరు మీ కారును జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​​తో కవర్​ చేసుకుంటే క్లెయిమ్​ సమయంలో కార్​ పార్ట్స్​కు ఏ విధమైన తరుగుదల ఉండదు. కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో క్లెయిమ్​ అమౌంట్​ పొందే అవకాశం​ ఉంటుంది.

ప్రశాంతత

మీరు జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ను ఎంచుకుంటే క్లెయిమ్​ సమయంలో మీరు అదనంగా డబ్బులను ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అనుకోని సందర్భాల్లో ఈ క్లెయిమ్​ మీకు చాలా మనశ్శాంతిని అందిస్తుంది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్​ తీసుకోవడం ఉత్తమం.

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​లో కవర్​ కానివి ఏంటి?

సరైన డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా డ్రైవ్​ చేసినపుడు

మీరు వ్యాలిడ్​ డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా డ్రైవింగ్​ చేసినపుడు జీరో డిప్రిషియేషన్​ యాడ్–ఆన్​ బెనిఫిట్స్​ పొందలేరు.

ఐదేళ్ల కన్నా పాతవైన కార్లకు

మీ కారు ఐదేళ్ల కంటే పాతదైతే జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ మీకు వర్తించదు.

మద్యం సేవించి వాహనం నడిపినపుడు

డ్రగ్స్,​ మద్యం లాంటివి సేవించి వాహనం నడిపినపుడు జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ నుంచి కవర్​ పొందలేరు.

కంపల్సరీ డిడక్టిబుల్స్​ను కవర్​ చేయదు

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కంపల్సరీ డిడక్టబుల్స్​ను కవర్​ చేయదు. కాబట్టి దీన్ని తీసుకునే సమయంలో ఈ విషయం గుర్తించాలి.

మెకానికల్​ బ్రేక్​ డౌన్లను కవర్​ చేయదు

జీరో డిప్రిషియేషన్​ కవర్​ మీ కారు మెకానికల్​ బ్రేక్​ డౌన్స్​ను కవర్​ చేయదు.

ఇంజన్​ ఆయిల్​ ధర

ఇంజన్​ ఆయిల్​, క్లచ్​ ఆయిల్​ ధరలను ఈ యాడ్​–ఆన్​ కవర్​ చేయదు.

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కవర్​ ధర ఎంత ఉంటుంది? దీనికి ఆ ధర పెట్టవచ్చా?

సాధారణంగా, జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ను మీ కాంప్రహెన్సివ్​ పాలసీలో భాగంగా ఎంచుకుంటే ఇది మీ కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం కంటే 15% అదనంగా ఉంటుంది.

మీ కారు ఓవరాల్​ ప్రొటెక్షన్​ కోసం మీరు 15% శాతం అదనపు ప్రీమియం చెల్లిస్తే అది నిజంగా మంచిదే కదా. ఎందుకంటే ఈ యాడ్​–ఆన్​కు అయ్యే ఖర్చు కంటే క్లెయిమ్స్​ సమయంలో దీనితో మీరు మిగుల్చుకునే అమౌంట్​నే ఎక్కువగా ఉంటుంది..

 

మరింత తెలుసుకోండి:

మీ జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలేంటి?

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కవర్​ ప్రీమియంను కింద పేర్కొనబడిన అంశాలు ప్రభావితం చేస్తాయి.

మీ కారు వయస్సు

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ మీ కారు వయస్సు, దాని పార్ట్స్​ వయస్సు​తో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. జీరో డిప్రిషియేషన్​ యాడ్– ఆన్​ ప్రీమియంను నిర్ధారించడంలో మీ కారు వయసు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

మీ కారు మోడల్

కార్​ ఇన్సూరెన్స్​ తీసుకునే సమయంలో కార్​ మోడల్​ అనేది ముఖ్య భూమిక వహిస్తుంది. జీరో యాడ్​–ఆన్​ కవర్​ కారు పార్ట్స్​ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కారు మోడల్​ కూడా దీనిలో కీలక పాత్ర పోషిస్తుంది.

మీ కారు లొకేషన్

ఒక్కో సిటీలో రిస్క్​ ఫ్యాక్టర్​ ఒక్కోలా ఉంటుంది. కాబట్టి జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కానీ, కార్​ ఇన్సూరెన్స్​ కానీ, మీరు ఏ సిటీలో కారు​ నడుపుతున్నారనే విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది.

స్టాండలోన్​ కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్ పాలసీ​తో పోలిస్తే జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ ఎందుకు మంచిది​?

