ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

డిజిట్ ఇన్సూరెన్స్​కు మారండి

క్యాటరాక్ట్ సర్జరీని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్

క్యాటరాక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

క్యాటరాక్ట్  హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం వృద్ధాప్యంలో ఎదుర్కొనే సాధారణ కంటి సమస్యైన కంటిశుక్లం (క్యాటరాక్ట్) చికిత్స కోసం, కంటికి అయ్యే గాయాల చికిత్సను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. 

డిజిట్‌లో, దీనికి సంబంధించిన చికిత్స చేర్చబడటమే గాక మా డేకేర్ ప్రొసీజర్స్​లో కవర్ చేయబడుతుంది - అదీ అదనపు ఖర్చు లేకుండా.

మీరు క్యాటరాక్ట్ సర్జరీని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్‌‌ను ఎందుకు పొందాలి?.

1

సంప్రదాయ కంటిశుక్లం (ఫాకోఎమల్సిఫికేషన్)కు ఒక్కో కంటికి రూ. 40,000 ఖర్చవుతుండగా, కొత్తగా వచ్చిన బ్లేడ్‌లెస్ సర్జరీకి రూ.85,000 నుంచి రూ. 1.2 లక్షల వరకు ఖర్చవుతుంది! (1)

2

కంటిశుక్లానికి సంబంధించిన సహజ నివారణ లేదు. 2017లో నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్  ప్రచురించిన అధ్యయనసమీక్షలో కంటిశుక్లం కోసం అందుబాటులో ఉన్న ఏకైక చికిత్స ఆపరేషన్​ మాత్రమేనని నిర్ధారించింది. (2)

3

అమెరికా లేదా ఐరోపా దేశాల్లో కంటిశుక్లం సంక్రమించే సగటు వయస్సు 70+ సంవత్సరాలు. భారతదేశంలో, ఈ పరిస్థితి 50 ఏళ్ల వయస్సులో ఉన్న వారిలోనే ఎక్కువగా ఉంది. (3)

కంటిశుక్లం (క్యాటరాక్ట్ ) అంటే ఏమిటి?

కంటిశుక్లం (క్యాటరాక్ట్) అనేది కంటి లెన్స్‌లో దట్టంగా మబ్బులు ఏర్పడటం వల్ల కలిగే కంటి పరిస్థితి. వృద్ధులలో ఇది చాలా సాధారణం. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, పాక్షిక లేదా పూర్తి అంధత్వానికి దారితీస్తుంది.

 

కంటిశుక్లం ( క్యాటరాక్ట్ ) ఎలా వస్తుంది?

కంటిశుక్లం రావడానికి ఒక నిర్దిష్ట కారణమంటూ లేదు. వృద్ధులలో ఇది సాధారణమే అయినప్పటికీ, భారతదేశంలో 50 ఏళ్ల వయస్సులో ఉన్నవారికి కూడా ఈ పరిస్థితి సంభవించే అవకాశం ఉంది!

భారతదేశంలో మధుమేహ బాధితులు పెరగడం, వ్యాప్తి చెందడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. మధుమేహం, పెరుగుతున్న వయస్సుతో పాటు ఈ కింది కారణాల వల్ల కూడా కంటిశుక్లం రావచ్చు.

  • ఆక్సిడెంట్ల అధిక ఉత్పత్తి, అనగా సాధారణ రోజువారీ జీవితంలో రసాయనికంగా మార్చబడిన ఆక్సిజన్ అణువులు

  • ధూమపానం

  • అతినీలలోహిత వికిరణం

  • దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్, ఇతర ఔషధాలను వాడటం

  • మధుమేహం వంటి కొన్ని వ్యాధులు

  • కంటికి తగిలిన పాత గాయాల వల్ల

  • రేడియేషన్ థెరపీ

కంటిశుక్లం యొక్క లక్షణాలు

  • కండ్లు మబ్బు మబ్బుగా కనిపించడం

  • రాత్రిపూట సరిగా కనిపించకపోవడం

  • రంగులు ఫేడ్ అయినట్లు కనిపించడం

  • దృష్టి సన్నగిల్లడం

  • కాంతి వలయాలు కనిపించడం

  • ఒకవస్తువు రెండుగా కనిపించడం

  • ప్రిస్క్రిప్షన్ గ్లాసుల్లో తరచుగా మార్పులు చేయాల్సిన అవసరం

కంటిశుక్లాల రకాలు

ప్రజలు సాధారణంగా కంటిశుక్లం ఒక రకమైనది మాత్రమే, ఇది పూర్తిగా వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉంటుందనే అపోహలో ఉంటారు.

