జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారండి
Work
in spare time
Earn
side income
FREE
training by Digit
జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఎవరు?
భారతదేశంలో జనరల్ ఇన్సూరెన్స్ రంగం గురించి ఆసక్తికర విషయాలు
డిజిట్‌తోనే ఎందుకు నేను జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారాలి?
మీరు ఎందుకోసం ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారాలి? డిజిట్‌ను ఎందుకు ఎంచుకోవాలనే విషయాలను గురించి మరింతగా తెలుసుకోండి.
ఆన్లైన్లో ఇన్సూరెన్స్ ఏజెంట్ అవడం ఎలా?
ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారేందుకు సులభమైన మార్గం పీవోఎస్‌పీ (POSP) సర్టిఫికేషన్ పూర్తి చేయడం. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) అనే పేరును ఇన్సూరెన్స్ ఏజెంట్‌కి కంపెనీ ఇచ్చిందంటే అతడు ఇన్సూరెన్స్ ప్రొడక్టులను అమ్మేందుకు అర్హత కలిగి ఉంటాడు.
పీవోఎస్‌పీ (POSP)గా మారేందుకు మీకు కొన్ని కనీస విద్యార్హతలు అవసరం. ఐఆర్‌డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం మీరు తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా, శిక్షణా కార్యక్రమాన్ని కూడాపూర్తి చేయాలి. మీ శిక్షణ కాలం గురించి ఎటువంటి చింత అవసరం లేదు. డిజిట్ అంతా చూసుకుంటుంది.
ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి కావాల్సిన అర్హతలు ఏంటి?
మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి ఏం కావాలంటే..
- మీకు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి
- కనీసం మీరు పదో తరగతి అయినా ఉత్తీర్ణులు అయి ఉండాలి
- మీకు సరైన ఆధార్ కార్డు, పాన్ (PAN) కార్డు ఉండాలి
- ఐఆర్‌డీఏఐ (IRDAI) అందించే 15 గంటల శిక్షణా కార్యక్రమాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి.
మీరు తెలుసుకోవాల్సినవి నేర్చుకోవడంలో మేము మీకు సాయం చేస్తామని హామీ ఇస్తున్నాము!
ఎవరు ఇన్సూరెన్స్ ఏజెంట్ కావచ్చు?
ఇన్సూరెన్స్ ఏజెంట్ అయ్యేందుకు మీరు కేవలం 18 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
పదో తరగతి ఉత్తీర్ణులైన ఎవరైనా సరే ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మడానికి అర్హులే. అలాగే, వారు సర్టిఫైడ్ పీవోఎస్‌పీ (POSP) ఏజెంట్‌గా మారొచ్చు. ఈ పనిని కళాశాల విద్యార్థులు, ఇంట్లో ఉండే గృహిణులు, పదవీ విరమణ పొందినవారు, వ్యాపారవేత్తలు ఇలా ఎవరైనా సరే చేయించొచ్చు.
డిజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడమెలా?
స్టెప్ 1
మా పీవోఎస్‌పీ (POSP) ఫామ్ నింపి సంతకం చేస్తే సరిపోతుంది. అన్ని రకాల వివరాలను నింపి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
స్టెప్ 2
మీ 15 గంటల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి.
స్టెప్ 3
సూచించిన పరీక్షను విజయవంతంగా రాయండి.
స్టెప్ 4
మాతో అగ్రిమెంట్ మీద సంతకం చేస్తే సరిపోతుంది. మీరు సర్టిఫైడ్ పీవోఎస్‌పీ (POSP)గా మారొచ్చు.
నేను జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఎందుకు మారాలి?
తరచూ అడిగే ప్రశ్నలు