మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

ఆన్‌లైన్‌లో మారుతి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి లేదా రెన్యూవల్ చేయండి

మారుతి సుజుకి కంపెనీ సరసమైన ధరల్లో వాహనాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో సెడాన్స్, హ్యాచ్ బ్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. మారుతి సుజుకి అందించే విటారా బ్రెజ్జా SUV కూడా.. బడ్జెట్ మీద ఆధారపడే ఇండియన్ మార్కెట్లో ఉంది. 

1462 సీసీతో ఉండే ఈ SUV రోడ్డు మీద ఇంప్రెసివ్ పనితీరును అందిస్తుంది. చూసేందుకు ఇది స్టైలిష్‌గా కూడా ఉంటుంది. ఇందులో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఆ కారణంతో బ్రెజ్జా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇది 2018లో టెక్ అండ్ ఆటో అవార్డ్స్ లో ‘SUV/MPV ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెల్చుకుంది. అందువల్ల ఈ SUV నాణ్యతలో ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదు . ఈ వాహనం ప్రయాణాలకు ఎంతో అనువైనది.

ఏదేమైనా కానీ మీ విటారా బ్రెజ్జా కారును ప్రమాదాలు, డ్యామేజెస్ నుంచి రక్షించుకునేందుకు మీరు తప్పనిసరిగా విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీకు కావాల్సిన ఆర్థిక అవసరాలను బట్టి మీరు థర్డ్ పార్టీ పాలసీ లేదా కాంప్రహెన్సివ్ పాలసీని ఎంచుకోవచ్చు.

థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీ అనేది దాని పేరు ఉన్న విధంగానే వర్క్ చేస్తుంది. ఏదైనా ప్రమాదంలో మీ వల్ల థర్డ్ పార్టీ వ్యక్తులకు కలిగిన నష్టాలను మాత్రమే ఇది కవర్ చేస్తుంది.

కానీ మీ సొంత కారుకు జరిగిన ఎటువంటి నష్టాన్ని ఈ పాలసీ కింద క్లెయిమ్ చేయలేరు. అలా మీరు చేసేందుకు మీరు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవాలి. ఈ పాలసీ కింద ఇన్సూరెన్స్ సంస్థలు ఓన్ డ్యామేజ్ కవర్ తో పాటు థర్డ్ పార్టీ లయబులిటీలను కూడా అందిస్తాయి.

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఇండియన్ రోడ్ల మీద తిరిగే ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి. మీరు కనుక ఇందులో విఫలం అయితే రూ. 2,000 జరిమానా (రూ. 4,000 రిపీట్ చేస్తే) చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల మీ కార్ ఇన్సూరెన్స్ కొనాలా వద్దా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీని కొనుగోలు చేయాలనేది ఆలోచించాలి.

ఇండియాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో డిజిట్ ఒకటి. ఆ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకునేందుకు చదవండి.

విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ ధర

రిజిస్ట్రేషన్ డేట్ ప్రీమియం (కేవలం ఓన్ డ్యామేజ్ పాలసీకి మాత్రమే)
ఆగస్టు-2019 2,315
ఆగస్టు -2018 2,198
ఆగస్టు -2017 2,028

**నిరాకరణ – ప్రీమియం లెక్కింపు అనేది విటారా బ్రెజ్జా LXI BSVI పెట్రోల్ 1462 కోసం. GST మినహాయించబడింది.

నగరం-ముంబై, వాహన రిజిస్ట్రేషన్ తేదీ-ఆగస్టు, NCB - 50%, ఎటువంటి యాడ్ ఆన్స్ లేవు, పాలసీ గడువు ముగిసిపోలేదు, & IDV- అందుబాటులో ఉన్న తక్కువ విలువ. ఆగస్టు-2020కి ప్రీమియం లెక్కింపు పూర్తయింది. పైన వాహన వివరాలు నమోదు చేసి ఫైనల్ ప్రీమియం పొందండి.

మారుతి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్‌లో ఏం కవర్ అవుతాయి

డిజిట్ అందించే మారుతి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్‌ని మీరు ఎందుకు కొనుగోలు చేయాలి?

విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదం వల్ల సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు

ఒకవేళ ఏదైనా ప్రమాదం లేదా ఢీకొట్టడం లాంటివి జరిగితే మీ సొంత కారుకు జరిగే డ్యామేజీలు కవర్ అవుతాయి.

×

అగ్ని ప్రమాదం వలన సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు

అగ్నిప్రమాదం, మంటల కారణంగా మీ సొంత కారుకు కలిగే డ్యామేజీలు, నష్టాలను కవర్ చేస్తుంది.

×

ప్రకృతి విపత్తుల వలన మీ సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు

వరదలు, భూకంపాలు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ సొంత కారుకు కలిగే డ్యామేజీలు, నష్టాలను కవర్ చేస్తుంది.

×

థర్డ్ పార్టీ వాహనానికి జరిగిన డ్యామేజీలకు

మీ కారు వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది.

×

థర్డ్ పార్టీ ఆస్తుల డ్యామేజీలకు

మీ కారు వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజీలు, నష్టాలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది.

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

యజమాని–డ్రైవర్ యొక్క శరీర గాయాలు లేదా మరణానికి కవర్ అవుతుంది. (చట్టపరంగా తప్పనిసరి, ఒకవేళ ముందు నుంచి లేనట్లు అయితే దీనిని ఎంచుకోవచ్చు)

×

థర్డ్ పార్టీ వ్యక్తి గాయాలపాలైనా/చనిపోయినా

మీ కారు వల్ల ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తికి శరీర గాయాలు లేదా మరణం సంభవిస్తే, అపరిమిత లయబులిటీకి కవరేజీ వర్తిస్తుంది.

×

మీ కారు దొంగిలించబడితే

ఒకవేళ మీ కారు దొంగతనానికి గురైతే కలిగే నష్టాలను కవర్ చేస్తుంది.

×

మీ ఐడీవీ (IDV) కస్టమైజ్ చేసుకోండి

మీ కారు యొక్క ఐడీవీ (IDV)ని మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి, తదనుగుణంగా మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించండి.

×

కస్టమైజ్డ్ యాడ్–ఆన్స్తో అదనపు రక్షణ

టైర్ ప్రొటెక్ట్ కవర్, ఇంజిన్ అండ్ గేర్బాక్స్ ప్రొటెక్షన్, జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ వంటి కస్టమైజ్డ్ యాడ్–ఆన్స్తో మీ కారుకు అదనపు సంరక్షణను అందించండి.

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్​, థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి.

కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ను ఎలా ఫైల్ చేయాలి?

మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ను కొనుగోలు/ రెన్యువల్ చేసిన తర్వాత చాలా నిశ్చింతగా ఉండండి. మీరు క్లెయిమ్ చేసేందుకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా 3 స్టెప్పుల క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. పైగా, ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ.

స్టెప్1

1800-258-5956 అనే నంబర్పై కాల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫారాలు కూడా నింపాల్సిన అవసరం ఉండదు.

స్టెప్2

అప్పడు మేము మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక స్వీయ తనిఖీ లింక్ను పంపిస్తాం. అప్పడు మీరు మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను ఫొటో తీసి మాకు పంపిస్తే సరిపోతుంది. ఎలా పంపాలి అనేది మేము దశలవారీగా వివరిస్తాం.

స్టెప్ 3

రీయింబర్స్మెంట్ క్లెయిమ్ కానీ, క్యాష్లెస్ క్లెయిమ్ కానీ ఎంచుకుంటే సరిపోతుంది. క్యాష్లెస్ క్లెయిమ్ అనేది కేవలం మా నెట్వర్క్ గ్యారేజీల్లోనే లభిస్తుంది.

డిజిట్ క్లెయిమ్స్ ఎంత త్వరగా సెటిల్ అవుతాయి? ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు వారి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇది. డిజిట్ యొక్క క్లెయిముల రిపోర్టు కార్డును చదవండి

విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు ఎంచుకోవాలి?

మారుతి సుజుకి బ్రెజ్జా కారు కోసం మీరు కొత్త ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలనుకున్నా లేక ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేయాలనుకున్నా మీరు తప్పకుండా డిజిట్ కు ఫోన్ చేయాలి.

