ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ (వ్యక్తిగత ఆరోగ్య బీమా) అనేది ఒకరకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది యువత కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఎదురయ్యే అనేక రకాల జబ్బులు, ఆస్పత్రి ఖర్చులు, పెళ్లయ్యాక పిల్లలు పుడితే అయ్యే ఖర్చులు, ఇంకా అనారోగ్య సమస్యల వల్ల ఎదురయ్యే ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది.
వ్యక్తిగత పాలసీ అనేది ఇంకా ఫ్యామిలీ ఏర్పాటు చేయని యుక్త వయసులో ఉన్న వారి కోసం రూపొందించబడింది. కానీ, మీరు మీ పాలసీలో వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యా పిల్లలను తర్వాత కూడా చేర్చుకునే వీలుంటుంది.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది యుక్త వయస్కులు వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేస్తున్నారు. ఈ పాలసీ వలన వైద్య ఖర్చులు తగ్గించుకోవడమే గాక, పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
మంచి ఆహారం తిన్నంతమాత్రాన మనం ఆరోగ్యంగా ఉంటామని, వైద్యపరమైన ఖర్చులు చేయకుండా ఉంటామని గ్యారంటీ ఏమీ లేదు కదా!
అత్యంత ఆశావహమైన, ఎక్కువ ఒత్తిడి, ప్రపంచాన్ని జయించాలనే కోరిక, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ, ఉన్న తరానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా అవసరం. ఎవరైతే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తారో, వృథాగా డబ్బును ఖర్చు చేయరో వారికి ఈ పాలసీ చాలా అవసరం ఉంటుంది. అన్ని సౌలభ్యాలు ఉండాలని చూసే వారికి కూడా ఈ హెల్త్ పాలసీ అవసరమే.
కవరేజెస్
డబుల్ వాలెట్ ప్లాన్
ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్
వరల్డ్‌వైడ్ ట్రీట్మెంట్ ప్లాన్
ముఖ్యమైన ఫీచర్లు
అనారోగ్యం, యాక్సిడెంట్, తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్ 19 వంటి మహమ్మారితో సహా అన్ని రకాల ఆసుపత్రి చికిత్సలకు ఇది వర్తిస్తుంది. మల్టీపుల్ హాస్పిటలైజేషన్స్ కొరకు దీనిని ఉపయోగించవచ్చు. మీ సమ్ ఇన్సూర్డ్ మొత్తం ఉన్నంతవరకు
ఏదైనా ప్రమాదవశాత్తు సంఘటన జరిగినా కానీ చికిత్స కోసం కానీ కవర్ పొందేందుకు మీరు నిర్దిష్ట సమయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదే ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్.
హోమ్ హెల్త్ కేర్, టెలీ కన్సల్టేషన్లు, యోగా, మైండ్‌ఫుల్‌నెస్ వంటి ఇంకా ఎన్నో రకాల ప్రత్యేకమైన వెల్నెస్ ప్రయోజనాలు మరియు మా యాప్‌లో మరెన్నో అందుబాటులో ఉంటాయి.
మేము మీ బీమా మొత్తంలో 100 శాతం బీమా మొత్తాన్ని బ్యాకప్‌గా అందజేస్తాం. సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్ ఎలా పని చేస్తుంది? ఉదాహరణకు మీ పాలసీ మొత్తం రూ. 5 లక్షలు అనుకుందాం. మీరు కనుక రూ. 50 వేలకు క్లెయిమ్ చేస్తే.. డిజిట్ ఆటోమేటిగ్గా వాలెట్‌ను ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు మీకు ఏడాది మొత్తానికి క్లెయిమ్ చేసుకునేందుకు రూ. 4.5 లక్షలు + 5 లక్షలు ఉంటాయి. పైన పేర్కొన్న సందర్భంలో ఒక సింగిల్ క్లెయిమ్ అనేది రూ. 5 లక్షలకు మించకూడదు.
పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ లేవా? మీరు ఆరోగ్యంగా ఉండి క్లెయిమ్ చేయనందుకు మీ మొత్తం సమ్ ఇన్సూర్డ్‌లో అదనపు మొత్తాన్ని బోనస్‌గా పొందుతారు.
వేర్వేరు వర్గాలకు చెందిన గదులు వేర్వేరు రకాల అద్దెలను కలిగి ఉంటాయి. హోటల్ గదులకు టారిఫ్‌లు ఎలా ఉంటాయో అలాగే వీటికి కూడా ఉంటాయి. డిజిట్ ప్లాన్లు గది అద్దె మీ బీమా మొత్తం కంటే తక్కువగా ఉన్నంత వరకు ఎటువంటి పరిమితులు కలిగి ఉండవు.
24 గంటల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య ఖర్చులను మాత్రమే ఇది కవర్ చేస్తుంది. డే కేర్ ప్రొసీజర్స్ ఆసుపత్రిలో చేపట్టే వైద్య చికిత్సలను సూచిస్తాయి. క్యాటరాక్ట్ , డయాలసిస్ వంటి వాటికి కూడా సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ సమయం అవసరమవుతుంది.
వరల్డ్‌వైడ్ కవరేజ్‌తో ప్రపంచ స్థాయి చికిత్సను పొందండి. భారతదేశంలో మీ ఆరోగ్య పరీక్షల సమయంలో వైద్యుడు మీ అనారోగ్యం గుర్తించిన తర్వాత మీరు దేశాల్లో చికిత్సను పొందాలని అనుకుంటే మేము మీ కోసం సిద్ధంగా ఉన్నాం. అందుకు అయ్యే చికిత్స ఖర్చులకు కూడా మీరు కవర్ చేయబడతారు.
మీ హెల్త్ చెకప్స్ కోసం పాలసీలో పేర్కొన్న విధంగా ఖర్చులను మేము చెల్లిస్తాం. అటువంటి పరీక్షల కొరకు ఎటువంటి పరిమితులు ఉండవు. అది ECG లేదా థైరాయిడ్ కోసం కూడా వర్తిస్తుంది. మీ క్లెయిమ్ లిమిట్‌ను తనిఖీ చేసేందుకు మీ పాలసీ షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలించండి.
మీకు అత్యవసర ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. తక్షణమే ఆసుపత్రికి తరలించాల్సి రావొచ్చు. విమానంలో లేదా హెలికాప్టర్లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చులను మీ కోసం మేము తిరిగి చెల్లిస్తాం.
కో పేమెంట్ అంటే ఆరోగ్య బీమా పాలసీ కింద వ్యయ భాగస్వామ్య ఆవశ్యకత. ఈ విధానంలో పాలసీదారుడు/బీమా చేయించుకున్న వ్యక్తి ఒక నిర్దిష్ట శాతాన్ని భరిస్తాడు. ఇది బీమా మొత్తం విలువను తగ్గించదు. ఈ శాతం వయసు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. లేదా కొన్ని సార్లు జోన్ ఆధారిత కోపేమెంట్ అని పిలువబడి మీరు చికిత్స చేయించుకునే నగరం ఉన్న జోన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మా ప్లాన్స్‌లో ఎటువంటి జోన్ బేస్డ్ లేదా ఏజ్ బేస్డ్ కో పేమెంట్స్ లేవు.
మీరు ఆసుపత్రిలో చేరితే రోడ్ అంబులెన్స్ ఖర్చులు కూడా రీయింబర్స్ చేయబడతాయి.
ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే మొత్తం ఖర్చులకు ఈ కవర్ వర్తిస్తుంది. వివిధ రకాల నిర్దారణ పరీక్షలు, టెస్టులు, మరియు రికవరీల కోసం
ఇతర ప్రయోజనాలు
మీరు ఇప్పటికే బాధపడుతున్న వ్యాధి లేదా పరిస్థితికి మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
నిర్దిష్ట అనారోగ్యాన్ని క్లెయిమ్ చేసుకోవడం కొరకు మీరు వేచి ఉండాల్సిన సమయం ఇది. డిజిట్ వద్ద ఇది రెండు సంవత్సరాలు ఉంటుంది. పాలసీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇది మొదలవుతుంది. మినహాయింపుల పూర్తి జాబితా కొరకు మీ పాలసీ వార్డింగ్స్లోని స్టాండర్డ్ ఎక్స్‌క్లూజన్స్ (Excl02) చూడండి.
పాలసీ పీరియడ్ వ్యవధిలో మీ శరీరానికి గాయం అయి 12 నెలల లోపు అదే మీ చావుకు గల కారణం అయితే మేము పాలసీ షెడ్యూల్లో పేర్కొన్నట్లు బీమా మొత్తంలో 100 శాతం చెల్లిస్తాం. ఈ కవర్ ప్లాన్ ప్రకారం తీర్మానించబడుతుంది.
మీకు అవయవాలను దానం చేసే వ్యక్తి మీ పాలసీలో కవర్ చేయబడతాడు. అతడు ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే ఖర్చులను మేము భరిస్తాం. అవయవ దానం అనేది గొప్ప దానాలలో ఒకటి. ఎందుకు అందులో భాగం కాకూడదని మేమూ అనుకున్నాం.
ఆసుపత్రలలో పడకలు అయిపోవచ్చు. లేదా ఆసుపత్రిలో చేరేందుకు రోగి పరిస్థితి సహకరించకపోవచ్చు. ఆందోళన పడకండి. మీరు ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకున్నా సరే వైద్య ఖర్చులను మేము భరిస్తాం.
ఊబకాయం అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చు. మేము దీనిని అర్థం చేసుకున్నాం. మీకు బేరియాట్రిక్ సర్జరీ వైద్య పరంగా అవసరమైనపుడు లేదా మీ డాక్టర్ సిఫారసు చేసినపుడు దానిని కూడా కవర్ చేస్తాం. అయితే మీరు ఈ చికిత్సను చేయించుకునేది సౌందర్య కారణాల కోసం అయితే మేము కవర్ చేయం.
గాయం కారణంగా, లేదా ఇతర కారణాల వల్ల ఒక సభ్యుడు ఆసుపత్రిలో చేరవలసి వస్తే ఈ ప్రయోజనం కింద రూ. 1,00,000 కవర్ చేయబడుతుంది. అయితే OPD కన్సల్టేషన్స్ దీని పరిధిలోనికి రావు. సైక్రియాట్రిక్ ఇల్నెస్ కవర్ కోసం వెయిటింగ్ పీరియడ్ నిర్దిష్ట ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్‌తో సమానంగా ఉంటుంది.
ఆసుపత్రిలో చేరే ముందు కానీ తర్వాత కానీ నడక కోసం సహాయం చేసేవి, క్రేప్ బ్యాండేజెస్, పట్టీలు వంటి ఇతర అనేక రకాల వైద్య సహాయకాలు మరియు ఖర్చులు ఉన్నాయి. ఇవి మీ పాకెట్ అటెన్షన్‌ను క్యాచ్ చేస్తాయి. ఈ కవర్ పాలసీ నుంచి మినహాయించబడిన ఈ ఖర్చుల గురించి మొత్తం చూసుకుంటుంది.