అన్ని సందర్భాల్లో మీ కారుకు అయ్యే డ్యామేజీల నుంచి ప్రొటెక్ట్​ చేసేందుకు సాధారణ కాంప్రహెన్సివ్​ పాలసీ చక్కగా పనిచేస్తుంది. కానీ, ఈ పాలసీని మీరు తీసుకున్నపుడు మీ క్లెయిమ్​ సమయంలో మీరు డిప్రిషియేషన్​ చార్జీలను ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. ఈ కారణం చేత కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​తో పాటు జీరో డిప్రిషియేషన్​ కార్​ యాడ్​–ఆన్​ కవర్​ను తీసుకోవడం చాలా అవసరం. ఇది చాలా బెటర్​ ఆప్షన్​. ఈ పాలసీ కేవలం మీకు మ్యాగ్జిమమ్​ కవర్​ ఇవ్వడమే కాకుండా క్లెయిమ్​ సమయంలో మీ జేబుకు చిల్లు పడకుండా కూడా చూసుకుంటుంది.

జీరో డిప్రిషియేషన్​, కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ మధ్య తేడా

జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​
అసలు ఏంటిది? జీరో డిప్రిషియేషన్​ కవర్​ అనేది మీ పాలసీకి యాడ్​–ఆన్​ వంటిది. ఇది కావాలంటేనే మీరు ఎంచుకోవచ్చు. ఈ యాడ్​–ఆన్​ను కలిగి ఉండటం వలన మీ పాలసీ క్లెయిమ్​ సమయంలో మీ ఇన్సూరర్​ మీ నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడు. డిప్రిషియేషన్​ పేరుతో మీరు ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ అనేది ఒక రకమైన కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ. ఇది మీ కారును సొంత​ డ్యామేజ్​లు, థర్డ్​ పార్టీ డ్యామేజ్​ల​ నుంచి కాపాడుతుంది. అదనపు రక్షణ కోసం ఈ కార్​ పాలసీని కస్టమైజ్​ కూడా చేసుకోవచ్చు.
ప్రీమియం మీరు ఈ యాడ్​–ఆన్​ను ఎంచుకుంటే, మీ కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం దాదాపు 15 శాతం మేర పెరుగుతుంది. స్టాండలోన్​ కాంప్రహెన్సివ్​ పాలసీ ప్రీమియం జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కలిపిన దానికంటే తక్కువగా ఉంటుంది.
డిప్రిషియేషన్​ కాస్ట్​ మీరు జీరో డిప్రిషియేషన్ యాడ్​–ఆన్​​ను గనుక తీసుకుంటే, మీ క్లెయిమ్​ సమయంలో ఎటువంటి డిప్రిషియేషన్​ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకున్నపుడు మీరు క్లెయిమ్​ చేసుకునే సమయంలో మీ కార్​ పార్ట్స్​ యొక్క డిప్రిషియేషన్​ చార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది.
కారు వయసు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల అన్ని కార్లకు జీరో డిప్రిషియేషన్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవచ్చు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అన్ని కార్లకు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవచ్చు.
మీరు ఎంత సేవ్​ చేస్తారంటే? మీరు జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ను గనుక ఎంచుకుంటే కాస్త ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. కానీ, లాంగ్​ టర్మ్​లో మీరు అదనంగా కట్టిన ప్రీమియం కంటే అధిక లాభాన్నే పొందుతారు. ఈ ఇన్సూరెన్స్​లో అదనంగా కట్టే యాడ్–ఆన్స్​ చార్జీలను మాత్రమే మిగుల్చుకోగలుగుతారు.

క్లెయిమ్​ సెటిల్​మెంట్​లో జీరో డిప్రిషియేషన్​ కవర్​ పాత్ర ఏంటి?

క్లెయిమ్స్​ సెటిల్​ చేసుకునే సమయంలో జీరో డిప్రిషియేషన్​ యాడ్-ఆన్​ పాత్ర మీ డబ్బును ఆదా చేయడం. జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ ఎలా వర్క్​ చేస్తుందో చిన్న ఉదాహరణ చూద్దాం. మీ కారు క్లెయిమ్​ అమౌంట్ 20,000 రూపాయలు, మీ కార్​ పార్ట్స్​ డిప్రిషియేషన్​ చార్జ్​ రూ. 6,000 అనుకుందాం. ఒకవేళ మీకు జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కనుక లేకపోతే మీరు కేవలం 14,000 రూపాయలు మాత్రమే క్లెయిమ్​ చేసుకోగలుగుతారు. అదే మీరు జీరో డిప్రిషియేషన్​ యాడ్–ఆన్​ కనుక తీసుకొని ఉంటే మీకు పూర్తి క్లెయిమ్​ అమౌంట్​ 20,000 రూపాయలు వస్తాయి. అంటే జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ మీకు చాలా బాగా ఉపయోగపడుతున్నట్లే కదా!

