సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ - వివరించబడిన కవరేజ్ మరియు బెనిఫిట్స్
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
సీనియర్ సిటిజన్ల కొరకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. health insurance policy 60 సంవత్సరాల వయసు దాటిన వారి కోసం ఇది రూపొందించబడింది. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించబడిన ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వారి అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడింది. ఇది క్రిటికల్ ఇల్నెస్ Critical Illnesses మరియు ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరడం, వార్షిక ఆరోగ్య తనిఖీలు, డే కేర్ ప్రొసీజర్లు, అవయవదాన ఖర్చులు, మొదలైన అన్ని ఖర్చులను ఆర్థికంగా కవర్ చేస్తుంది. హోమ్ హాస్పిటలైజేషన్ మరియు సైక్రియాట్రిక్ సపోర్ట్‌ను కూడా అందజేస్తుంది.
పెద్దలు చెప్పేదేంటంటే, జీవితం అనేది ఒక వృత్తం వలే తిరుగుతూ ఉంటుంది.
మనల్ని ఒకప్పుడు జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడిన వారు ప్రస్తుతం జబ్బులతో సతమతమవడం చూస్తే చాలా మందికి మనసుకు కష్టంగానే ఉంటుంది. మనం వారి కోసం ఏదో ఒకటి చేయాలి. ప్రత్యేకించి వారి ఆరోగ్య సంరక్షణను చూసుకోవాలి. ఎన్ని విషయాలున్నా కూడా వారి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. చాలా మంది తమకు మనవలు, మనవరాళ్లు పుట్టిన తర్వాత తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. 😉
మీ తల్లిదండ్రుల కోసం సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకోసం తీసుకోవాలి?
మీ తల్లిదండ్రులు వయసులో ఉన్నప్పటి కంటే వయసు మళ్లిన తర్వాత వారి ఆరోగ్య ఖర్చులు 3.8 శాతం పెరుగుతాయి.
గుండె జబ్బులు ఎక్కువగా వయోవృద్ధులను వేధించే సమస్య. మన దేశంలోని చాలా పట్టణాల్లో వయోవృద్ధులు గుండె జబ్బులతో బాధపడుతున్నారు.
భారతదేశంలో 50 శాతం కంటే ఎక్కువ మంది వయోవృద్ధులు మానసిక ఆందోళనతో సతమతమవుతున్నారు.
డిజిట్ అందించే సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ గొప్పతనమేంటి?
సులభమైన ఆన్లైన్ ప్రక్రియలు - మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పటి నుంచి క్లెయిమ్ చేసే వరకు మొత్తం పేపర్‌లెస్, సులభంగా మరియు ఎటువంటి చింత లేకుండా ఉంటుంది. క్లెయిమ్స్ కోసం కూడా ఎటువంటి హార్డ్ కాపీస్ అవసరం లేదు.
ఏజ్ మీద ఆధారపడి కానీ జోన్ మీద ఆధారపడి ఎటువంటి కోపేమెంట్స్ లేవు - మా హెల్త్ ఇన్సూరెన్స్ ఎటువంటి కో పేమెంట్ లేకుండా ఉంటుంది. copayment. దీనర్థం మీరు క్లెయిమ్ చేసేటపుడు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
రూం రెంట్ కోసం ఎటువంటి పరిమితులు లేవు - గదుల విషయంలో వేర్వేరు వ్యక్తుల ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయని మేము అర్థం చేసుకున్నాం. అందుకే మా పాలసీలలో గదుల విషయంలో అద్దె పరిమితులు లేవు. no room rent restrictions. మీరు ఇష్టపడే ఏ ఆసుపత్రి గదైనా ఎంచుకోండి.
SI(బీమా మొత్తం) వాలెట్ ప్రయోజనం - బీమా గడువులో మీరు పాలసీ చేసిన బీమా మొత్తం కంప్లీట్‌గా వాడుకుంటే మీ కోసం మేము దానిని మరలా అందజేస్తాం.
మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోండి - దేశం మొత్తం మీద మాకు ఉన్న 10500 కంటే ఎక్కువ నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి ఎంచుకోండి. network hospitals వాటిల్లో క్యాష్లెస్ చికిత్సలు లేదా రీయింబర్స్మెంట్ ఎంచుకోండి.
వెల్నెస్ బెనిఫిట్లు - అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల సహకారంతో యాప్‌లో ప్రత్యేకమైన వెల్నెస్ ప్రయోజనాలను పొందండి. wellness benefits
మా హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏం కవర్ అవుతుంది?
కవరేజెస్
డబుల్ వాలెట్ ప్లాన్
ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్
వరల్డ్‌వైడ్ ట్రీట్మెంట్ ప్లాన్
ముఖ్యమైన ఫీచర్లు
అన్ని రకాల ఆసుపత్రి చికిత్సల కొరకు - యాక్సిడెంట్ల వలన లేదా అనారోగ్యం, లేదా తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్ వలన ఆసుపత్రిలో చేరితే..
అనారోగ్యం, యాక్సిడెంట్, తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్ 19 వంటి మహమ్మారితో సహా అన్ని రకాల ఆసుపత్రి చికిత్సలకు ఇది వర్తిస్తుంది. మల్టీపుల్ హాస్పిటలైజేషన్స్ కొరకు దీనిని ఉపయోగించవచ్చు. మీ సమ్ ఇన్సూర్డ్ మొత్తం ఉన్నంతవరకు
ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్
ఏదైనా ప్రమాదవశాత్తు సంఘటన జరిగినా కానీ చికిత్స కోసం కానీ కవర్ పొందేందుకు మీరు నిర్దిష్ట సమయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదే ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్.
వెల్నెస్ ప్రోగ్రాం
హోమ్ హెల్త్ కేర్, టెలీ కన్సల్టేషన్లు, యోగా, మైండ్‌ఫుల్‌నెస్ వంటి ఇంకా ఎన్నో రకాల ప్రత్యేకమైన వెల్నెస్ ప్రయోజనాలు మరియు మా యాప్‌లో మరెన్నో అందుబాటులో ఉంటాయి.
సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్
మేము మీ బీమా మొత్తంలో 100 శాతం బీమా మొత్తాన్ని బ్యాకప్‌గా అందజేస్తాం. సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్ ఎలా పని చేస్తుంది? ఉదాహరణకు మీ పాలసీ మొత్తం రూ. 5 లక్షలు అనుకుందాం. మీరు కనుక రూ. 50 వేలకు క్లెయిమ్ చేస్తే.. డిజిట్ ఆటోమేటిగ్గా వాలెట్‌ను ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు మీకు ఏడాది మొత్తానికి క్లెయిమ్ చేసుకునేందుకు రూ. 4.5 లక్షలు + 5 లక్షలు ఉంటాయి. పైన పేర్కొన్న సందర్భంలో ఒక సింగిల్ క్లెయిమ్ అనేది రూ. 5 లక్షలకు మించకూడదు.
క్యుములేటివ్ బోనస్
Digit Special
పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ లేవా? మీరు ఆరోగ్యంగా ఉండి క్లెయిమ్ చేయనందుకు మీ మొత్తం సమ్ ఇన్సూర్డ్‌లో అదనపు మొత్తాన్ని బోనస్‌గా పొందుతారు.
రూం రెంట్ క్యాపింగ్
వేర్వేరు వర్గాలకు చెందిన గదులు వేర్వేరు రకాల అద్దెలను కలిగి ఉంటాయి. హోటల్ గదులకు టారిఫ్‌లు ఎలా ఉంటాయో అలాగే వీటికి కూడా ఉంటాయి. డిజిట్ ప్లాన్లు గది అద్దె మీ బీమా మొత్తం కంటే తక్కువగా ఉన్నంత వరకు ఎటువంటి పరిమితులు కలిగి ఉండవు.
డే కేర్ ప్రొసీజర్స్
24 గంటల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య ఖర్చులను మాత్రమే ఇది కవర్ చేస్తుంది. డే కేర్ ప్రొసీజర్స్ ఆసుపత్రిలో చేపట్టే వైద్య చికిత్సలను సూచిస్తాయి. క్యాటరాక్ట్ , డయాలసిస్ వంటి వాటికి కూడా సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ సమయం అవసరమవుతుంది.
వరల్డ్‌వైడ్ కవరేజ్
Digit Special
వరల్డ్‌వైడ్ కవరేజ్‌తో ప్రపంచ స్థాయి చికిత్సను పొందండి. భారతదేశంలో మీ ఆరోగ్య పరీక్షల సమయంలో వైద్యుడు మీ అనారోగ్యం గుర్తించిన తర్వాత మీరు దేశాల్లో చికిత్సను పొందాలని అనుకుంటే మేము మీ కోసం సిద్ధంగా ఉన్నాం. అందుకు అయ్యే చికిత్స ఖర్చులకు కూడా మీరు కవర్ చేయబడతారు.
హెల్త్ చెకప్
మీ హెల్త్ చెకప్స్ కోసం పాలసీలో పేర్కొన్న విధంగా ఖర్చులను మేము చెల్లిస్తాం. అటువంటి పరీక్షల కొరకు ఎటువంటి పరిమితులు ఉండవు. అది ECG లేదా థైరాయిడ్ కోసం కూడా వర్తిస్తుంది. మీ క్లెయిమ్ లిమిట్‌ను తనిఖీ చేసేందుకు మీ పాలసీ షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలించండి.
అత్యవసర ఎయిర్ అంబులెన్స్ ఖర్చులు
మీకు అత్యవసర ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. తక్షణమే ఆసుపత్రికి తరలించాల్సి రావొచ్చు. విమానంలో లేదా హెలికాప్టర్లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చులను మీ కోసం మేము తిరిగి చెల్లిస్తాం.
ఏజ్ /జోన్ మీద ఆధారపడి కో పేమెంట్
Digit Special
కో పేమెంట్ అంటే ఆరోగ్య బీమా పాలసీ కింద వ్యయ భాగస్వామ్య ఆవశ్యకత. ఈ విధానంలో పాలసీదారుడు/బీమా చేయించుకున్న వ్యక్తి ఒక నిర్దిష్ట శాతాన్ని భరిస్తాడు. ఇది బీమా మొత్తం విలువను తగ్గించదు. ఈ శాతం వయసు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. లేదా కొన్ని సార్లు జోన్ ఆధారిత కోపేమెంట్ అని పిలువబడి మీరు చికిత్స చేయించుకునే నగరం ఉన్న జోన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మా ప్లాన్స్‌లో ఎటువంటి జోన్ బేస్డ్ లేదా ఏజ్ బేస్డ్ కో పేమెంట్స్ లేవు.
రోడ్ అంబులెన్స్ ఖర్చులు
మీరు ఆసుపత్రిలో చేరితే రోడ్ అంబులెన్స్ ఖర్చులు కూడా రీయింబర్స్ చేయబడతాయి.
ప్రీ/పోస్ట్ హాస్పిటలైజేషన్
ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే మొత్తం ఖర్చులకు ఈ కవర్ వర్తిస్తుంది. వివిధ రకాల నిర్దారణ పరీక్షలు, టెస్టులు, మరియు రికవరీల కోసం
ఇతర ప్రయోజనాలు
ముందే నిర్దారణ అయిన వ్యాధికి(PED) వెయిటింగ్ పీరియడ్
మీరు ఇప్పటికే బాధపడుతున్న వ్యాధి లేదా పరిస్థితికి మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
నిర్దిష్ట అనారోగ్యం కొరకు వెయిటింగ్ పీరియడ్
నిర్దిష్ట అనారోగ్యాన్ని క్లెయిమ్ చేసుకోవడం కొరకు మీరు వేచి ఉండాల్సిన సమయం ఇది. డిజిట్ వద్ద ఇది రెండు సంవత్సరాలు ఉంటుంది. పాలసీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇది మొదలవుతుంది. మినహాయింపుల పూర్తి జాబితా కొరకు మీ పాలసీ వార్డింగ్స్లోని స్టాండర్డ్ ఎక్స్‌క్లూజన్స్ (Excl02) చూడండి.