మా వద్ద ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అవి పాలసీ తీసుకున్న వారి జీవితాన్ని సింపుల్‌గా మార్చేస్తాయి. డిజిట్ మీకు అందించే కొన్ని రకాల సౌకర్యాలు..

  • క్లెయిమ్ సెటిల్‌మెంట్ ట్రాక్ రికార్డు- తాము సమర్పించిన క్లెయిమ్ దరఖాస్తులు ఆమోదం పొందుతాయా? లేదా అనే గాబరా డిజిట్ పాలసీదారులకు అవసరం లేదు. మా ఇన్ హౌజ్ టీం మీరు సమర్పించే వాటిలో కొన్నింటిని తప్పా అన్ని రకాల క్లెయిమ్స్ దరఖాస్తులను పరిశీలిస్తుంది. మరీ సిల్లీ కారణాలతో మేము క్లెయిమ్స్ రిజెక్ట్ చేయం. అంతే కాకుండా మా టీమ్ పాలసీదారులు కష్ట సమయాల్లో ఉన్నపుడు వారికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది.
  • డిజిటలీకరించిన క్లెయిమ్ ప్రక్రియ – క్లెయిమ్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడల్లా ఇన్సూరెన్స్ కార్యాలయానికి వెళ్లడం మీకు ఇబ్బందికరంగా ఉందా? మేము మీ బాధలను అర్థం చేసుకున్నాం. అందుకోసమే క్లెయిమ్స్ కోసం పూర్తి డిజిటల్ ప్రాసెస్‌ను మీ కోసం తీసుకువచ్చాం. పాలసీదారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఇళ్లలో కూర్చొనే స్మార్ట్ ఫోన్ ద్వారా క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా మేము సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ ప్రక్రియను కూడా అందిస్తున్నాం. దీని ద్వారా మీరు.. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. డ్యామేజ్ అయిన వాహనం చిత్రాలను డిజిట్ యాప్ ద్వారా మాకు పంపితే సరిపోతుంది. మేము అన్ని వివరాలను తనిఖీ చేసి నష్టపరిహారం గురించి మిమ్మల్ని సంప్రదిస్తాం.
  • అనుకూలీకరణ కోసం ఎంపికలు - మీ వాహనం రిపేర్ చేయరాకుండా డ్యామేజ్ అయినపుడు లేదా అది దొంగిలించబడినపుడు మీరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పొందే మొత్తం అమౌంట్ (నష్టపరిహారం) అనేది IDV మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసమే ఎల్లప్పుడూ దానిని గరిష్టంగానే మెయింటెన్ చేయాలి. అనేక సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలే మీ కారు IDVని నిర్ణయిస్తాయి. కానీ డిజిట్ ఈ విషయంలో మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. మీరు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కారు ఇన్సూరెన్స్ ను ఆన్‌లైన్ లో కొనుగోలు చేసినపుడు మీకు ఇష్టం వచ్చిన విధంగా IDVని మార్చుకునే సదుపాయం కల్పించాం. కావున అనుకోని సందర్భాల్లో మీ కారు దొంగతనానికి గురయితే మీరు నష్టపోకుండా ఉండేందుకు మీకు నచ్చిన IDVని ఎంచుకోవచ్చు.
  • ఇండియా వ్యాప్తంగా 6000+ కంటే ఎక్కువ నెట్‌వర్క్ గ్యారేజీలు- మారుతి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్లకు సేవలందించేందుకు మా వద్ద నెట్వర్క్ గ్యారేజీల జాబితా ఉంది. మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్న వాహనానికి 6000+ నెట్వర్క్ గ్యారేజీల్లో క్యాష్‌లెస్ రిపేర్స్ పొందొచ్చు. మీ వాహనం రిపేర్ అయినపుడు మీ వద్ద నగదు కొరతగా ఉన్నా కానీ ఎంచక్కా రిపేర్ చేయించుకోవచ్చు. ముందు డబ్బులు కట్టి తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.
  • డోర్ స్టెప్ కార్ పికప్ మరియు డ్రాప్ సదుపాయం – కేవలం క్యాష్‌లెస్ రిపేర్లు అందించడం మాత్రమే కాకుండా నెట్వర్క్ గ్యారేజెస్ అనేవి కూడా పాలసీదారులకు ముఖ్యమైనవే. పాడయిపోయిన కారును ఇంటినుంచే పికప్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. డిజిట్ మీకు ఆ సేవలను అందిస్తుంది. గ్యారేజ్ వ్యక్తి మీ రిపేర్ అయిన కారును గ్యారేజ్ కు తీసుకెళ్లి.. రిపేర్ చేసి మళ్లీ మీ ఇంటి వద్ద డెలివరీ చేస్తాడు. ఈ మొత్తం ప్రక్రియలో మీరు గ్యారేజీని సందర్శించాల్సిన అవసరం ఉండదు.
  • అనేక రకాల యాడ్ ఆన్ ఆప్షన్స్- యాడ్ ఆన్స్ అనేవి స్టాండ్ అలోన్ ఇన్సూరెన్స్ పాలసీలు కావు. అవి వివిధ రకాల మారుతి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను మాత్రమే పెంపొందిస్తాయి. మీ అవసరాలకు సరిపోయే విధంగా డిజిట్ కంపెనీ ఏడు రకాల యాడ్ ఆన్స్ ను అందిస్తుంది. ఉదాహరణకు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ అనేది ఇన్సూరెన్స్ చేసిన వాహన ఇంజిన్ ను ఎలక్ట్రికల్ మరియు లిక్విడ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఈ కవరేజ్ సాధారణ పాలసీ కవరేజ్ కు మించి ఉంటుంది. ఇతర యాడ్ ఆన్ కవర్స్‌లో జీరో డెప్రిసియేషన్ కవర్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ప్యాసింజర్ కవర్, కన్జూమబుల్ కవర్ వంటి మరెన్నో పాలసీలు ఉన్నాయి. మీ డ్రైవింగ్ స్టైల్ కు ఏది అవసరం అని మీరు భావిస్తారో దానిని ఎంచుకోండి.
  • గంటల కస్టమర్ సర్వీస్ - క్రిస్మస్ లేదా రిపబ్లిక్ డే వంటి సెలవుదినం రోజు మీరు ప్రమాదానికి గురి కావొచ్చు. మీరు దాని గురించి ఏం చింతించకండి. డిజిట్ కస్టమర్ సర్వీస్ టీమ్ ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. మీ కాల్స్ ను ఎప్పుడైనా సరే తీసుకుంటుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా మీకు అవసరం అయినపుడు ఎప్పుడైనా మిమ్మల్ని సంప్రదించొచ్చు. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కొనుగోలు లేదా రెన్యూవల్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మా నిపుణులు వాటిని నివృత్తి చేస్తారు.