అయితే ఇది నిజం కాదు. కంటిశుక్లం  వివిధ రకాలుగా ఉంటుంది. దానికి కారణం, అది కంటిలో ప్రభావితం చేసే భాగాన్ని బట్టి ఉంటుంది. కంటిశుక్లం యొక్క వివిధ రకాలు క్రింద ఉన్నాయి:

  • న్యూక్లియర్ క్యాటరాక్ట్ : లెన్స్ మధ్యలో ఏర్పడి న్యూక్లియస్ (కంటి మధ్య భాగం) పసుపు/గోధుమ రంగులోకి మారుతుంది.
  • కార్టికల్ క్యాటరాక్ట్స్ : చీలిక ఆకారంలో, న్యూక్లియస్ అంచు చుట్టూ ఏర్పడుతుంది.
  • పోస్టీరియర్ క్యాప్సులర్ క్యాటరాక్ట్స్: ఇతర కంటిశుక్లాలతో పోలిస్తే ఇది చాలా వేగంగా కంటిలో ఏర్పడుతుంది. కంటి లెన్స్ వెనుక భాగాన్ని ప్రభావితం చేస్తుంది.
  • పుట్టుకతో వచ్చే క్యాటరాక్ట్స్: శుక్లాల రకాల్లో ఒకటి పెరుగుతున్న వయసు కారణంగా సంభవించదు. కానీ పుట్టినప్పటి నుండి లేదా శిశువు యొక్క మొదటి సంవత్సరంలోనే కంటిశుక్లం ఏర్పడవచ్చు.
  • సెకండరీ క్యాటరాక్ట్: మరో వ్యాధి లేదా మధుమేహం, గ్లాకోమా వంటి అంతర్లీన ఆరోగ్య పరిస్థితి కారణంగా ఏర్పడుతుంది. అదనంగా స్టెరాయిడ్స్, ఇతర మందుల వాడకం కూడా కంటిశుక్లం ఏర్పడటానికి దారి తీస్తుంది.
  • ట్రామాటిక్ క్యాటరాక్ట్: కొన్నిసార్లు, కంటికి గాయం అయిన తర్వాత ట్రామా క్యాటరాక్ట్ వస్తుంది. అయితే ఇది జరగడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు.
  • రేడియేషన్ క్యాటరాక్ట్: వ్యక్తికి క్యాన్సర్‌ కోసం రేడియేషన్ చికిత్స అందించిన తర్వాత ఏర్పడుతుంది.

కంటి శుక్లాల నివారణకు మార్గం ఉందా?

ఉంది, మీ కంటి ఆరోగ్యంతో పాటు మొత్తం శరీరక ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకోవడం ద్వారా కంటి శుక్లంకి సంబంధించిన సమస్యను  ప్రాథమికంగా నివారించవచ్చు. కంటిశుక్లాన్ని నిరోధించడానికి కొన్ని మార్గాలు:

  • అతినీలలోహిత కిరణాల నుండి మీ కళ్ళను రక్షించడానికి ఎండలో సన్ గ్లాసెస్ ధరించండి. 

  • ప్రత్యేకించి మీరు సాధారణంగా కంటి సమస్యలను ఎదుర్కొంటే లేదా 65 ఏళ్లు పైబడిన వారైతే తరచూ కంటి చెకప్‌లకు వెళ్లండి.

  • పొగ తాగడం మానండి!

