ఆన్లైన్లో హోండా CBF స్టన్నర్ బైక్ ఇన్సూరెన్స్ ధర & పాలసీ రెన్యువల్
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కలిసి 2008 జూన్-జూలై మధ్య CBF స్టన్నర్ సిరీస్‌ను ప్రారంభించాయి. చివరకు హోండా స్టాండర్డ్ మోటార్‌సైకిళ్ల జాబితాలో ఈ సిరీస్ చేరింది. భారతదేశ 125 cc మోటార్‌సైక్లింగ్ చరిత్రలో బెంచ్‌మార్క్ మోడల్‌లలో హోండా CBF స్టన్నర్ ఒకటి.
హోండా బైక్ యజమాని కావడం వల్ల, అన్ని భద్రతా ఫీచర్లు బైకుకు ఉన్నప్పటికీ రిస్క్‌లు, డ్యామేజీలకు గురికావాల్సి ఉంటుందని మీరు విధిగా తెలుసుకోవాలి. అందువల్ల, హోండా CBF స్టన్నర్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం, అటువంటి డ్యామేజులకు ప్రతిగా మీ బైక్‌కు బీమా చేయడం చాలా ముఖ్యం.
భారతదేశంలో పేరున్న బీమా కంపెనీలు అందించే ఆకర్షణీయమైన డీల్స్ కారణంగా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం సౌకర్యవంతంగా, తేలికగా ఉంటుంది. భారతదేశంలో అటువంటి బీమా సంస్థల్లో డిజిట్ ఒకటి.
ఈ సెగ్మెంట్లో మీరు CBF స్టన్నర్ ఇన్సూరెన్స్, దాని ప్రయోజనాలు, డిజిట్ ఇన్సూరెన్స్ అందించే పాలసీ ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు.
హోండా CBF స్టన్నర్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేస్తుంది
డిజిట్ వారి హోండా CBF స్టన్సర్ ఇన్సూరెన్స్ నే ఎందుకు తీసుకోవాలి?
హోండా CBF స్టన్నర్ కోసం టూవీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
థర్డ్ పార్టీ
కాంప్రహెన్సివ్
ప్రమాదంలో సొంత టూ-వీలర్ వాహనానికి కలిగే డ్యామేజులు/నష్టాలు |
×
|
✔
|
సొంత టూవీలర్ కు అగ్నిప్రమాదాల వల్ల కలిగే డ్యామేజులు/నష్టాలు |
×
|
✔
|
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లయితే స్వంత టూవీలర్ కి కలిగే డ్యామేజీలు/నష్టాలు |
×
|
✔
|
థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజులు |
✔
|
✔
|
థర్డ్ పార్టీ ఆస్తికి కలిగే డ్యామేజులు |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్ పార్టీ వ్యక్తికి కలిగే గాయాలు/మరణం |
✔
|
✔
|
స్కూటర్ లేదా బైక్ దొంగతనం అయితే |
×
|
✔
|
మీ ఐడివి (IDV) కస్టమైజ్ చేయడం |
×
|
✔
|
కస్టమైజ్ యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ల మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.
ఎలా క్లెయిమ్ చేయాలి?
మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన లేదా రెన్యువల్ చేసిన తరువాత, డిజిటల్ క్లెయిముల ప్రక్రియను 3-స్టెప్‌లలో చేస్తాం కాబట్టి మీరు చింత లేకుండా ఉండవచ్చు.
స్టెప్ 1
1800-258-5956కి కాల్ చేయండి. ఎలాంటి ఫారాలు నింపాల్సిన పని లేదు.
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై స్వీయ తనిఖీ కోసం ఒక లింకును పొందండి. దశలవారీగా వివరించినట్లు మీ స్మార్ట్ ఫోన్ నుంచి మీ వాహనం యొక్క డ్యామేజీలను ఫొటోలు తీయండి.
