సూపర్ టాప్‌-అప్ హెల్త్ ఇన్సూరెన్స్

Zero Paperwork. Quick Process.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఇప్పటికే మీ కార్పొరేట్ ఇన్సూరెన్స్‌లో (ఏడాదిలో) గరిష్టంగా క్లెయిమ్ చేసుకున్నప్పుడు లేదా మీరు సొంతంగా కొంత మొత్తాన్ని చెల్లించేందుకు మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు వాడుకునేందుకు హెల్త్​ ఇన్సూరెన్స్​కు ఇచ్చే పొడిగింపు లాంటిది. కాకపోతే అధిక ధరలు ఉన్నప్పుడు కవర్ అవ్వడానికి ఓ హెల్త్ ఇన్పూరెన్స్ ఇచ్చేవారు అవసరం.

సూపర్ టాప్-అప్ ప్లాన్ గొప్పతనం ఏంటంటే.. మీ డిడక్టబుల్​ను దాటి ఖర్చు చేసిన తర్వాత కూడా పాలసీ సంవత్సరంలోపు ఉన్న మొత్తం మెడికల్ ఖర్చులను కూడా క్లెయిమ్ చేసుకునే వీలు కల్పిస్తుంది. అదే రెగ్యులర్ టాప్–అప్ మాత్రం డిడక్టబుల్ దాటిన తర్వాత ఒక్కసారే క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది!

ఒక ఉదాహరణతో సూపర్ టాప్–అప్​ను అర్థం చేసుకుందాం

సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ (డిజిట్ హెల్త్ కేర్ ప్లస్) ఇతర టాప్​–అప్​ ప్లాన్లు
డిడక్టబుల్ ఎంపిక 2 లక్షలు 2 లక్షలు
ఇన్సూరెన్స్​ చేసే మొత్తం 10 లక్షలు 10 లక్షలు
ఏడాదిలో తొలి క్లెయిమ్ 4 లక్షలు 4 లక్షలు
మీరు చెల్లించేది 2 లక్షలు 2 లక్షలు
మీ టాప్–అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది 2 లక్షలు 2 లక్షలు
ఏడాదిలో రెండో క్లెయిమ్ 6 లక్షలు 6 లక్షలు
మీరు చెల్లించేది ఏమీ ఉండదు 😊 2 లక్షలు (డిడక్టబుల్ ఎంపిక)
మీ టాప్–అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది 6 లక్షలు 4 లక్షలు
ఏడాదిలో మూడో క్లెయిమ్ 1 లక్ష 1 లక్ష
మీరు చెల్లించేది ఏమీ ఉండదు 😊 1 లక్ష
మీ టాప్–అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది 1 లక్ష ఏమీ ఉండదు ☹️

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ లాభాలు ఏంటి?

మహమ్మారులను కవర్ చేస్తుంది - కోవిడ్-19 మన జీవితాల్లో చాలా అనిశ్చితి తెచ్చింది. ఇతర అనారోగ్యాలతో పాటు కోవిడ్-19 ఒక మహమ్మారి అయినా కూడా దాన్ని కవర్ చేస్తుంది.

మీ డిడక్టబుల్​ను ఒక్కసారి మాత్రమే చెల్లించండి - సూపర్ టాప్-అప్ ఇన్పూరెన్స్ తో మీ డిడక్టబుల్ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే చెల్లించాలి. ఇక ఆ తర్వాత సంవత్సరంలో చాలా సార్లు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది డిజిట్ అసలైన ప్రత్యేకత! 😊

హెల్త్ కేర్ అవసరాలకు తగ్గట్టు మీ సూపర్ టాప్-అప్ పాలసీని కస్టమైజ్ చేసుకోండి - మీరు 1, 2, 3 మరియు 5 లక్షల డిడక్టబుల్స్ ఎంచుకోవచ్చు. మీ ఇన్సూరెన్స్ మొత్తంగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

రూమ్ రెంట్​పై పరిమితులు ఉండవు - ప్రతీ ఒక్కరికి వేర్వేరు ప్రాధాన్యాలు ఉంటాయి. అది మాకు తెలుసు. అందుకే మేము రూమ్ రెంట్​పై పరిమితులు విధించడం లేదు! మీరు మీకు నచ్చిన ఏ ఆస్పత్రిలోనైనా రూమ్​ను ఎంచుకోండి. 😊

ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందండి - క్యాష్​లెస్ క్లెయిమ్‌ల కోసం భారతదేశంలోని మా నెట్‌వర్క్ ఆసుపత్రులలో 16400+ పైగా ఆసుపత్రులను ఎంచుకోండి. లేదా మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ సదుపాయాన్ని కూడా ఎంచుకోవచ్చు.