  • యాంటీ–ఆక్సిడెంట్లు ఉండే పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

  • ఇతర వ్యాధులను నివారించడంతోపాటు - ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉండటానికి బరువును నియత్రణలో ఉంచండి

  • మీకు మధుమేహం ఉన్నట్లయితే, దాని స్థాయిని అదుపులో ఉంచుకోండి.

కంటిశుక్లంతో సంబంధం ఉన్న ఏవైనా ప్రమాద కారకాలు ఉన్నాయా?

అవును, దురదృష్టవశాత్తు ఇతరులకన్నా కంటిశుక్లం వచ్చే అవకాశం ఉన్నవారు కొందరు ఉన్నారు. ఈ ప్రమాద కారకాలలో కొన్ని:

  • పెరుగుతున్న వయస్సు

  • మద్యం ఎక్కువగా తీసుకోవడం

  • క్రమంగా ధూమపానం చేయడం

  • ఊబకాయం

  • అధిక రక్త పోటు

  • పాత కంటి గాయాలు

  • వంశపారపార్యంగా వచ్చే కంటిశుక్లం 

  • ఎక్కువ సూర్యరశ్మి కారణంగా

  • మధుమేహం

  • ఎక్స్​- కిరణాలు, క్యాన్సర్ చికిత్సల వల్ల రేడియేషన్‌కు గురికావడం

కంటిశుక్లం ఆపరేషన్ ఎందుకు ముఖ్యమైనది?

  • కంటిశుక్లం కోసం ఆపరేషన్ తప్ప సహజ చికిత్స లేదు - దురదృష్టవశాత్తూ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ధృవీకరించినట్లుగా, ప్రస్తుతం ఆపరేషన్‌ తప్ప కంటిశుక్లానికి సహజ చికిత్స లేదు. అందువల్ల, మీ దృష్టిని మెరుగుపరచడానికి, కంటిశుక్లం యొక్క లక్షణాలు, పరిణామాలను తగ్గించుకోవడానికి మీరు కంటిశుక్లం ఆపరేషన్ చేయించుకోవాలి.


  • చికిత్స చేయని కంటిశుక్లం పాక్షిక లేదా పూర్తి అంధత్వానికి దారి తీస్తుంది - వయస్సు, కంటి పరిస్థితి ప్రకారం, లక్షణాలు కాలక్రమేణా మరింత తీవ్రమవుతాయి. చికిత్స తీసుకోకుంటే (కోర్సులో ఆపరేషన్ ద్వారా), ఇది ప్రభావితమైన వ్యక్తి యొక్క పాక్షిక లేదా పూర్తి అంధత్వానికి దారితీస్తుంది. అందువల్ల మీరు లేదా మీ తల్లిదండ్రులకు ఒకటి లేదా రెండు కళ్లలో కంటిశుక్లం ఉంటే, అధ్వాన్నమైన పరిణామాలను నివారించడానికి కంటిశుక్లం ఆపరేషన్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.


  • క్యాటరాక్ట్ సర్జరీ విజయవంతంగా దృష్టిని పునరుద్ధరిస్తుంది - ఇందులో శుభవార్త ఏమిటంటే కంటిశుక్లం ఆపరేషన్ వాస్తవానికి సురక్షితమైన ఆపరేషన్‌లలో ఒకటి. ఇందుకు వైద్యరంగంలో వచ్చిన పురోగతికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.  నిజానికి మీరు కేవలం కొన్ని గంటల పాటు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది ఇతర సర్జరీలతో పోలిస్తే చాలా తక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. (రికవరీ కూడా త్వరితంగా ఉంటుంది!) ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఒకరి దృష్టిని విజయవంతంగా పునరుద్ధరించడం జరగుతుంది!
  • మెరుగైన జీవనశైలిని పెంపొందిస్తుంది - సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని మీకు తెలుసు! ఈ విషయం చిన్నదిలా అనిపించవచ్చు కానీ మనం  ఊహించే వాటి కన్నా ఎక్కువ వీటిపై ఆధారపడతాము. అందువల్ల క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవడం అనేది ఒకరి దృష్టి నాణ్యతను మాత్రమే కాకుండా, మొత్తం జీవనశైలినే మెరుగుపరుస్తుంది.