స్టెప్ 3
మీరు కావాలనుకున్న రిపేర్ విధానాన్ని ఎంచుకోండి, అంటే మా గ్యారేజీల నెట్వర్క్ ద్వారా రీఎంబర్స్మెంట్ లేదా క్యాష్‌లెస్.
డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత త్వరగా సెటిల్ చేయబడతాయి?
మీ బీమా సంస్థను మార్చేటప్పుడు మీ మదిలో మెదలాల్సిన మొదటి ప్రశ్న ఇది. మంచిదే, మీరు ఇలా ఆలోచించడం సరైనదే!
డిజిట్ యొక్క క్లెయిముల రిపోర్ట్ కార్డును చదవండిడిజిట్ హోండా CBF స్టన్నర్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడానికి కారణాలు
డిజిట్ వంటి బీమా కంపెనీలు బైక్ ఇన్సూరెన్స్ యొక్క పాలసీదారులకు అనేక ప్రోత్సాహకాలు, ప్రయోజనాలను అందిస్తాయి. వారి సేవలను ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- అంతరాయం లేని ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్- డిజిట్ యొక్క స్మార్ట్‌ఫోన్ ఆధారిత ప్రక్రియలతో హోండా CBF స్టన్నర్ ఇన్సూరెన్స్‌ను ఆన్లైన్లో పొందడం సులభం. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ పూర్తి డిజిటల్ ప్రక్రియ కారణంగా తక్కువ టర్న్–అరౌండ్ సమయం పడుతుంది. అవాంతరాలు లేకుండా ముగుస్తుంది.
- విస్తృత శ్రేణి గల డిజిట్ నెట్వర్క్ గ్యారేజీలు - డిజిట్ అధీకృత నెట్వర్క్ గ్యారేజీల నుంచి క్యాష్‌లెస్ సౌలభ్యంతో పాటుగా ప్రొఫెషనల్ సేవలను మీరు పొందవచ్చు. ఈ గ్యారేజీలను కనుగొనడం చాలా సులభం, ఎందుకంటే భారతదేశం అంతటా 2900+ డిజిట్ నెట్వర్క్ బైక్ గ్యారేజీల యొక్క విస్తృత శ్రేణి ఉంది.
- ఇన్సూరెన్స్ ఆప్షన్లు- మీ అవసరానికి తగ్గట్టుగా డిజిట్ మూడు ఇన్సూరెన్స్ కవరేజీలను అందిస్తుంది. కవరేజీ ఆప్షన్లు దిగువ పేర్కొన్న విధంగా ఉంటాయి:
- థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: ఈ స్కీం కింద థర్డ్ పార్టీ డ్యామేజీలకు కవరేజీ ప్రయోజనాలు పొందవచ్చు.
- ఓన్ డ్యామేజీ బైక్ ఇన్సూరెన్స్: ఇది ఒక స్టాండలోన్ పాలసీ, దీనిలో ప్రమాదాల వల్ల సొంత బైకుకు అయ్యే డ్యామేజీలు కవర్ అవుతాయి.
- కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్: కాంప్రహెన్సివ్ హోండా CBF స్టన్నర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ, ఓన్ బైక్ డ్యామేజీలు రెండింటికీ కవరేజీని అందిస్తుంది.
- అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో - మీ హోండా బైక్ ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేసేటప్పుడు, మీరు తక్కువ టర్న్–అరౌండ్ సమయం, మొత్తం మీద అంతరాయం లేని ప్రక్రియను ఆశించవచ్చు. డిజిట్ యొక్క స్మార్ట్‌ఫోన్ ఆధారిత క్లెయిమ్ ప్రక్రియ కారణంగా, మీరు కొన్ని నిమిషాల్లోనే తక్షణ క్లెయిమ్‌లను పొందవచ్చు. అలాగే అక్టోబర్ 2019 నుండి మార్చి 2020 వరకు 97% క్లెయిమ్‌లను సెటిల్ చేసిన రికార్డును డిజిట్ కలిగి ఉంది.
