ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్
High
Sum Insured
Affordable
Premium
24/7
Customer Support
High
Sum Insured
Affordable
Premium
24/7
Customer Support
ఆరోగ్య సంజీవని పాలసీ అంటే ఏమిటి?
ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ మొత్తం వరకు అయ్యే మీ వైద్య పరమైన ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ కవరేజీలో ఆస్పత్రిపాలు కావడానికి ముందు, ఆ తర్వాత అయ్యే ఖర్చులు, ఆస్పత్రిలో గది అద్దె (ఉండటానికి, బెడ్ చార్జీలు), ఐసీయూ (ICU) సేవలు, ఇంకా అధునాతన చికిత్సల ఖర్చులు ఉంటాయి.
డిజిట్ అందిస్తున్న ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్‌తో మీరు మీ కుటుంబం మొత్తానికి పనికి వచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కానీ, లేదా మీ ఒక్కరికి మాత్రమే ఉపయోగపడే వ్యక్తిగత (ఇండివిడ్యువల్) పాలసీ కానీ ఎంచుకోవచ్చు.
ఆరోగ్య సంజీవని ఇన్సూరెన్స్ పాలసీ ప్రాముఖ్యత ఏమిటి?
మీరు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలని చూసినపుడు ఆన్లైన్లో ఉన్న అనేక రకాల పాలసీలు మిమ్మల్ని తికమక పెడతాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందరికీ మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఐఆర్డీఏఐ (IRDAI) ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాండర్డ్, బేసిక్ ప్లాన్లను, అదే ప్రయోజనాలతో అందిస్తున్నాయి.
ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మరో ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చే సరికి కస్టమర్లకు అందించే సేవలు, క్యాష్‌లెస్ నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యలో తేడా ఉంటుంది. అంతకు మించి కొన్ని విషయాలు ఒకేలా ఉంటాయి. మనం ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటపుడు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ అనేది చాలా ముఖ్యం. అలాగే, ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం కూడా చాలా ముఖ్యం.
*డిస్‌క్లెయిమర్ – నెలకు రూ. 640 ప్రీమియం అనేది ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని 30 సంవత్సరాల వయసున్న పురుషుడికి రూ. 1 కోటి ఇన్సూరెన్స్ మొత్తం కోసం లెక్కించబడింది. అలాగే, ఈ ప్రీమియం అమౌంట్లో జీఎస్టీ (GST) చేర్చలేదు.
ఆరోగ్య సంజీవని పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి?
డిజిట్ అందించే ఆరోగ్య సంజీవని పాలసీ గొప్పతనం ఏమిటి?
ఆరోగ్య సంజీవని పాలసీ చార్ట్, క్యాలుక్యులేటర్
డిజిట్ అందిస్తున్న ఆరోగ్య సంజీవని పాలసీలో రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. రూ. 50 వేల గుణకాల్లో ఈ విలువ ఉంటుంది. ఆరోగ్య సంజీవని ప్రీమియం ఏ విధంగా మారుతుందో కింద కొన్ని ఉదాహరణలతో చూపించాం.
ఏజ్ గ్రూప్ |
ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం (ఇన్సూరెన్స్ మొత్తం 3 లక్షలు) |
ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం (ఇన్సూరెన్స్ మొత్తం 2 కోట్లు) |
18-25 |
₹2,414 |
₹9,642 |
26-30 |
₹2,503 |
₹9,999 |
31-35 |
₹2,803 |
₹11,197 |
36-40 |
₹3,702 |
₹13,333 |
41-45 |
₹4,698 |
₹18,764 |
46-50 |
₹6,208 |
₹24,799 |
51-55 |
₹8,420 |
₹33,633 |
56-60 |
₹11,569 |
₹46,211 |
ఆరోగ్య సంజీవని పాలసీలో ఏమేం కవర్ అవుతాయి?
ఆరోగ్య సంజీవని పాలసీలో కవర్ అయ్యే అత్యాధునిక చికిత్సల జాబితా
నేడు వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది. అందుకే కింద పేర్కొన్న అత్యాధునిక చికిత్సలు కూడా ఆరోగ్య సంజీవని పాలసీలో కవర్ అవుతాయి. (ఇన్సూరెన్స్ చేసిన మొత్తంలో 50% వరకు)
యుటెరైన్ ఆర్థరీ (గర్భాశయ ధమని) ఎంబోలైజేషన్, హెచ్ఐఎఫ్యూ (HIFU) (హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్)
బెలూన్ సినూప్లాస్టీ
డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్
ఓరల్ కీమోథెరపీ
ఇమ్యునోథెరపీ: మోనోక్లోనల్ యాంటీబాడీని ఇంజెక్షన్‌గా ఇస్తారు
ఇంట్రా విటెరల్ ఇంజెక్షన్స్
రోబోటిక్ సర్జరీలు
స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీలు
బ్రోన్చియల్ థర్మోప్లాస్టీ
ప్రోస్టేట్ వాపోరైజేషన్ (గ్రీన్ లేసర్ చికిత్స లేదా హొలీమియమం చికిత్స)
ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్
స్టెమ్ సెల్ థెరపీ: రక్త సంబంధిత సమస్యలు ఏర్పడితే ఎముక మజ్జ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్‌ను ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది.
ఏమేం కవర్ కావంటే?
- మనం చేసిన మెడికల్ క్లెయిములతో సంబంధం లేని ఆస్పత్రి ఖర్చులు, ఆస్పత్రిలో చేరడానికి ముందు అయిన ఖర్చులు దీనిలో కవర్ కావు.
- స్థూలకాయం, బరువు తగ్గించేందుకు చేయించుకునే సర్జరీలు దీనిలో కవర్ కావు.
- లింగ మార్పిడి చికిత్సలు ఈ పాలసీ కింద కవర్ కావు.
- మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే (ఉదాహరణకు ఏదైనా ప్రమాదం తర్వాత లేదా క్యాన్సర్ చికిత్స తర్వాత చేయించుకునే సర్జరీలు) సరే కానీ అందం మెరుగపరుచుకోవడం కోసం చేయించుకునే ప్లాస్టిక్ సర్జరీలు కవర్ కావు.
- వివిధ రకాల డొమిసిలియరీ కేర్ (ఇంటి వద్ద రోగులు, వృద్ధులకు అందించే సేవలు) సేవలు, ఓపీడీ (OPD) ఖర్చులు కవర్ కావు.
- ఏవైనా నేర పూరిత చర్యలకు సంబంధించిన క్లెయిమ్స్ కవర్ చేయబడవు.
- డ్రగ్స్ వాడకం వలన చేసే చికిత్సలు ఆరోగ్య సంజీవని పాలసీలో కవర్ కావు.
- ప్రమాదకర క్రీడల్లో పాల్గొన్నపుడు ఏదైనా గాయాలయి వైద్య ఖర్చులయితే అవి కవర్ కావు.
- పురుటి సంబంధిత ఖర్చులు ఈ పాలసీలో కవర్ కావు.
- స్టెరిలిటీ, సంతాన సాఫల్య చికిత్సలు కవర్ కావు.
- వైద్యుడి సిఫారసు లేకుండా చేయించుకున్న వైద్య చికిత్సలు కవర్ కావు.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
ఆరోగ్య సంజీవని పాలసీ ముఖ్యమైన ఫీచర్లు
ఇన్సూరెన్స్ చేసిన మొత్తం |
రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు |
కో–పేమెంట్ |
5% తప్పనిసరి కో–పేమెంట్ |
ప్రీమియం |
సంవత్సరానికి రూ. 2414 నుంచి ప్రారంభం. |
రూమ్ రెంట్ పరిమితి |
మీరు ఇన్సూరెన్స్ చేసిన మొత్తంలో 2 శాతం (రూ. 5,000 వరకు) |
క్యుములేటివ్ బోనస్ |
మీరు క్లెయిమ్ చేయని ప్రతీ సంవత్సరానికి మీరు ఇన్సూరెన్స్ చేసిన మొత్తంలో 5% అదనంగా పొందండి |
క్లెయిమ్ ప్రక్రియ |
డిజిటల్ ఫ్రెండ్లీ, ఎటువంటి హార్డ్ కాపీలు అవసరం లేదు. |
అందుబాటులో ఉన్న ఎంపికలు |
ఫ్యామిలీ ఫ్లోటర్, వ్యక్తిగత పాలసీ |
ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సాధారణ ప్రయోజనాలు
ఆరోగ్య సంజీవని ప్లాన్‌ను ఎవరు కొనుగోలు చేయాలి?
ఆన్లైన్లో ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కొనుగోలు చేయాలి?
ఆన్లైన్లో ఆరోగ్య సంజీవని పాలసీని కొనుగోలు చేయడం 123 అనే అంకెలు లెక్కబెట్టినంత సులభం.
- స్టెప్ 1 : డిజిట్ కంపెనీ వెబ్సైట్ కానీ, మొబైల్ యాప్ కానీ తెరిచి ఆరోగ్య సంజీవని పేజ్‌ను సందర్శించాలి. అక్కడ మీ మొబైల్ నంబర్, పిన్ కోడ్ నమోదు చేస్తే సరిపోతుంది.
- స్టెప్ 2 : కొన్ని రకాల తప్పనిసరైన వివరాలను అక్కడ నమోదు చేస్తే సరిపోతుంది. పుట్టిన తేదీ, ఎంత మొత్తానికి మీరు ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నారో ఆ మొత్తం, కనీస ఆరోగ్య వివరాలు, సంప్రదింపు వివరాలు మొదలగునవి.
- స్టెప్ 3 : ఒకసారి మీరు ఈ సమాచారాన్ని అందించిన వెంటనే మీకు తుది కొటేషన్ తెలియజేయబడుతుంది. అనంతరం మీరు ముందుకు సాగేందుకు వీలుంటుంది. మీరు తుది అమౌంట్‌ను సెటిల్ చేస్తే మీ పాలసీ పూర్తవుతుంది.
మీ పాలసీలను పునరుద్ధరించుకోవడం ఇంకా సులభం. మీరు చేయాల్సిందల్లా మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌తో సైన్–ఇన్ అయి (పాలసీ వివరాలతోనైనా) మీ వివరాలను సరిచూసుకుని డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.