మారుతి సుజుకి ఇగ్నిస్ ఇన్సూరెన్స్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ అయిన సుజుకి సంస్థ 2000వ సంవత్సరంలో సబ్ కాంపాక్ట్ కారు అయిన ఇగ్నిస్ ను విడుదల చేసింది. మారుతి సుజుకి రిట్జ్ కు ప్రత్యామ్నాయంగా మారుతి సుజుకి ఇగ్నిస్ రెండవ తరం (సెకండ్ జెనరేషన్) కారు ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. తర్వాత ఫిబ్రవరి 2020లో 15వ ఆటో ఎక్స్పో లో ఈ మోడల్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఆవిష్కరించబడింది.
మారుతి సుజుకి ఫేస్ లిఫ్ట్ వెర్షన్‌ను ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత ఆగస్టు 2020లో కంపెనీ దాదాపు 3,262 యూనిట్లను విక్రయించింది. కంపెనీ ఈ కారును నెక్సా చెయిన్ ప్రీమియం డీలర్షిప్ ల వద్ద విక్రయిస్తోంది.
రాబోయే సంవత్సరాలలో మీరు ఈ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద మారుతి సుజుకి ఇగ్నిస్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీ కారు కనుక అనుకోకుండా ప్రమాదానికి గురయినపుడు సరైన ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుంచి, భారీ నష్టాల నుంచి గట్టెక్కిస్తుంది.
ఇండియాలో ఉన్న అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు మీ అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తాయి. ఈ విషయంలో డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని కంపెనీల కంటే ముందు ఉంటుంది. ఇతర కంపెనీలతో పోల్చుకుంటే డిజిట్ వద్ద మారుతి సుజుకి ఇగ్నిస్ ఇన్సూరెన్స్ ధర చాలా తక్కువగా ఉంటుంది.
మేము మా కస్టమర్స్‌ను VIPల వలె ట్రీట్ చేస్తాం. అదెలాగో తెలుసుకోండి..
ప్రమాదం కారణంగా సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
థర్డ్-పార్టీ వాహనానికి డ్యామేజీలు |
✔
|
✔
|
థర్డ్-పార్టీ ఆస్తికి డ్యామేజీలు |
✔
|
✔
|
పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్-పార్టీ వ్యక్తి యొక్క గాయాలు/మరణం |
✔
|
✔
|
మీ కార్ దొంగతనం |
×
|
✔
|
డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్ |
×
|
✔
|
మీ ఐడివి (IDV)ని అనుకూలీకరించండి |
×
|
✔
|
అనుకూలీకరించిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
×
|
✔
|
మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, మేము 3-స్టెప్ ల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
1800-258-5956కు కాల్ చేయండి. ఫారమ్‌లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క డ్యామేజీలను షూట్ చేయండి.
మీరు మా గ్యారేజీల నెట్వర్క్ ద్వారా రీయింబర్స్మెంట్ లేదా క్యాష్‌లెస్‌ని ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.
మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం సరియైనదే!
డిజిట్ క్లయిమ్స్ రిపోర్ట్ కార్డ్ ని చదవండి
ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు పాలసీ ధరను మాత్రమే కాకుండా పరిగణలోకి తీసుకోవాల్సిన మరికొన్ని అంశాలు ఉన్నాయి. కావున ప్లాన్ తీసుకునే ముందు సరైన నిర్ణయం తీసుకునేందుకు ఈ కింది పాయింట్లను ఒకసారి చెక్ చేయండి.
మారుతి సుజుకి ఇగ్నిస్ కోసం డిజిట్ అందించే ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
మీరు కనుక డిజిట్ ను మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ గా ఎంచుకుంటే మీరు మీ అవసరాలకు తగిన విధంగా కింది రకాల ఇన్సూరెన్స్ లను పొందొచ్చు.
ఇది ఒక ప్రాథమిక ఇన్సూరెన్స్ ప్లాన్. మీ మారుతి సుజుకి ఇగ్నిస్ ద్వారా ఒక వ్యక్తికి లేదా వాహనానికి లేదా ఆస్తికి జరిగిన నష్టాన్నికవర్ చేస్తుంది. మీ కారుకు థర్డ్ పార్టీకి యాక్సిడెంట్ అయినపుడు జరిగిన నష్టాలను మీరు భరించాల్సి ఉంటుంది. అటువంటి నష్టపరిహార బాధ్యతలను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ చూసుకుంటుంది. అంతే కాకుండా మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఈ పాలసీని కలిగి ఉండడం తప్పనిసరి.
