Third-party premium has changed from 1st June. Renew now
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది సాధారణంగా ప్రతి ఒక్క టూ వీలర్ యజమాని తీసుకునే టూ వీలర్ ఇన్సూరెన్స్ (two-wheeler insurance). ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీ వలన థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా థర్డ్ పార్టీ వాహనానికి అయిన డ్యామేజ్ల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. చట్ట ప్రకారం ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం కూడా తప్పనిసరి. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ లేకుండా బండి నడిపితే రూ. 1,000 నుంచి రూ. 2,000 వేల వరకు జరిమానా పడే ప్రమాదం ఉంది.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ కావు?
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ కావో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్ని విషయాలు తెలుసుకోవడం వలన మీరు క్లెయిమ్ చేసేటపుడు కొన్ని విషయాలకు షాక్ కాకుండా ఉంటారు. కింది సందర్భాల్లో థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ వర్తించదు అని మీరు గుర్తుంచుకోవాలి:
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌లో స్వంత వాహనానికి అయ్యే డ్యామేజ్లు కవర్ కావు.
బైక్ నడిపే వ్యక్తి మద్యం సేవించి ప్రమాదానికి గురయినా లేకుండా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపినా మీ ఇన్సూరెన్స్ కవర్ వర్తించదు.
సరైన లైసెన్స్ ఉన్న వ్యక్తి లేకుండా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురయితే అటువంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ కవర్ కాదు.
కొన్ని సందర్భాలు యాడ్–ఆన్స్‌లో కవర్ అవుతాయి. కాబట్టి మీరు two wheeler add-ons తీసుకోకపోతే కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ కవర్ కాదు.
అందించే థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన ఫీచర్లు
ప్రధాన ఫీచర్స్ | Digit బెనిఫిట్ |
---|---|
ప్రీమియం | రూ. 714 నుంచి ప్రారంభం |
కొనుగోలు విధానం | స్మార్ట్‌ఫోన్–ఎనేబుల్డ్ ప్రాసెస్. కేవలం 5 నిమిషాల్లో పూర్తవుతుంది! |
థర్డ్ పార్టీకి పర్సనల్ డ్యామేజ్లు అయితే | అన్లిమిటెడ్ లయబిలిటీ |
అన్లిమిటెడ్ లయబిలిటీ | 7.5 లక్షల వరకు |
థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే | 7.5 లక్షల వరకు |
థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే | ₹330/- |
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక్కో వాహనానికి ఒక్కోలా ఉంటుంది. కానీ కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో ఈ విధంగా ఉండదు. IRDAI నిర్ణయించిన ప్రకారం బైక్ సీసీ (ఇంజన్ కెపాసిటీ) బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం మారుతూ ఉంటుంది. IRDAI నిర్ణయించిన తాజా బైక్ ప్రీమియం ధరలు కింద పేర్కొన్నాం. bike insurance premium calculator ను ఇక్కడ చెక్ చేయండి.
