ఆరోగ్య సంజీవని పాలసీ అంటే ఏమిటి?
ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ మొత్తం వరకు అయ్యే మీ వైద్య పరమైన ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ కవరేజీలో ఆస్పత్రిపాలు కావడానికి ముందు, ఆ తర్వాత అయ్యే ఖర్చులు, ఆస్పత్రిలో గది అద్దె (ఉండటానికి, బెడ్ చార్జీలు), ఐసీయూ (ICU) సేవలు, ఇంకా అధునాతన చికిత్సల ఖర్చులు ఉంటాయి.
డిజిట్ అందిస్తున్న ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్‌తో మీరు మీ కుటుంబం మొత్తానికి పనికి వచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కానీ, లేదా మీ ఒక్కరికి మాత్రమే ఉపయోగపడే వ్యక్తిగత (ఇండివిడ్యువల్) పాలసీ కానీ ఎంచుకోవచ్చు.
ఆరోగ్య సంజీవని ఇన్సూరెన్స్ పాలసీ ప్రాముఖ్యత ఏమిటి?
మీరు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలని చూసినపుడు ఆన్లైన్లో ఉన్న అనేక రకాల పాలసీలు మిమ్మల్ని తికమక పెడతాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందరికీ మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఐఆర్డీఏఐ (IRDAI) ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాండర్డ్, బేసిక్ ప్లాన్లను, అదే ప్రయోజనాలతో అందిస్తున్నాయి.
ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మరో ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చే సరికి కస్టమర్లకు అందించే సేవలు, క్యాష్‌లెస్ నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యలో తేడా ఉంటుంది. అంతకు మించి కొన్ని విషయాలు ఒకేలా ఉంటాయి. మనం ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటపుడు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ అనేది చాలా ముఖ్యం. అలాగే, ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం కూడా చాలా ముఖ్యం.
*డిస్‌క్లెయిమర్ – నెలకు రూ. 640 ప్రీమియం అనేది ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని 30 సంవత్సరాల వయసున్న పురుషుడికి రూ. 1 కోటి ఇన్సూరెన్స్ మొత్తం కోసం లెక్కించబడింది. అలాగే, ఈ ప్రీమియం అమౌంట్లో జీఎస్టీ (GST) చేర్చలేదు.
ఆరోగ్య సంజీవని పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి?
ఎందుకంటే భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పాలసీల్లో ఆరోగ్య సంజీవని పాలసీనే అందరికీ అందుబాటు ధరల్లో ఉంది.
కనీసం ఒక బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటమనేది తెలివైన ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడికి ఒక మార్గం వంటిది.
కోవిడ్ వలన ఎక్కువ నష్టపోయిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఈ క్రమంలో కోవిడ్–19తో పాటు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకునేందుకు ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక చౌకైన మార్గం.
డిజిట్ అందించే ఆరోగ్య సంజీవని పాలసీ గొప్పతనం ఏమిటి?
సులభమైన ఆన్‌లైన్ ప్రక్రియలు – మీరు పాలసీని కొనుగోలు చేసే సమయం నుంచి క్లెయిమ్ చేసే దాకా ఇక్కడ ప్రతీదీ సులభంగా, త్వరితంగా, పేపర్‌లెస్‌గా, ఇబ్బంది లేకుండా ఉంటుంది! మరో విషయమేంటంటే ఇక్కడ ఎటువంటి హార్డ్ కాపీలు కూడా అవసరం ఉండదు.
ఇన్సూరెన్స్ చేయగల మొత్తం – మీ అవసరాన్ని బట్టి మీరు మీ ఇన్సూరెన్స్ అమౌంట్‌ను మార్చుకునే సదుపాయం ఉంటుంది.
కరోనా వైరస్ లాంటి మహమ్మారుల నుంచి మిమ్మల్ని కవర్ చేస్తుంది – కోవిడ్-19 వలన ఎక్కువ బాధింపబడిన దేశాలలో మన భారతదేశం కూడా ఒకటి. కాబట్టి మేము ఈ ఆరోగ్య సంజీవని పాలసీలోనే కోవిడ్ చికిత్సను కూడా కవర్ చేస్తున్నాం. కాబట్టి కరోనా వైరస్ కొరకు మరలా మీరు ప్రత్యేకమైన పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
క్యుములేటివ్ బోనస్ – ఆరోగ్యంగా ఉంటూ రివార్డులను పొందండి. మీరు ఎలాంటి క్లెయిమ్‌లు చేయకుండా ఉన్న ప్రతీ సంవత్సరానికి క్యుములేటివ్ బోనస్‌ను పొందండి.
ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు – మా నెట్‌వర్క్‌లో ఉన్న 6400+ ఆస్పత్రుల నుంచి ఏ ఆస్పత్రికైనా వెళ్లి రీయింబర్స్మెంట్ సదుపాయంతో చికిత్స చేసుకునే వెసులుబాటు ఉంది.
తక్కువ కో–పేమెంట్ – హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటపుడు కేవలం 5 శాతం మీరు కో–పేమెంట్‌గా చెల్లిస్తే సరిపోతుంది.
24X7 కస్టమర్ సపోర్ట్ – జాతీయ సెలవు దినాల్లో కూడా మా కాల్ సెంటర్ 24x7 అందుబాటులో ఉంటుంది. కావున మీకు ఎటువంటి సాయం కావాలన్నా కేవలం ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది.
అత్యంత సులువైన క్లెయిములు – మా క్లెయిముల ప్రక్రియ పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది. కాబట్టి, క్లెయిములు చేయడమే కాకుండా వాటిని సెటిల్ చేయడం కూడా సులభంగానే పూర్తవుతుంది.
ఆరోగ్య సంజీవని పాలసీ చార్ట్, క్యాలుక్యులేటర్
డిజిట్ అందిస్తున్న ఆరోగ్య సంజీవని పాలసీలో రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. రూ. 50 వేల గుణకాల్లో ఈ విలువ ఉంటుంది. ఆరోగ్య సంజీవని ప్రీమియం ఏ విధంగా మారుతుందో కింద కొన్ని ఉదాహరణలతో చూపించాం.
ఏజ్ గ్రూప్ | ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం (ఇన్సూరెన్స్ మొత్తం 3 లక్షలు) | ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం (ఇన్సూరెన్స్ మొత్తం 2 కోట్లు) |
18-25 | ₹2,414 | ₹9,642 |
26-30 | ₹2,503 | ₹9,999 |
31-35 | ₹2,803 | ₹11,197 |
36-40 | ₹3,702 | ₹13,333 |
41-45 | ₹4,698 | ₹18,764 |
46-50 | ₹6,208 | ₹24,799 |
51-55 | ₹8,420 | ₹33,633 |
56-60 | ₹11,569 | ₹46,211 |
ఆరోగ్య సంజీవని పాలసీలో ఏమేం కవర్ అవుతాయి?
ఆరోగ్య సంజీవని పాలసీలో కవర్ అయ్యే అత్యాధునిక చికిత్సల జాబితా
ఏమేం కవర్ కావంటే?
- మనం చేసిన మెడికల్ క్లెయిములతో సంబంధం లేని ఆస్పత్రి ఖర్చులు, ఆస్పత్రిలో చేరడానికి ముందు అయిన ఖర్చులు దీనిలో కవర్ కావు.
- స్థూలకాయం, బరువు తగ్గించేందుకు చేయించుకునే సర్జరీలు దీనిలో కవర్ కావు.
- లింగ మార్పిడి చికిత్సలు ఈ పాలసీ కింద కవర్ కావు.
- మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే (ఉదాహరణకు ఏదైనా ప్రమాదం తర్వాత లేదా క్యాన్సర్ చికిత్స తర్వాత చేయించుకునే సర్జరీలు) సరే కానీ అందం మెరుగపరుచుకోవడం కోసం చేయించుకునే ప్లాస్టిక్ సర్జరీలు కవర్ కావు.
- వివిధ రకాల డొమిసిలియరీ కేర్ (ఇంటి వద్ద రోగులు, వృద్ధులకు అందించే సేవలు) సేవలు, ఓపీడీ (OPD) ఖర్చులు కవర్ కావు.
- ఏవైనా నేర పూరిత చర్యలకు సంబంధించిన క్లెయిమ్స్ కవర్ చేయబడవు.
- డ్రగ్స్ వాడకం వలన చేసే చికిత్సలు ఆరోగ్య సంజీవని పాలసీలో కవర్ కావు.
- ప్రమాదకర క్రీడల్లో పాల్గొన్నపుడు ఏదైనా గాయాలయి వైద్య ఖర్చులయితే అవి కవర్ కావు.
- పురుటి సంబంధిత ఖర్చులు ఈ పాలసీలో కవర్ కావు.
- స్టెరిలిటీ, సంతాన సాఫల్య చికిత్సలు కవర్ కావు.