మీరు పాలసీల గురించి ఇంకా చింతిస్తున్నట్లయితే ఒకసారి డిజిట్ పాలసీని ఎందుకు ట్రై చేయకూడదు. మీకు ఆర్థిక సాయం అవసరం అయినపుడు ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మీరు త్వరితగతిన గుర్తిస్తారు.

డ్రైవింగ్ ఎంజాయ్ చేయండి కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి!

మారుతి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?

ఈ పవర్ ప్యాక్డ్ SUV మీరు రక్షించాలనుకునే ఆస్తి. మీ జేబుకు ఖర్చులు తగ్గించేందుకు కొత్త కారుకు ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. కార్ ఇన్సూరెన్స్ వల్ల మీరు పొందే ప్రయోజనాలు ఏంటంటే..

  • ఆర్థిక బాధ్యతల నుంచి గట్టెక్కిస్తుంది: ఇది మీకూ సేవియర్ లా పని చేస్తుంది. మీ వాహనం వల్ల థర్డ్ పార్టీలకు సంభవించే అన్ని నష్టాలను ఇది కవర్ చేస్తుంది. అదే మీరు కనుక కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే మీ సొంత కారు డ్యామేజెస్ మరియు నష్టాలు కూడా కవర్ అవుతాయి.

● Legally Compliant చట్టప్రకారం మిమ్మల్ని కాపాడుతుంది: మీరు సరైన ఇన్సూరెన్స్ లేకుండా మీ బ్రెజ్జా కారును డ్రైవ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండియాలో కార్ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం వల్ల భారీ జరిమానాలు (రూ. 2,000) వరకు పడే అవకాశం ఉంది. అంతే కాకుండా దీని వల్ల మీ జైలు శిక్ష పడే అవకాశం/మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే చాన్స్ కూడా ఉంటుంది.