భారతదేశంలో కంటిశుక్లం సర్జరీకి ఎంత ఖర్చవుతుంది?

ఫాకోఎమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది కంటిశుక్లం ఆపరేషన్ యొక్క అత్యంత సాధారణ రూపం. అయితే కంటిశుక్లం కోసం ఇతర రకాల ఆపరేషన్‌లు కూడా ఉన్నాయి.

మీ డాక్టర్ సిఫారసు చేసిన దాని ఆధారంగా, మీరు నివసిస్తున్న నగరం, మీరు ఎంచుకున్న ఆసుపత్రి, మీ వయస్సు ఎంత అనే దానిపై భారతదేశంలో కంటిశుక్లం ఆపరేషన్ ఖర్చు భిన్నంగా ఉంటుంది. భారతదేశంలోని మూడు రకాల కంటిశుక్లం ఆపరేషన్‌లకు సుమారుగా ఎంత ఖర్చవుతుందో క్రింద ఇవ్వబడింది:

 

ఫాకోమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ ఎక్స్‎ట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ సర్జరీ బ్లేడ్ లెస్ క్యాటరాక్ట్ సర్జరీ
ఇది ఏంటి: క్యాటరాక్ట్ విచ్ఛిన్నం కావడానికి మరియు తొలగించడానికి ప్రభావిత కార్నియాలో చిన్న కోతలు చేయడానికి ముందు స్థానిక అనస్థీషియాను ఉపయోగించి క్యాటరాక్ట్ కోసం ఆచరించే అత్యంత సాధారణ సర్జరీ. ఇది ఏంటి: ఫాకోఎమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ మాదిరిగానే, కానీ ఇక్కడ అవసరమైన కోతలు సాధారణం కంటే ఎక్కువ. ఇది ఏంటి: ఈ ఆపరేషన్ ఎటువంటి కోత (ఇన్ సెషన్) పద్ధతులను ఉపయోగించదు, బదులుగా క్యాటరాక్ట్ కరిగిపోయే కంప్యూటర్-గైడెడ్ ఫెమ్టోసెకండ్ లేజర్ ద్వారా క్యాటరాక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది.
ధర: ఎఫెక్ట్ అయిన కంటికి సుమారు రూ. 40,000. ధర: ఎఫెక్ట్ అయిన కంటికి రూ. 40,000 నుండి రూ. 60,000 ధర: ఈ ఆపరేషన్ నూతనమైన మరియు చాలా సాంకేతికతో కూడినది. కాబట్టి ఇది ఇతర ఆపరేషన్‌ల కంటే ఖరీదైనది. అంటే ఎఫెక్ట్ అయిన కంటికి దాదాపు రూ. 85,000 నుండి 120,000 వరకు ఖర్చు అవుతుంది.

సోర్స్

డిస్​క్లెయిమర్ (Disclaimer): పైన పేర్కొన్నవి సుమారు ఖర్చులు మాత్రమే. ఇవి ఒక్కో ఆసుపత్రికి, ఒక్కో నగరానికి ఒక్కోలా ఉండవచ్చు.

 

క్యాటరాక్ట్​ను కవర్ చేసే డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో గొప్పతనం ఏమిటి?

సులభమైన ఆన్​లైన్ ప్రక్రియలు  - మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పటి నుంచి క్లెయిమ్ చేసే వరకు మొత్తం పేపర్​లెస్, సులభంగా మరియు ఎటువంటి చింత లేకుండా ఉంటుంది. క్లెయిమ్స్ కోసం కూడా ఎటువంటి హార్డ్ కాపీస్ అవసరం లేదు.

ఏజ్ మీద ఆధారపడి కానీ జోన్ మీద ఆధారపడి ఎటువంటి కోపేమెంట్స్ లేవు - మా హెల్త్ ఇన్సూరెన్స్ ఎటువంటి కో పేమెంట్ లేకుండా ఉంటుంది. copayment. దీనర్థం మీరు క్లెయిమ్ చేసేటపుడు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

రూం రెంట్ కోసం ఎటువంటి పరిమితులు లేవు  - గదుల విషయంలో వేర్వేరు వ్యక్తుల ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయని మేము అర్థం చేసుకున్నాం. అందుకే మా పాలసీలలో గదుల విషయంలో అద్దె పరిమితులు లేవు. no room rent restrictions. మీరు ఇష్టపడే ఏ ఆసుపత్రి గదైనా ఎంచుకోండి.

