హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అవండి
Work
in spare time
Earn
side income
FREE
training by Digit
హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్/ POSP (పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్) అంటే ఎవరు?
భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం గురించిన ఆశ్చర్యకరమైన విషయాలు
డిజిట్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్/పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) ఎందుకు కావాలి?
హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఎందుకు కావాలో, డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీనే ఎందుకు ఎంచుకోవాలో మరింత తెలుసుకోండి.
హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్/పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) కావడమెలా?
ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడం కోసం సులభమైన మార్గం పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) సర్టిఫికేషన్ కోర్సును పూర్తి చేయడం. POSP సర్టిఫికెట్ మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారేందుకు సహాయం చేస్తుంది.
POSPగా మారేందుకు కనీస విద్యార్హతలు ఉండాలని భారతీయ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (IRDAI) సూచించింది. డిజిట్ కంపెనీ మీ శిక్షణ ప్రక్రియ గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది. కావున మీరు నిశ్చింతగా ఉండొచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారేందుకు ఎటువంటి అర్హతలు ఉండాలనేవి కింద వివరించబడ్డాయి.
- మీకు తప్పనిసరిగా 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండాలి
- మీరు కనీసం పదో తరగతి వరకైనా చదివి ఉండాలి
- మీకు సరైన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలి
- IRDAI సూచించే 15 గంటల శిక్షణా కాలాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి.
ఈ ప్రక్రియలో అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తామని మేము హామీ ఇస్తున్నాం.
ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావొచ్చు?
ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడం కోసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. పదో తరగతి పాసై ఉండాలి.
ఈ అర్హతలున్న వ్యక్తులు ఎవరైనా సరే ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారొచ్చు. కాలేజీ విద్యార్థులు, గృహిణులు, ఇంట్లో ఉండేవారు, పదవీ విరమణ పొందినవారు, వ్యాపారస్తులు కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా మారే అవకాశం ఉంది.
డిజిట్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్/పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) కావడమెలా?
స్టెప్ 1
పైన ఉన్న మా POSP ఫామ్‌ను నింపి అందులో మీ సరైన వివరాలు, సరైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
స్టెప్ 2
15 గంటల మీ శిక్షణ కాలాన్ని పూర్తి చేయండి.
స్టెప్ 3
పరీక్షను పూర్తి చేయండి.
స్టెప్ 4
మేము అందజేసే అగ్రిమెంట్ మీద మీరు సంతకం చేస్తే చాలు. సర్టిఫైడ్ POSPగా గుర్తింపు పొందుతారు.
మీరు ఎంత సంపాదించొచ్చు?
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా చేరిన తర్వాత ఎంత సంపాదిస్తున్నారనేది మీరు చేసే పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఆదాయం సంపాదించేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌కు అవకాశం ఉంటుంది. వైద్య చికిత్సల ఖర్చు పెరుగుతుండటమే ఇందుకు కారణం.
మనకు ఎటువంటి చికిత్స కావాలన్నా ప్రస్తుత రోజుల్లో అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కావున మనం ఖర్చుల బారి నుంచి బయటపడేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. వైద్య ఖర్చులను ఇవి కవర్ చేస్తాయి.
ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కమిషన్ రూపంలో ఎంత సంపాదిస్తాడనేది కింద పూర్తిగా ఇవ్వబడింది. దీన్ని చూస్తే మీకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
మంత్లీ నెట్ ప్రీమియం |
కమిషన్ & నెట్ ప్రీమియం మీద కమిషన్ పర్సంటేజ్ |
ఆరోగ్య సంజీవని |
<25K |
సంవత్సరానికి - 25% | రెండు సంవత్సరాలకు - 23% | 3 సంవత్సరాలకు - 22% |
15% |
25 వేలు అంతకన్నా ఎక్కువ & 50 వేల కన్నా తక్కువ |
సంవత్సరానికి - 28% | రెండు సంవత్సరాలకు - 26% | 3 సంవత్సరాలకు - 25% |
15% |
50 వేల కంటే ఎక్కువ & లక్ష కన్నా తక్కువ |
సంవత్సరానికి - 30% | రెండు సంవత్సరాలకు - 28% | 3 సంవత్సరాలకు - 26% |
15% |
లక్ష రూపాయల కన్నా ఎక్కువ |
సంవత్సరానికి - 35% | రెండు సంవత్సరాలకు - 30% | 3 సంవత్సరాలకు - 28% |
15% |
షరతులు:
- నెలకు రెండుసార్లు పేమెంట్ లభిస్తుంది.
- మీరు పాలసీ చేసిన తేదీ మాత్రమే నెలను నిర్ధారిస్తుంది.
- వేర్వేరు స్లాబ్లకు పేమెంట్ వేర్వేరుగా ఉంటుంది.
- నియమ నిబంధనలు వర్తిస్తాయి. రెగ్యులేషన్ సూచించిన గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.
- నికర ప్రీమియం అనేది జీఎస్టీ (GST)ని మినహాయించి ఉంటుంది.
నేను ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారాలి?
తరచూ అడిగే ప్రశ్నలు