మీరు మీ మారుతి కారు ఓవరాల్ ప్రొటెక్షన్ కనుక కోరుకుంటే మీరు డిజిట్ నుంచి మారుతి సుజుకి ఇగ్నిస్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమం. ఈ పాలసీ మీకు థర్డ్ పార్టీ నష్టాలతో పాటు భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వల్ల మీ సొంత కారుకు జరిగే నష్టాలను కూడా కవర్ చేస్తుంది.
మారుతి సుజుకి ఇగ్నిస్ కార్ ఇన్సూరెన్స్ ను మీరు డిజిట్ నుంచి పొందడం ద్వారా ఎటువంటి అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రక్రియను మీరు పొందొచ్చు. ఇందులో స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ సెల్ఫ్ ఇన్ప్సెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ రెయిజ్ చేయొచ్చు. అందుకోసం మీరు మీ కారు డ్యామేజెస్ ను షూట్ చేసి మీకు అవసరం అయిన రిపేర్ మోడ్ ను ఎంచుకుంటే సరిపోతుంది.
కస్టమర్స్ క్యాష్‌లెస్ సర్వీసులను ఎంచుకునేందుకు డిజిట్ ఇన్సూరెన్స్ అనుమతిస్తుంది. కావున కస్టమర్స్ రిపేర్ల కోసం ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మీరు మీ మారుతి కారును ఆథరైజ్డ్ నెట్వర్క్ గ్యారేజీల్లో రిపేర్ చేయించుకోవచ్చు. మీ తరఫున మీ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లించే వరకు మీరు వెయిట్ చేస్తే సరిపోతుంది. మీరు చేయాల్సిందల్లా మీ మారుతి సుజుకి ఇగ్నిస్ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను దరఖాస్తు చేసుకునేటపుడు క్యాష్‌లెస్ మోడ్ ఎంచుకుంటే సరిపోతుంది.
దేశంలో మాకు అనేకమైన నెట్వర్క్ గ్యారేజెస్ ఉన్నాయి. కావున మీరు రిపేర్ సెంటర్ ను కనుక్కోవడం సులభం అవుతుంది. ఒక వేళ మీ మారుతి కారుకు ప్రమాదం జరిగినపుడు వృత్తి నిపుణుడితో రిపేర్ చేయించుకోవచ్చు.
మీరు డిజిట్ నుంచి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ను పొందినట్లయితే.. అదనపు కవరేజ్ కోసం మీ బేస్ ప్లాన్ కు యాడ్ ఆన్స్ ను జత చేసుకునే సౌలభ్యాన్ని మీరు పొందుతారు. మీరు ఈ యాడ్ ఆన్ ప్రయోజనాలను పొందేందుకు మీరు మారుతి సుజుకి ఇగ్నిస్ ఇన్సూరెన్స్ కు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. మీరు ప్రయోజనం పొందగలిగే కొన్ని రకాల యాడ్ ఆన్స్..
మీరు మీ మారుతి సుజుకి ఇగ్నిస్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద క్లెయిమ్ ఫైల్ చేసినపుడు డిజిట్ మీకు డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ ఫెసిలిటీని అందిస్తుంది. దీని వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిపేర్ సర్వీసులను పొందొచ్చు.
మీరు మారుతి సుజుకి ఇగ్నిస్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేస్తున్న సమయంలో మీరు కనుక గత పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉంటే మీకు డిజిట్ ప్రీమియంలో 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ నే నో క్లెయిమ్ బోనస్ అని పిలుస్తారు. ఈ బోనస్ ను మీరు బదిలీ చేసుకోవచ్చు. మీరు ఇన్సూరెన్స్ కంపెనీ మారినా కానీ మీ బోనస్ అలాగే ఉంటుంది.
మారుతి సుజుకి ఇగ్నిస్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధర అనేది కార్ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (IDV) మీద ఆధారపడి ఉంటుంది. మీ మారుతి కారు నష్టాలు సంభవించినపుడు ఇన్సూరెన్స్ సంస్థలు IDV ఆధారంగా మీ నష్టాలను భర్తీ చేస్తాయి. అయితే మీ అవసరాలకు అనుగుణంగా ఈ విలువను మార్చుకునేందుకు డిజిట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అందువల్ల ఈ విలువను అనుకూలీకరించుకునేటపుడు మీరు మీ రాబడిని పెంచుకోవచ్చు.