ఇన్‌బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్
పాలసీ పీరియడ్ వ్యవధిలో మీ శరీరానికి గాయం అయి 12 నెలల లోపు అదే మీ చావుకు గల కారణం అయితే మేము పాలసీ షెడ్యూల్లో పేర్కొన్నట్లు బీమా మొత్తంలో 100 శాతం చెల్లిస్తాం. ఈ కవర్ ప్లాన్ ప్రకారం తీర్మానించబడుతుంది.
అవయవ దాత ఖర్చులు
Digit Special
మీకు అవయవాలను దానం చేసే వ్యక్తి మీ పాలసీలో కవర్ చేయబడతాడు. అతడు ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే ఖర్చులను మేము భరిస్తాం. అవయవ దానం అనేది గొప్ప దానాలలో ఒకటి. ఎందుకు అందులో భాగం కాకూడదని మేమూ అనుకున్నాం.
డొమిసిలియరీ హాస్పిటలైజేషన్
ఆసుపత్రలలో పడకలు అయిపోవచ్చు. లేదా ఆసుపత్రిలో చేరేందుకు రోగి పరిస్థితి సహకరించకపోవచ్చు. ఆందోళన పడకండి. మీరు ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకున్నా సరే వైద్య ఖర్చులను మేము భరిస్తాం.
బారియాట్రిక్ సర్జరీ
ఊబకాయం అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చు. మేము దీనిని అర్థం చేసుకున్నాం. మీకు బేరియాట్రిక్ సర్జరీ వైద్య పరంగా అవసరమైనపుడు లేదా మీ డాక్టర్ సిఫారసు చేసినపుడు దానిని కూడా కవర్ చేస్తాం. అయితే మీరు ఈ చికిత్సను చేయించుకునేది సౌందర్య కారణాల కోసం అయితే మేము కవర్ చేయం.
మానసిక అనారోగ్యం
గాయం కారణంగా, లేదా ఇతర కారణాల వల్ల ఒక సభ్యుడు ఆసుపత్రిలో చేరవలసి వస్తే ఈ ప్రయోజనం కింద రూ. 1,00,000 కవర్ చేయబడుతుంది. అయితే OPD కన్సల్టేషన్స్ దీని పరిధిలోనికి రావు. సైక్రియాట్రిక్ ఇల్నెస్ కవర్ కోసం వెయిటింగ్ పీరియడ్ నిర్దిష్ట ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్‌తో సమానంగా ఉంటుంది.
కన్స్యూమబుల్స్ కవర్
ఆసుపత్రిలో చేరే ముందు కానీ తర్వాత కానీ నడక కోసం సహాయం చేసేవి, క్రేప్ బ్యాండేజెస్, పట్టీలు వంటి ఇతర అనేక రకాల వైద్య సహాయకాలు మరియు ఖర్చులు ఉన్నాయి. ఇవి మీ పాకెట్ అటెన్షన్‌ను క్యాచ్ చేస్తాయి. ఈ కవర్ పాలసీ నుంచి మినహాయించబడిన ఈ ఖర్చుల గురించి మొత్తం చూసుకుంటుంది.
ఏమేం కవర్ కావంటే?
ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ (పాలసీ తీసుకోవడానికి ముందు నుంచే ఉన్న జబ్బులు) విషయంలో వెయిటింగ్ పీరియడ్ ముగిసే వరకు మీరు ఎటువంటి క్లెయిమ్స్ చేయలేరు.
డాక్టర్ సిఫారసు లేకుండా వయోవృద్ధులయిన మీ తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేరితే ఈ పాలసీ వర్తించదు.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
రీయింబర్స్మెంట్ క్లెయిములు – మీరు ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల్లోపు 1800-258-4242 నెంబర్‌పై మాకు ఫోన్ చేయండి. లేదా healthclaims@godigit.com అనే మెయిల్‌కు ఈమెయిల్ చేయండి. మేము మీకు సంబంధించిన ఆస్పత్రి బిల్లులను అప్లోడ్ చేసేందుకు ఒక లింకును పంపుతాం. ఈ డాక్యుమెంట్లతో మీ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది.
క్యాష్లెస్ క్లెయిములు – మీకు క్యాష్లెస్ క్లెయిమ్ కావాలంటే అందుకోసం మీరు మా నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ మీ ఈ-హెల్త్ కార్డును ఆస్పత్రి హెల్ప్ డెస్క్‌లో చూపిస్తే వారు మీకు క్యాష్లెస్ రిక్వెస్ట్ ఫామ్‌ను అందిస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ క్లెయిమ్ పరిష్కరించబడుతుంది.
మీరు కనుక కరోనా వైరస్‌కు సంబంధించిన చికిత్స గురించి క్లెయిమ్ చేస్తే పాజిటివ్ టెస్ట్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టును మీరు ఐసీఎంఆర్ (ICMR) ద్వారా గుర్తించబడిన అధీకృత సెంటర్ల ద్వారా చేయించుకోవాల్సి ఉంటుంది.
డిజిట్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉండే ముఖ్య ప్రయోజనాలు
కో పేమెంట్ | లేదు |
---|---|
రూం రెంట్ క్యాపింగ్ | లేదు |
క్యాష్లెస్ హాస్పిటల్స్ | ఇండియా వ్యాప్తంగా 10500 కంటే ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ |
ఇన్‌బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ | అవును |
వెల్నెస్ బెనిఫిట్స్ | 10 కంటే ఎక్కువ వెల్నెస్ పార్ట్నర్ల నుంచి లభ్యం |
సిటీ ద్వారా వచ్చే డిస్కౌంట్ | 10 శాతం వరకు డిస్కౌంట్ |
వరల్డ్‌వైడ్ కవరేజ్ | అవును* |
గుడ్ హెల్త్ డిస్కౌంట్ | 5% శాతం వరకు డిస్కౌంట్ |
కన్య్సూమబుల్ కవర్ | యాడ్ ఆన్‌గా అందుబాటులో ఉంది. |
*కేవలం వరల్డ్‌వైడ్ ట్రీట్మెంట్ ప్లాన్‌లో మాత్రమే లభ్యమవుతాయి.