- స్వీయ తనిఖీ ప్రక్రియ - మరే ఇతర అథారిటీ ప్రమేయం లేకుండా డ్యామేజీల కొరకు మీ బైక్‌ని చెక్ చేయడానికి డిజిట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అందువల్ల మీరు మీ హోండా బైక్‌ని మీరే తనిఖీ చేయవచ్చు, చిరాకు లేని విధంగా అవసరమైన రిపేర్లను చేయించవచ్చు.
- బాధ్యత గల కస్టమర్ సపోర్ట్ - ఒకవేళ సందేహాలు, క్వెరీలు ఉన్నట్లయితే, మీరు డిజిట్ యొక్క కస్టమర్ సర్వీస్‌ని సంప్రదించవచ్చు. అవి 24/7, జాతీయ సెలవు దినాల్లో కూడా లభ్యమవుతాయి.
- యాడ్-ఆన్ ప్రయోజనాలు - మీ హోండా బైక్ కొరకు ఒక కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని కవర్లు చేర్చబడవు. ఆ మేరకు వారి ప్రీమియం మొత్తం కంటే కొంచెం ఎక్కువ చెల్లించడం ద్వారా డిజిట్ యొక్క యాడ్-ఆన్ పాలసీలను ఎంచుకోవచ్చు. జీరో-డిప్రిషియేషన్ కవర్, బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, కంజూమబుల్ కవర్, మరిన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
ఇంకా డిజిట్ మీరు ఎంచుకున్న ఏ సేవలోనైనా పారదర్శకతను అందిస్తుంది. ఎలాంటి దాపరికపు ఛార్జీలు లేవు. అదేవిధంగా గరిష్ట ప్రయోజనాలను పొందడం కొరకు మీ బైక్ యొక్క ఐడివి (IDV)ని కస్టమైజ్ చేయడానికి ఇవి మీకు దోహదపడతాయి.
మీ హోండా CBF స్టన్నర్ ఇన్సూరెన్స్ పాలసీ కొరకు డిజిట్‌ని ఎందుకు ఎంచుకోవాలి?
హోండా CBF స్టన్నర్ కొరకు టూ-వీలర్ ఇన్సూరెన్స్ లాభదాయకమైన ప్రయోజనాలతో వస్తుంది. ఈ క్రింది ప్రయోజనాల జాబితాను పరిగణనలోకి తీసుకొని, మీరు మీ హోండా ప్రయాణికుల కొరకు ఈ ఇన్సూరెన్స్‌ని పొందాలని అనుకోవచ్చు.
- థర్డ్ పార్టీ లయబిలిటీలను తగ్గిస్తుంది - మీ హోండా బైక్ ప్రమాదం బారిన పడ్డప్పుడు లేదా ఢీకొన్నప్పుడు థర్డ్ పార్టీ వ్యక్తులు, ప్రాపర్టీలు లేదా వాహనాలకు నష్టం కలిగించవచ్చు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం ద్వారా, మీరు ఈ లయబిలిటీలను సమర్థవంతంగా తగ్గించవచ్చు, లిటిగేషన్ సమస్యలను కూడా పరిహరించవచ్చు.
- సొంత బైక్ డ్యామేజీని కవర్ చేస్తుంది- మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. అయితే ఇది మీ సొంత బైక్ డ్యామేజీలకు కవర్ చేయదు. అటువంటి పరిస్థితిలో, పూర్తి కవరేజీ ప్రయోజనాలను అందించే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవడం మంచిది.
- పర్సనల్ యాక్సిడెంట్ కవర్ - మీరు థర్డ్ పార్టీ లేదా కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకున్నా, శాశ్వత సంపూర్ణ అంగవైకల్యం లేదా మరణానికి దారితీసే ప్రమాదాలు జరిగినప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ను పొందడానికి మీరు లయబిలిటీని కలిగి ఉంటారని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) పేర్కొంది.
