ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాల్సిన సమయం వచ్చినపుడు మీరు పాత ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీని ఉంచాలా? లేదా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మారాలా? అనే విషయంలో తర్జనభర్జన పడతారు. ఈ నిర్ణయం తీసుకోవడం కొంత ప్రయాసతో కూడుకున్నదే. అందుకే మీరు నిర్ణయం తీసుకోవడాన్ని మేము చాలా సులభం చేస్తాం.
ముందు మీరు అసలు కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ అంటే ఏమిటో తెలుసుకోండి.
కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ మీ ప్రీమియం రేటును మార్చకుండా మీ ఇన్సూరెన్స్ పాలసీని కొనసాగించే సమయం. కార్ ఇన్సూరెన్స్‌ను తప్పకుండా రెన్యువల్ చేయించుకోవాలి. దీనికి ఎటువంటి అదనపు ఖర్చులు ఉండవు. మీరు ఏవైనా మార్పులు చేసే వరకూ మీ ఇన్సూరెన్స్ పాలసీ రేటు మారదు. మీకు పాత ఇన్సూరెన్స్ కంపెనీ నచ్చకపోతే మీ పాలసీ రెన్యూ చేసే సమయంలో మీరు కొన్ని విషయాలను ఆలోచించాలి. అవేంటంటే..
మీకు ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీరు మీ పాత ఇన్సూరెన్స్ కంపెనీ, వారు అందించే కస్టమర్ సపోర్ట్, క్లెయిమ్ ప్రక్రియతో సంతోషంగా ఉంటే పాత ఇన్సూరెన్స్ కంపెనీనే ఎంచుకోవచ్చు. లేదా మీకు నచ్చకపోతే కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మారిపోవచ్చు. ఏదనేది మీ అవసరాలు, పాత కంపెనీతో మీకున్న అనుభవం మీద ఆధారపడి ఉంటుంది.
కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకునే ముందు అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం రెన్యూ చేయిస్తే ఏ ఏ అంశాలను గమనించాలో కింద నిశితంగా పేర్కొన్నాం. ఓ సారి లుక్కేయండి.
స్టెప్ 1 – మీ వాహనం యొక్క మోడల్, తయారీ దారు, వేరియంట్, రిజిస్ట్రేషన్ తేదీ, వాహనం నడిపే నగరం మొదలైన వివరాలను నమోదు చేసి గెట్ కోట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు వివిధ రకాల ప్లాన్లు కనబడతాయి. వాటిల్లోనుంచి మీకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.
స్టెప్ 2 – థర్డ్ పార్టీ లయబిలిటీ లేదా స్టాండర్డ్ ప్యాకేజ్ దేనినైనా సరే మీరు ఎంచుకోవచ్చు.
స్టెప్ 3 – మీ పాత పాలసీ వివరాలను సమర్పించండి. ఉదా. గడువు ముగిసిన తేదీ, మీరు క్లెయిమ్స్ చేసిన వివరాలు, నో క్లెయిమ్ బోనస్ తదితరాలు.
స్టెప్ 4 – మీకు ప్రీమియం అమౌంట్ అనేది కనబడుతుంది. మీరు కనుక స్టాండర్డ్ ప్లాన్‌ను ఎంచుకుంటే తదుపరి యాడ్-ఆన్స్‌ను ఎంచుకోవాలి. మీ వాహన ఐడీవీ (IDV)ని సెట్ చేసుకోవాలి. మీరు కనుక సీఎన్జీ (CNG) కార్‌ను కలిగి ఉంటే మీ ప్రీమియం మొత్తం ఎంత అవుతుందో తదుపరి పేజీలో కనబడుతుంది.
ఈ సారికి డిజిట్లో మీ కార్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు ప్రయత్నించండి. డిజిట్ వలన ఎటువంటి మార్పులు ఉంటాయంటే..