స్ట్(ఎజాస్) ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్
వయోవృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం?
సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది 65 సంవత్సరాలకు పైబడిన వయోవృద్ధుల కోసం రూపొందించబడింది. కాలం గడుస్తున్న కొద్దీ మన లైఫ్‌స్టైల్, శరీరంలో జరిగే మార్పుల వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని మనకు తెలుసు.
ఈ అనారోగ్య సమస్యల వల్ల వాటి కోసం చేసే ఖర్చులు కూడా పెరిగిపోతాయి. అందుకే మేము ఈ సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ను రూపొందించాం. చాలా మంది వయస్సు పైబడిన వారికి ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వారికి అయ్యే ఆస్పత్రి ఖర్చుల నుంచి ఈ పాలసీ కవర్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి వివిధ రకాల జబ్బులు ఉంటాయి. కొందరు క్యాన్సర్, గుండె జబ్బులతో బాధపడితే మరికొందరు కిడ్నీ వ్యాధులతో బాధపడతారు.
డొమిసిలియరీ కేర్(ఇంటిలో అందించే వైద్య సేవలు), సైక్రియాట్రిక్ సపోర్ట్ వంటి కొన్ని రకాల ప్రత్యేక ప్రయోజనాలను కూడా సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.
నేను ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ను ఎందుకు తీసుకోవాలి?
వయోవృద్ధులు అయిన మీ తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని మీరు చూస్తున్నపుడు, లేదా మీరే వయోవృద్ధులయిన తర్వాత స్వయంగా హెల్త్ పాలసీని తీసుకోవాలని భావిస్తే, మిమ్మల్ని అనేక ఖర్చుల నుంచి కవర్ చేసే పాలసీని తీసుకోవడం అవసరం. మీరు అందుబాటులో ఉన్న పాలసీలతో గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సరైన పాలసీని ఎంచుకోవడం ఉత్తమం.
మీకు అనేక రకాల ప్రశ్నలు, భయాందోళనలు ఉంటాయి. అది సహజం. మీరు కేవలం మీకు లేదా మీ తల్లిదండ్రులకు వచ్చే అన్ని వ్యాధులను కవర్ చేసే పాలసీని తీసుకోవాలని భావిస్తారు. మీకు ఆన్లైన్ పాలసీలో అనేక రకాల ఆప్షన్లు లభిస్తున్నపుడు మీరు అన్ని ఫారాలు రాయాల్సిన పనికి స్వస్తి పలకండి. ఆన్లైన్ పాలసీలో అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
ఎంతో కష్టపడి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం ఈ పాలసీలో ఉండదు. ఈ పాలసీ చాలా సులభంగా పూర్తవుతుంది. కావున రిలాక్స్‌గా కూర్చుని పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను నిశితంగా పరిశీలించండి. ఎలాంటి పాలసీ మీ తల్లిదండ్రులకు సరిగ్గా సూటవుతుందో తెలుసుకోండి. ఇక పాలసీని నిర్ధారించుకున్న తర్వాత ఎంచుకునేందుకు కేవలం కొద్ది సమయం మాత్రమే పడుతుంది.
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వలన ప్రయోజనాలేంటి?
చాలా సందర్భాల్లో ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆదాయపు పన్ను మినహాయింపుల కోసమే తీసుకుంటారు. కానీ అలా తీసుకోవడం మంచిది కాదు.
మనం ప్రస్తుతం జీవిస్తున్న ప్రపంచంలో రోజురోజుకూ ఆరోగ్య ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇక వయోవృద్ధుల విషయానికి వస్తే వారికి రోజురోజుకూ రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. అందువలన వారు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పాలసీ అనేది మనకు అనేక విషయాల్లో సాయపడుతూ ఉంటుంది. మనం ఇష్టపడే వారి ఆరోగ్య అవసరాలను తీరుస్తూ ఉంటుంది. ఈ విషయంలో వయోవృద్ధుల విషయానికి వస్తే..
a. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులను అనవసరంగా మెడికల్ ఖర్చుల కోసం వాడకుండా మీకు అన్ని విధాలా కవర్ అయ్యే పాలసీని ఎంచుకోవాలి. మీరు ఎంచుకున్న పాలసీలో ప్రమాదాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మెడికల్ ఎమర్జెన్సీలకు చికిత్స ఉండేలా చూసుకోండి.
b. మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సును ఎప్పటికీ దృష్టిలో ఉంచుకోండి. సీనియర్ సిటిజన్ల కోసం కేటాయించబడిన మా హెల్త్ ఇన్సూరెన్స్ ఉచిత ఆన్యువల్ హెల్త్ చెకప్స్ మరియు అంతే కాకుండా సైకియాట్రిక్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.
c. మనశ్శాంతిగా ఉండటం చాలా ముఖ్యం. అనుకోని పరిస్థితుల వలన వచ్చే సందర్భాలకు ముందే ప్లాన్ చేసుకోవడం వలన మీరు నిశ్చింతగా ఉంటారు.
మరింతగా తెలుసుకోండి వయోవృద్ధులకు ఆదాయపన్ను ప్రయోజనాలు (Income tax benefits for Senior Citizens) & హెల్త్ ఇన్సూరెన్స్ పన్ను ప్రయోజనాలు (Health Insurance Tax Benefits).
వయోవృద్ధుల కోసం బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏది?