- వైద్యుడి సిఫారసు లేకుండా చేయించుకున్న వైద్య చికిత్సలు కవర్ కావు.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
రీయింబర్స్మెంట్ క్లెయిమ్స్ – మీరు ఏదైనా ప్రమాదంలో గాయపడి, లేదా అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చేరితే 1800-258-4242 అనే నెంబర్‌కు కాల్ చేసి రెండు రోజుల్లో మాకు తెలియజేయండి. లేదా healthclaims@godigit.com అనే మెయిల్ ఐడీకి ఈమెయిల్ చేయండి. మీరు ఆస్పత్రి బిల్లులు, ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేందుకు మేము మీకు ఒక లింక్‌ను పంపుతాం. ఆ లింక్ ద్వారా మీరు కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది.
క్యాష్‌లెస్ క్లెయిమ్స్ – మీకు క్యాష్‌లెస్ క్లెయిమ్ కావాలనుకుంటే మా నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్తే సరిపోతుంది. మా నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాను ఇక్కడ చూడవచ్చు. అక్కడ మీరు మీ ఈ-హెల్త్ కార్డును హెల్ప్ డెస్క్‌లో ఉండే వారికి చూపించి క్యాష్‌లెస్ రిక్వెస్ట్ ఫామ్ అడిగితే సరిపోతుంది. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే మీ క్లెయిమ్ ప్రాసెస్ చేయబడుతుంది.
మీరు కనుక కరోనా వైరస్ గురించి క్లెయిమ్ చేస్తే అప్పుడు మీరు ఐసీఎంఆర్ (ICMR)– నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణే ద్వారా ఆమోదం పొందిన అధీకృత కేంద్రం నుంచి ఇచ్చిన పాజిటివ్ రిపోర్టును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఆరోగ్య సంజీవని పాలసీ ముఖ్యమైన ఫీచర్లు
ఇన్సూరెన్స్ చేసిన మొత్తం | రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు |
---|---|
కో–పేమెంట్ | 5% తప్పనిసరి కో–పేమెంట్ |
ప్రీమియం | సంవత్సరానికి రూ. 2414 నుంచి ప్రారంభం. |
రూమ్ రెంట్ పరిమితి | మీరు ఇన్సూరెన్స్ చేసిన మొత్తంలో 2 శాతం (రూ. 5,000 వరకు) |
క్యుములేటివ్ బోనస్ | మీరు క్లెయిమ్ చేయని ప్రతీ సంవత్సరానికి మీరు ఇన్సూరెన్స్ చేసిన మొత్తంలో 5% అదనంగా పొందండి |
క్లెయిమ్ ప్రక్రియ | డిజిటల్ ఫ్రెండ్లీ, ఎటువంటి హార్డ్ కాపీలు అవసరం లేదు. |
అందుబాటులో ఉన్న ఎంపికలు | ఫ్యామిలీ ఫ్లోటర్, వ్యక్తిగత పాలసీ |
ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సాధారణ ప్రయోజనాలు
ఈ పాలసీని మీరు జీవితాంతం పునరుద్ధరించుకోవచ్చు. 18 నుంచి 65 సంవత్సరాల లోపు వారెవరైనా సరే ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైన సరే మీరు సరైన సమయానికి పునరుద్ధరించుకుంటే సరిపోతుంది.
ఐఆర్డీఏఐ (IRDAI) ద్వారా నిర్దేశించబడిన బేసిక్ స్టాండర్డ్ పాలసీ ఇది. మీకు మార్కెట్లో లభించే ఇతర ఇన్సూరెన్స్ పాలసీలతో పోల్చి చూసుకుంటే ఆరోగ్య సంజీవని హెల్త్ పాలసీ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.
ప్రతీ హెల్త్ పాలసీ ఎంతో కొంత కో–పేమెంట్ నిబంధనను కలిగి ఉంటుంది. అది ఒక్కో ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కోలా ఉంటుంది. కొన్ని పాలసీలు 10, 20 శాతం కో–పేమెంట్‌ను కలిగి ఉంటాయి. కొన్ని పాలసీలకు అసలు కో–పేమెంట్ చేయాల్సి అవసరమే ఉండదు. కానీ ఈ ఆరోగ్య సంజీవని ప్లాన్‌కు మీరు 5 శాతం కో–పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే పాలసీని క్లెయిమ్ చేసే సమయంలో మీరు మీ జేబు నుంచి 5 శాతం ఖర్చులను భరించాల్సి ఉంటుంది.