టూ వీలర్స్ ఇంజన్ కెపాసిటీ | ప్రీమియం రేటు |
---|---|
75cc కి మించని వాహనాలు | ₹538 |
75cc నుంచి 150cc మధ్యలో ఉన్న వాహనాలు | ₹714 |
150cc నుంచి 350cc మధ్యలో ఉన్న వాహనాలు | ₹1,366 |
350cc కంటే పెద్ద వాహనాలు | ₹2,804 |
కొత్త టూ వీలర్స్ కోసం థర్డ్ పార్టీ ప్రీమియం (5ఏళ్లకు ఒకే సింగిల్ ప్రీమియం పాలసీ)
టూ వీలర్స్ ఇంజిన్ కెపాసిటీ | ప్రీమియం రేట్ (1 జూన్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి) |
---|---|
75ccకి మించకుండా | ₹2,901 |
75cc నుంచి 150cc మధ్యలో | ₹3,851 |
150cc నుంచి 350cc మధ్యలో | ₹7,365 |
350cc కంటే ఎక్కువ | ₹15,117 |
కొత్త ఎలక్ట్రికల్ వాహనాలకు (EV) ప్రీమియం (ఒక సంవత్సరం సింగిల్ ప్రీమియం పాలసీ)
వాహన కిలోవాట్ల సామర్థ్యం (KW) | ప్రీమియం రేట్ (1 జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చాయి) |
---|---|
3KW సామర్థ్యానికి మించనవి | ₹457 |
3KW కంటే పెద్దవి కానీ 7KW కంటే చిన్నవి | ₹607 |
7KW కంటే పెద్దవి కానీ 16KW కంటే చిన్నవి | ₹1,161 |
16KW కంటే పెద్దవి కానీ | ₹2,383 |
కొత్త ఎలక్ట్రికల్ వాహనాలకు(EV) ప్రీమియం రేట్లు (5ఏళ్లకు సింగిల్ ప్రీమియం పాలసీ)
వాహన సామర్థ్యం కిలోవాట్లలో (KW) | ప్రీమియం రేట్ (1 జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చాయి) |
---|---|
3KWకు మించనవి | ₹2,466 |
3KW కంటే పెద్దవి 7KW కంటే చిన్నవి | ₹3,273 |
7KW కంటే పెద్దవి 16KW కంటే చిన్నవి | ₹6,260 |
16KW కంటే పెద్దవి | ₹12,849 |
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
- థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేందుకు మొదటగా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో FIR ఫైల్ చేయాల్సి ఉంటుంది.
- చార్జ్ షీట్ కూడా అవసరం పడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కొరకు 1800-103-4448 నంబర్‌కు ఫోన్ చేయండి.
- మీరు ఏదైనా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే, మేము అన్ని చూసుకుంటాం.
- చట్టాన్ని మీరు అతిక్రమించకుండా ఉంటే నాన్ మానిటరీ సెటిల్మెంట్ కోసం మేము ప్రయత్నిస్తాం. ఒకవేళ ఏదైనా ఉల్లంఘన జరిగితే మీ తరఫున కోర్టులో వాదిస్తాం.
- మీరు మంచి పౌరుడై ఉండి, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఉంటే Digit థర్డ్ పార్టీ కవర్ మిమ్మల్ని కవర్ చేస్తుంది.
- ఏదైనా పర్సనల్ యాక్సిడెంట్ సంబంధిత క్లెయిమ్‌కు సంబంధించి 1800-258-5956 నంబర్‌పై కాల్ చేయండి. మేము మీకు అవసరమైన సహాయం అందిస్తాం.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే సమయంలో ముఖ్యమైన విషయాలు
- థర్డ్ పార్టీ పర్సన్ FIR నమోదు చేసే ముందు తన వద్ద తగిన ఆధారాలు ఉండేలా చూసుకోవాలి.
- యాక్సిడెంట్ జరిగిన వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీని, పోలీసులను సంప్రదించాలి. ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత మీకు క్లెయిమ్ కోసం దాఖలు చేయడం వీలుపడదని గుర్తుంచుకోవాలి.
- IRDAI రూల్స్ ప్రకారం క్లెయిమ్స్‌ను ట్రైబ్యునల్ పరిష్కరిస్తుంది.థర్డ్ పార్టీ వ్యక్తికి జరిగిన నష్టం విషయంలో ఎటువంటి గరిష్ట పరిమితి లేనప్పటికీ, థర్డ్ పార్టీ వ్యక్తుల ప్రాపర్టీల విషయంలో మాత్రం గరిష్టంగా రూ. 7.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లింస్తుంది.
మా కస్టమర్లు మా గురించి ఏమంటున్నారంటే..