వయోవృద్ధుల కోసం మంచి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని మీరు అనుకున్నపుడు కేవలం ప్రీమియం మాత్రమే చూడకూడదు. మీ తల్లిదండ్రులకు కావాల్సిన అన్ని అవసరాలను ఆ పాలసీ తీరుస్తుందా? లేదా? అని చూసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ మనుషులు జబ్బులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లైఫ్స్టైల్లో వస్తున్న మార్పుల వలన అనేకమంది వయోధికులు మానసిక అనారోగ్యం బారిన పడి బాధపడుతున్నారు.
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటపుడు కేవలం ప్రీమియం గురించి మాత్రమే ఆలోచించకుండా ఆ పాలసీ మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను జబ్బుల నుంచి ఎలా కవర్ చేస్తుందనేది కూడా చూడాలి. మీ క్లెయిమ్ కోసం ఎటువంటి ప్రక్రియ ఉంటుందనేది తెలుసుకోవాలి? ఆ పాలసీ అన్ని రకాల జబ్బులను కవర్ చేస్తుందా లేదా అనే విషయాలను తనిఖీ చేయాలి. ఆ పాలసీలో ఇంట్లోనే చికిత్స చేయించుకునే అవకాశం కూడా అందుబాటులో ఉంటుందా? అనే విషయాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పాలసీని తీసుకోవాలి. పాలసీ తీసుకునేది మీ ఆరోగ్య ఖర్చులను కవర్ చేసేందుకేనని గుర్తుంచుకోవాలి.
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చి చూడండి
మీరు వయోవృద్ధుల కోసం ఆరోగ్య పాలసీని తీసుకోవడం ఇదే తొలిసారి అయితే అందులో ఉన్న పదాలు తప్పనిసరిగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. కానీ మీరు ఏమాత్రం తొందరపడకుండా సరైన ప్లాన్‌ను ఎంచుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉండే పదజాలం గురించి మేము ఇక్కడ ఇచ్చాం. వీటిని చదివి సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి. పాలసీ తీసుకునే ముందు వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చిచూడండి.
- సమ్ ఇన్సూర్డ్ : మీరు ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ చేస్తున్నారనేదాన్ని సమ్ ఇన్సూర్డ్ అనేది సూచిస్తుంది. ఒకవేళ మీరు క్లెయిమ్ చేసినా కూడా గరిష్టంగా అంతే మొత్తాన్ని పొందుతారు. కాబట్టి పాలసీ తీసుకునే ముందు మీరు చూడాల్సిన ముఖ్య విషయం ఇది. ప్లాన్ తక్కువ రేటుకు వస్తుందని ఎంచుకోవడం సరి కాదు. మీరు క్లెయిమ్ చేసినపుడు మీకు ఎంత వస్తుందనేది ముఖ్యం.
- నిజమైన బెనిఫిట్లు: మీకు అందే బెనిఫిట్లను పోల్చి చూసుకోవడం చాలా అవసరం. ఒక పాలసీని కనుక తీసుకుంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయనే విషయం తెలుసుకుని పాలసీని ఎంచుకోవడం అవసరం.
- క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డు : సీనియర్ సిటిజన్ హెల్త్ పాలసీ తీసుకునే ముందు చూడాల్సిన మరో ముఖ్య విషయం క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్. మీరు పాలసీని తీసుకునే ముందు కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డును తనిఖీ చేయండి. వాటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంతో తెలుసుకోండి. సదరు కంపెనీలు తమ కస్టమర్లకు ఎంత ఈజీగా క్లెయిమ్స్ అందజేస్తాయో నిర్ధారించుకోండి.
- ప్రక్రియలు : వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్ ప్రక్రియలను చూసి అందులో ఏది చాలా సులభమైన క్లెయిమ్ ప్రక్రియ కలిగి ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీని తీసుకోండి.
- ప్రీమియం : చాలా మంది పాలసీ తీసుకునేటపుడు ఈ అంశాన్ని పోల్చి చూస్తారు. పాలసీదారుడికి ఇది ముఖ్యమైనది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం ప్రీమియం రేటును పోల్చి చూడటమే కాకుండా మీరు కట్టిన ప్రీమియంకు ఇన్సూరెన్స్ అమౌంట్‌కు సరిపోతుందా? అనే విషయం, ఎన్ని అనారోగ్యాలను కవర్ చేస్తుందనేది కూడా లెక్కించాలి.
క్యాష్లెస్ క్లెయిమ్ అంటే ఏమిటి?
ఈ క్లెయిమ్ పేరులో ఉన్నట్లే అన్ని పనులు క్యాష్లెస్గానే జరుగుతాయి. క్యాష్లెస్ క్లెయిమ్ విధానంలో మీరు మీ జేబు నుంచి ఎటువంటి డబ్బులను చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు చికిత్స కోసం మా నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లినపుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
క్యాష్లెస్ హెల్త్ క్లెయిమ్ ఎలా సెటిల్ చేసుకోవాలి?
1. ఆస్పత్రిలో చేరడానికి 72 గంటల ముందు (మీరు ఆస్పత్రిలో చేరాలని ముందే అనుకుంటే) కానీ లేదా ఆస్పత్రిలో చేరిన 24 గంటల తర్వాత (ఎమర్జెన్సీ కేసులలో) కానీ మమ్మల్ని ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించండి.
2. మీ హెల్త్ కార్డ్ లేదా ఈ–కార్డును హాస్పిటల్లో క్యాష్ కౌంటర్ సిబ్బందికి చూపించి ప్రీ–ఆథరైజేషన్ పొందండి.
3. వారు మీకిచ్చిన ఫామ్‌లో అన్ని వివరాలు నింపి సంతకం చేయండి.
4. మీరు సంతకం చేసిన డాక్యుమెంట్లను ఆస్పత్రి వర్గాలు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (TPA) సర్వీస్ ప్రొవైడర్‌తో ప్రాసెస్ చేస్తాయి.
5. మీ ఫామ్ ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత థర్డ్ పార్టీ నుంచి ఆస్పత్రికి క్లెయిమ్‌కు సంబంధించిన కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది.
6. అన్నీ పూర్తయిన తర్వాత మీరు చికిత్స చేయించుకోవచ్చు. మీకు కన్ఫర్మేషన్ వచ్చిన 15 రోజుల్లోపు చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.
రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అంటే ఏమిటి?
తరుచుగా వాడే క్లెయిమ్స్ రకాలలో రీయింబర్స్మెంట్ క్లెయిమ్ విధానం ఒకటి. ఈ క్లెయిమ్‌ను వాడేందుకు తప్పకుండా నెట్వర్క్ ఆస్పత్రికే వెళ్లాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్న ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకుని ఈ విధానం ద్వారా క్లెయిమ్ పొందొచ్చు. మీరు ఈ క్లెయిమ్ కోసం చేయాల్సిందల్లా సరైన సమయంలో అన్ని రకాల అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం మాత్రమే.
రీయింబర్స్మెంట్ క్లెయిమ్ సెటిల్ చేసుకోవడానికి ఎలాంటి ప్రక్రియ ఉంటుంది?
1. మాకైనా లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (TPA)కు అయినా 48 గంటల్లోపు తెలియజేయండి.
2. మీ డిశ్చార్జీ అయిన 30 రోజుల్లోపు అన్ని రకాల ఆస్పత్రి బిల్లులును సబ్మిట్ చేస్తే క్లెయిమ్ సెటిల్ అవుతుంది.
3. మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లను మా టీమ్ పరిశీలిస్తుంది. అనంతరం మీ క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది. ఇందుకు 30 రోజుల సమయం పడుతుంది. ఒకవేళ అలా కుదరని పక్షంలో మేము మీకు 2 శాతం వడ్డీ రేటును కూడా అందిస్తాం.
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఏ వయసులో తీసుకోవడం మంచిది?
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని 65 సంవత్సరాలకు మించిన వారి కోసమే డిజైన్ చేశారు. 65 సంవత్సరాల వయసు దాటిన వారికి మాత్రమే ఈ ప్లాన్‌ను తీసుకునేందుకు వీలుంటుంది. కావున ఎవరైనా సరే ఈ పాలసీని రిటైర్మెంట్ తర్వాతే కొనేందుకు వీలుంటుంది. ఈ పాలసీని తీసుకుని మీ సేవింగ్స్‌ను పెంచుకోండి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి.
వయోవృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ను కొనుగోలు చేసేటపుడు తరచూ చేసే తప్పిదాలు
- తక్కువ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోవడం
- ఇదివరకే ఉన్న వ్యాధులు, లైఫ్‌స్టైల్ విధానాలను సరిగా చెప్పకపోవడం
- అదనపు ప్రయోజనాల కోసం యాడ్–ఆన్స్ తీసుకోకపోవడం
- పాలసీ డాక్యుమెంట్లను సరిగ్గా చదవకపోవడం
- ఆదాయ పన్ను ప్రయోజనాల కోసం మాత్రమే సీనియర్ సిటిజన్ పాలసీని కొనుగోలు చేయడం.
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా లెక్కిస్తారు?
మాతో పాటుగా ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీలు సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కింద పేర్కొన్న విధంగానే లెక్కిస్తాయి.
- వయోవృద్ధుల వయసు : సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ 65 సంవత్సరాల పైబడిన వారి కోసం రూపొందిచబడినప్పటికీ, ప్రతి ఒక్కరిలో వయసు పెరిగే కొద్దీ జబ్బులు పెరుగుతాయి. అందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం విషయంలో వయసును పరిగణనలోకి తీసుకుంటారు.
- లైఫ్‌స్టైల్ : మనం లీడ్ చేసే లైఫ్‌స్టైల్ మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కావున హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని లెక్కించే చేసే ముందు మన లైఫ్‌స్టైల్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి మీ తల్లిదండ్రుల గురించి అన్ని విషయాలను నిజాయతీగా చెప్పాలి. వారికి ఉన్న డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లను గురించి చెప్పేయాలి. ఒకవేళ మీరు చెప్పకుండా దాస్తే, క్లెయిమ్ చేసినపుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు ఆస్పత్రిలో తప్పకుండా విచారణ చేస్తారు. అటువంటి సమయంలో వారికి ఉన్న అలవాట్ల వల్లనే జబ్బు పడ్డారన్న విషయం తెలిస్తే మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అలవాట్ల గురించి ముందే చెప్పడం ఉత్తమం.
- ప్రీ–ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లేదా పరిస్థితులు : మీరు పాలసీ తీసుకోవడానికి 48 నెలల ముందు మీ తల్లిదండ్రులు ఏదైనా జబ్బుతో ఆస్పత్రిలో చేరితే ఇన్సూరెన్స్ కంపెనీకి కచ్చితంగా తెలియజేయాలి.
- ప్రాంతం : ప్రతీ పట్టణం, నగరాలు ఒకదానికొకటి డిఫరెంట్‌గా ఉంటుంది. ట్రాఫిక్, పొల్యూషన్ లెవల్స్, లైఫ్‌స్టైల్, అన్నీ ఇలా మారుతుంటాయి. వయోవృద్ధులయిన మీ తల్లిదండ్రులు ఉంటున్న ప్రాంతం కూడా వారి ప్రీమియాన్ని ప్రభావితం చేస్తుంది.
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏం చూడాలి?