  • థర్డ్ పార్టీ లయబులిటీ: దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినపుడు థర్డ్ పార్టీ వాహనానికి గానీ లేదా థర్డ్ పార్టీ ఆస్తులకు గానీ ఏదైనా నష్టం సంభవించినపుడు మీరు ఆ నష్టాలకు బాధ్యులుగా ఉంటే ఈ పాలసీ మీకు కవరేజ్ అందిస్తుంది. ఇటువంటి ఖర్చులు ఊహించని విధంగా ఉంటాయి. మీరు ఈ ఖర్చులను చెల్లించేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇటువంటి పాలసీ మీకు కవరేజ్ కల్పిస్తుంది.
  • కాంప్రహెన్సివ్ కవర్: ఇది మీ అవసరాలకు అనుగుణంగా సవరించబడుతుంది. మీ బ్రెజ్జా కారుకు అదనపు కవర్ గా ఇది ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పేరులో సూచించినట్లుగానే కాంప్రహెన్సివ్ కవర్ మీ చేతిలో లేని మీ ప్రమేయం లేకుండా సంభవించే నష్టాలయిన అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, సహజ/మానవ నిర్మిత ప్రకృతి విపత్తులు మొదలయిన వాటి నుంచి మీ కారును రక్షిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఈ పాలసీ కింద మీరు కవరేజ్ పొడిగించుకునేందుకు అవకాశం కూడా ఉంది. కొన్ని కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్స్ తో ఎక్స్‌టెండెడ్ కవరేజ్ పొందండి. బ్రేక్ డౌన్ అసిస్టెన్స్, ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్, టైర్ ప్రొటెక్టివ్ కవర్ మరియు జీరో డెప్ కవర్ వంటివి ఉంటాయి.

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా గురించి మరింత తెలుసుకోండి

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లుక్.. మిమ్మల్ని ఆశ్చర్యపరచడం గ్యారంటీ. ఎవరైతే స్టైల్ కారు కావాలని అనుకుంటారో అటువంటి వారికి ఈ బోల్డ్, బ్రిలియంట్, గ్లామరస్ కారు సరిగ్గా సూటవుతుంది. ఇది అత్యద్భుత ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ లను కలిగి ఉంటుంది.

ఇది అత్యంత వేగవంతమైన కాంపాక్ట్ SUV. అంతే కాకుండా 2017-18వ సంవత్సరం కార్ల కేటగిరీలోని ప్రతి అవార్డును కైవసం చేసుకుంది. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2017తో సహా ఒకే సంవత్సరంలో 28 అవార్డులను ఇది కైవసం చేసుకుంది.

మీరు ఎందుకు మారుతి సుజుకి విటారా బ్రెజ్జాను కొనుగోలు చేయాలి?

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా అనేది క్రూయిజ్ కంట్రోల్,డ్యూయల్ టోన్ ఫ్లోటింగ్ రూఫ్, స్పోర్టీ డిజైన్, ఫ్లిప్ ఫోల్డెడ్ రియర్ సీట్స్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్న మొదటి కాంపాక్ట్ SUV. ఈ SUV ఫ్రంట్ డిజైన్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయకుండా వదిలి పెట్టదు. విటారా బ్రెజ్జా 4 వేరియంట్లలలో అందుబాటులో ఉంది. LDI, VDI, ZDI మరియు ZDI+. DDis 200 ఇంజిన్ ద్వారా ఈ కారు 24.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ మరియు స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా మీ భద్రత కోసం ఈ కారులో ఎన్నో ఫీచర్స్ డిజైన్ చేయబడ్డాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, ల్యాంప్ బజర్‌తో కూడిన సీట్ బెల్ట్, హై స్పీడ్ వార్నింగ్ అలెర్ట్ వంటివి ఉన్నాయి.