గో డిజిట్ (Go Digit) జనరల్ ఇన్సూరెన్స్ అందిస్తున్న ఆరోగ్య సంజీవని పాలసీలో రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అవి 1. వ్యక్తిగత పాలసీ (ఒక పాలసీ ఒక్కరికి మాత్రమే) 2. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ (మొత్తం కుటుంబానికి కలిపి ఒకే హెల్త్ పాలసీ).
ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల మొత్తం వరకు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.
ఆరోగ్య సంజీవని ప్లాన్‌ను ఎవరు కొనుగోలు చేయాలి?
ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రస్తుతం ఉన్న అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కెల్లా మెరుగైనది. మీరు ప్రస్తుతం యుక్త వయస్సులో ఉండి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఇదే మొదటిసారి అయితే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయిన ఆరోగ్య సంజీవని ప్లాన్‌ను తీసుకోవడం చాలా ఉత్తమం. రూ. 5 లక్షల కంటే ఎక్కువగా కూడా మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి వీలుంటుంది. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం రాదు.
కోవిడ్-19 భయం వలన ఎక్కువ మంది ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్‌ల వైపు చూస్తున్నారు. తమకు కావాల్సిన పాలసీలో కరోనా కూడా కవర్ కావాలని వారు కోరుకుంటున్నారు. మీరు కూడా అటువంటి పాలసీ కోసమే వెతుకుతుంటే ఆరోగ్య సంజీవని పాలసీ ఉత్తమ ఎంపిక. ఈ పాలసీలో కోవిడ్-19 వ్యాధి కూడా కవర్ అవుతుంది. వివిధ రకాల జబ్బులు ఎలా కవర్ అవుతాయో కోవిడ్-19 కూడా అలాగే కవర్ అవుతుంది. మీరు దాని కోసం అదనపు మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. ఈ పాలసీలో మరో విషయం ఏమిటంటే ఈ పాలసీని జీవితాంతం పునరుద్ధరించుకోవచ్చు. మిగతా కోవిడ్-19 పాలసీలు కొన్ని నెలల వరకే పనిచేస్తాయి.
మీరు మీ కుటుంబాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ సాయంతో సంరక్షించాలని భావిస్తుంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కు అధికంగా ఖర్చు చేసేందుకు ఇష్టపడకపోతే మీకు ఈ పాలసీ సరిగ్గా నప్పుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.
ఆన్లైన్లో ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కొనుగోలు చేయాలి?
ఆన్లైన్లో ఆరోగ్య సంజీవని పాలసీని కొనుగోలు చేయడం 123 అనే అంకెలు లెక్కబెట్టినంత సులభం.
- స్టెప్ 1 : డిజిట్ కంపెనీ వెబ్సైట్ కానీ, మొబైల్ యాప్ కానీ తెరిచి ఆరోగ్య సంజీవని పేజ్‌ను సందర్శించాలి. అక్కడ మీ మొబైల్ నంబర్, పిన్ కోడ్ నమోదు చేస్తే సరిపోతుంది.
- స్టెప్ 2 : కొన్ని రకాల తప్పనిసరైన వివరాలను అక్కడ నమోదు చేస్తే సరిపోతుంది. పుట్టిన తేదీ, ఎంత మొత్తానికి మీరు ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నారో ఆ మొత్తం, కనీస ఆరోగ్య వివరాలు, సంప్రదింపు వివరాలు మొదలగునవి.
- స్టెప్ 3 : ఒకసారి మీరు ఈ సమాచారాన్ని అందించిన వెంటనే మీకు తుది కొటేషన్ తెలియజేయబడుతుంది. అనంతరం మీరు ముందుకు సాగేందుకు వీలుంటుంది. మీరు తుది అమౌంట్‌ను సెటిల్ చేస్తే మీ పాలసీ పూర్తవుతుంది.
మీ పాలసీలను పునరుద్ధరించుకోవడం ఇంకా సులభం. మీరు చేయాల్సిందల్లా మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌తో సైన్–ఇన్ అయి (పాలసీ వివరాలతోనైనా) మీ వివరాలను సరిచూసుకుని డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.
గో డిజిట్ అందిస్తున్న ఆరోగ్య సంజీవని ప్లాన్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కరోనా వైరస్ చికిత్స కవర్ అవుతుందా?
అవును. కవర్ అవుతుంది. కరోనా వైరస్ అనేది హాస్పిటలైజేషన్ ప్రయోజనం కింద కవర్ అవుతుంది.
గో డిజిట్ అందించే ఆరోగ్య సంజీవని ప్లాన్‌ను ఎవరెవరు కొనుగోలు చేయొచ్చు?
18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న ఎవరైనా సరే ఆరోగ్య సంజీవని పాలసీని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.
గో డిజిట్ అందజేసే ఆరోగ్య సంజీవని హెల్త్ పాలసీలో ఇన్సూరెన్స్ చేయగల గరిష్ట మొత్తం ఎంత?
గో డిజిట్ అందజేసే ఆరోగ్య సంజీవని పాలసీ కింద మీరు రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఇన్సూరెన్స్ చేసేందుకు వీలుంటుంది.
ఆరోగ్య సంజీవని పాలసీలో వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలలో గల తేడా ఏమిటి?
డిజిట్ అందజేసే ఆరోగ్య సంజీవని పాలసీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్. మరొకటి వ్యక్తిగత పాలసీ. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌కు ఇన్సూరెన్స్ చేయగల గరిష్ట మొత్తం రూ. 2 కోట్లు కాగా, వ్యక్తిగత పాలసీకి రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు మీరు ఎంతకైనా చేసుకోవచ్చు.
ఆరోగ్య సంజీవని పాలసీలో ఏమైనా వెయింటింగ్ పీరియడ్ ఉంటుందా?
అవును, ఉంటుంది. ఈ పాలసీలో వెయిటింగ్ పీరియడ్ అనేది జబ్బును బట్టి మారుతూ ఉంటాయి. వివిధ రకాల వ్యాధులను బట్టి 24 నుంచి 48 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ ముగిసన తర్వాతనే మీరు అన్ని రకాల వ్యాధులకు కవర్ చేయబడతారు.
నాకు ఇది వరకే ఉన్న ఆరోగ్య పాలసీని గో డిజిట్ ఆరోగ్య సంజీవని పాలసీకి మార్చుకోవచ్చా?
అవును. మీరు మార్చుకునేందుకు వీలుంది.
ఈ పాలసీలో క్లెయిమ్స్ చేసేటపుడు నేనేమైనా ఖర్చులను భరించాలా?
అవును. నియమాల ప్రకారం మీరు ఆరోగ్య సంజీవని పాలసీని క్లెయిమ్ చేసేటపుడు 5 శాతం కో–పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
ఆరోగ్య సంజీవని పాలసీలో రూమ్ రెంట్ పరిమితి ఉంటుందా?
అవును, ఉంటుంది. మీకు రూమ్ రెంట్ చార్జీలుగా ఇన్సూరెన్స్ చేసిన మొత్తం విలువలో 2 శాతం అందజేస్తారు. గరిష్టంగా రోజుకు రూ. 5 వేలు మాత్రమే. ఇది చాలా పెద్ద అమౌంట్. మీకు ఈ ధరలో చాలా మంచి గదులు దొరుకుతాయి.
ఈ పాలసీలో కవరేజీలను పొడిగించుకునే అవకాశం ఉందా?
లేదు. ఆరోగ్య సంజీవని ప్లాన్ అనేది సాధారణ ప్రయోజనాలతో వస్తుంది. ఇందులో ఎటుంటి యాడ్-ఆన్స్ ఉండవు.
నేను నా ఇన్సూరెన్స్ చేయగల మొత్తాన్నిపెంచుకోవచ్చా?
ఆరోగ్య సంజీవని పాలసీ నిబంధనల ప్రకారం మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ మొత్తం విలువ రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల మధ్యలోనే ఉండాలి.
తప్పనిసరి కో–పేమెంట్‌ను చెల్లించాల్సిందేనా?
అవును, ఆరోగ్య సంజీవని పాలసీ నియమ నిబంధనల ప్రకారం, క్లెయిమ్‌ల సమయంలో 5% తప్పనిసరి కో–పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
డిజిట్ అందజేసే ఆరోగ్య సంజీవని పాలసీ కాల వ్యవధి ఎంత?
డిజిట్ ఆరోగ్య సంజీవని పాలసీ కాల వ్యవధి 1 సంవత్సరం ఉంటుంది. ఆ తర్వాత కూడా మీరు అదే పాలసీని కొనసాగించాలనుకుంటే మీరు మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు.
గో డిజిట్ అందజేసే ఆరోగ్య సంజీవని పాలసీకి వయో పరిమితి ఏంటి?
18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసున్న ప్రతీ ఒక్కరు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో ఉన్న పిల్లలు 3 నెలల వయసు నుంచి 25 సంవత్సరాల వయసు వరకు ఉంటారు. పాలసీ పునరుద్ధరించుకునేందుకు ఎటువంటి వయో పరిమితి అవసరం లేదు.