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు కింది విషయాలను ఒకసారి తనిఖీ చేయండి.
a. క్లెయిమ్ ప్రక్రియ & సెటిల్మెంట్ : మీరు క్లెయిమ్ చేసినపుడు ఇబ్బంది పడేకంటే ముందుగానే క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ, రేషియో ఎలా ఉన్నాయో తనిఖీ చేయండి.
b. కస్టమర్ టెస్టిమెనియల్స్ & సోషల్ మీడియా రివ్యూలు : ఇంతకుముందు పాలసీ తీసుకున్న ప్రజల నుంచి స్పందన తెలుసుకోవడానికి ఇదే ఉత్తమ మార్గం. మీరు పాలసీ తీసుకునే ముందు ఆ కంపెనీ గురించి రివ్యూలు, కామెంట్లు ఎలా ఉన్నాయో ఒకసారి సోషల్ మీడియాలో చెక్ చేయండి.
c. ఆస్పత్రుల నెట్వర్క్: క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది అత్యుత్తమమైన మార్గం. మీరు పాలసీ తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీకి నెట్వర్క్ ఆస్పత్రులు ఉంటేనే ఇది వర్తిస్తుంది. కావున మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే కంపెనీ నెట్‌వర్క్‌లో ఎన్ని ఆస్పత్రులు ఉన్నాయనేది ఒకసారి చెక్ చేయండి.
d. యాడ్–ఆన్ బెనిఫిట్లు : ప్రతీ హెల్త్ ఇన్సూరెన్స్కు యాడ్–ఆన్ బెనిఫిట్లు ఉంటాయి. ఈ యాడ్–ఆన్ బెనిఫిట్లను మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. వయోవృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలని మీరు భావిస్తున్నపుడు ఏ ఏ యాడ్–ఆన్స్ అందుబాటులో ఉన్నాయో చూసుకోవడం వాటి వలన మీకు కలిగే బెనిఫిట్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
e. ఇన్సూరెన్స్ అమౌంట్: హెల్త్ ఇన్సూరెన్స్ చేసినపుడు మీరు అంతిమంగా పొందేది మీరు ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ చేశారో ఆ అమౌంట్ మాత్రమే. కావున మీరు చేసిన ఇన్సూరెన్స్ అమౌంట్ మీకు సరిపోతుందో లేదో ఒకటికి రెండు సార్లు సరి చూసుకోండి.
సరైన ఇన్సూరెన్స్ అమౌంట్ను ఎలా ఎంచుకోవాలి?
ఇన్సూరెన్స్ అమౌంట్ను ఎంచుకునేటప్పుడు కింది రెండు విషయాలను అనుసరించాలి:
a. ఆరోగ్య పరిస్థితులు : మీ తల్లిదండ్రులకు ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉండి ఉన్నట్లయితే లేదా తక్కువ రోగ నిరోధక శక్తి ఉంటే అధిక ఇన్సూరెన్స్ అమౌంట్ను ఎంచుకోవాలి. మీ తల్లిదండ్రులకు వంశపారంపర్య వ్యాధులు ఉండి, మీ నగరంలో కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటే అధిక ఇన్సూరెన్స్ అమౌంట్ను ఎంచుకుంటే బాగుంటుంది.
b. జీవన విధానం: మన ఆరోగ్యం అనేది జీవన విధానంతో ముడిపడి ఉంటుంది. అందుకోసమే మీరు, మీ తల్లిదండ్రుల జీవన విధానాన్ని బట్టి ఇన్సూరెన్స్ అమౌంట్‌ను ఎంచుకోండి.
మరింత తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం సరైన ఇన్సూరెన్స్ అమౌంట్‌ను ఎంచుకోవడం ఎలా?
సైకియాట్రిక్ బెనిఫిట్ అంటే ఏమిటి?
శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా మనకు అంతే ముఖ్యం. అందుకోసమే మా సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మానసిక సమస్యలకు కూడా చికిత్స ఖర్చులు కవర్ అవుతాయి.
వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు
1. చురుగ్గా ఉండండి – చాలా మంది వయసు పెరిగే కొద్ది వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. ఇలా చేయడం వలన మీరు అనేక రకాల వ్యాధులకు గురికావచ్చు. మీరు ఈ విషయాన్ని మీ కోసం చదివినా, లేదా మీ తల్లిదండ్రుల కోసం చదివినా వ్యాయామం మాత్రం ముఖ్యం. ప్రతి రోజూ 15-20 నిమిషాల పాటు యోగా కానీ, వాకింగ్ కానీ చేసి ఆరోగ్యంగా ఉండవచ్చు.
2. ఆరోగ్యకరమైన ఆహారం తినండి – మనం తినే ఆహరం వలన మన ఆరోగ్యం 70% మెరుగుపడుతుంది. ఈ విషయాన్ని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మీరు కానీ, మీ తల్లిదండ్రులు కానీ తీసుకునే ఆహారం మీద జాగ్రత్త వహించండి. మీరు, మీ తల్లిదండ్రులు తప్పకుండా సమతుల ఆహారం తీసుకోండి. క్యాల్షియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. ఆయిల్ ఫుడ్స్, డెయిరీ ఉత్పత్తులను వీలయినంత వరకు తినడం మానేయండి.
3. నివారణ మీద దృష్టి పెట్టండి - జబ్బు బారినపడి కోలుకోవడం కంటే ముందే జబ్బు బారిన పడకుండా ఉండటం ఉత్తమం. 😊 కావున ప్రతి సారి వార్షిక చెకప్స్ కోసం వెళ్లండి. మీ ఆరోగ్యం పట్ల అవగాహనను కల్గి ఉండండి. అవగాహన అనేది అనేక రకాలుగా వచ్చే ఆరోగ్య ప్రమాదాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
4. మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి – మన దేశంలో 65 సంవత్సరాలకు పైబడిన వారిలో 50శాతం కంటే ఎక్కువ మంది ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు. చిన్న చిన్న చిట్కాలను పాటించి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ధ్యానం, తోట పని వంటి పనుల్లో పాలు పంచుకోవడం వలన మీ మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. పెద్దలయిన మీ తల్లిదండ్రులు ఒత్తిడి, ఆందోళనకు లోనయితే వెంటనే దగ్గర్లోని సైకాలజిస్ట్ వద్ద కౌన్సెలింగ్ ఇప్పించండి.
5. డెంటల్ చికిత్సకు వెళ్లండి – డెంటల్ సమస్యలు వయోవృద్ధులకు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి, మీ తల్లిదండ్రులకు తరచూ డెంటల్ పరీక్షలు చేయించండి.