నేను digit ఇన్సూరెన్స్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమృత్‌సర్‌కు చెందిన సర్వేయర్ గగన్‌దీప్ సింగ్ కేవలం 24 గంటల్లోనే నా బజాజ్ ప్లాటినా బైక్ క్లెయిమ్ సెటిల్ చేశాడు. digit ఇన్సూరెన్స్ కంపెనీకి గగన్‌దీప్ సింగ్‌కు స్పెషల్ థాంక్స్. digit లో అత్యుత్తమ సేవలు అందుతాయి.
digit వాళ్లది సూపర్ స్మూత్ సర్వీస్. నేను నా బైక్‌కు సంబంధించిన క్లెయిమ్ రిజిస్టర్ చేసిన రెండు రోజులకే నా క్లెయిమ్ సెటిల్ అయింది. మిస్టర్. నిర్మల్ నా క్లెయిమ్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో సహాయం చేశారు. digit ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ సెటిల్ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంది.
భారతదేశంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల్లో Digit ఇన్సూరెన్స్ కంపెనీ బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్లు వర్క్ చేసే విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. వారి పనితీరును నేను చాలా ఇష్టపడుతాను. నా బైక్‌కు క్లెయిమ్ పొందాను. నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. Go digit కంపెనీకి, అభిషేక్ సర్కి చాలా థాంక్స్.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వలన మీరు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు సంబంధించిన జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. ఇన్సూరెన్స్ లేకుండా బండి నడుపుతూ పట్టుబడితే మొదటి సారి రెండు వేల రూపాయలు, రెండో సారి నాలుగు వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
ఈ థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని అనుకోని విపత్తుల నుంచి కాపాడుతుంది. మీరు ఎవరి బైక్‌ను అయినా డ్యామేజ్ చేసినా, వారికి నష్టం కలిగేలా చేసినా థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని సంరక్షిస్తుంది.
మీ పర్సనల్ డ్యామేజ్‌లను కవర్ చేస్తుంది
మీకు 24x7 సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ వలె ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు అన్ని వేళలా మీకోసం అందుబాటులో ఉంటారు.
చట్టానికి లోబడి ఉండేలా, లీగల్‌గా రోడ్ల మీద రైడ్ చేసేలా చేస్తుంది.
మానసిక ఒత్తిడి నుంచి మిమ్మల్ని సంరక్షిస్తుంది. అనేక విపత్తుల నుంచి మీరు కవర్ చేయబడతారు.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ యొక్క ప్రతికూలతలు
ఈ బైక్ ఇన్సూరెన్స్ మీ సొంత టూ వీలర్ డ్యామేజ్ అయితే కవర్ చేయదు.
ఇది మీ టూ వీలర్‌ను వరదలు, అగ్నిప్రమాదాలు, తుఫానుల వంటి సహజ విపత్తుల నుంచి ప్రొటెక్ట్ చేయదు.
మీరు మీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను అడిషనల్ ఫీచర్స్‌తో కస్టమైజ్ చేసుకోలేరు. ఉదాహరణకు గేర్ బాక్స్ ప్రొటెక్షన్ వంటి యాడ్ ఆన్స్. కస్టమైజ్డ్ ప్లాన్స్ కోసం మీరు కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం.
ఇండియాలో అందుబాటులో ఉన్న బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ రకాలు
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
యాక్సిడెంట్ వలన సొంత టూ వీలర్ డ్యామేజ్/నష్టం అయితే |
|
అగ్ని ప్రమాదం వలన సొంత టూ వీలర్ డ్యామేజ్/నష్టం అయితే |
|
ప్రకృతి వైపరీత్యాల వలన సొంత టూ వీలర్ డ్యామేజ్/నష్టం అయితే |
|
థర్డ్ పార్టీ వాహనం డ్యామేజ్ అయితే |
|
థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే |
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
|
థర్డ్ పార్టీ పర్సన్‌కు గాయాలు/మరణం సంభవించినపుడు |
|
మీ బైక్ చోరీకి గురయినపుడు |
|
మీ ఐడీవీ (IDV) కస్టమైజేషన్ |
|
కస్టమైజ్డ్ యాడ్-ఆన్స్‌తో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి difference between Comprehensive and Third-party bike insurance. |
భారతదేశంలో ఉన్న పాపులర్ బైకులకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
భారతదేశంలో ఉన్న పాపులర్ బ్రాండ్స్‌కు టూ వీలర్ ఇన్సూరెన్స్
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన FAQs
బైక్‌కు నేను స్టాండలోన్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా?