- భారీ ట్రాఫిక్ జరిమానాలను నివారించండి- పైన పేర్కొన్న విధంగా మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి. సరైన ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే మొదటిసారి ₹ 2000 వరకు ట్రాఫిక్ జరిమానాలు, మళ్లీ మళ్లీ పట్టుబడితే ₹ 4000 వరకు ట్రాఫిక్ జరిమానాలను మీరు చెల్లించాల్సి రావచ్చు.
- నో క్లెయిమ్ బోనస్‌లు - ఆన్లైన్లో హోండా CBF స్టన్నర్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు ఎలాంటి క్లెయిములు చేయనందున పాలసీని ఒక సంవత్సరం వరకు పెంచుతూ మీకు బీమా సంస్థ అందించవచ్చు. లేదంటే ప్రీమియంపై డిస్కౌంట్లను అందించవచ్చు. ఈ డిస్కౌంట్ క్లెయిమ్ చేయని సంవత్సరాల సంఖ్య, మీ బీమా సంస్థపై ఆధారపడి 20% నుంచి 50% మధ్య ఉంటుంది.
హోండా CBF స్టన్నర్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేటప్పుడు సర్వీస్ ప్రయోజనాలు, ప్రీమియం అమౌంట్, ఐడివి (IDV) కస్టమైజేషన్, మరెన్నో ఇతర అంశాల ఆధారంగా వివిధ బీమా కంపెనీలలో ఉన్న బీమా ప్లాన్లను పోల్చాలి. ఇది మార్కెట్లో ఉన్న ఆప్షన్లను చూడటానికి, సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది.
ఏదేమైనా, ఈ అంశంలో మీరు డిజిట్ ఇన్సూరెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు.
హోండా CBF స్టన్నర్ గురించి మరింత తెలుసుకోండి
ఈ హోండా మోడల్ యొక్క కొన్ని ప్రత్యేకతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- సేఫ్టీ (భద్రత) - ఇది అనలాగ్ కన్సోల్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ వంటి సేఫ్టీ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
- టైర్లు, బ్రేకులు - ఈ మోటార్ సైకిల్లో ట్యూబ్‌లెస్ టైర్లు, అలాయ్ వీల్స్ ఉంటాయి. దీని బ్రేకింగ్ కాంపోనెంట్లో డిస్క్ ఫ్రంట్, రియర్ బ్రేకులు ఉంటాయి.
- మైలేజ్ - హోండా CBF స్టన్నర్ లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
- ఇంజిన్ - ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, SI ఇంజిన్, PGM-FI ద్వారా పవర్ చేయబడుతుంది. ఈ బైక్ యొక్క ఇంజిన్ 124.7cc డిస్ప్లేస్మెంట్ కలిగి ఉంటుంది.
- ట్రాన్స్మిషన్ - ఇది కాన్స్టంట్- మెష్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ హోండా మోటార్ సైకిల్లో టాప్ పర్ఫార్మెన్స్, భద్రతకు గ్యారెంటీ ఇచ్చే ఫీచర్లతో వచ్చినప్పటికీ, ప్రమాదాలు, ఇతర దురదృష్టకర పరిస్థితులు జరుగుతునే ఉన్నాయి. అందువల్ల హోండా CBF స్టన్నర్ ఇన్సూరెన్స్‌ని పొందడం అనేది భారీ రిపేర్ ఛార్జీలను భరించడం కంటే మంచి ఆప్షన్.
దీనికి సంబంధించి డిజిట్ వంటి బీమా సంస్థలు మీ అవసరాలను సమర్థవంతంగా తీర్చగలవు.
హోండా CBF స్టన్నర్ - వేరియెంట్లు & ఎక్స్-షోరూం ధర
వేరియేషన్లు |
ఎక్స్-షోరూం ధర (నగరాన్ని బట్టి ఇది మారవచ్చు) |
||||
స్టన్నర్ CBF సెల్ఫ్ డ్రమ్ అలాయ్ |
₹51,449 |
స్టన్నర్ CBF సెల్ఫ్ డిస్క్ అలాయ్ |
₹58,721 |
స్టన్నర్ CBF CBF స్టన్నర్ PGM FI |
₹65,842 |