6. జనంతో కలిసిపోండి – చాలా మంది వయోవృద్ధులు ఒంటరితనంతో బాధపడుతున్నారు. మనిషికి కావాల్సింది తోడు. అది తన పక్కింటి వారైనా కానీ, కుటుంబ సభ్యులైనా కానీ, స్నేహితులైనా కానీ తోడుగా ఉంటే మనిషి మానసికంగా బలంగా ఉంటాడు. పక్కవారితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.
7. బాగా విశ్రాంతి తీసుకోండి – మంచి నిద్ర మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. ప్రతిరోజు మీ తల్లిదండ్రులు కనీసం ఎనిమిది గంటలైనా సరిగ్గా నిద్ర పోయేలా చూడండి.
8. ధూమపానం (స్మోకింగ్) మానేయండి– మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ ధూమపానం చేసేవారైతే ఆ అలవాటును వెంటనే మానేయండి. మానేసేందుకు ఇదే సరైన సమయం. ధూమపానం వలన ఏ ఒక్క లాభం చేకూరదు. ఏదేమైనప్పటికీ వయసు పెరిగే కొద్ది ధూమపానం చాలా దుష్ప్రభావాలను చూపిస్తుంది.
9. బాగా చదవండి – వయసు మళ్లిన తర్వాత జ్ఞాపకాలు బలహీనం అవుతాయని ఒక పురాణంలో ఉంది. ఇది అబద్ధం. ఎందుకంటే మీకు వయసు మళ్లిన తర్వాత మీ మెదడును చురుకుగా ఉంచుకోండి. చదవడం వలన మీ మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉండేందుకు ఇది చాలా సహాయపడుతుంది. కావున మీరు మీ మెదడును చురుకుగా ఉంచుకునేందుకు చదవడమనేది బాగా సాయపడుతుంది.
10. శరీరంలో నీటి స్థాయులు బాగా ఉండేలా చూసుకోండి – నీరు. మన జీవితంలో చాలా ముఖ్యమైన ద్రవం. మన శరీరంలో ఉన్న అనేక విషపదార్థాలను నీరు బయటకు పంపుతుంది. మేము ఈ విషయంలో జోక్ చేయడం లేదు. అధికంగా నీటిని తీసుకుని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు, మీ తల్లిదండ్రులు రోజుకు 8 గ్లాసుల మంచి నీటిని తప్పనిసరిగా తీసుకోండి. నీటిని ఎంత ఎక్కువ మొత్తంలో తాగితే అంత మంచిది.
వయోవృద్ధుల హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
నా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో వయోవృద్ధులైన నా తల్లిదండ్రులను చేర్చవచ్చా?
అలా చేసేందుకు వీలుపడదు. మీరు వయోవృద్ధులైన మీ తల్లిదండ్రుల కోసం విడిగా వేరొక పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వయసులో ఉన్న వ్యక్తులకు, వయసు పైబడిన వ్యక్తులకు వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వేర్వేరు ప్లాన్లు ఉంటాయి. ఒక వ్యక్తి ఇన్ని పాలసీలు తీసుకోనవసరం లేకుండా డిజిట్ మీ కోసం కేవలం ఒకే ప్లాన్‌లో తల్లిదండ్రుల ఇన్సూరెన్స్, మీ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ను కలిపి తీసుకొచ్చింది. కానీ మీకు రెండు వేర్వేరు పాలసీ డాక్యుమెంట్లు వస్తాయి.
వార్షిక ఇన్సూరెన్స్ మొత్తం అంటే ఏమిటి?
పాలసీ సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ మనకు చెల్లించే ఇన్సూరెన్స్ మొత్తాన్నే వార్షిక ఇన్సూరెన్స్ అని పిలుస్తారు.
వెయిటింగ్ పీరియడ్ అంటే ఏమిటి?
వెయిటింగ్ పీరియడ్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఎంత సమయం వేచి ఉండాలో తెలియజేస్తుంది. ఉదాహరణకు వయోవృద్ధులకు ముందునుంచే ఉన్న వ్యాధుల కోసం రెండు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటే క్యాన్సర్ సంబంధిత చికిత్సలకు క్లెయిమ్ చేసుకోవడం కోసం రెండు సంవత్సరాలు వేచి ఉండాలి.
వ్యక్తిగత పాలసీకి, ఫ్లోటర్ పాలసీకి మధ్య వ్యత్యాసం ఏమిటి?
వ్యక్తిగత పాలసీ ఎవరైతే వ్యక్తి ఇన్సూరెన్స్ చేయించుకున్నారో వారి పేరు మీదే ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో ఒకే పాలసీ కింద కుటుంబం మొత్తం కవర్ అవుతుంది. ఇన్సూరెన్స్ మొత్తం కుటుంబ సభ్యులకు సమానంగా వర్తిస్తుంది.
నా తల్లిదండ్రులకు వేరే ప్లాన్ ఎందుకు తీసుకోవాలి?
తల్లిదండ్రులకు వేరే పాలసీ తీసుకోవడం చాలా అవసరం. మీ పిల్లలతో పోల్చుకుంటే మీ తల్లిదండ్రులు ఎక్కువ జబ్బుపడతారు. కావున వారికి వేరే ప్లాన్ తీసుకోవాలి. వారిని మీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో కలపకూడదు.
ముందు నుంచి ఉన్న వ్యాధులు (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్) అంటే అర్థం ఏమిటి?
ముందు నుంచి ఉన్న వ్యాధులు (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్) అన్నా కూడా సాధారణ వ్యాధులే. హెల్త్ పాలసీని తీసుకునే 48 నెలల ముందు మీ తల్లిదండ్రులు కనుక ఏవైనా జబ్బులు వచ్చి ఆస్పత్రిలో చేరితే వాటిని ముందు నుంచి ఉన్న వ్యాధులు (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్)గా పేర్కొంటారు.