విటారా బ్రెజ్జా కారులో స్టైల్ తో పాటు కంఫర్ట్, పర్ఫామెన్స్, సేఫ్టీ కూడా ఉంటుంది. 24.3 కిలో మీటర్ల మైలేజ్‌తో కొనుగోలుదారులను ఇట్టే అట్రాక్ట్ చేస్తోంది. ఇది కేవలం వీకెండ్ ట్రిప్స్ కోసం మాత్రమే కాకుండా రోజువారీ అవసరాలకు కూడా ఎంతో పనికొస్తుంది. బ్రెజ్జా అనేది ఫ్యామిలీ కార్. ప్రతి రోజు ప్రయాణించేందుకు దీనిని ఉపయోగించండి.

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా – వేరియంట్లు మరియు ఎక్స్ షోరూం ధరలు

వేరియంట్లు ఎక్స్-షోరూం ధర (నగరాన్ని బట్టి ధర మారుతూ ఉంటుంది)
LDi 1248 సీసీ, మాన్యువల్, డీజిల్ రూ. 7.67 లక్షలు
VDi 1248 సీసీ, మాన్యువల్, డీజిల్ రూ. 8.19 లక్షలు
VDi AMT 1248 సీసీ, ఆటోమేటిక్, డీజిల్ రూ. 8.69 లక్షలు
ZDi 1248 సీసీ, మాన్యువల్, డీజిల్ రూ. 8.97 లక్షలు
ZDi AMT 1248 సీసీ, ఆటోమేటిక్, డీజిల్ రూ. 9.47 లక్షలు
ZDi ప్లస్ 1248 సీసీ, మాన్యువల్, డీజిల్ రూ. 9.92 లక్షలు
ZDi ప్లస్, డ్యూయల్ టోన్, 1248 సీసీ, మాన్యువల్, డీజిల్ రూ. 10.08 లక్షలు
ZDi ప్లస్ AMT 1248 సీసీ, ఆటోమేటిక్, డీజిల్ రూ. 10.42 లక్షలు
ZDi ప్లస్ AMT డ్యూయల్ టోన్ 1248 సీసీ, ఆటోమేటిక్, డీజిల్ రూ. 10.64 లక్షలు

మారుతి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ గురించి FAQలు

నా మారుతి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ ధరను ఎలా తగ్గించుకోవాలి?

డిజిట్ అందించే ఇన్సూరెన్స్ పాలసీలు తక్కువ ధరలో ఉంటాయి. మీరు ఇంకా ప్రీమియంలను తగ్గించుకోవాలని అనుకుంటే మీకు రెండు మార్గాలున్నాయి. అందుకోసం మొదట మీరు చేయాల్సింది పాలసీ IDVని పెంచకుండా ఉండడం. తర్వాత మీరు చేయాల్సింది ఎక్కువ వాలంటరీ డిడక్టబుల్స్ ఉన్న ప్లాన్స్ ఎంచుకోవడం.

మారుతి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా నేను ఎంత వరకు NCB (నో క్లెయిమ్) పొందొచ్చు?

డిజిట్ ఇన్సూరెన్స్ అనేది మీరు తదుపరి సంవత్సరాలలో NCB (నో క్లెయిమ్) పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ పాలసీల ద్వారా మీరు 50 శాతం వరకు నో క్లెయిమ్ బోనస్‌ను పొందొచ్చు.

మారుతి విటారా బ్రెజ్జా పాలసీలో రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ ఎలా పని చేస్తుంది?

రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ అనేది మీ కారు రోడ్డు మీద ఆగిపోయిన ప్రతిసారి డిజిట్ నెట్వర్క్ గ్యారేజీల నుంచి మీరు సర్వీసును క్లెయిమ్ చేసుకునేలా అధికారం ఇస్తుంది. అటువంటి సందర్భాలలో గ్యారేజెస్ నుంచి మెకానిక్స్ వచ్చి మీ కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తారు. అది మాత్రమే కాకుండా ఈ సర్వీస్ అనేది మీ ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్‌లా రిఫ్లెక్ట్ కాదు.

నో క్లెయిమ్ బోనస్ అనేది నా మారుతి విటారా బ్రెజ్జా ఇన్సూరెన్స్ మీద ఎలా ప్రభావం చూపుతుంది?

NCB అనేది మీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గిస్తుంది. అయితే ఇది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గించకుండా ఓన్ డ్యామేజీ ప్రీమియాన్ని తగ్గిస్తుంది.