సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్
No Capping
on Room Rent
Affordable
Premium
24/7
Customer Support
No Capping
on Room Rent
Affordable
Premium
24/7
Customer Support
సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఇప్పటికే మీ కార్పొరేట్ ఇన్సూరెన్స్‌లో (ఏడాదిలో) గరిష్టంగా క్లెయిమ్ చేసుకున్నప్పుడు లేదా మీరు సొంతంగా కొంత మొత్తాన్ని చెల్లించేందుకు మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు వాడుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఇచ్చే పొడిగింపు లాంటిది. కాకపోతే అధిక ధరలు ఉన్నప్పుడు కవర్ అవ్వడానికి ఓ హెల్త్ ఇన్పూరెన్స్ ఇచ్చేవారు అవసరం.
సూపర్ టాప్-అప్ ప్లాన్ గొప్పతనం ఏంటంటే.. మీ డిడక్టబుల్‌ను దాటి ఖర్చు చేసిన తర్వాత కూడా పాలసీ సంవత్సరంలోపు ఉన్న మొత్తం మెడికల్ ఖర్చులను కూడా క్లెయిమ్ చేసుకునే వీలు కల్పిస్తుంది. అదే రెగ్యులర్ టాప్–అప్ మాత్రం డిడక్టబుల్ దాటిన తర్వాత ఒక్కసారే క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది!
ఒక ఉదాహరణతో సూపర్ టాప్–అప్ను అర్థం చేసుకుందాం
సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ (డిజిట్ హెల్త్ కేర్ ప్లస్) | ఇతర టాప్–అప్ ప్లాన్లు | |
డిడక్టబుల్ ఎంపిక | 2 లక్షలు | 2 లక్షలు |
ఇన్సూరెన్స్ చేసే మొత్తం | 10 లక్షలు | 10 లక్షలు |
ఏడాదిలో తొలి క్లెయిమ్ | 4 లక్షలు | 4 లక్షలు |
మీరు చెల్లించేది | 2 లక్షలు | 2 లక్షలు |
మీ టాప్–అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది | 2 లక్షలు | 2 లక్షలు |
ఏడాదిలో రెండో క్లెయిమ్ | 6 లక్షలు | 6 లక్షలు |
మీరు చెల్లించేది | ఏమీ ఉండదు 😊 | 2 లక్షలు (డిడక్టబుల్ ఎంపిక) |
మీ టాప్–అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది | 6 లక్షలు | 4 లక్షలు |
ఏడాదిలో మూడో క్లెయిమ్ | 1 లక్ష | 1 లక్ష |
మీరు చెల్లించేది | ఏమీ ఉండదు 😊 | 1 లక్ష |
మీ టాప్–అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది | 1 లక్ష | ఏమీ ఉండదు ☹️ |
సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ లాభాలు ఏంటి?
మీరు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?
సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు కొనుగోలు చేయాలి?
సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
ప్రయోజనాలు |
|
సూపర్ టాప్ అప్ నిర్దిష్ట పరిమితిపై కేవలం ఒక్క క్లెయిమ్‌ను మాత్రమే కవర్ చేసే సాధారణ టాప్–అప్ ఇన్సూరెన్స్‌తో పోల్చితే, సూపర్ టాప్–అప్ ఒక పాలసీ సంవత్సరంలో దాని డిడక్టబుల్ పరిమితిని దాటిన తర్వాత అయ్యే క్యుములేటివ్ వైద్య ఖర్చులకు క్లెయిములను చెల్లిస్తుంది. |
మీ డిడక్టబుల్‌ను ఒక్కసారి మాత్రమే చెల్లించండి– డిజిట్ స్పెషల్
|
ఆసుపత్రిపాలైన అన్ని సందర్భాలకు ఇది అనారోగ్యం, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. మీ డిడక్టబుల్ పరిమితి దాటిన తర్వాత మీరు బీమా చేసిన మొత్తం నిండుకునే వరకు దీనిని ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా వాడుకోవచ్చు. |
✔
|
డే కేర్ ప్రొసీజర్లు సాధారణంగా ఆరోగ్య బీమా అనేది 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడే వర్తిస్తుంది. కానీ, డే కేర్ చికిత్సలు అంటే 24 గంటల కంటే తక్కువ సమయంలో ఆస్పత్రిలో పూర్తయ్యే చికిత్సలు. |
✔
|
ముందు నుంచే ఉన్న/ నిర్దిష్ట అనారోగ్య వెయిటింగ్ పీరియడ్ మీకు ముందు నుంచే ఉన్న లేదా నిర్దిష్ట అనారోగ్యానికి మీరు క్లెయిమ్ చేసుకోవడానికి వేచి ఉండాల్సిన సమయం. |
4 సంవత్సరాలు/ 2 సంవత్సరాలు
|
గది అద్దె పరిమితి వేర్వేరు రకాల గదులకు అద్దె వేర్వేరుగా ఉంటుంది. హోటల్ గదులు ఎలాంటి ప్లాన్లను కలిగి ఉంటాయో అలాగే అన్నమాట. డిజిట్ ఇన్సూరెన్స్ వద్ద ఉన్న కొన్ని ప్లాన్లు, మీకు ఎలాంటి గది అద్దె పరిమితులు లేని ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, ఆ గది అద్దె మీ బీమా మొత్తం కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది. |
రూమ్ రెంట్ పరిమితి లేదు – డిజిట్ ప్రత్యేకం
|
ఐసీయూ (ICU) గది అద్దె ఐసీయూ (ICU –ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్) అనేవి పరిస్థితి విషమంగా ఉన్న రోగుల కోసం నిర్దేశించినవి. ఐసీయూలో ఉన్న రోగుల పట్ల ఎక్కువ శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే వాటి అద్దె కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఆ గది అద్దె మీరు బీమా చేసిన మొత్తం కంటే తక్కువగా ఉన్నంత వరకు డిజిట్ మీకు ఎలాంటి పరిమితులు విధించదు. |
పరిమితి లేదు
|
రోడ్ అంబులెన్స్ చార్జీలు ఆసుపత్రికి వెళ్లే వారికి అంబులెన్స్ సేవలు చాలా ముఖ్యం. అన్ని వైద్య సేవలతో పాటుగా ఇవి కూడా అత్యవసర సేవలు. వ్యాధి సోకిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకుపోవడం మాత్రమే కాకుండా అతడికి ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఉంటే మీకు చికిత్స అందిస్తాయి. ఈ సూపర్–టాప్ అప్ పాలసీలో అంబులెన్స్ ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి. |
✔
|
కాంప్లిమెంటరీ వార్షిక వైద్య పరీక్షలు మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వార్షిక వైద్య పరీక్షలు చాలా అవసరం. ఈ వార్షిక వైద్య పరీక్షల ద్వారానే మీ ఆరోగ్య వివరాలు సరిగ్గా తెలుస్తాయి. మీకు ఏదైనా జబ్బున్నా ఇట్టే తెలిసిపోతుంది. మీకు నచ్చిన ఏ ఆసుపత్రిలోనైనా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అయ్యే ఖర్చులను ఇది రీయింబర్స్ చేస్తుంది. కావున ఈ ప్రయోజనం మీకు బాగా ఉపయోగపడుతుంది. |
✔
|
ఆసుపత్రిపాలు కావడానికి ముందు/తర్వాత అయ్యే ఖర్చులు ఆస్పత్రిపాలు కావడానికి ముందు, అయిన తర్వాత చేసే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఇతర పరీక్షలు, కోలుకోవడానికి అయ్యే ఖర్చులను ఇది కవర్ చేస్తుంది. |
✔
|
ఆస్పత్రిపాలైన తర్వాత ఏకమొత్తం – డిజిటల్ ప్రత్యేకం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత మీ అన్ని రకాల వైద్య ఖర్చులను కవర్ చేసుకునేందుకు ఈ ప్రయోజనం ఉపయోగపడుతుంది. దీనికోసం మీకు ఎటువంటి బిల్లులు అవసరం లేదు. మీరు రీయింబర్స్‌మెంట్ ద్వారా అయినా ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదా ఆస్పత్రిపాలైన తర్వాత అయినా ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. |
✔
|
సైక్రియాట్రిక్ ఇల్నెస్ కవర్ ట్రామా కారణంగా ఆసుపత్రిలో చేరి సైక్రియాట్రిక్ చికిత్స తీసుకుంటే దీని కింద కవర్ అవుతుంది. కానీ ఓపీడీ (OPD) సంప్రదింపులు దీని కింద కవర్ కావు. |
✔
|
బేరియాట్రిక్ సర్జరీ ఈ కవరేజ్ అనేది స్థూలకాయం (బీఎంఐ (BMI) > 35) కారణంగా అవయవాల సమస్యను ఎదుర్కొనే వారికి మాత్రమే. అంతేకాకుండా స్థూలకాయం వలన ఆహార సమస్యలు, హార్మోన్ల ప్రభావితం అవడం, ఇతర చికిత్స చేసే సమస్యలు ఏర్పడితే చేసే సర్జరీ ఈ ప్లాన్ కింద కవర్ కాదు. |
✔
|
ఏవి కవర్ కావు?
క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?
సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్య ప్రయోజనాలు
డిడక్టబుల్ |
ఒకేసారి చెల్లించండి |
కో–పేమెంట్ |
వయసు ఆధారిత కో–పేమెంట్స్ ఉండవు |
క్యాష్‌లెస్ ఆసుపత్రులు |
భారతదేశ వ్యాప్తంగా మొత్తం 16400+ క్యాష్‌లెస్ ఆసుపత్రులు |
రూమ్ రెంట్ పరిమితి |
రూమ్ రెంట్ పరిమితి లేదు. మీకు నచ్చినది ఎంచుకోండి |
క్లెయిమ్ ప్రక్రియ |
డిజిటల్ ఫ్రెండ్లీ, హార్డ్ కాపీలు అవసరం లేదు! |
కోవిడ్-19 చికిత్స |
కవర్ అవుతుంది |