SI(బీమా మొత్తం) వాలెట్ ప్రయోజనం  - బీమా గడువులో మీరు పాలసీ చేసిన బీమా మొత్తం కంప్లీట్​గా వాడుకుంటే మీ కోసం మేము దానిని మరలా అందజేస్తాం.

మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోండి  - దేశం మొత్తం మీద మాకు ఉన్న 10500 కంటే ఎక్కువ నెట్​వర్క్ ఆసుపత్రుల నుంచి ఎంచుకోండి. network hospitals వాటిల్లో క్యాష్​లెస్ చికిత్సలు లేదా రీయింబర్స్​మెంట్ ఎంచుకోండి.

వెల్​నెస్ బెనిఫిట్లు - అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల సహకారంతో యాప్​లో ప్రత్యేకమైన వెల్​నెస్ ప్రయోజనాలను పొందండి. wellness benefits

డిజిట్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్​లో ఉండే ముఖ్య ప్రయోజనాలు

కో పేమెంట్ లేదు
రూం రెంట్ క్యాపింగ్ లేదు
క్యాష్​లెస్ హాస్పిటల్స్ ఇండియా వ్యాప్తంగా 10500 కంటే ఎక్కువ నెట్​వర్క్ హాస్పిటల్స్
ఇన్​బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అవును
వెల్​నెస్ బెనిఫిట్స్ 10 కంటే ఎక్కువ వెల్​నెస్ పార్ట్​నర్ల నుంచి లభ్యం
సిటీ ద్వారా వచ్చే డిస్కౌంట్ 10% శాతం వరకు డిస్కౌంట్
వరల్డ్​వైడ్ కవరేజ్ అవును*
గుడ్ హెల్త్ డిస్కౌంట్ 5% శాతం వరకు డిస్కౌంట్
కన్య్సూమబుల్ కవర్ యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంది.

*కేవలం వరల్డ్​వైడ్ ట్రీట్​మెంట్​ ప్లాన్​లో మాత్రమే లభ్యమవుతాయి. 

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో క్యాటరాక్ట్ సర్జరీ కోసం ఎలా క్లెయిమ్ చేయాలి?

డిజిట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ 'డేకేర్ ప్రొసీజర్స్' కింద క్యాటరాక్ట్ ఆపరేషన్‌ను కవర్ చేస్తుంది.  వైద్యరంగంలో సాధించిన పురోగతి కారణంగా 24 గంటలలోపు ఆసుపత్రిలో చేరాల్సిన వైద్య చికిత్సగా ఇది మారింది.

మీరు క్యాటరాక్ట్ ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంటే, మాతో బీమా చేయబడి ఉంటే - మీరు ఎలా క్లెయిమ్ చేయవచ్చంటే:

 

A. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్

  • షెడ్యూల్ చేయబడిన ఆపరేషన్‌, ఆసుపత్రిలో చేరడం గురించి ముందుగానే లేదా చేరిన రెండు రోజులలోపు మాకు తెలియజేయండి. కంటిశుక్లం ఆపరేషన్  సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేయబడుతుంది. కాబట్టి చివరి నిమిషంలో ఏవైనా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే మాకు తెలియజేయడం మంచిది!

  • మీరు మాకు 1800-258-4242కి కాల్ చేయడం ద్వారా లేదా healthclaims@godigit.com లో  ఈ మెయిల్ సమాచారాన్ని అందించవచ్చు. మీకు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయడానికి మేము మీకు ఒక లింక్‌ను పంపుతాము. ఆపరేషన్ తర్వాత, రీయింబర్స్‌మెంట్ వీలైనంత త్వరగా అందేలా చూస్తాము.