అంతే కాకుండా మీకు మారుతి ఇగ్నిస్ కార్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే డిజిట్ కస్టమర్ సపోర్ట్ కి కాల్ చేసి వాటిని నివృత్తి చేసుకోవచ్చు. ఇలా అనేక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి.. మీరు మీ మారుతి సుజుకి ఇగ్నిస్ కారు ఇన్సూరెన్స్ కోసం డిజిట్ ను ఎంచుకోవచ్చు.
మారుతి సుజుకి ఇగ్నిస్ అనేది లగ్జరీ యొక్క మినీ వెర్షన్. కావున మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు కార్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీకు నష్టం జరిగినపుడు వివిధ మార్గాల్లో మీకు రీయింబర్స్ చేస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా ఈ పాలసీ ఇంకా కొన్ని రకాల కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్స్ ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. వాటిల్లో బ్రేక్ డౌన్ అసిస్టెన్స్, ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్, టైర్ ప్రొటెక్టివ్ కవర్ మరియు జీరో డెప్ కవర్ వంటివి ఉన్నాయి.
ఇతర పరిశ్రమలతో పోల్చుకుంటే ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఉత్పత్తులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అలానే ప్రీమియం కార్ సెల్లార్ మారుతి సుజుకి చేసిన ఒక ఆవిష్కరణ ఇగ్నిస్. ఈ కారు 13వ ఎడిషన్ NDTV కార్ అండ్ బైక్ అవార్డ్ గెలుచుకుంది.
ప్రయాణికుల భద్రత కోసం మారుతి సుజుకి ఇగ్నిస్ అనేది ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ ప్లాట్.ఫామ్ ద్వారా తయారు చేయబడింది. ఇది 1000+ క్యూబిక్ కెపాసిటీతో ఉండే కారు. ఇది ఎంతో అట్రాక్టివ్ ఉంటూ ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తుంది.
20+ మోడల్స్ లో పట్టణ ప్రాంత ప్రజలకు ఉన్న మరో మోడల్ మారుతి సుజుకి ఇగ్నిస్. దీని 4 వేరియంట్లు పెట్రోల్/డీజిల్ వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా వీటి ధర కూడా రూ. 4.79 లక్షల నుంచి రూ. 7.14 లక్షల మధ్య ఉంది. ఈ కారులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంది. ఇది లీటర్ ఇంధనానికి 20.89 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
మారుతి సుజుకి ఇగ్నిస్ అనేది సిగ్మా, డెల్టా, జెటా, మరియు ఆల్ఫా వేరియంట్లతో కూడిన కాంపాక్ట్ కారు. ఈ అన్ని వేరియంట్లలో అధునాతన ఫీచర్లయిన ఎయిర్ బ్యాగులు, ABS, హెడ్ బీమ్ అడ్జస్టర్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హయ్యర్ వేరియంట్స్ అయిన ఆల్ఫా మరియు జెటాలలో రియర్ (వెనకాల వైపు) వైపర్స్, హలోజెన్స్, ఫ్రంట్ ఫాగ్ లైట్లు కూడా ఉంటాయి.
కస్టమర్‌కు మెరుగైన సౌలభ్యం అందించడం కోసం ఈ వేరియంట్లలో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, రియర్ పార్కింగ్ సెన్సార్, స్టార్ మరియు స్టాప్ కోసం పుష్ బటన్, హైట్ అడ్జస్ట్ చేసుకునే డ్రైవర్ సీటు వంటివి ఉంటాయి. మారుతి సుజుకి ఇగ్నిస్ అనేది అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న కొత్త యుగపు కారు. అంతే కాకుండా ఇంధనం, లైట్లు, డోర్స్, సీట్ బెల్టు వంటి విషయాల్లో మీకు అలారం కూడా వస్తుంది. మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతుంది.
మారుతి సుజుకి ఇగ్నిస్ కారు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. అంతే కాకుండా కీలెస్ ఎంట్రీ కూడా ఇందులో ఉంటుంది. ఇందులో మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి.
చెక్: మారుతి కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
వేరియంట్ పేరు |
వేరియంట్ ధర (న్యూ ఢిల్లీ, నగరాన్ని బట్టి ధర మారుతూ ఉండొచ్చు) |
సిగ్మా |
రూ. 5.65 లక్షలు |
డెల్టా |
రూ. 6.41 లక్షలు |
జెటా |
రూ. 7.03 లక్షలు |
డెల్టా AMT |
రూ. 7.13 లక్షలు |
జెటా AMT |
రూ. 7.58 లక్షలు |
ఆల్ఫా |
రూ. 7.85 లక్షలు |
ఆల్ఫా AMT |
రూ. 8.50 లక్షలు |