కో పేమెంట్ |
లేదు |
రూం రెంట్ క్యాపింగ్ |
లేదు |
క్యాష్‌లెస్ హాస్పిటల్స్ |
ఇండియా వ్యాప్తంగా 10500 కంటే ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ |
ఇన్‌బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
అవును |
వెల్నెస్ బెనిఫిట్స్ |
10 కంటే ఎక్కువ వెల్నెస్ పార్ట్నర్ల నుంచి లభ్యం |
సిటీ ద్వారా వచ్చే డిస్కౌంట్ |
10 శాతం వరకు డిస్కౌంట్ |
వరల్డ్‌వైడ్ కవరేజ్ |
అవును* |
గుడ్ హెల్త్ డిస్కౌంట్ |
5% శాతం వరకు డిస్కౌంట్ |
కన్య్సూమబుల్ కవర్ |
యాడ్ ఆన్‌గా అందుబాటులో ఉంది. |
ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ (వ్యక్తిగత ఆరోగ్య బీమా) అనేది కేవలం ఒకే వ్యక్తి కోసం రూపొందించబడింది. 40 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు తప్పకుండా ఈ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీలో వివిధ రకాల అనారోగ్యాలు, హాస్పిటలైజేషన్, ఇతర రకాల మెడికల్ ఎమర్జెన్సీలు కవర్ అవుతాయి.
వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రముఖంగా కుటుంబం లేని యువత కోసమే రూపొందించినప్పటికీ, మీ మీద ఆధారపడిన వయోవృద్ధులైన తల్లిదండ్రులు, భార్యతో పాటు ఇద్దరు పిల్లలకు కూడా కవర్ అయ్యేలా ఎంచుకోవచ్చు.
మీరు త్వరలో పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనాలని భావిస్తుంటే, ముందుగానే మెటర్నిటీ ప్లాన్ ఎంచుకుంటే, మీకు అవసరమైన సమయానికి వెయిటింగ్ పీరియండ్ ముగుస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్‌లు చాలా సంక్లిష్టంగా ఉంటాయని చాలా మంది నమ్ముతారు. ఎక్కువ మంది హెల్త్ పాలసీలను ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే తీసుకుంటారు. ఈ పాలసీ వలన ఈ ప్రయోజనం మాత్రమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది మిమ్మల్ని అనేక రకాల అనారోగ్యాల నుంచి కవర్ చేస్తుంది. వైద్య ఖర్చుల చింతను తీరుస్తుంది.
నేటి డిజిటల్ యుగంలోని మార్కెట్లో అనేక రకాల ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ పద్ధతి వలన పాలసీలు తీసుకోవడం సులభం అవడంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మీరు పాలసీ తీసుకునే ముందు ఆన్లైన్లో అనేక రకాల ప్లాన్లను పోల్చి చూసుకోండి. మీ అవసరాలకు తగిన ప్లాన్‌ను ఎంచుకోండి. ఇందుకోసం మీకు ఎటువంటి పేపర్ వర్క్ అవసరం ఉండదు. కేవలం కొన్ని క్షణాల్లోనే ఇది పూర్తవుతుంది.
ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా సులభం చేశారు: డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉన్న ప్రధాన లాభం ఏంటంటే.. ఇక్కడ ప్రతీదీ ఆన్లైన్లో ఉంటుంది. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పటి నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఆన్లైన్ విధానం వలన ప్రతీదీ పారదర్శకంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
క్యాష్‌లెస్ సెటిల్మెంట్స్: క్యాష్‌లెస్ క్లెయిమ్స్ వలన మీరు మీ జేబు నుంచి ఎటువంటి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ పద్ధతి వలన మీ క్లెయిమ్ ప్రక్రియ సులభం అవడం మాత్రమే కాదు... మీరు ఎటువంటి చింతా లేకుండా ఉండొచ్చు. క్యాష్‌లెస్ సెటిల్మెంట్లు డిజిట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
అతిపెద్ద ఆస్పత్రుల నెట్వర్క్: క్యాష్‌లెస్ సెటిల్మెంట్లు చేసే వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరేందుకు ఎక్కువ సంఖ్యలో ఆస్పత్రులు మీకు అందుబాటులో ఉన్నాయి. డిజిట్ ఎక్కువ ఆస్పత్రులను క్యాష్‌లెస్ క్లెయిమ్స్ కోసం ఆఫర్ చేస్తుంది.
