బైక్ ఇన్సూరెన్స్‌లో నో క్లెయిమ్ బోనస్ (NCB)
మీ చిన్నతనం గనుక మీకు గుర్తుంటే.. మీరు ఐదారు సంవత్సరాల వయసు ఉన్నపుడు మీ నాన్న గారు మీతో చెప్పిన విషయాలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు వినయంగా ఉండి, బుద్దిగా చదువుకుంటే, మంచి మార్కులతో పాస్ అయితే మీకు మంచి ట్రీట్ ఇస్తారని చెప్పి ఉంటారు కదా. అలాగే ఎన్సీబీ (NCB) పాలసీ కూడా. మీరు మంచి బైకర్‌గా ఉంటే వచ్చే ట్రీట్ వంటిదే ఈ నో క్లెయిమ్ బోనస్ (No Claim Bonus).
మంచి బైక్ రైడర్‌గా ఉన్నందుకు నాకేం బోనస్ వచ్చిందని మీరు అడగొచ్చు. మీరు bike insurance ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పటికీ, బైక్‌ను జాగ్రత్తగా నడిపి, సరిగా మెయింటేన్ చేస్తే మీ బైక్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం రాదు. ఎందుకంటే అక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి మీ బండికి ఏ డ్యామేజ్ లేదు కనుక.
బైక్ ఇన్సూరెన్స్‌లో ఎన్సీబీ (NCB) అంటే ఏమిటి?
మీరు బైక్ ఇన్సూరెన్స్ తీసుకునేటపుడు సంవత్సరం పాటు మీ బైక్‌ను జాగ్రత్తగా నడిపి, ఎటువంటి క్లెయిమ్స్ చేయకపోతే, తర్వాతి సంవత్సరం కట్టాల్సిన ప్రీమియంలో డిస్కౌంట్ ఇస్తామని ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతాయి. ఆ డిస్కౌంట్‌నే నో క్లెయిమ్ బోనస్ (No Claim Bonus) (NCB) అంటారు.
ఎన్సీబీ (NCB) ని బైక్ ప్రీమియం మీద అందించే డిస్కౌంట్‌గా వ్యవహరిస్తారు. పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉండటం వలన ప్రీమియం మీద ఈ డిస్కౌంట్ ఆఫర్ చేయబడుతుంది. (కానీ, మేము క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తూ మా కస్టమర్లకు సహాయం చేయడాన్నే ఇష్టపడతాం.)
మీరు ఏళ్ల తరబడి మీ బైక్‌కు ఎటువంటి నష్టం జరగకుండా, క్లెయిమ్ చేయకుండా ఉంటే మీ ఎన్సీబీ (NCB) పెరుగుతూ పోతుంది. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీకు ఎక్కువ డబ్బును ఆదా చేస్తుంది.
కొత్త బైక్‌ను కొన్నపుడు ఎన్సీబీ (NCB)ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా?
అవును, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎన్సీబీ (NCB) ని పాత వాహనం నుంచి కొత్త వాహనానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎన్సీబీ (NCB) అనేది పాలసీ హోల్డర్‌కు ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ చేయించిన బండికి ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి.
బైక్ ఇన్సూరెన్స్‌లో ఎన్సీబీ (NCB)ని ఎలా లెక్కిస్తారు?
మీ ఎన్సీబీ (NCB) అనేది మీ comprehensive two wheeler insurance పాలసీ మొదటి రెన్యువల్ తర్వాతే మీకు వర్తిస్తుంది. (ఈ కింది విషయాలను గుర్తుంచుకోండి. ఎన్సీబీ (NCB) ఓన్ డ్యామేజ్ కాంపోనెంట్ ప్రీమియంకు వర్తిస్తుంది. కాంపోనెంట్ ప్రీమియాన్ని ఐడీవీ (IDV) మీద ఆధారపడి లెక్కిస్తారు. బోనస్ అనేది థర్డ్ పార్టీ కవర్ ప్రీమియంకు వర్తించదు).
మీరు క్లెయిమ్ చేయకుండా ఉన్న మొదటి సంవత్సరం తర్వాత 20% డిస్కౌంట్‌ను పొందుతారు. ప్రతి సంవత్సరం మీరు క్లెయిమ్ చేయకుండా ఉంటే డిస్కౌంట్ అనేది 5-10% శాతం చొప్పున పెరుగుతూ పోతుంది. మీరు క్లెయిమ్ చేయని ప్రతి సంవత్సరానికి ఈ డిస్కౌంట్ పెరుగుతూ ఉంటుంది.