సులభమైన ఆన్‌లైన్ ప్రక్రియలు - సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి మీ క్లెయిమ్‌ను పేపర్‌లెస్, సులభంగా, త్వరితంగా, అవాంతరాలు లేకుండా అయిపోతుంది. క్లెయిమ్‌ల కోసం కూడా ఎలాంటి హార్డ్ కాపీలు అవసరం ఉండదు.

మీరు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు కొనుగోలు చేయాలి?

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?

ప్రయోజనాలు

సూపర్ టాప్ అప్

నిర్దిష్ట పరిమితిపై కేవలం ఒక్క క్లెయిమ్​ను మాత్రమే కవర్​ చేసే సాధారణ టాప్​–అప్​ ఇన్సూరెన్స్​తో పోల్చితే, సూపర్​ టాప్​–అప్​ ఒక పాలసీ సంవత్సరంలో దాని డిడక్టబుల్​ పరిమితిని దాటిన తర్వాత అయ్యే క్యుములేటివ్​ వైద్య ఖర్చులకు క్లెయిములను చెల్లిస్తుంది.

మీ డిడక్టబుల్​ను ఒక్కసారి మాత్రమే చెల్లించండి– డిజిట్​ స్పెషల్​

ఆసుపత్రిపాలైన అన్ని సందర్భాలకు

ఇది అనారోగ్యం, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. మీ డిడక్టబుల్​ పరిమితి దాటిన తర్వాత మీరు బీమా చేసిన మొత్తం నిండుకునే వరకు దీనిని ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా వాడుకోవచ్చు.

డే కేర్ ప్రొసీజర్లు

సాధారణంగా ఆరోగ్య బీమా అనేది 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడే వర్తిస్తుంది. కానీ, డే కేర్ చికిత్సలు అంటే 24 గంటల కంటే తక్కువ సమయంలో ఆస్పత్రిలో పూర్తయ్యే చికిత్సలు.

ముందు నుంచే ఉన్న/ నిర్దిష్ట అనారోగ్య వెయిటింగ్ పీరియడ్

మీకు ముందు నుంచే ఉన్న లేదా నిర్దిష్ట అనారోగ్యానికి మీరు క్లెయిమ్ చేసుకోవడానికి వేచి ఉండాల్సిన సమయం.

4 సంవత్సరాలు/ 2 సంవత్సరాలు

గది అద్దె పరిమితి

వేర్వేరు రకాల గదులకు అద్దె వేర్వేరుగా ఉంటుంది. హోటల్ గదులు ఎలాంటి ప్లాన్లను కలిగి ఉంటాయో అలాగే అన్నమాట. డిజిట్ ఇన్సూరెన్స్ వద్ద ఉన్న కొన్ని ప్లాన్లు, మీకు ఎలాంటి గది అద్దె పరిమితులు లేని ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, ఆ గది అద్దె​ మీ బీమా మొత్తం కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది.

రూమ్​ రెంట్​ పరిమితి లేదు – డిజిట్​ ప్రత్యేకం

ఐసీయూ (ICU) గది అద్దె

ఐసీయూ (ICU –ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్) అనేవి పరిస్థితి విషమంగా ఉన్న రోగుల కోసం నిర్దేశించినవి. ఐసీయూలో ఉన్న రోగుల పట్ల ఎక్కువ శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే వాటి అద్దె కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఆ గది అద్దె మీరు బీమా చేసిన మొత్తం కంటే తక్కువగా ఉన్నంత వరకు డిజిట్​ మీకు ఎలాంటి పరిమితులు విధించదు.

పరిమితి లేదు

రోడ్ అంబులెన్స్ చార్జీలు

ఆసుపత్రికి వెళ్లే వారికి అంబులెన్స్ సేవలు చాలా ముఖ్యం. అన్ని వైద్య సేవలతో పాటుగా ఇవి కూడా అత్యవసర సేవలు. వ్యాధి సోకిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకుపోవడం మాత్రమే కాకుండా అతడికి ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఉంటే మీకు చికిత్స అందిస్తాయి. ఈ సూపర్–టాప్ అప్​ పాలసీలో అంబులెన్స్ ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.