కస్టమైజ్డ్ హెల్త్ ప్లాన్లు: డిజిట్ ద్వారా మీరు ఆన్లైన్ పాలసీని కొనుగోలు చేసినపుడు మీకు ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి. మీ అవసరాలకు తగిన విధంగా ప్లాన్లు ఉంటాయి. మీకు అందే ప్రయోజనాలను మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు ఇన్సూరెన్స్ చేయాలనుకునే మొత్తాన్ని మీకు నచ్చినట్లు మార్చుకునే అవకాశం ఉంది. మీ గురించి మీ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు కదా.
మీ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుంది: డిజిట్ పాలసీలో మేము మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటేనే మీరు సంతోషంగా ఉంటారు.
మీరు ఇంతకు ముందు ఎప్పుడూ ఆన్లైన్ పాలసీని తీసుకోకపోయి ఉంటే.. మీకు ఈ పద్ధతి ఇంకా కొంచెం గందరగోళాన్ని కలిగించవచ్చు. అందుకోసమే డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను మేము మీ కోసం సులభంగా ఉండేలా తయారు చేశాం. ఏ విధంగా వివిధ రకాల పాలసీలను పోల్చి చూడవచ్చనే విషయాలను కూడా మీకు తెలియజేస్తాం. ఆ తర్వాత ఏది సరైన పాలసీయో మీకే అర్థం అవుతుంది.
ఇన్సూరెన్స్ చేసిన మొత్తం: అన్నింటికంటే ముఖ్యమైన విషయమేంటంటే.. మీరు పాలసీని క్లెయిమ్ చేసిన సమయంలో ఎంత మొత్తంలో ఇన్సూరెన్స్ అమౌంట్ పొందుతారనేది కూడా ఈ పాలసీలో మీకు తెలుస్తుంది. డిజిట్ పాలసీలో మీరు మీకు నచ్చిన విధంగా ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. తక్కువ ప్రీమియం ఉందని మోసపోకండి. తక్కువ ప్రీమియం ఉంటే ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా తక్కువగానే ఉంటుంది.
నిజమైన ప్రయోజనాలు: వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసే ముందు అన్ని రకాల నియమ నిబంధనలను జాగ్రత్తగా చదవండి. మీరు చదవకుండా సంతకం చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఎక్కువమంది క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డు ఎలా ఉంటుందని తనిఖీ చేస్తారు. అంతేకాకుండా క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని కూడా చూస్తారు. ఎంత త్వరగా క్లెయిమ్స్ సెటిల్ అవుతాయని చూస్తారు. మొత్తం డిజిటల్ ప్రక్రియనా లేదా ఏమైనా పేపర్‌వర్క్ ఉంటుందా? ముందునుంచే వీటి మీద అవగాహన ఉంటే మీరు మీకు బాగా సరిపోయే అత్యత్తమ పాలసీని ఎంచుకోవచ్చు.
ప్రీమియం: ప్రీమియం గురించి కూడా చాలా మంది చూస్తారు. పాలసీ తక్కువగా ఉందనే కారణంతో మీరు తక్కువ ప్రీమియం ఉన్న ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం వలన అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. ప్రీమియం మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ చేస్తున్న మొత్తం ఎంత అనేది కూడా తనిఖీ చేయండి. పాలసీ వలన మీకు అందే సేవలు, ప్రయోజనాల గురించి కూడా ఆరా తీయండి. అన్ని వివరాలు చూసి ఏ పాలసీ మీకు అనువైనదో నిర్ణయించుకోండి.
పేరుకు తగ్గ విధంగానే క్యాష్‌లెస్ క్లెయిమ్‌లో మీరు ఎటువంటి డబ్బులను మీ జేబు నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ, మీరు ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకున్నపుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.
క్యాష్‌లెస్ హెల్త్ క్లెయిమ్‌ను ఎలా సెటిల్ చేసుకోవాలి?
1. ముందుగా అనుకుని హాస్పిటల్‌కు వెళ్తే 72 గంటల ముందు మాకు ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ సమాచారం అందించండి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి ఉంటే ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోపు మాకు తెలియజేయండి.