మీరు మొదటి సంవత్సరం 20% డిస్కౌంట్ కనుక పొందితే, అది తర్వాతి సంవత్సరం వరకు 25-30% అవుతుంది. తర్వాతి సంవత్సరానికి ఈ డిస్కౌంట్ 30-35% అవుతుంది. ఇలాగే ఉంటే ఐదేళ్లలో మీ బోనస్ దాదాపు 50% వరకు అవుతుంది.
Check: Bike Insurance Calculator ని ఉపయోగించి ఎన్సీబీ (NCB) డిస్కౌంట్‌తో మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉంటుందో చెక్ చేసుకోండి.
క్లెయిమ్ చేయని సంవత్సరాలు |
నో క్లెయిమ్ బోనస్ |
సంవత్సరం తర్వాత |
20% |
2 సంవత్సరాల తర్వాత |
25% |
3 సంవత్సరాల తర్వాత |
35% |
4 సంవత్సరాల తర్వాత |
45% |
5 సంవత్సరాల తర్వాత |
50% |
అత్యాశ వద్దు. మంచి ఎన్సీబీ (NCB) కలిగి ఉంటే అత్యధిక డిస్కౌంట్ లభిస్తుందని కొంత మంది అత్యాశకు పోతారు. కానీ ఐదు సంవత్సరాల తర్వాత మీ డిస్కౌంట్ అనేది పెరగకుండా అలాగే ఉంటుంది. మీరు క్లెయిమ్ చేయకపోయినా సరే డిస్కౌంట్ అనేది పెరగదు.
ఉదాహరణకు, 2010వ సంవత్సరంలో ఒక వ్యక్తి బైక్ తీసుకున్నాడని అనుకుందాం. అతడు మంచి ఎన్సీబీ (NCB)ని కలిగి ఉండి ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి క్లెయిమ్స్ చేయలేదు. కానీ అతడు ఇప్పుడు కొత్త వాహనాన్ని కొని పాత బైక్ ఎన్సీబీ (NCB)ని కొత్త బండికి బదిలీ చేస్తే అతడికి ఇన్సూరెన్స్ అమౌంట్లో కేవలం 50 శాతం మాత్రమే తగ్గుతుంది.
నేను ఎన్సీబీ (NCB)ని ఎప్పుడు కోల్పోతాను?
మీరు ఒక్కసారి క్లెయిమ్ చేసినా మీ ఎన్సీబీ (NCB) సున్నాకు పడిపోతుంది. మీరు ఏ సంవత్సరంలో బైక్ పాలసీ తీసుకున్నా గానీ ఎన్సీబీ (NCB) జీరో అవుతుంది. ఈ నియమం నుంచి తప్పించుకునే అవకాశం ఉందా? అని ప్రతి ఒక్కరూ చూస్తారు. ఉంది. మీరు కనుక మీ పాలసీలో ఎన్సీబీ (NCB) ప్రొటెక్షన్ ఫీచర్ కలిగి ఉంటే మీకు ఈ నియమం వర్తించదు.
నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన తర్వాత కూడా నా ఎన్సీబీ (NCB)ని అలాగే ఉంచుకునే అవకాశం ఉందా?
ఉంది. కానీ అది మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ బెనిఫిట్ ప్రొవైడ్ చేసిందా? లేదా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. దానికి మీ ఇన్సూరెన్స్ కంపెనీ అనుమతిస్తే మీకు ఎన్సీబీ (NCB) ప్రొటెక్ట్ యాడ్–ఆన్ అనేది మీ ఇన్సూరెన్స్‌లో భాగంగా ఉంటుంది. ఈ ఫీచర్ గనుక ఉంటే మీరు మీ ఎన్సీబీ (NCB)ని కోల్పోకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌కు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని నిబంధనలను కూడా విధిస్తాయి. కావున మీ ఇన్సూరెన్స్ కంపెనీ విధించిన నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి.
కావున, మీరు ఎప్పుడైనా సరే బైక్ రేస్‌కి వెళ్లే సమయంలో ఎన్సీబీ (NCB) గురించి ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే అనవసరంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం వలన మీరు మీ ఎన్సీబీ (NCB)ని కోల్పోవాల్సి వస్తుంది. ఎన్సీబీ (NCB)ని కొత్త వాహనానికి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కావున బండిని జాగ్రత్తగా నడిపి మీ ఎన్సీబీ (NCB)ని రక్షించుకోండి.