తీసుకోవచ్చు. మీకు అన్నివేళలా అండగా ఉండేందుకు కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం ఉత్తమం. ఇది మిమ్మల్ని అనుకోని విపత్తుల నుంచి కాపాడుతుంది.
నేను నా థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేస్తే ఎన్సీబీ (NCB) కోల్పోతానా?
లేదు. అలా జరగదు. మీ ఎన్సీబీ (NCB) లేదా No Claim Bonus అలాగే ఉంటుంది.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?
అవును. మోటార్ వెహికిల్ చట్టం-1988 ప్రకారం వాహనానికి కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా ఉండాలి.
వేరే వ్యక్తులు నా వాహనం నడుపుతూ యాక్సిడెంట్ చేస్తే, Digit ఇన్సూరెన్స్ నా నష్టాన్ని భర్తీ చేస్తుందా?
అవును. చేస్తుంది. యాక్సిడెంట్ సమయంలో ఎవరు వాహనం నడిపినా కూడా మీ క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది. Digit ఇన్సూరెన్స్ మీ నష్టాలను కవర్ చేస్తుంది. కానీ ఒక్క విషయం.. వాహనం నడిపిన వ్యక్తికి సరైన లైసెన్స్ ఉండాలి. లేకపోతే మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.
నా బైక్‌కు థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ సరిపోతుందా?
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో పేరులో ఉన్న విధంగానే, కేవలం మీ వలన థర్డ్ పార్టీ వ్యక్తులకు జరిగిన నష్టాలను మాత్రమే అది చెల్లిస్తుంది. మీ వాహనం సంగతి గురించి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పట్టించుకోదు. మీ వాహనం కోసం మీరు కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవడం ఉత్తమం.
నేను వేరే నగరంలో/రాష్ట్రంలో ఉండగా యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది?
మీరు వేరే నగరంలో లేదా వేరే రాష్ట్రంలో యాక్సిడెంట్ అయినా Digit ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
నేను థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉండొచ్చా?
లేదు. మీరు తప్పనిసరిగా థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కనీసం ఒక ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం చట్ట ప్రకారం తప్పనిసరి. (mandatory by law to at least have an insurance policy). ఈ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ డ్యామేజ్‌లను కవర్ చేస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కన్నా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మీకు మరిన్ని బెనిఫిట్స్ అందిస్తుంది. మీరు సరైన ఇన్సూరెన్స్ పత్రాలు లేకుండా బండి నడిపితే మొదటిసారి దొరికినపుడు రెండు వేల రూపాయలు, రెండో సారి దొరికినపుడు నాలుగు వేల రూపాయల ఫైన్ పడుతుంది.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో గరిష్టంగా ఎంత నష్టపరిహారం వస్తుంది?
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో గరిష్టంగా రూ. 7.5 లక్షల వరకు నష్టపరిహారం వస్తుంది. అదే ఒకవేళ థర్డ్ పార్టీ వ్యక్తికి నష్టం జరిగితే నష్టపరిహారం అపరిమితంగా (అన్లిమిటెడ్) ఉంటుంది.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటపుడు ఎటువంటి పత్రాలు నేను సబ్మిట్ చేయాలి?
ఎటువంటి పత్రాలు అవసరం లేదు. కేవలం మీరు మీకు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో FIR ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ నేను థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ఏమవుతుంది?
మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ మొదటి సారి పట్టుబడితే రెండు వేల రూపాయలు, రెండో సారి పట్టుబడితే నాలుగు వేల రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది.