హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్/ POSP (పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్) అంటే ఎవరు?
హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి పని చేస్తూ ఉంటాడు. ఆరోగ్య సంబంధిత ఇన్సూరెన్స్ ప్రొడక్టులను విక్రయిస్తాడు. తమకు అవసరమైన హెల్త్ పాలసీని కస్టమర్లు తీసుకునేలా ఏజెంట్లు సాయం చేస్తారు.
డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు వ్యక్తులకు, కుటుంబాలకు మేలు చేసే హెల్త్ పాలసీలను విక్రయించే అవకాశం ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
అనుకోని సందర్భాల్లో మనకు ఎదురయ్యే వైద్యపరమైన ఖర్చుల నుంచి కాపాడేవే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు. ఇవి ఉంటే మనం ఆర్థికంగా నష్టపోకుండా ఉంటాం. ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తి ఒకవేళ జబ్బు పడినా లేదా ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరినా చికిత్సకు అయ్యే ఖర్చులను ఈ పాలసీలు భరిస్తాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ భారతదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న మార్కెట్. మన దేశంలోని 1.3 బిలియన్ల మందికి ఇది అవసరమైనప్పటికీ, అందులో కేవలం 20 శాతం మందికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి.
*డిస్క్లైమర్ (Disclaimer) – ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ప్రత్యేక కేటగిరీ అంటూ ఏమీ ఉండదు. మీరు జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా నమోదు చేసుకుంటే అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించాల్సి ఉంటుంది.
భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం గురించిన ఆశ్చర్యకరమైన విషయాలు
మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2018లో ఈ రంగం 24 శాతం వృద్ధి రేటు సాధించింది.(1)
ఆర్థిక సంవత్సరం–2020లో భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు దాదాపు రూ. 40.17 లక్షల కోట్లను ప్రీమియంల కింద ఆదాయంగా పొందాయి. (డిసెంబర్ 2019 వరకు). (2)
భారతదేశ జనాభాలో కేవలం 20 శాతం మంది మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రంగం ఇంకా చాలా వృద్ధి చెందే అవకాశం ఉంది. (3)
డిజిట్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్/పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) ఎందుకు కావాలి?
హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఎందుకు కావాలో, డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీనే ఎందుకు ఎంచుకోవాలో మరింత తెలుసుకోండి.
మీరు డిజిట్ కంపెనీ పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్ (POSP)గా నేరుగా పనిచేయండి. ఇందులో ఇతరుల ప్రమేయం ఉండదు. ప్రస్తుతం డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. 2019వ సంవత్సరానికి డిజిట్ ఆసియా యొక్క జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అవార్డును గెలుచుకుంది. స్థాపించిన తక్కువ సమయంలోనే ఈ అవార్డును గెలుచుకున్న కంపెనీగా డిజిట్ కొత్త రికార్డును సృష్టించింది.
మేము ఇన్సూరెన్స్ పాలసీ సులభంగా పూర్తయ్యేలా చూస్తాం. అందుకే మా డాక్యుమెంట్లు చాలా సులభంగా అర్థమవుతాయి. 15 సంవత్సరాల వయసు వారు కూడా ఈ డాక్యుమెంట్లలోని విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు.
టెక్నాలజీనే మా ప్రధాన బలం. అందుకే మేము 24x7 సపోర్ట్‌ను అందిస్తాం. అంతేకాకుండా ఎన్నో అధునాతన ఫీచర్లతో మొబైల్, వెబ్ యాప్‌లను కూడా అందుబాటులోకి తెచ్చాం.
కస్టమర్ల సంతృప్తే మాకు ముఖ్యం. అందుకే మేము మా కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాం. మా కంపెనీకి ఫేస్బుక్లో 4.8/5 రేటింగ్ ఉంది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంత ఎక్కువ రేటింగ్ లేదు.
మా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎయిమ్స్ (AIIMs) మాజీ డైరెక్టర్ డా. ఎం.సి.మిశ్రా సహాయంతో రూపొందించాం.
మేము ప్రైవేటు కార్ల విషయంలో అత్యధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను కలిగి ఉన్నాం. అంతేకాకుండా హెల్త్ పాలసీలకు వచ్చిన 93 శాతం క్లెయిమ్స్‌ను మేము సెటిల్ చేశాం.