జీరో డిప్రిషియేషన్​ గురించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ అనేది కేవలం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న కార్లకు మాత్రమే వర్తిస్తుంది.
  • జీరో డిప్రిషియేషన్​ కేవలం మీ కార్​ పార్ట్స్​ డిప్రిషియేషన్​కు మాత్రమే వర్తిస్తుంది. కంపల్సరీ డిడక్టబుల్స్​కు వర్తించదు.
  • జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ను​ ఐదేళ్ల కంటే పాతవైన కార్లకు మీరు ఎంచుకోలేరు.

జీరో డిప్రిషియేషన్​ కవర్​ను ఎవరు ఎంచుకోవాలి?

  • మీరు త్వరలోనే కొత్త కారును కొనాలని భావించినపుడు, తప్పకుండా ఆ కారుకు జీరో డిప్రిషియేషన్​ కవర్​ను ఎంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొత్త కారు కోసం మీరు ఇప్పటికే చాలా మొత్తం ఖర్చు చేస్తున్నారు. కాబట్టి, క్లెయిమ్​ సమయంలో డిప్రిషియేషన్​ చార్జీలు చెల్లించకుండా ఉండేందుకు ఈ యాడ్–ఆన్​ చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • మీరు ఇటీవలే నూతన కారు కొన్నట్లయితే, మీ కారు ఐదేళ్ల కంటే తక్కువ పాతదైతే మీరు జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ను ఎంచుకోవడం చాలా ఉత్తమం. ఈ నిర్ణయం మీ క్లెయిమ్​ సమయంలో చాలా డబ్బును ఆదా చేస్తుంది. రాను రాను మీ కారు డిప్రిషియేషన్​ కాస్ట్​ చాలా పెరిగిపోతుంది. అదే జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు.

కార్​ ఇన్సూరెన్స్​లో జీరో డిప్రిషియేషన్​ కవర్​ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

నేను కారు కొన్న 5 సంవత్సరాల తర్వాత జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ పొందొచ్చా?

లేదు. మీరు కారును కొన్న 5 సంవత్సరాల తర్వాత జీరో డిప్రిషియేషన్​ ఇన్సూరెన్స్​ పొందలేరు. మీ కారు ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు కలది అయితేనే మీ కార్​ ఇన్సూరెన్స్​లో భాగంగా జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ తీసుకోగలరు.

నేను కారును కొన్న 3 సంవత్సరాల తర్వాత జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ పొందొచ్చా?

అవును, పొందొచ్చు. కారును కొన్న 3 సంవత్సరాల తర్వాత కూడా మీరు జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ పొందేందుకు అర్హులే.

క్లెయిమ్స్​కు సంబంధించి ఏదైనా పరిమితి ఉందా? క్లెయిమ్​ సెటిల్​మెంట్​ ప్రాసెస్​ను జీరో డిప్రిషియేషన్​ ఇన్సూరెన్స్​ పాలసీ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?

క్లెయిమ్​ల సంఖ్య​ విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. ఇది క్లెయిమ్​ సెటిల్​మెంట్​ ప్రాసెస్​లో కూడా చక్కగా పని చేస్తుంది. జీరో డిప్రిషియేషన్​ పాలసీ సాయంతో క్లెయిమ్​ సమయంలో ఎటువంటి డిప్రిషియేషన్​ చార్జీలు లేకుండా మనం రక్షించబడతాం.

జీరో డిప్రిషియేషన్​ కవర్​ కాంప్రహెన్సివ్​ కవర్​తో పోల్చితే భిన్నమైనదా?

అవును. భిన్నమైనదే. జీరో డిప్రిషియేషన్​ కవర్​ అనేది ఒక యాడ్​–ఆన్. కాంప్రహెన్సివ్​ పాలసీతో కలిపి మీరు ఈ యాడ్​–ఆన్​ను ఎంచుకోవచ్చు. కాంప్రహెన్సివ్​ కవర్​ పాలసీ అనేది కేవలం స్టాండర్డ్​ కార్​ పాలసీ మాత్రమే. దీనిలో మీరు జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ వంటి కవర్​లను యాడ్​ చేసుకొని కస్టమైజ్​ చేసుకోవచ్చు.

జీరో డిప్రిషియేషన్​ కవర్​ కేవలం కొత్త కార్లకు మాత్రమే వర్తిస్తుందా?

అవును. జీరో డిప్రిషియేషన్​ పాలసీ అనేది కొత్త కార్లకు, ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న కార్లకు మాత్రమే వర్తిస్తుంది.