B. నగదు రహిత (క్యాష్‌లెస్) క్లెయిమ్

  • మీరు నగదు రహిత (క్యాష్‌లెస్) క్లెయిమ్ కోసం వెళ్లాలనుకుంటే, ముందుగా ఇక్కడ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాలనుకుంటున్న నెట్‌వర్క్ ఆసుపత్రిని ఎంచుకోవచ్చు.

  • పైన పేర్కొన్న నంబర్ లేదా ఈ మెయిల్‌లో కనీసం 72-గంటల ముందుగా మాకు తెలియజేయండి.

  • నెట్‌వర్క్ హాస్పిటల్ డెస్క్ వద్ద మీ ఈ- హెల్త్ కార్డ్‌ని చూపించండి. క్యాష్‌లెస్ రిక్వెస్ట్ ఫారమ్‌ను అడిగి తీసుకొని నింపండి. అన్నీ బాగుంటే, మీ క్లెయిమ్ అక్కడే ప్రాసెస్ చేయబడుతుంది.

క్యాటరాక్ట్ ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు

ఏ వయస్సు వారు కంటిశుక్లాల బారిన పడే అవకాశం ఉంది?

చాలా వరకు వయోవృద్ధులు కంటిశుక్లాల బారిన పడే అవకాశం ఉంది.

 

అన్ని రకాల మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్​లు క్యాటరాక్ట్ ఆపరేషన్‌ను కవర్ చేస్తాయా?

లేదు, ఇది వివిధ ఆరోగ్య బీమా సంస్థల యొక్క షరతులు, నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మీ పాలసీ డాక్యుమెంట్ చెక్ చేయడం లేదా అది కవర్ చేయబడిందా లేదా అని చూడమని మీ బీమా సంస్థను అడగడం అనేది ఎల్లప్పుడూ ఉత్తమం.

 

క్యాటరాక్ట్ సర్జరీల కోసం ఏదైనా వెయిటింగ్ పీరియడ్ ఉందా?

అవును. డిజిట్‌లో కంటి శుక్లాల (క్యాటరాక్ట్) సర్జరీ కోసం 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది స్పెసిఫిక్ ఇల్‌నెస్ (అనారోగ్యం) జాబితాలో వస్తుంది. 

 

నాకు మధుమేహం ఉంటే, క్యాటరాక్ట్ కూడా వస్తుందా?

లేదు, మీకు మధుమేహం ఉంటే క్యాటరాక్ట్ వస్తుందనే గ్యారంటీ లేదు. కానీ, మధుమేహ వ్యాధిగ్రస్తులు (ముఖ్యంగా అధిక స్థాయిలు) ఉన్న వ్యక్తులు సెకండరీ క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం నేను విడిగా యాడ్-ఆన్ కవర్ పొందాలా?

ఇది కూడా మీ ఆరోగ్య బీమా సంస్థపై ఆధారపడి ఉంటుంది. కానీ, డిజిట్‌లో - క్యాటరాక్ట్ సర్జరీలు డేకేర్ ప్రొసీజర్‌ల కింద కవర్ చేయబడతాయి. అలాగే అన్ని ఆరోగ్య బీమా ఎంపికలలో డీఫాల్ట్‌గా చేర్చబడ్డాయి.

 

కంటిశుక్లం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ అవసరమా?

ఇది ప్రధానంగా మీకు ఉండే లక్షణాలు, ప్రస్తుత దృష్టి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. క్యాటరాక్ట్ సమస్య ఉన్న చాలా మందికి దృష్టి నాణ్యతను విజయవంతంగా పునరుద్ధరించడానికి సర్జరీ చేయించుకోవాలని సిఫార్సు చేయబడుతుంది. అయితే ప్రస్తుతం మీ కళ్లపై ఎలాంటి ప్రభావం ఉంది అనే దాని ఆధారంగా ఆపరేషన్ ఉంటుంది. మీ ప్రశ్నకు సమాధానం చాలా వివరంగా చెప్పాం, కంటి పరీక్ష తర్వాత మీకు సరైన సమాధానాల కోసం కంటి నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.