దేశవ్యాప్తంగా మాకు 5900కు పైగా నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో చికిత్స చేయించుకున్న మా కస్టమర్లు క్యాష్‌లెస్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ సౌలభ్యాన్ని పొందవచ్చు. దీని వలన ఎలాంటి చింత లేకుండా చికిత్స చేయించుకోవచ్చు
మా పాలసీ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. మీరు పాలసీ కొనుగోలు చేసినప్పటి నుంచి క్లెయిమ్ వరకు మొత్తం ఆన్లైన్లోనే పూర్తవుతుంది. మీరు ఎటువంటి పేపర్ వర్క్ చేసే అవసరం ఉండదు. మీరు ఇందుకోసం కేవలం స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌తో పాటు మంచి ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉంటే సరిపోతుంది. కావున మీరు ఎక్కడినుంచైనా కానీ పూర్తి చేసుకోవచ్చు.
కమిషన్ విషయంలో మీరు కంగారు చెందాల్సిన అవసరం ఉండదు. మీరు పాలసీ జారీ చేసిన వెంటనే మీ కమిషన్ అమౌంట్ మీ బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. ప్రతీ 15 రోజులకోసారి మీకు కమిషన్ అమౌంట్ అందుతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్/పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) కావడమెలా?
ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడం కోసం సులభమైన మార్గం పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) సర్టిఫికేషన్ కోర్సును పూర్తి చేయడం. POSP సర్టిఫికెట్ మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారేందుకు సహాయం చేస్తుంది.
POSPగా మారేందుకు కనీస విద్యార్హతలు ఉండాలని భారతీయ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (IRDAI) సూచించింది. డిజిట్ కంపెనీ మీ శిక్షణ ప్రక్రియ గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది. కావున మీరు నిశ్చింతగా ఉండొచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారేందుకు ఎటువంటి అర్హతలు ఉండాలనేవి కింద వివరించబడ్డాయి.
- మీకు తప్పనిసరిగా 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండాలి
- మీరు కనీసం పదో తరగతి వరకైనా చదివి ఉండాలి
- మీకు సరైన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలి
- IRDAI సూచించే 15 గంటల శిక్షణా కాలాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి.
ఈ ప్రక్రియలో అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తామని మేము హామీ ఇస్తున్నాం.
ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావొచ్చు?
ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడం కోసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. పదో తరగతి పాసై ఉండాలి.
ఈ అర్హతలున్న వ్యక్తులు ఎవరైనా సరే ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారొచ్చు. కాలేజీ విద్యార్థులు, గృహిణులు, ఇంట్లో ఉండేవారు, పదవీ విరమణ పొందినవారు, వ్యాపారస్తులు కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా మారే అవకాశం ఉంది.
డిజిట్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్/పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) కావడమెలా?
స్టెప్ 1
పైన ఉన్న మా POSP ఫామ్‌ను నింపి అందులో మీ సరైన వివరాలు, సరైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
స్టెప్ 2
15 గంటల మీ శిక్షణ కాలాన్ని పూర్తి చేయండి.
స్టెప్ 3
పరీక్షను పూర్తి చేయండి.
స్టెప్ 4
మేము అందజేసే అగ్రిమెంట్ మీద మీరు సంతకం చేస్తే చాలు. సర్టిఫైడ్ POSPగా గుర్తింపు పొందుతారు.
మీరు ఎంత సంపాదించొచ్చు?
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా చేరిన తర్వాత ఎంత సంపాదిస్తున్నారనేది మీరు చేసే పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఆదాయం సంపాదించేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌కు అవకాశం ఉంటుంది. వైద్య చికిత్సల ఖర్చు పెరుగుతుండటమే ఇందుకు కారణం.
మనకు ఎటువంటి చికిత్స కావాలన్నా ప్రస్తుత రోజుల్లో అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కావున మనం ఖర్చుల బారి నుంచి బయటపడేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. వైద్య ఖర్చులను ఇవి కవర్ చేస్తాయి.
ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కమిషన్ రూపంలో ఎంత సంపాదిస్తాడనేది కింద పూర్తిగా ఇవ్వబడింది. దీన్ని చూస్తే మీకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
మంత్లీ నెట్ ప్రీమియం | కమిషన్ & నెట్ ప్రీమియం మీద కమిషన్ పర్సంటేజ్ | ఆరోగ్య సంజీవని |
<25K | సంవత్సరానికి - 25% | రెండు సంవత్సరాలకు - 23% | 3 సంవత్సరాలకు - 22% | 15% |
25 వేలు అంతకన్నా ఎక్కువ & 50 వేల కన్నా తక్కువ | సంవత్సరానికి - 28% | రెండు సంవత్సరాలకు - 26% | 3 సంవత్సరాలకు - 25% | 15% |
50 వేల కంటే ఎక్కువ & లక్ష కన్నా తక్కువ | సంవత్సరానికి - 30% | రెండు సంవత్సరాలకు - 28% | 3 సంవత్సరాలకు - 26% | 15% |
లక్ష రూపాయల కన్నా ఎక్కువ | సంవత్సరానికి - 35% | రెండు సంవత్సరాలకు - 30% | 3 సంవత్సరాలకు - 28% | 15% |
షరతులు:
- నెలకు రెండుసార్లు పేమెంట్ లభిస్తుంది.
- మీరు పాలసీ చేసిన తేదీ మాత్రమే నెలను నిర్ధారిస్తుంది.
- వేర్వేరు స్లాబ్లకు పేమెంట్ వేర్వేరుగా ఉంటుంది.
- నియమ నిబంధనలు వర్తిస్తాయి. రెగ్యులేషన్ సూచించిన గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.
- నికర ప్రీమియం అనేది జీఎస్టీ (GST)ని మినహాయించి ఉంటుంది.
నేను ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారాలి?
పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) కావడం వలన ప్రధాన లాభం ఏంటంటే మీకు నచ్చిన సమయంలో పని చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు మీరే బాస్‌గా ఉండొచ్చు. మిమ్మల్ని ఆదేశించే వారు ఎవరూ ఉండరు.
మీరు ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ మీకు ఇష్టం వచ్చిన విధంగా పని చేసుకోవచ్చు.
డిజిట్ ఇన్సూరెన్స్‌లో మేము ఎక్కువ పాలసీలను ఆన్లైన్లోనే చేస్తాం. కావున ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇంటి వద్ద ఉండే పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇలా మీకు ఎక్కువగా సౌకర్యవంతంగా ఉంటుంది.
పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP)గా గుర్తింపు పొందేందుకు మీరు 15 గంటల శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణ IRDAI ఆధ్వర్యంలో ఉంటుంది. కేవలం మీరు 15 గంటలు మాత్రమే కేటాయించి పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్‌గా మారొచ్చు
మీరు సంపాదించే మొత్తం మీరు ఎన్ని గంటలు పని చేశారనే విషయం మీద ఆధారపడకుండా, మీరు ఎన్ని పాలసీలు చేశారనే దానిపై ఆధారపడుతుంది. ఈ విషయం గురించి మరింత విపులంగా అర్థం చేసుకునేందుకు మా ఆదాయ క్యాలుక్యులేటర్‌ను ఒక్కసారి చూస్తే సరిపోతుంది. ఒక్క పాలసీని విక్రయించడం వలన మీకు ఎంత మొత్తం వస్తుందనే విషయాలు తెలుస్తాయి.
మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారేందుకు ఎటువంటి డబ్బును పెట్టుబడి పెట్టనవసరం లేదు. ఇందుకోసం కేవలం ఒక స్మార్ట్ ఫోన్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్, 15 గంటల శిక్షణ సమయం మాత్రమే సరిపోతుంది. మీరు ఒక్కసారి పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్‌గా ఎంపికైతే మీ ఆదాయం స్థాయులు కూడా పెరుగుతాయి.
తరచూ అడిగే ప్రశ్నలు
నేను POS పర్సన్‌గా ఇంటి దగ్గరి నుంచి పని చేయొచ్చా?
డిజిట్ ఇన్సూరెన్స్‌లో మేము ఎక్కువగా పాలసీలను ఆన్లైన్లోనే అమ్ముతాం. మీరు POSP గా డిజిట్‌తో పని చేస్తే ఇంటి వద్ద ఉండే పాలసీలను విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. పాలసీలలో ఎటువంటి సమస్యలున్నా మీరు మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు. ఆన్లైన్లో పాలసీలు చేసేందుకు మీ చేతిలో స్మార్ట్ ఫోన్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా 15 గంటల శిక్షణ ఉంటే సరిపోతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా నేను ఎంత మొత్తం సంపాదించే అవకాశం ఉంటుంది?
ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మీ ఆదాయం మీరు చేసిన పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో రోజురోజుకూ వైద్య ఖర్చులు పెరుగుకుంటూ పోతున్నాయి. వైద్య ఖర్చుల నుంచి ఉపశమనం పొందేందుకు అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు.
నాకు ఏ డాక్యుమెంట్లు అవసరం?
మీ పదో తరగతి సర్టిఫికెట్తో పాటు మీ గరిష్ట విద్యార్హత సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్, క్యాన్సెల్ చేసిన చెక్ ఒకటి (దాని మీద మీ పేరు ఉండేది), ఒక ఫొటో అవసరం ఉంటుంది.
పాన్ కార్డ్ హోల్డర్, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఒక్కరే ఉండాలా?
అవును. మీకు వచ్చే కమిషన్ అమౌంట్లు టీడీఎస్ (TDS) మీద ఆధారపడి ఉంటాయి. మీ పాన్ కార్డును బట్టే టీడీఎస్ (TDS) అనేది ఆదాయపన్ను శాఖకు చెల్లిస్తారు.
నేను ఎప్పటినుంచి పాలసీలు చేయించడం ప్రారంభించాలి?
మీరు మాతో రిజిస్టర్ చేసుకుని శిక్షణ సమయంలో POSP పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పరీక్ష పూర్తి చేసిన తర్వాత మీరు ఈ–సర్టిఫికెట్‌ను పొందుతారు. ఆ సర్టిఫికెట్‌ను ఉపయోగించి మీరు POSP ఏజెంట్‌గా పాలసీలు చేయొచ్చు.
సర్టిఫైడ్ POS పర్సన్ కావడానికి తప్పకుండా శిక్షణ తీసుకోవాలా?
అవును. మీరు సర్టిఫైడ్ POSPగా మారాలంటే తప్పకుండా శిక్షణ తీసుకోవాలి. ఇందులో మీకు ఇన్సూరెన్స్ పాలసీల వివరాలు, క్లెయిమ్స్, పాలసీ చేసే విధానం గురించి వివరిస్తారు
నేను డిజిట్‌తో పని చేసినపుడు ఎటువంటి మద్దతు సేవలు పొందుతాను?
అందరు డిజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు మేము రిలేషన్షిప్ మేనేజర్‌ను కేటాయిస్తాం. ఒకవేళ ఏజెంట్లు ఏవైనా పాలసీలు చేసేటపుడు కస్టమర్లకు ఉన్న అనుమానాలను కూడా రిలేషన్షిప్ మేనేజర్లు నివృత్తి చేస్తారు. ఏజెంట్లు partner@godigit.com మెయిల్ అడ్రస్‌కు మెయిల్ చేయడం ద్వారా కూడా సహాయాన్ని పొందొచ్చు.
POSP కోర్సును పూర్తి చేసిన తర్వాత నేను నా జ్ఞానాన్ని ఎలా పెంచుకోవచ్చు?
పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) కోర్సును మీరు పూర్తి చేసిన తర్వాత మేము మా POSPల కోసం మరో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం మీకు ఇన్సూరెన్స్ జ్ఞానాన్ని అందిస్తుంది. మీ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. పాలసీలను అమ్మే తెలివి తేటలు కూడా పెరుగుతాయి. ఈ శిక్షణ కార్యక్రమంలో కింది విషయాలు ఉంటాయి.
- క్లిష్టమైన కేసులను హ్యాండిల్ చేసేందుకు మీకు కావాల్సిన ఇన్సూరెన్స్ జ్ఞానాన్ని అందిస్తుంది.
- కొత్త కొత్త ఇన్సూరెన్స్ పాలసీలను గురించి మీకు తెలియజేస్తుంది.
- మీ అమ్మకాలను పెంచుకునేందుకు కావాల్సిన పాలసీ అమ్మకపు చిట్కాలను అందిస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
లైసెన్స్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చేయొచ్చు?
హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు హెల్త్ పాలసీలను విక్రయిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలనే వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారు. వినియోగదారుల అవసరాలకు సరిపోయే పాలసీలను వారితో కొనుగోలు చేయిస్తారు.