కాంప్లిమెంటరీ వార్షిక వైద్య పరీక్షలు

మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వార్షిక వైద్య పరీక్షలు చాలా అవసరం. ఈ వార్షిక వైద్య పరీక్షల ద్వారానే మీ ఆరోగ్య వివరాలు సరిగ్గా తెలుస్తాయి. మీకు ఏదైనా జబ్బున్నా ఇట్టే తెలిసిపోతుంది. మీకు నచ్చిన ఏ ఆసుపత్రిలోనైనా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అయ్యే ఖర్చులను ఇది రీయింబర్స్ చేస్తుంది. కావున ఈ ప్రయోజనం మీకు బాగా ఉపయోగపడుతుంది.

ఆసుపత్రిపాలు కావడానికి ముందు/తర్వాత అయ్యే ఖర్చులు

ఆస్పత్రిపాలు కావడానికి ముందు, అయిన తర్వాత చేసే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఇతర పరీక్షలు, కోలుకోవడానికి అయ్యే ఖర్చులను ఇది కవర్ చేస్తుంది.

ఆస్పత్రిపాలైన తర్వాత ఏకమొత్తం – డిజిటల్ ప్రత్యేకం

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత మీ అన్ని రకాల వైద్య ఖర్చులను కవర్ చేసుకునేందుకు ఈ ప్రయోజనం ఉపయోగపడుతుంది. దీనికోసం మీకు ఎటువంటి బిల్లులు అవసరం లేదు. మీరు రీయింబర్స్​మెంట్ ద్వారా అయినా ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదా ఆస్పత్రిపాలైన తర్వాత అయినా ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు.

సైక్రియాట్రిక్ ఇల్​నెస్ కవర్

ట్రామా కారణంగా ఆసుపత్రిలో చేరి సైక్రియాట్రిక్ చికిత్స తీసుకుంటే దీని కింద కవర్​ అవుతుంది. కానీ ఓపీడీ (OPD) సంప్రదింపులు దీని కింద కవర్ కావు.

బేరియాట్రిక్ సర్జరీ

ఈ కవరేజ్ అనేది స్థూలకాయం (బీఎంఐ (BMI) > 35) కారణంగా అవయవాల సమస్యను ఎదుర్కొనే వారికి మాత్రమే. అంతేకాకుండా స్థూలకాయం వలన ఆహార సమస్యలు, హార్మోన్ల ప్రభావితం అవడం, ఇతర చికిత్స చేసే సమస్యలు ఏర్పడితే చేసే సర్జరీ ఈ ప్లాన్ కింద కవర్ కాదు.

Get Quote

ఏవి కవర్ కావు?

మీ డిడక్టబుల్ పూర్తయ్యే వరకు క్లెయిమ్ చేయలేరు

మీరు ఇప్పటికే ఉన్న మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ మొత్తాన్ని ఇప్పటికే పూర్తయిన తర్వాత లేదా మీ పాకెట్ నుంచి ఖర్చు పెట్టినట్లయితే మాత్రమే మీ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్ చేయవచ్చు. అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే మీ డిడక్టబుల్​ను ఒకసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ముందు నుంచే ఉన్న వ్యాధులు

ముందుగా ఉన్న వ్యాధి విషయంలో వెయిటింగ్ పీరియడ్ ముగియకపోతే ఆ వ్యాధి కోసం క్లెయిమ్ చేసుకోలేరు.

డాక్టర్ సిఫార్సు లేకుండా ఆసుపత్రిలో చేరడం

డాక్టర్ సిఫార్సుతో సంబంధం లేకుండా మీరు ఏ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరినా అది కవర్ కాదు.

ప్రీ-నాటల్ & పోస్ట్-నాటల్ ఖర్చులు

ప్రసవానికి ముందరి, ప్రసవానంతర వైద్య ఖర్చులు. ఆసుపత్రిలో చేరే పరిస్థితులు వస్తే తప్ప కవర్ కావు.

క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు - ఆసుపత్రిలో చేరిన రెండు రోజులలోపు 1800-258-4242 ద్వాారా ఆ విషయాన్నిమాకు తెలియజేయండి లేదా healthclaims@godigit.comకి ఈ‌–మెయిల్ చేయండి. అప్పుడు రీయింబర్స్‌మెంట్‌ను ప్రాసెస్ చేయడానికి మీ హాస్పిటల్ బిల్లులు, అన్ని సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయగల లింక్‌ను మేము మీకు పంపిస్తాం.

క్యాష్​లెస్ క్లెయిమ్‌లు - నెట్‌వర్క్ ఆసుపత్రిని ఎంచుకోండి. మీరు నెట్‌వర్క్ ఆసుపత్రుల పూర్తి లిస్టును ఇక్కడ చూడవచ్చు. హాస్పిటల్ హెల్ప్‌ డెస్క్‌కు ఈ-హెల్త్ కార్డ్‌ను చూపించి, క్యాష్​లెస్ రిక్వెస్ట్ ఫారమ్‌ అడగండి. అన్నీ బాగుంటే మీ క్లెయిమ్ అప్పటికప్పుడు ప్రాసెస్ అవుతుంది.

మీరు కరోనా వైరస్ కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణే యొక్క అధీకృత కేంద్రం నుంచి మీకు పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టు ఉండేలా నిర్ధారించుకోండి.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్య ప్రయోజనాలు

డిడక్టబుల్ ఒకేసారి చెల్లించండి
కో–పేమెంట్ వయసు ఆధారిత కో–పేమెంట్స్ ఉండవు
క్యాష్​లెస్ ఆసుపత్రులు భారతదేశ వ్యాప్తంగా మొత్తం 16400+ క్యాష్​లెస్ ఆసుపత్రులు
రూమ్ రెంట్ పరిమితి రూమ్​ రెంట్ పరిమితి లేదు. మీకు నచ్చినది ఎంచుకోండి
క్లెయిమ్ ప్రక్రియ డిజిటల్ ఫ్రెండ్లీ, హార్డ్ కాపీలు అవసరం లేదు!
కోవిడ్-19 చికిత్స కవర్ అవుతుంది

భారతదేశంలో సూపర్ టాప్–అప్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

సూపర్ టాప్-అప్ హెల్త్​ ఇన్పూరెన్స్ ఎలా పని చేస్తుంది?

ఒక సూపర్ టాప్-అప్ ప్లాన్ ఖర్చుల షేరింగ్​ ప్రాతిపదికన పనిచేస్తుంది. అంటే, మొత్తం ఖర్చు మీ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ భరించదు. అయితే మీ డిడక్టబుల్ ఆధారంగా కొంత భాగం మాత్రమే కవర్ అవుతుంది. మీ సూపర్ టాప్-అప్ ప్లాన్‌లో రూ. 2 లక్షల డిడక్టబుల్ ఉంటే, మీ సూపర్ టాప్-అప్ ప్లాన్ 2 లక్షలకు మించిన క్లెయిమ్‌లకు వర్తిస్తుంది.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్, సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మధ్య తేడా ఏమిటి?

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్, మీ రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ మొత్తం లేదా మీ హాస్పిటలైజేషన్ ఖర్చులలో (మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని బట్టి) 70% కవర్ చేస్తుంది.

అయితే, సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మీ ఖర్చులను కవర్ చేస్తుంది. 

ఉదాహరణకు: మీ సూపర్ టాప్–అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు రూ. 5 లక్షల తర్వాత మాత్రమే వర్తిస్తుంది. అంటే మీ బిల్లు రూ. 8 లక్షలు అయితే, మీరు సొంతంగా లేదా మీ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి రూ. 5 లక్షలు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన రూ. 3 లక్షలను మాత్రమే కవర్ చేస్తుంది.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎందుకు చౌకగా ఉంటుంది?

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చౌకగా ఉండటానికి ప్రాథమిక కారణం ఏంటంటే, మొత్తం ఖర్చులను సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరించదు. అదనంగా, డిడక్టబుల్ పరిమితిని దాటిన తర్వాత మాత్రమే ఖర్చులు భరిస్తాయి.

టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య తేడా ఏమిటి?

మీరు టాప్-అప్, సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండింటి గురించీ చదివి ఉండవచ్చు. అయినా వాటి మధ్య తేడా ఏమిటో అయోమయంలో ఉన్నారనుకోండి. సరళంగా చెప్పాలంటే ఒక క్లెయిమ్ డిడక్టబుల్ పరిమితిని మించిపోయినప్పుడు మాత్రమే టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది.

సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ క్లెయిమ్‌లు డిడక్టబుల్ పరిమితిని మించిపోయినప్పటికీ, సూపర్-టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. 