2. మీరు చేరిన ఆస్పత్రిలో హెల్త్ కార్డ్ లేదా ఈ- కార్డ్ కాపీని చూపెట్టండి. వారు మీకు ప్రీ-ఆథరైజేషన్ ఫామ్‌ను అందజేస్తారు.
3. ఆ ఫామ్‌లో సంతకం చేసి ఆస్పత్రి వారికి సబ్మిట్ చేయాలి.
4. తర్వాత ప్రాసెసింగ్ కోసం హాస్పిటల్ వారు ఆ ఫామ్‌ను థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (TPA) కు పంపిస్తారు.
5. మీ ఫామ్ ప్రాసెసింగ్ పూర్తయి, క్లెయిమ్ నిర్ధారణ అయిన వెంటనే టీపీఏ (TPA) ఆథరైజేషన్ లెటర్‌ను విడుదల చేస్తారు.
6. మీ చికిత్స అంతా పూర్తయిన తర్వాత 15 రోజుల్లోపు రీయింబర్స్మెంట్ ఫామ్ నింపితే సరిపోతుంది.
ఎక్కువ మంది ఎంచుకునే క్లెయిమ్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్. మీరు మా నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లినా వెళ్లకపోయినా కూడా ఈ క్లెయిమ్ మీకు వర్తిస్తుంది. మీరు అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పిస్తే మీ క్లెయిమ్ అమౌంట్ సెటిల్ అవుతుంది.
రీయింబర్స్మెంట్ క్లెయిమ్ సెటిల్ చేసుకునేందుకు ప్రక్రియ ఏంటి?
1. 48 గంటల్లోపు మా టీపీఏ (TPA)కు మీరు సమాచారం అందిస్తే సరిపోతుంది. మీరు ఏ చికిత్స తీసుకున్నారో కూడా చెప్పాల్సి ఉంటుంది.
2. మీ ఆస్పత్రికి సంబంధించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 30 రోజుల్లోపు సబ్మిట్ చేయాలి.
3. మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లను మా టీమ్ పరిశీలించి మీకు 30 రోజుల్లోపు క్లెయిమ్ అందజేస్తుంది. ఇలా మేము మీకు 30 రోజుల్లోపు క్లెయిమ్ సెటిల్ చేయకపోతే అందుకు మీకు 2 శాతం వడ్డీని చెల్లిస్తాం.
చాలా మంది తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా లెక్కిస్తారని సందేహపడుతుంటారు. వివిధ రకాల అంశాలు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. అవేంటంటే..
1. మీ వయసు: వయసులో ఉన్న వారికి వయసు మళ్లిన వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. యుక్త వయసులో ఉన్నవారు వృద్ధుల కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. చిన్నవారైతే మెటర్నిటీ ప్రయోజనాలు పొందడానికి, తీవ్రమైన అనారోగ్య సమస్యల వెయిటింగ్ పీరియడ్ పూర్తి చేయడానికి మీకు అంత ఎక్కువ సమయం ఉంటుంది. మీరు ఎంత చిన్నవారైతే మీ పాలసీ అంత తక్కువ ఉంటుంది. చాలా మంది యుక్త వయసులో ఉండగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవమని ఎందుకు సూచిస్తారో మీకు ఇప్పుడు అర్థం అయి ఉంటుంది.
2. లైఫ్ స్టైల్: ప్రస్తుత రోజుల్లో ప్రతీది మన లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మన ఆరోగ్యం కూడా మన జీవన విధానంతో ముడిపడి ఉంటుంది. మనకు మంచి, చెడు రెండు రకాల అలవాట్లు ఉంటాయి. అందుకే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మీ లైఫ్ స్టైల్ మీద ఆధారపడుతుంది.
కావున పాలసీ తీసుకునేటపుడు ప్రతి విషయాన్ని నిజాయతీగా ఒప్పుకోండి. మీరు జిమ్‌కు వెళ్తారా? లేదా? మీరు ధూమపానం చేస్తారా? లేదా? అనే విషయాలు కచ్చితంగా తెలియజేయండి. ఒకవేళ మీరు తప్పుడు వివరాలు సమర్పిస్తే భవిష్యత్‌లో క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.
3. దీర్ఘకాలిక వ్యాధులు లేదా పరిస్థితులు: మీకు 48 నెలల ముందు నుంచే ఉన్న వ్యాధుల గురించి పాలసీ పాలసీ కొనేముందే లేదా పునరుద్ధరించే ముందే తెలియజేయాలి. మీకు ఉన్న అనారోగ్యం, పరిస్థితి, లేదా గాయం స్థితిని బట్టే మీ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించబడుతుంది.
4. ప్రాంతం: మీరు జీవించే ప్రాంతాన్ని బట్టి కూడా మీ పాలసీ ప్రీమియం నిర్ణయించబడుతుంది. వివిధ రకాల నగరాల్లో కాలుష్య స్థాయులు వివిధ రకాలుగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం కూడా వేరుగా ఉంటుంది. ఆయా నగరాల్లో వైద్య ఖర్చులు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో జీవించే ఎక్కువ మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశ నగరాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది.
5. యాడ్-ఆన్స్, కవర్లు: మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు, మీ జీవన విధానానికి అనువైనదని నిర్ధారించుకునేందుకు, మీ వ్యక్తిగత ఆరోగ్య బీమా మీకు అదనపు రక్షణగా కొన్ని ప్రత్యేకమైన కవర్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
ఆ కవర్లలో క్రిటికల్ ఇల్నెస్ కవర్, మెటర్నిటీ, ఇన్ఫర్టిలిటీ ప్రయోజనం మొదలైనవి ఉంటాయి. మీరు ఎంచుకునే కవర్లను బట్టి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభావితం అవుతుంది.
వయసు: మీరు త్వరలో పెళ్లి చేసుకునే యోచనలో ఉంటే ఎక్కువ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోవాలి. మీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడు ప్రీమియం రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. వెయిటింగ్ పీరియడ్లు (మెటర్నిటీ ప్రయోజనాల వంటి వాటికోసం) కూడా త్వరగా పూర్తవుతాయి.
జీవితంలోని దశ: జీవితంలో మీరు ఉన్న దశను బట్టి ఇన్సూరెన్స్ అమౌంట్‌ను ఎంచుకోండి. మీరు కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీ రోగనిరోధక శక్తి ఎలా ఉంది? మీరు ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉన్నారు? మీరు ఒంటరా? లేక త్వరలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారా? త్వరలోనే పిల్లలను కనాలని అనుకుంటున్నారా? అనే వివరాలను గురించి ఆలోచించాలి.
మీ మీద ఆధారపడిన వారి సంఖ్య: వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది కేవలం మీకోసం మాత్రమే రూపొందించబడింది. ఈ పాలసీలో మీరు మీ కుటుంబీకులను కూడా కలుపుకొనే సౌలభ్యం ఉంది. ఎంత మందినైతే మీరు కలుపుతున్నారో అంత మొత్తంలో ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోవాలి. మీ మీద ఆధారపడినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది.
ఇప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితులు: మీ కుటుంబంలో వంశపారంపర్యంగా ఉన్న జబ్బు ఏదైనా ఉంటే, మీ సిటీలో వైద్య ఖర్చులు పెరుగుతూ ఉంటే మీరు ఎక్కువ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోవాలి.
మీ లైఫ్ స్టైల్: మీరు ఎక్కువ కాలుష్యం ఉండే మెట్రో నగరాల్లో నివసిస్తున్నట్లయితే.. ప్రతిరోజు ఆఫీస్ టెన్షన్లతో సతమతమవుతుంటే, మీరు జబ్బు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున మీరు ఎక్కువ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోవాలి. ఇది మిమ్మల్ని అనేక జబ్బుల నుంచి కాపాడుతుంది.
