మీకు ఉత్తమమైన వాటిని మాత్రమే ఎంచుకోవడంలో మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. సరైన పనిని చేపట్టడం, సరైన ఆహార ప్రణాళిక అనుసరించడం లేదా మీ అవసరాలకు సరిపోయే కారును కొనుగోలు చేయడం. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇలాగే ఉంటుందా? మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఎలాంటి ఢోకా ఉండదని మనం భావిస్తాము. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, సరైన సమ్ ఇన్సూర్డ్ ను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం.
అవసరమైన దానికంటే తక్కువ సమ్ ఇన్సూర్డ్ ను కలిగి ఉండటం అన్నది ఇన్సూరెన్స్ లేకపోవడం ఎంత చెడ్డదో అంతే చెడ్డది, ఎందుకంటే ఆ సందర్భంలో, మీరు దాని కోసం ప్రీమియం కూడా చెల్లిస్తారు మరియు మీకు ఈ కవర్ ఉందని భావించి మీరు ఆరోగ్యం కోసం కూడా అంత పొదుపు చేయరు.
ఇక్కడ ఒక నిమిషం సమయం తీసుకుని, కొన్ని షాకింగ్ వాస్తవాలను చూద్దాం:
"5 క్యాన్సర్ రోగులలో 1 (ఒకరు) 36 నుండి 45 సంవత్సరాల వయస్సులోపు ఉన్నారు"
మూలం: టైమ్స్ ఆఫ్ ఇండియా
"ఒక క్యాన్సర్ రోగి చికిత్స, మందులు మరియు అన్ని ఇతర సంరక్షణ కోసం సుమారు 20 లక్షలు ఖర్చు చేస్తాడు."
మూలం: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
కాబట్టి, అటువంటి అవసరమైన సమయాల్లో మనం 20 లక్షలను భరించగలమని భావించినప్పటికీ, మన జీవితకాల పొదుపును ఖర్చు చేయడం నిజంగా విలువైనదేనా?
ఇప్పుడు మీరు చెప్పే పరిష్కారం ఏమిటి. ఎందుకంటే ఇలాంటి అత్యవసర సమయాల్లో మన పొదుపులే మనకు వెన్నుదన్నుగా ఉంటాయి. అయితే తగిన సమ్ ఇన్సూర్డ్ తో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం వల్ల మీ పొదుపులను ఆదా చేసుకోవచ్చని మేము చెబితే? దీన్ని ఒక ఉదాహరణతో మీకు వివరిస్తాము.
30 సంవత్సరాల వయస్సు గల శ్రీ అగ్నిహోత్రి నెలకు 50,000 సంపాదిస్తాడు మరియు ప్రతి నెలా 10,000 ఆదా చేస్తాడు. 40 సంవత్సరాల వయస్సులో, అతను దాదాపు 17 లక్షలు ఆదా చేస్తాడు. కానీ పరిస్థితులు క్షీణించిన రోజున, మిస్టర్ అగ్నిహోత్రికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఊహించలేని మానసిక మరియు శారీరక ఒత్తిడితో పాటు, మిస్టర్ అగ్నిహోత్రి చికిత్స మరియు మందుల ఖర్చులను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
కాబట్టి, సరైన సమ్ ఇన్సూర్డ్ తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జీవితకాలంలో మీ సేవింగ్స్ను రక్షించగల పెట్టుబడి అని మనకు తెలుస్తోంది.
మీ వయస్సు: మీరు ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత ఎక్కువగా మీ సమ్ ఇన్సూర్డ్ ఉండాలి, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉంటే అంత ఎక్కువ భద్రతా వలయం అవసరం.
మీ జీవిత దశ: మీరు ఉన్న జీవిత దశ ఆధారంగా, ఉదాహరణకు, మీరు వివాహం చేసుకోబోతున్నట్లయితే లేదా కుటుంబాన్ని ప్రారంభించబోతున్నట్లయితే, మీ సమ్ ఇన్సూర్డ్ దానికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ ఖర్చులని దృష్టిలో పెట్టుకోవాలి.
ఆరోగ్య పరిస్థితులు: మీకు మీ కుటుంబంలో వైద్య పరిస్థితి చరిత్ర ఉన్నట్లయితే, మీ సమ్ ఇన్సూర్డ్ భవిష్యత్తులో ఊహించని ఆరోగ్య పరిస్థితి ని దృష్టిలో పెట్టుకోవాలి.
కుటుంబంలో ఆధారపడినవారు: మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లోటర్ పాలసీని తీసుకోవాలని ప్రణాళిక రచిస్తూంటే, సమ్ ఇన్సూర్డ్ ప్రతి సభ్యుని అవసరాలను మరియు వారి భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి.
జీవనశైలి మరియు వ్యక్తిగత అలవాట్లు: ఉద్యోగం రకం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి స్థాయిలు మరియు ఇతర వ్యక్తిగత అలవాట్లు వ్యక్తి యొక్క భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ అవసరాలకు మార్గాన్ని చూపుతాయి. సమ్ ఇన్సూర్డ్ ఎంచుకునేటప్పుడు వీటి గురించి కూడా ఆలోచించాలి.
ఎన్ని చెప్పినా కూడా, ఆరోగ్యమే కదా సంపద!
ముఖ్యమైనది: భారతదేశంలో కరోనా వైరస్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు & అప్రయోజనాలు గురించి మరింత తెలుసుకోండి