ఉదాహరణకు: మీరు రూ. 5 లక్షల తగ్గింపుతో టాప్–అప్ ప్లాన్‌ ఎంచుకున్నారు అనుకోండి. ఆ సంవత్సరంలో మీకు ఒక్కొక్కటి రూ. 4 లక్షల చొప్పున రెండు క్లెయిమ్‌లు ఉంటే, క్లెయిమ్ రూ. 5 లక్షలు దాటకపోవడంతో మీ టాప్–అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు. 

అయితే, ఒక సూపర్ టాప్-అప్ ప్లాన్ సంవత్సరంలో మొత్తం క్లెయిమ్ మొత్తం రూ. 8 లక్షలు కాబట్టి మిగిలిన రూ. 3 లక్షలకు కవర్ అవుతుంది.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో డిడక్టబుల్ అంటే ఏమిటి?

డిడక్టబుల్ అనేది మీ సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ మీ కోసం చెల్లించడానికి ముందు మీరు లేదా మీ ప్రైమరీ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించాల్సిన మొత్తం. 

కాబట్టి, ఉదాహరణకు, మీరు రూ. 2 లక్షల విలువైన డిడక్టబుల్ టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ ప్లాన్‌ను ఎంచుకుంటే, మీ ఇన్సూరెన్స్ మొత్తం రూ. 20 లక్షలు. క్లెయిమ్ సమయంలో మీకు రూ. 3 లక్షల మొత్తం క్లెయిమ్ ఉన్నట్లయితే, మీ సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ రూ. ఒక లక్షకు క్లెయిమ్ అవుతుంది. అయితే, మీరు రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. (మీ జేబు నుంచి లేదా మీ గ్రూప్ మెడికల్ ప్లాన్/ప్రైమరీ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి).

ఆయుష్ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్​లో కవర్ అవుతుందా?

అవును, డిజిట్ యొక్క సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆయుష్ ద్వారా చికిత్సలకు కూడా వర్తిస్తుంది.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ఎవరు అర్హులు?

18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి అర్హులు.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ నా తల్లిదండ్రులకు ఎలా ఉపయోగపడుతుంది?

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటే ఒక సంవత్సరంలో ఆరోగ్య సంరక్షణ కోసం చేసే మొత్తం ఖర్చులు మీ కార్పొరేట్ ప్లాన్ లేదా ప్రైమరీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేసే దానికంటే ఎక్కువ ఉండవచ్చు.

టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ ప్లాన్​లో నేను దేన్ని ఎంచుకోవాలి?

చాలా మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవడానికి టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేస్తారు. టాప్-అప్, సూపర్ టాప్-అప్ రెండూ నిర్ణయించిన డిడక్టబుల్ మొత్తం కంటే ఎక్కువగా అయితే అప్పుడు సహాయపడతాయి. సంవత్సరంలో మొత్తం ఖర్చులు డిడక్టబుల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సూపర్ టాప్-అప్ ప్లాన్‌లు వర్తిస్తాయి. అయితే టాప్-అప్ ప్లాన్‌లు ఒక్క క్లెయిమ్‌కే వర్తిస్తాయి. 

కాబట్టి, ఆర్థికపరమైన కోణం నుంచి చూస్తే, సూపర్ టాప్-అప్ ప్లాన్‌లు మీరు చాలా ఎక్కువ ఆదా చేసుకోవడంలో, మీకు ప్రయోజనం చేకూర్చడంలో దోహదపడతాయి!

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ నా ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎలా పెంచుతుంది?

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే.. మీరు సంవత్సరంలో ఆరోగ్య సంబంధిత క్లెయిమ్‌లపై మీ డిడక్టబుల్ మొత్తాన్ని ఖర్చు చేసిన తర్వాత, అదనపు కవరేజ్ కోసం మీరు మీ సూపర్ టాప్-అప్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు రూ. 3 లక్షల వరకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్, రూ. 10 లక్షల సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉంటే, మీరు మొత్తం రూ. 13 లక్షల ఇన్సూరెన్స్ మొత్తాన్ని కలిగి ఉంటారన్న మాట. ఇలా మీ సూపర్ టాప్–అప్ ప్రైమరీ బూస్ట్ ఇస్తుంది.

నా సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు ఏమిటి?

మీ వయసు, మీరు నివసించే ప్రాంతం, మీ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో భాగంగా మీరు ఎంచుకున్న డిడక్టబుల్, ఇన్సూరెన్స్ మొత్తం వంటి అంశాలు మీ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపుతాయి.