క్యాటరాక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం వృద్ధాప్యంలో ఎదుర్కొనే సాధారణ కంటి సమస్యైన కంటిశుక్లం (క్యాటరాక్ట్) చికిత్స కోసం, కంటికి అయ్యే గాయాల చికిత్సను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.
డిజిట్లో, దీనికి సంబంధించిన చికిత్స చేర్చబడటమే గాక మా డేకేర్ ప్రొసీజర్స్‌లో కవర్ చేయబడుతుంది - అదీ అదనపు ఖర్చు లేకుండా.
కంటిశుక్లం (క్యాటరాక్ట్) అనేది కంటి లెన్స్‌లో దట్టంగా మబ్బులు ఏర్పడటం వల్ల కలిగే కంటి పరిస్థితి. వృద్ధులలో ఇది చాలా సాధారణం. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, పాక్షిక లేదా పూర్తి అంధత్వానికి దారితీస్తుంది.
కంటిశుక్లం రావడానికి ఒక నిర్దిష్ట కారణమంటూ లేదు. వృద్ధులలో ఇది సాధారణమే అయినప్పటికీ, భారతదేశంలో 50 ఏళ్ల వయస్సులో ఉన్నవారికి కూడా ఈ పరిస్థితి సంభవించే అవకాశం ఉంది!
భారతదేశంలో మధుమేహ బాధితులు పెరగడం, వ్యాప్తి చెందడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. మధుమేహం, పెరుగుతున్న వయస్సుతో పాటు ఈ కింది కారణాల వల్ల కూడా కంటిశుక్లం రావచ్చు.
ఆక్సిడెంట్ల అధిక ఉత్పత్తి, అనగా సాధారణ రోజువారీ జీవితంలో రసాయనికంగా మార్చబడిన ఆక్సిజన్ అణువులు
ధూమపానం
అతినీలలోహిత వికిరణం
దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్, ఇతర ఔషధాలను వాడటం
మధుమేహం వంటి కొన్ని వ్యాధులు
కంటికి తగిలిన పాత గాయాల వల్ల
రేడియేషన్ థెరపీ
కండ్లు మబ్బు మబ్బుగా కనిపించడం
రాత్రిపూట సరిగా కనిపించకపోవడం
రంగులు ఫేడ్ అయినట్లు కనిపించడం
దృష్టి సన్నగిల్లడం
కాంతి వలయాలు కనిపించడం
ఒకవస్తువు రెండుగా కనిపించడం
ప్రిస్క్రిప్షన్ గ్లాసుల్లో తరచుగా మార్పులు చేయాల్సిన అవసరం
ప్రజలు సాధారణంగా కంటిశుక్లం ఒక రకమైనది మాత్రమే, ఇది పూర్తిగా వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉంటుందనే అపోహలో ఉంటారు.
అయితే ఇది నిజం కాదు. కంటిశుక్లం వివిధ రకాలుగా ఉంటుంది. దానికి కారణం, అది కంటిలో ప్రభావితం చేసే భాగాన్ని బట్టి ఉంటుంది. కంటిశుక్లం యొక్క వివిధ రకాలు క్రింద ఉన్నాయి:
ఉంది, మీ కంటి ఆరోగ్యంతో పాటు మొత్తం శరీరక ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకోవడం ద్వారా కంటి శుక్లంకి సంబంధించిన సమస్యను ప్రాథమికంగా నివారించవచ్చు. కంటిశుక్లాన్ని నిరోధించడానికి కొన్ని మార్గాలు:
అతినీలలోహిత కిరణాల నుండి మీ కళ్ళను రక్షించడానికి ఎండలో సన్ గ్లాసెస్ ధరించండి.
ప్రత్యేకించి మీరు సాధారణంగా కంటి సమస్యలను ఎదుర్కొంటే లేదా 65 ఏళ్లు పైబడిన వారైతే తరచూ కంటి చెకప్‌లకు వెళ్లండి.
పొగ తాగడం మానండి!
యాంటీ–ఆక్సిడెంట్లు ఉండే పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ఇతర వ్యాధులను నివారించడంతోపాటు - ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉండటానికి బరువును నియత్రణలో ఉంచండి
మీకు మధుమేహం ఉన్నట్లయితే, దాని స్థాయిని అదుపులో ఉంచుకోండి.
అవును, దురదృష్టవశాత్తు ఇతరులకన్నా కంటిశుక్లం వచ్చే అవకాశం ఉన్నవారు కొందరు ఉన్నారు. ఈ ప్రమాద కారకాలలో కొన్ని:
పెరుగుతున్న వయస్సు
మద్యం ఎక్కువగా తీసుకోవడం
క్రమంగా ధూమపానం చేయడం
ఊబకాయం
అధిక రక్త పోటు
పాత కంటి గాయాలు
వంశపారపార్యంగా వచ్చే కంటిశుక్లం
ఎక్కువ సూర్యరశ్మి కారణంగా
మధుమేహం
ఎక్స్- కిరణాలు, క్యాన్సర్ చికిత్సల వల్ల రేడియేషన్‌కు గురికావడం
ఫాకోఎమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది కంటిశుక్లం ఆపరేషన్ యొక్క అత్యంత సాధారణ రూపం. అయితే కంటిశుక్లం కోసం ఇతర రకాల ఆపరేషన్లు కూడా ఉన్నాయి.
మీ డాక్టర్ సిఫారసు చేసిన దాని ఆధారంగా, మీరు నివసిస్తున్న నగరం, మీరు ఎంచుకున్న ఆసుపత్రి, మీ వయస్సు ఎంత అనే దానిపై భారతదేశంలో కంటిశుక్లం ఆపరేషన్ ఖర్చు భిన్నంగా ఉంటుంది. భారతదేశంలోని మూడు రకాల కంటిశుక్లం ఆపరేషన్లకు సుమారుగా ఎంత ఖర్చవుతుందో క్రింద ఇవ్వబడింది:
ఫాకోమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ |
ఎక్స్ట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ సర్జరీ |
బ్లేడ్ లెస్ క్యాటరాక్ట్ సర్జరీ |
ఇది ఏంటి: క్యాటరాక్ట్ విచ్ఛిన్నం కావడానికి మరియు తొలగించడానికి ప్రభావిత కార్నియాలో చిన్న కోతలు చేయడానికి ముందు స్థానిక అనస్థీషియాను ఉపయోగించి క్యాటరాక్ట్ కోసం ఆచరించే అత్యంత సాధారణ సర్జరీ. |
ఇది ఏంటి: ఫాకోఎమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ మాదిరిగానే, కానీ ఇక్కడ అవసరమైన కోతలు సాధారణం కంటే ఎక్కువ. |
ఇది ఏంటి: ఈ ఆపరేషన్ ఎటువంటి కోత (ఇన్ సెషన్) పద్ధతులను ఉపయోగించదు, బదులుగా క్యాటరాక్ట్ కరిగిపోయే కంప్యూటర్-గైడెడ్ ఫెమ్టోసెకండ్ లేజర్ ద్వారా క్యాటరాక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. |
ధర: ఎఫెక్ట్ అయిన కంటికి సుమారు రూ. 40,000. |
ధర: ఎఫెక్ట్ అయిన కంటికి రూ. 40,000 నుండి రూ. 60,000 |
ధర: ఈ ఆపరేషన్ నూతనమైన మరియు చాలా సాంకేతికతో కూడినది. కాబట్టి ఇది ఇతర ఆపరేషన్ల కంటే ఖరీదైనది. అంటే ఎఫెక్ట్ అయిన కంటికి దాదాపు రూ. 85,000 నుండి 120,000 వరకు ఖర్చు అవుతుంది. |
డిస్‌క్లెయిమర్ (Disclaimer): పైన పేర్కొన్నవి సుమారు ఖర్చులు మాత్రమే. ఇవి ఒక్కో ఆసుపత్రికి, ఒక్కో నగరానికి ఒక్కోలా ఉండవచ్చు.
కో పేమెంట్ |
లేదు |
రూం రెంట్ క్యాపింగ్ |
లేదు |
క్యాష్‌లెస్ హాస్పిటల్స్ |
ఇండియా వ్యాప్తంగా 10500 కంటే ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ |
ఇన్‌బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
అవును |
వెల్నెస్ బెనిఫిట్స్ |
10 కంటే ఎక్కువ వెల్నెస్ పార్ట్నర్ల నుంచి లభ్యం |
సిటీ ద్వారా వచ్చే డిస్కౌంట్ |
10% శాతం వరకు డిస్కౌంట్ |
వరల్డ్‌వైడ్ కవరేజ్ |
అవును* |
గుడ్ హెల్త్ డిస్కౌంట్ |
5% శాతం వరకు డిస్కౌంట్ |
కన్య్సూమబుల్ కవర్ |
యాడ్ ఆన్‌గా అందుబాటులో ఉంది. |
డిజిట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ 'డేకేర్ ప్రొసీజర్స్' కింద క్యాటరాక్ట్ ఆపరేషన్‌ను కవర్ చేస్తుంది. వైద్యరంగంలో సాధించిన పురోగతి కారణంగా 24 గంటలలోపు ఆసుపత్రిలో చేరాల్సిన వైద్య చికిత్సగా ఇది మారింది.
మీరు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే, మాతో బీమా చేయబడి ఉంటే - మీరు ఎలా క్లెయిమ్ చేయవచ్చంటే:
షెడ్యూల్ చేయబడిన ఆపరేషన్, ఆసుపత్రిలో చేరడం గురించి ముందుగానే లేదా చేరిన రెండు రోజులలోపు మాకు తెలియజేయండి. కంటిశుక్లం ఆపరేషన్ సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేయబడుతుంది. కాబట్టి చివరి నిమిషంలో ఏవైనా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే మాకు తెలియజేయడం మంచిది!
మీరు మాకు 1800-258-4242కి కాల్ చేయడం ద్వారా లేదా healthclaims@godigit.com లో ఈ మెయిల్ సమాచారాన్ని అందించవచ్చు. మీకు అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయడానికి మేము మీకు ఒక లింక్‌ను పంపుతాము. ఆపరేషన్ తర్వాత, రీయింబర్స్మెంట్ వీలైనంత త్వరగా అందేలా చూస్తాము.
మీరు నగదు రహిత (క్యాష్‌లెస్) క్లెయిమ్ కోసం వెళ్లాలనుకుంటే, ముందుగా ఇక్కడ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాలనుకుంటున్న నెట్వర్క్ ఆసుపత్రిని ఎంచుకోవచ్చు.
పైన పేర్కొన్న నంబర్ లేదా ఈ మెయిల్లో కనీసం 72-గంటల ముందుగా మాకు తెలియజేయండి.
నెట్వర్క్ హాస్పిటల్ డెస్క్ వద్ద మీ ఈ- హెల్త్ కార్డ్‌ని చూపించండి. క్యాష్‌లెస్ రిక్వెస్ట్ ఫారమ్‌ను అడిగి తీసుకొని నింపండి. అన్నీ బాగుంటే, మీ క్లెయిమ్ అక్కడే ప్రాసెస్ చేయబడుతుంది.