కస్టమర్ రివ్యూలు, టెస్టిమోనియల్స్: ఇది వరకే ఈ పాలసీని తీసుకున్న వారిని నమ్మండి. సోషల్ మీడియా లేదా ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్లో రివ్యూలు చూడండి. మీరు ఎంచుకునే పాలసీ విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి.
ఆస్పత్రుల నెట్వర్క్: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు అనేక మంది ఈ ప్రయోజనం కోసమే వెతుకుతారు. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నెట్వర్క్ ఆస్పత్రులను వినియోగించుకుని క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్లు చేసుకోండి. మీకు చికిత్స చేసే నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాను చూసి, దానిలో మీకు నచ్చిన ఆస్పత్రిని ఎంచుకోండి.
క్లెయిమ్ ప్రాసెస్: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అనేక మంది ఆలోచించేది క్లెయిమ్ ప్రాసెస్ గురించే. మీరు తీసుకునే పాలసీ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి తనిఖీ చేయండి. ఆ ప్రాసెస్‌లో ఏదైనా పేపర్‌వర్క్ ఉందా? లేకపోతే డిజిటల్ ఫ్రెండ్లీగా ఉందా? అనేది తనిఖీ చేసుకోవాలి.
కవరేజ్ ప్రయోజనాలు: ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ వివిధ కవరేజీలను కలిగి ఉంటుంది. మీరు తీసుకునే పాలసీ కవరేజ్‌ను తనిఖీ చేసుకోండి. మీకు అది సరిపోతుందా? లేదా అని చెక్ చేసుకోండి.
ఇతర ప్రయోజనాలు: మీరు పాలసీ తీసుకునే ముందు సర్వీస్ ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాల గురించి చూసుకోండి. మీ పాలసీలో మీకు అందే ప్రయోజనాలను తనిఖీ చేసుకోండి.
నిజం చెప్పాలంటే చిన్న వయసులో వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ సమయంలో మీరు ఏ విధమైన పాలసీ తీసుకున్నా కూడా తక్కువ ప్రీమియం ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్‌లు పెరుగుతూ పోతున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రోజురోజుకూ వైద్య ఖర్చులు పెరుగుకుంటూ పోతున్నాయే కానీ తక్కువ కావడం లేదు.
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని వైద్య ఖర్చుల నుంచి కాపాడటమే కాకుండా ఆదాయపు పన్ను నుంచి కూడా మినహాయింపులు పొందే అవకాశం ఇస్తుంది. మీ పొదుపును పెంచుతుంది. కింది విధంగా ఈ ప్రాసెస్ ఉంటుంది.
a. ప్రీవెంటివ్ హెల్త్ చెకప్స్ ద్వారా: ఆదాయపు పన్ను చట్టంలోని 80D–సెక్షన్ ప్రకారం మీకు రూ. 25,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక పాలసీ పీరియడ్‌లో మీరు చేయించుకునే ఆరోగ్య పరీక్షల నుంచి కూడా ఇది మిమ్మల్ని కాపాడుతుంది.
b. మీ తల్లిదండ్రులను హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో యాడ్ చేసుకోండి: ఆదాయపు పన్ను చట్టంలోని 80D–సెక్షన్ ప్రకారం మీ పాలసీలో డిపెండెంట్స్‌గా ఉన్న వ్యక్తులను కూడా యాడ్ చేసుకోండి. మీరు వారికి కట్టే ప్రీమియం డబ్బులను కూడా మినహాయింపుగా పొందొచ్చు. రూ. 50,000 వరకు మీరు ఆదా చేసుకోవచ్చు.
c. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియానికి నగదు చెల్లించడం మానేయండి: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియానికి ఆదాయపు పన్ను మినహాయింపులు పొందేందుకు మీ పాలసీ ప్రీమియాన్ని డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయండి. నగదు చెల్లింపులు మీ పన్ను మినహాయింపులకు వర్తించవు.