జీరో డిప్రిషియేషన్ కార్ ఇన్సూరెన్స్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
జీరో డిప్రిషియేషన్ కార్ ఇన్సూరెన్స్ అనేది ఒక కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ ఇన్సూరెన్స్ ద్వారా మీకు సున్నా డిప్రిషియేషన్ కలపబడుతుంది. ఈ ఇన్సూరెన్స్ వలన మీరు క్లెయిమ్స్ చేసేటపుడు మీ కారు విలువలో తరుగుదల ఉండదు. తద్వారా మీకు ఎక్కువ క్లెయిమ్ డబ్బులు వస్తాయి.
మీకు జీరో డిప్రిషియేషన్ కార్ ఇన్సూరెన్స్ లేకపోయినట్లయితే మీరు క్లెయిమ్ చేసే సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు మీ కారు పార్ట్స్‌కు డిప్రిషియేషన్ చేస్తారు. అలాంటప్పుడు మీరు ఎంతో కొంత డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు డిప్రిషియేషన్ అమౌంట్‌ను తీసేసిన తర్వాతే మీకు మీ క్లెయిమ్ అమౌంట్ చెల్లిస్తారు. కాబట్టి మీరు జీరో డిప్రిషియేషన్ కార్ ఇన్సూరెన్స్ యాడ్–ఆన్ కనుక తీసుకుంటే ఎటువంటి డిప్రిషియేషన్ కటింగ్ లేకుండా పూర్తి క్లెయిమ్ చెల్లిస్తారు
డిప్రిషియేషన్ అనేది మీ కారు మొత్తం విలువలో తగ్గుదల. కారు కొన్న సమయాన్ని బట్టి అది ఎంత పాతదనే విషయం ఆధారంగా దాని డిప్రిషియేషన్ ఎంతనేది లెక్కిస్తారు. మీ కారు ఎంత పాతదైతే డిప్రిషియేషన్ వ్యాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప్రకారం డిప్రిషియేషన్ రేట్లు ఈ కింది విధంగా ఉంటాయి. ఈ రేట్లను బట్టే మీ కారు డిప్రిషియేషన్ విలువను లెక్కిస్తారు.
వాహనం వయసు |
డిప్రిషియేషన్ శాతం |
6 నెలలకు మించని వాహనాలకు |
5% |
6–12 నెలల మధ్యలోని వాహనాలకు |
15% |
1–2 సంవత్సరాల మధ్య వాహనాలకు |
20% |
2–3 సంవత్సరాల మధ్య వాహనాలకు |
30% |
3–4 సంవత్సరాలకు మధ్య వాహనాలకు |
40% |
4–5 సంవత్సరాల మధ్య వాహనాలకు |
50% |
వాహనం వయస్సు |
డిప్రిషియేషన్ చార్జ్ |
6 నెలల కంటే తక్కువ వయసున్న వాహనాలు |
Nil |
6–12 నెలల మధ్య ఉన్న వాహనాలు |
5% |
1–2 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు |
10% |
2–3 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు |
15% |
3–4 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు |
25% |
4–5 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు |
35% |
5–10 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు |
40% |
10 సంవత్సరాలకు పైబడిన వాహనాలకు |
50% |
సాధారణంగా, జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్‌ను మీ కాంప్రహెన్సివ్ పాలసీలో భాగంగా ఎంచుకుంటే ఇది మీ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కంటే 15% అదనంగా ఉంటుంది.
మీ కారు ఓవరాల్ ప్రొటెక్షన్ కోసం మీరు 15% శాతం అదనపు ప్రీమియం చెల్లిస్తే అది నిజంగా మంచిదే కదా. ఎందుకంటే ఈ యాడ్–ఆన్‌కు అయ్యే ఖర్చు కంటే క్లెయిమ్స్ సమయంలో దీనితో మీరు మిగుల్చుకునే అమౌంట్‌నే ఎక్కువగా ఉంటుంది..
మరింత తెలుసుకోండి:
జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ కవర్ ప్రీమియంను కింద పేర్కొనబడిన అంశాలు ప్రభావితం చేస్తాయి.
అన్ని సందర్భాల్లో మీ కారుకు అయ్యే డ్యామేజీల నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు సాధారణ కాంప్రహెన్సివ్ పాలసీ చక్కగా పనిచేస్తుంది. కానీ, ఈ పాలసీని మీరు తీసుకున్నపుడు మీ క్లెయిమ్ సమయంలో మీరు డిప్రిషియేషన్ చార్జీలను ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. ఈ కారణం చేత కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌తో పాటు జీరో డిప్రిషియేషన్ కార్ యాడ్–ఆన్ కవర్‌ను తీసుకోవడం చాలా అవసరం. ఇది చాలా బెటర్ ఆప్షన్. ఈ పాలసీ కేవలం మీకు మ్యాగ్జిమమ్ కవర్ ఇవ్వడమే కాకుండా క్లెయిమ్ సమయంలో మీ జేబుకు చిల్లు పడకుండా కూడా చూసుకుంటుంది.
|
జీరో డిప్రిషియేషన్ కార్ ఇన్సూరెన్స్ |
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ |
అసలు ఏంటిది? |
జీరో డిప్రిషియేషన్ కవర్ అనేది మీ పాలసీకి యాడ్–ఆన్ వంటిది. ఇది కావాలంటేనే మీరు ఎంచుకోవచ్చు. ఈ యాడ్–ఆన్‌ను కలిగి ఉండటం వలన మీ పాలసీ క్లెయిమ్ సమయంలో మీ ఇన్సూరర్ మీ నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడు. డిప్రిషియేషన్ పేరుతో మీరు ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. |
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక రకమైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది మీ కారును సొంత డ్యామేజ్లు, థర్డ్ పార్టీ డ్యామేజ్ల నుంచి కాపాడుతుంది. అదనపు రక్షణ కోసం ఈ కార్ పాలసీని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. |
ప్రీమియం |
మీరు ఈ యాడ్–ఆన్‌ను ఎంచుకుంటే, మీ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం దాదాపు 15 శాతం మేర పెరుగుతుంది. |
స్టాండలోన్ కాంప్రహెన్సివ్ పాలసీ ప్రీమియం జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ కలిపిన దానికంటే తక్కువగా ఉంటుంది. |
డిప్రిషియేషన్ కాస్ట్ |
మీరు జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్‌ను గనుక తీసుకుంటే, మీ క్లెయిమ్ సమయంలో ఎటువంటి డిప్రిషియేషన్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. |
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నపుడు మీరు క్లెయిమ్ చేసుకునే సమయంలో మీ కార్ పార్ట్స్ యొక్క డిప్రిషియేషన్ చార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. |
కారు వయసు |
5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల అన్ని కార్లకు జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవచ్చు. |
15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అన్ని కార్లకు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవచ్చు. |
మీరు ఎంత సేవ్ చేస్తారంటే? |
మీరు జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్‌ను గనుక ఎంచుకుంటే కాస్త ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. కానీ, లాంగ్ టర్మ్‌లో మీరు అదనంగా కట్టిన ప్రీమియం కంటే అధిక లాభాన్నే పొందుతారు. |
ఈ ఇన్సూరెన్స్‌లో అదనంగా కట్టే యాడ్–ఆన్స్ చార్జీలను మాత్రమే మిగుల్చుకోగలుగుతారు. |
క్లెయిమ్స్ సెటిల్ చేసుకునే సమయంలో జీరో డిప్రిషియేషన్ యాడ్-ఆన్ పాత్ర మీ డబ్బును ఆదా చేయడం. జీరో డిప్రిషియేషన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా వర్క్ చేస్తుందో చిన్న ఉదాహరణ చూద్దాం. మీ కారు క్లెయిమ్ అమౌంట్ 20,000 రూపాయలు, మీ కార్ పార్ట్స్ డిప్రిషియేషన్ చార్జ్ రూ. 6,000 అనుకుందాం. ఒకవేళ మీకు జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ కనుక లేకపోతే మీరు కేవలం 14,000 రూపాయలు మాత్రమే క్లెయిమ్ చేసుకోగలుగుతారు. అదే మీరు జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ కనుక తీసుకొని ఉంటే మీకు పూర్తి క్లెయిమ్ అమౌంట్ 20,000 రూపాయలు వస్తాయి. అంటే జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతున్నట్లే కదా!